రోజూ మీ ఇంటిపక్కనే ఎందుకు ఉ...(బీప్) పోస్తారు?!

ఇది ఇదివరలో వ్రాసానో లేదో గుర్తుకులేదు. మా సూర్యాపేట ఇంటికి కొద్ది దూరంలో ఎదురుగా వున్న ఇంట్లో కొంతమంది లంబాడా సిస్టర్స్ వుండేవారు. వాళ్ళ నాన్న ఉపాధ్యాయుడు. వాళ్ళ పెద్దమ్మాయి అస్తమానం ఇంటిగడప మీద నిలబడి వచ్చేపోయెవారినీ అలాగే ఎదురింటివారినీ అనగా నన్నూ చూస్తుండేది. ఆమె చూస్తున్నప్పుడు నేను కూడా చూడకపోతే ఆమె మనోభావాలు గాయపడక మానవని జాలి తలంచి పాపం నేనూ చూస్తూవుండేవాడిని. అలా ఆమే, నేనూ ఊరకే చూస్తుండటం తప్ప ఎవరం అడ్వాన్స్ అయ్యింది లేదు. ఇలా పని కాదని ఇంకో వైపు నుండి కాస్త నరుక్కువచ్చే ప్రయత్నాలు చేసాను. 

ఆమెకు తొమ్మిదో తరగతి చదివే చెల్లెలు వుండేది. పేరు సునీత అని అనుకుందాం. ఆమె సరదాగా, ఉత్సాహంగా వుండేది. గలగలా మాట్లాడుతుండేది. ఆ అక్కకు క్లోజ్ కావాలంటే ఈ చెల్లెలికి క్లోజ్ కావాలని నిశ్చయించాను. మరి ఆ చెల్లెలికి సన్నిహితం అవడం ఎలా?  ఆమెకూ ఓ ఇద్దరు చెల్లెళ్ళున్నారు. వారు మూడో, నాలుగో చదుతుండేవారు. నెమ్మదిగా ఆట, పాటలతో వారికి దగ్గరయ్యాను. అలా వారి చిన్నక్క దారిలోకి వచ్చింది. ఆమెతొ క్లోజ్ ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆమెను ప్రేమిద్దామా అని కూడా ఆలోచించాను కానీ ఎందుకో ఆగిపోయాను. ఆ పెద్దక్క మాత్రం కాస్తంత సన్నిహితం అయ్యిందంతే. 

సునీతతో బాగా స్నేహం చేస్తున్న రోజులవి. (ఒఠ్ఠి స్నేహమే లెండి, అడ్వాన్స్ తీసుకొవడానికి ఎందుకో అవకాశం దొరకలేదు). అప్పట్లో మా ఇంటి పక్క స్థలం ఖాళీగా వుండి చెత్త, చెట్లు, పొదలు వుండేవి. అందువల్ల నేను గానీ, మా ఇంటికి వచ్చిన నా స్నేహితులు గానీ మా ఇంటి పక్కకు వెళ్ళి కుక్కల్లాగా కాలు లేపి వచ్చేవారం. ఆ దృశ్యాలు ఎన్ని సార్లు చూసి డోక్కుందో కానీ  ఆమె ఓ రోజు మమ్మల్ని అనగా నన్నూ, మా మిత్రులని కలిపి నిలదీసింది రోజూ ఎందుకు మీ ఇంటి పక్కనే మూత్రం పోస్తారూ?! అని. పోనీ మీ ఇంటి పక్కకొచ్చి పొయ్యమంటావా? అని ఆమెని అడిగేసాను. వాళ్ళింటి పక్కన కూడా ఖాళీ స్థలం వుండేది లెండి. ఆమె నా జవాబుకి షాక్ తిని యాక్ అని చెప్పి ఆమె చెల్లెళ్లతో కలిసి వాళ్ళింటికి తుర్రుమన్నది. మళ్ళెప్పుడూ ఆ ప్రశ్న మమ్మల్ని అడగలేదు. మేము నిరభ్యంతరంగా మా పక్కింటోడు ఇల్లు కట్టేదాకా ఆ నేలని ఎంచక్కా పావనం చేస్తూపోయేం.

17 comments:

 1. లంబాడా సిస్టర్సా మజాకా?!

