చదువుతున్నా... The Happiness Trap పుస్తకం

రుణాత్మక ఆలోచనల (నెగటివ్ థాట్స్) విషయమై కొంతకాలం క్రితం వరకు వచ్చిన చాలా పద్ధతులు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) లాంటివి ఆయా ఆలోచనలను నిరోధించి మన మనస్సు నమ్మినా నమ్మకపోయినా ధనాత్మక ఆలోచనలను ఆలోచిస్తుండాలని చెబుతాయి. అలా చెప్పుకోగా చెప్పుకోగా మన మనస్సు ఆ పాజిటివ్ థాట్స్ ను విశ్వసించి మనలో మెరుగుదలకు తోడ్పడతాయి అని చెబుతాయి.

కొన్నేళ్ళ క్రితమే వచ్చిన ఏక్సె్‌ప్టాన్స్ అండ్ కమిట్మెంట్ థెరపీ (ACT) అలా మనస్సుతో యుద్ధం చెయ్యడం వల్ల లాభం లేదనీ, అలా చెయ్యడం మన శక్తి యుక్తులని వృధా చేసుకోవడమే అనీ,  మన మనస్సుతో రాజీపడాలనీ చెబుతుంది. ఇలా ధనాత్మకంగా ఆలోచించగానే అలా మన మనస్సు ప్రభావితం కాదనీ, అది చాలావరకు వృధా ప్రయత్నం అని చెబుతుంది. అందుకు బదులుగా ఆయా ఆలోచనల మీద యుద్ధం మానివేసి వాటిని యథాతథంగా ఆమోదించేసి ఇహ వాటిని పెద్దగా పట్టించుకోకుండా డిఫ్యూజ్ చేసివేస్తూ మన విలువల ప్రకారం, లక్ష్యాల ప్రకారం అడుగు వేస్తూ పోవడమే ఉత్తమం అంటుంది. 

నా వరకు CBT కంటే ACT కన్విన్సింగుగా వుండి దానికి సంబధించిన పుస్తకాలు చదువుతున్నా. మిగతాకొన్ని రుగ్మతలతో పాటుగా  మైల్డ్ మరియు మోడరేట్ మానసిక కృంగుబాటు వున్నవారికి CBT, ACT, తదితర పద్ధతులు ఉపకరిస్తాయి. క్లినికల్ కృంగుబాటు వున్నవారికి మందులతో పాటు ఈ పద్ధతులు ఉపకరిస్తాయి. నేను చదువుతున్న పుస్తకం వర్శన్ ఇల్లస్ట్రేటెడ్ కాబట్టి కామిక్స్ చదివినట్లుగా సరదాగా వుంది. నెగెటివ్ థాట్స్ తో ఇబ్బంది పడుతున్న ఎవరయినా ఇలాంటి పద్ధతులు పాటించి ఆలోచనా విధానాన్ని మార్చుకోవచ్చు.

ఆ పుస్తకం యొక్క అమెజాన్ లింక్ ఇది. ఇక్కడ ఆ పుస్తకం యొక్క సమీక్షలు కూడా మీరు ఇక్కడ చదవవచ్చు:
 

2 comments:

  1. బాగుంది గురువు గారు. ఎంతో కాలంగా అందరికీ అవీ ఇవీ అంటూ చెప్తూ వస్తున్నారు, ఇప్పటికి వినటం ఎంతో మహదానందకరం అని తెలుసుకుంటున్నారన్నమాట.. ఆ పక్కన ఉన్న చెట్టుని చూడండి, అది ఎంత పీస్ ఫుల్ గా ఉందో. దానివంటి గుణం ఆవాహన జరిగితే ఎంత హాయో.......ప్రేమలో ఆత్మ గౌరవం దెబ్బతినటమేంటండి మరీను...

    మీరలా కానిచ్చేయండి హాయిగా....

    ReplyDelete
  2. @ కాయ
    మరో టపాలో వెయ్యాల్సిన వ్యాఖ్య ఇక్కడ వేసినట్లున్నారు. ఓకే.

    FLR హాయిగా కానిస్తున్నా కానీ ఇందులో ఓ క్యాచ్ వుంది మరి - 'అవుట్' అవకపోవడం. ఎంత నిగ్రహం వుంటే అంత ఆనందం. ఇకపోతే ఇదివరలో ప్రతిరోజూ లేవగానే దిక్కుమాలిన జీవితం అని తిట్టుకునేవాడిని. మరి ఇప్పుడో? మా రిచువల్స్ తో రోజూ ఉదయం ఎంత ఉత్సాహంగా, చిరు వెచ్చగా మొదలవుతుందనీ! నిజమే, మీరన్నట్లు ప్రేమలో అహాలేమిటీ? అది తీసి పడేసి ఆవిడకి ఆత్మార్పణం చేసుకున్నా కాబట్టే హాయిగా కానిచ్చేస్తున్నా. ఆమెకు పవర్ - నాకు ప్లెజర్. ఇదో విజయం - విజయం స్థితి (విన్ - విన్ సిచువేషన్)!.

    ReplyDelete