  ReplyDelete
 2. మీ బ్లాగ్ చూస్తూంటే ఇది చెప్పాలనిపించింది. మీరు మారతారని కాదు బట్ ఎందుకో...

  చాలా రోజుల క్రితం మాట. మా బాబయ్య గార్ని ఒక తుంటరి అడిగేడు. "మీరెందుకు అన్ని దేవుళ్ళ పటాలు పెట్టుకుంటారు ఇంట్లో?"

  ఆయన సమాధానం: "ఎప్పుడూ ఏది అలోచిస్తామో అదే మనకి మిగిలేది. ఈగ ఉందనుకో. దానికి ఎక్కడ వాలాలో దానిష్టం. మనం తినే స్వీటు మీద వాలచ్చు. కానీ మనం విసర్జించే అశుద్ధం మీద వాలచ్చు. అంచేత మనకి ఏమికావాలో మన ఆలోచన్లే చెప్తాయి."

  "ఉచ్చలూ, సెక్సూ రోజుకి 24 గంటలూ ఆలోచించడం తప్పేనా?" అది మీ మటుక్కి మీరు నిర్ణయించుకోవాల్సింది. ఏ ఈగ ఎక్కడ వాలాలని ఉంటే అక్కడే వాలుతుంది. మీరు చేసేది తప్పూ అని ఎవరూ చెప్పబోవడం లేదు కానీ మీ మనస్సనే ఈగ ఎప్పుడూ అశుద్ధం మీద వాలుతోంది అని మీకు తెలుస్తోందా?

  దేవుడున్నాడా లేదా అనేది పక్కన పెట్టి మీరు అప్పుడప్పుడూ మెడిటేషన్ అంటున్నారు కదా? శంకర భగవత్పాదుల ఈ క్రింది శ్లోకం గుర్తు పెట్టుకోండి.

  ఆనందామృతా పూరితా హర పదాంభోజాల వాలోద్యతా
  స్థైర్యోపఘ్న ముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్వితా
  ఉఛ్ఛైర్మానసకాయపటలీ మాక్రమ్య నిష్కల్మషా
  నిత్యాభీష్ట వరప్రదా భవతుమే సత్కర్మ సంవర్ధితా

  (పరమేశ్వర సేవానురక్తి నీరుపోతగా చరణకమలాలు పాదుగా జిత స్థైర్యము ప్రాకుడుగంపగా బయలుదేరి అల్లుకొనుచు ఉన్నతమైన నా మనస్సనెడి పందిరి అంతటా అల్లుకొని చీడ మొదలగు దోషములు అంటకుండా నా మనోభీష్టము శాశ్వత ఫలము ప్రసాదించుగాక)

  ఆ తర్వాత శుద్ధమైన మనస్సుని ఏం చెయ్యాలో చెప్తున్నారు చూడండి.

  కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ
  గృహస్తే స్వర్భూజామర సురభి చింతామణిగణే
  శిరస్తే శీతాంసౌ చరణయుగలస్తేఖిలశుభౌ
  కమర్దం దాస్యే జహం భవతు భవదర్దం మనమనః

  (పరమేశ్వరా నీ చేతిలో బంగారం కొండ ఉంది. కుబేరుడు నీ స్నేహితుడే. నీ వాకిట్లోనే కామధేనువూ, చింతామణి వజ్రం ఉన్నాయి. నీ తలమీద ఎప్పుడూ చల్లదనాన్నిచ్చే చంద్రుడున్నాడు. ప్రపంచంలోని అన్ని శుభాలు నీ చేతిలోనే ఉన్నాయి. అటువంటి నీకివ్వగలిగేది ఏదీ కనిపించదు కనక నా మనస్సే నీదవుగాక)

  కష్టపడి శివానందలహరి పుస్తకం బయటికి తీసి టైప్ చేసాను. "ఆ వంకాయ్" అని తీసిపడేయకండి. ఎప్పుడో తీరిక ఉన్నప్పుడు నిదానంగా ఆలోచించుకోండి. మిమ్మల్ని భక్తులైపోమని ఎవరూ చెప్పడం లేదు. యద్భావం తద్భవతి అని మాత్రమే చెప్పేది.

  క్లోజ్ చేసే ముందు మరోమాట.
  "ప్రపంచంలో దేవుడున్నాడా లేదా అనేది పక్కన పెట్టండి. ఎప్పుడూ హైయ్యర్ వాల్యూస్ కోసం ప్రయత్నిస్తూ ఉండండి. మాంస ఖండాల కోసం కుక్కల వలే కాట్లాడుకుంటూ బతకడం కంటే, లేదు లేదనే మహోన్నతాశయన్ని నమ్మి దాని కోసం ప్రయత్నిచడం లక్షరెట్లు మేలు.... స్వామి వివేకానంద."

  శుభం భూయాత్!

  ReplyDelete
 3. @ వినోద్
  :)

  @ అజ్ఞాత
  మీ కామెంటు చూసాక అర్జంటుగా మా ఇంట్లో సౌందర్య భామల కేలెండర్ ఫోటోలు పెట్టుకోవాలని గుర్తుకువచ్చింది. ప్రషుతానికయితే ఒక్కటీ లేదూ.

  నేను చేసేది ధ్యానం ఓషో ధ్యానం కాబట్టి అవన్నీ ఓకే లెండి.

  నేను పూర్తిగా అధ్యాత్మిక చింతనకి మరలినప్పుడు ఇలాంటి మాటలు నచ్చుతాయి. ఇప్పుడే అంత వైరాగ్యంలో పడదలుచుకోలేదు. అయితే కొద్దిగా స్పిరుచువాలిటీని మాత్రం టచ్చులో ఉంచుకుంటున్నా.

  ఎనీ వే, సహృదయంతో మీరు కష్టపడి అంతటి సలహా ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సమయం వచ్చినప్పుడు, ఆ వయస్సు వచ్చినప్పుడు వైరాగ్యం కలిగినప్పుడు, ఆ ఆలోచనలు అవే వస్తాయి. అందాకా ఇలా విభిన్నంగా నన్ను బ్రతకనివ్వండి. అలాంటి ఆధ్యాత్మిక చింతనకి బోలెడంత సమయం వుంది. ముసలాడినయ్యాక నేను చేసే పనేం వుంటుంది - అది తప్ప. ఇప్పుడే కోరికలని కంట్రోల్ చేసుకోదలుచుకోలేదు కానీ బ్యాలన్స్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే నాకు తగ్గ ధ్యానాలూ గట్రా.

  నాలో మార్పు రాదు అని చెప్పట్లేదు. వస్తుంది కానీ ఇంకా సమయం వుంది. దానికి తొందరేం లేదు. అప్పుడు ఆధ్యాత్మికం అంతు చూస్తాను.

  ReplyDelete
 4. @ అజ్ఞాత
  అన్నట్లు నా దృష్టిలో 'ముసలితనం వయస్సుని బట్టి రాదు - మనస్సుని బట్టి వస్తుంది'. మనలో కోరికలు చచ్చాక మిగిలేది ముసలితనమే కదా. వారిలో పరిపూర్ణత, అనుభవ జ్ఞానం వుంటుంది. వారు గౌరవనీయులు. యువత పెడతోవ పడుతుందని తరచుగా గొణుక్కుంటుంటారు. కొంతమంది ముప్పయ్యేళ్ళకే ముసలివారవుతారు. మరికొంతమంది ఎనభై ఏళ్ళకి కూడా అవచ్చు. చూద్దాం - నేనెప్పుడవుతానో.

  రాతి యుగం లాంటి కాలాల్లో చాలామంది ముప్పయి ఏళ్ళకి లోగానే మరణించేవారుట.

  ReplyDelete
 5. మీ "రోజూ మీ ఇంటిపక్కనే ఎందుకు ఉ...(బీప్) పోస్తారు?!" పోస్ట్‌పై అజ్ఞాత క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:

  @ above AGNATHA

  GOD has nothing to do with Meditation!!!

  [Edited. ఈ అజ్ఞాతకి ఓ చిన్న గమనిక: ఎవరయినా మర్యాదతో, మన్ననతో పరస్పరం భావాలు తెలియజేసుకోవచ్చు. పై అజ్ఞాత ఒక శ్రేయోభిలాషిగానే నాకు సలహా ఇచ్చారు కనుక, దురుసుగా వ్రాయలేదు కనుక వారిపైన మీ కఠినమయిన వాక్యాలని ఎడిట్ చేయాల్సి వచ్చింది]

  ReplyDelete
 6. అజ్ఞాత Gaaru.....
  మీరు హరి సేవ భ్లాగ్ చదవండి ....షరత్ బ్లాగ్ మసాల ఫ్రియుల కొసం.....

  ReplyDelete
 7. మీతో వచ్చిన చిక్కే ఇది. ప్రతీవాడూ ఒక యోగి వేమన ఐపోదామనే. ఇప్పట్నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తే అరవై ఏళ్ళు వచ్చేసరికి ఏది గుర్తు ఉంటుందో ఆ మాత్రం గ్రహించలేరా? ఏదో ఒకరోజున రూఫ్ తెరుచుకుని సినిమాల్లో చూపించినట్టూ ఏదో కనక వర్షమో, భగవదనుగ్రహమో కురిసేస్తుందని ఆశ? సరే కానివ్వండి. ఎప్పుడైనా ఒక సారి ఆలోచించుకోండి - ఎందుకు శంకర భగవత్పాదులూ, స్వామి వివేకానందులూ, బుధ్ధుడూ చిన్నప్పుడే సన్యాసం తీసుకున్నారో? మిమ్మల్ని సన్యాసం తీసుకోమని చెప్పబోవడం లేదు అని గ్రహించండి. జీవితాంతం ఏది ప్రాక్టీస్ చేస్తే అదే మనకి మిగిలేది. అరవై ఏళ్ళకి ఏదో చేద్దాం అనుకునేవారు అరవై ఏళ్ళు వచ్చేసరికి ఎలాగ/ఎక్కడ ఉంటారో?

  To the other ajnata: If you read my post again you will notice, that I already said God has nothing to do with meditation. :-) I only was talking about how you can shape your mind in a sophisticated way. Nobody is forcing you to discuss God - oh that too in a blog like this (no offense to Sarath though) :-) And BTW knee jerk reactions do not help in healthy discussion.

  ReplyDelete
 8. అజ్ఞాతా: ఆ వంకాయ్..

  శరత్ భయ్యా: "అప్పుడు ఆధ్యాత్మికం అంతు చూస్తాను.".. ఆ చూసేదేదో ఇప్పుడే మొదలు పెడితే బాగుంటుంది.. ఏమో ఏ రాయి తగులుతుందో..

  గుడ్డిగా మత పుస్తకాలు చదివే లోకానికి స్పష్టత నిచ్చే మనుషులు అవసరం.. మరీ ఇలా అర్థం లేని గోడలు కట్టుకుని మనుషులు ఎన్నేళ్ళు బతకాలి..

  కొన్ని మతాలైతే రాళ్ళతో కొట్టడం, చంపేయడం లాంటివి చేస్తున్నాయి..

  ఓషో ప్రకారం ఐతే.. ఇస్టిప్పిడిటీ ఎక్కువైపోతున్నది..

  ReplyDelete
 9. @ అజ్ఞాత @ 27 జనవరి 2012 1:55 సా
  నాకో విషయం గుర్తుకు వచ్చింది :) పదకొండేళ్ళ క్రితం సంగతి. ఓ స్నేహితురాలు నన్ను మార్చాలని చూసింది. అది తెలిసిన ఇంకో స్నేహితురాలు నన్ను మారొద్దని తెగ రిక్వెస్ట్ చేసింది. ఆ ఇద్దరితో నాకు శారీరక సంబంధాలు ఏమీ లేవు లెండి. కొన్ని రోజులు తెగ ఊగిసలాడిపోయాను. ఆ తరువాత కాలంలో నెమ్మదిగా మొదటి అమ్మాయినే మారిపోయింది :) సవాస దోషం అంటే అదే కదూ.

  ReplyDelete
 10. @ సింహం
  మీకే పాపం చేసానని నన్ను అప్పుడే సన్నాసుల్లో కలిపేయాలని చూస్తున్నారు? నేను సన్యాసం తీసుకున్నప్పుడు "అన్నమైతేనేమిరా, సున్నమైతేనేమిరా, ఈ పాడు పొట్టకు అన్నమే పడవేయురా" అనే మెట్టవేదాంతాలు వల్లించను. ఏదయినా సరే మనసా, వాచా, కర్మేణా ఆచరించెయ్యడమే. ఆధ్యాత్మికం అనగానే సన్యాసం అని కాదు లెండి కానీ అది బాగా తలకు ఎక్కితే ఇంకా వేరే ఆలోచనలు ఏమొస్తాయి చెప్పండి? హమ్మా, మీ కుట్రని కండిస్తన్నా.

  ఓషో గురించి బాగానే చదివేస్తున్నారులా వుంది. ఓషో మ్యాగజైనులో కొన్ని వ్యాసాలు తప్ప పెద్దగా చదవడం లేదు. ఆన్లైన్ లైబ్రరీకి వెళ్ళి చాలా రోజులవుతోంది.

  ReplyDelete
 11. అంత క్లారిటీ ఆయన చెప్తే మీకు ఉట్టి సినిమా సన్యాసం లాగా కనిపిస్తుందా?

  ఆయన కూడా రెగులర్ జీవితం గడపటం గురించే చెప్పేది.. కాకపోతే జీవితాన్ని ధ్యానం తో కలిపి కొట్టమంటున్నాడు..

  ఇక్కడ గంటల తరబడి ఓషో వీడియోలు చూస్తున్నా..

  ReplyDelete
 12. కాకపోతే జీవితాన్ని ధ్యానం తో కలిపి కొట్టమంటున్నాడు.. ......LOL
  ఏం చెప్పావన్న ....

  ReplyDelete
 13. @ సింహం
  లేదండీ. నేను జీవితాన్ని ధ్యానంతో కలిపికొట్టను - తంత్రతో కలిపి తంతా! నేనింకా చిన్న కుర్రాడిని ( కనీసం మానసికంగా). నా మనస్సుకీ, వయస్సుకీ ఆటబొమ్మలు తగును కానీ అద్వైతం ఏంటీ మరీనూ? ఏదో రైమింగుకి బావుందని అద్వైతం అని అన్నా కానీ దానియొక్క టీకా, తాత్పర్య, నానార్ధాలు వర్ణించమని నన్నెవరూ అడక్కండి బాబూ దయచేసి.

  ReplyDelete
 14. @ Sarath

  I admire your magnanimity. I respect you for what you are and believe it is nobody's business to judge you.
  I could not but notice the holier-than-thou attitude so full of self righteousness indignation in the free advice offered by the anonymous.

  ReplyDelete
 15. మీరెలా ఉండాలనేది మీఇష్టం. మీరు మీకునచ్చినట్లుగా ఉండకుండా -స్వర్గమ్మీద మోజుతో- ఇంకొకరినచ్చినట్టు ఉండటానికీ చచ్చిపోవడానికీ తేడా ఏమీలేదు.

  కానీ ఒకటి. మీ స్వోత్కర్షలకంటే (ఈ మధ్య అవే రాస్తున్నారు కదా), మీరుచూస్తున్న విషయాలపై మీ కామెంట్లు నాకు నచ్చుతాయ్. కాబట్టి వాటితోబాటూ మీరు గమనిస్తున్నవాటిపై విమర్శలూ, మెచ్చుకోళ్ళూ రాస్తూండండి.

  ReplyDelete
 16. @ మినర్వా
  స్వొత్కర్ష అంటే మనలని మనం పొగుడుకోవడం అనుకుంటాను. నా గురించి నేను పొగుడుకోవడం తక్కువే కనుక నా గురించి నేను వ్రాసుకోవడం అని మీ అర్ధం అయివుంటుంది. మీ అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుంటాను. వ్రాసేప్పుడు నాకు ఓ సందేహం ఎప్పుడూ వస్తూనేవుంటుంది. పలువులు మెచ్చే విషయాలు వ్రాయాలా లేక నాకు నచ్చింది వ్రాసుకుంటూ పోవాలా అనేది. పలువురు మెచ్చే విషయాల్లోనే నాకు నచ్చేవి వ్రాయొచ్చు కానీ అంత అవసరం ఏంటని అనిపిస్తుంది. నాకు నచ్చినట్లుగా వ్రాసుకుంటే కాస్త మనస్ఖలించినట్లుగా వుండి హాయిగా అనిపిస్తుంది.

  ReplyDelete