మనం ఎంత ప్రయత్నించినా అనుకున్న ఫలితాలు రాకపోతే ఆ ప్రాసెస్ లోనో, సిస్టంలోనో మార్పు తేవాలనుకుంటాను. ఉదాహరణకి గత కొన్ని నెలలుగా ఆఫీసు లంచ్ అవర్లో వ్యాయామానికి వెళుతున్నాను. అయితే మీటింగుల వల్లనో, మూడు బాగాలేకో, అలసట వల్లనో, ఇతర పనుల వల్లనో ప్రతి రోజూ వెళ్ళడానికి వీలు అవదు. అలా క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యలేకపోతున్నాను. ఇహ మరో వైపు ధ్యానమూ రోజూ చెయ్యడానికి సమయం కెటాయించలేకపోతున్నాను. ఆలోచించగా ఈ రెండింటికీ ఓ పరిష్కారం దొరికింది. ఉదయం అయిదున్నరకే లేచేసి ఓ చాయ్ తాగేసి ఆరుగంటల రైలు అందుకొని ఏడింటికలా ఆఫీసుకి వచ్చెయ్యాలని ప్లాను చేస్తున్నా.
ఏడింటికే ఆఫీసు పని మొదలెట్టాలనే! అంతలేదు. మా ఆఫీసు బ్యుల్డింగులోనే జిమ్ము వుంటుంది. అందుకోసం. ఓ గంట వ్యాయామం చేసి అక్కడే స్నానం చేసి శుబ్బరంగా ఆఫీసుకి రావాలని అనుకుంటున్నాను. ఇహ లంచ్ అవర్లో మధ్యాహ్న భోజనం అయ్యాక నా ఆఫీసు గది తలుపు మూసివేసి కాస్సేపు ఎంచక్కా ధ్యానమో ఆ పేరిట ఓ కునుకో తీసిపడెయ్యొచ్చనుకుంటున్నాను. ఎలా వుంది నా ప్లాన్? ప్రణాళికలకేముంది భేషుగ్గానే వుంటాయి - అవి అమలు చేసినప్పుడు కదా సంగతి. మర్రదే మండుద్ది. అందుకే కదా మీకు చెప్పడం. నాలో నేను అనుకుంటే లైట్ తీసుకుంటాననే మీకు చెబుతూంట. బ్లాగుల్లో నా శ్రేయోభిలాషులంటూ ఎవరయినా వుంటే నా బాగోగులు అప్పుడప్పుడయినా కామెంట్ల రూపేణా కనుక్కోండి బాబయ్యా.
విజయం సాధించాలంటే ముందు మన మాట మన మనస్సు వినాలి. అలా మనస్సు మెడలు వంచడానికి ధ్యానమూ, వ్యాయామమూ బాగా ఉపకరిస్తాయి. అవి రెండూ చేస్తున్నప్పుడు మనలో ప్రశాంతతా, చురుకుదనం వెల్లివిరుస్తాయి. బద్దకం తగ్గుతుంది. ఏవన్నా పనులుంటే ఇప్పుడేం చేస్తాములే బాబూ అనుకోకుండా ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తాం. అలా ఒకదాని తరువాత ఒకటి పనులు పూర్తిచేసుకుంటూ, ఉప లక్ష్యాలను అందుకుంటూ అసలయిన వేదికలను అందుకోవచ్చు. అందుకే ఆ రెండింటి మీద శ్రద్ధ వహిస్తుంటాను కానీ పలు కారణాల వల్ల క్రమం తప్పకుండా చెయ్యలేకపోతుంటాను. అందుకే ఈ ప్రాసెస్ లేదా సిస్టం ఛేంజ్. చూద్దాం. చేసి చూద్దాం. ఉదయమే కాస్త నన్ను నేను తన్నుకొని లేవగలిగితే మిగతా పనులు వాటంతటవే దాదాపుగా జరిగిపోతాయి.
http://sahiti.org/dict/index.jsp?engWord=process
ReplyDeletehttp://sahiti.org/dict/index.jsp?engWord=system
ReplyDeleteఉదయం పూట వ్యాయామం కంటే మెడిటేషన్ మంచిది. లంచ్ తర్వాత కావాలంటే వాకింగ్ చెయ్యండి (ఈ కాలం లో మీ ఊరిలో కష్టమే లెండి) అంతే కాని మెడిటేషన్ చేస్తే హాయిగా నిద్రపోయి పొట్ట పెంచుకుంటారు. సాయంత్రం ఆఫీస్ అయ్యాక జిమ్ముకెళ్లండి. ఆ సమయం లో అయితే ఎక్కువ జనాలు వుంటారు, మీక్కూడా మోటివేషన్ వస్తుంది. తర్వాత హాయిగా స్నానం చేసి ఇంటికెళ్లొచ్చు. కామన్ షవర్స్ లో అందమైన మగ నగ్న శరీరాలను చూసి ఆనందించొచ్చు. ఇక్కడ కూడా అదే యావనా అంటారా? మరి క్రమం తప్పకుండా వెళ్లాలంటే ఎదో ఒక అట్రాక్షన్ వుండాలి కదా ....
ReplyDelete//అంతేగాని మెడిటేషన్ చెస్తే హాయిగా నిద్రోతారు"//
ReplyDeleteఎవరు చెరయ్యా బాబు మెడిటషన్ అంటే హాయిగా పడుక్కోడం అని.. ఖర్మరా బాబూ..
Sharat, interesting application of PDCA. Are you a quality professional (e.g. ISO/CMM)?
ReplyDelete@ సిద్ధార్ధ్
ReplyDeleteసాయంకాలాలు అంతకంటే ముఖ్యమయిన పనులు సాధారణంగా వుంటాయి కాబట్టి అప్పుడు జిమ్ముకి క్రమం తప్పకుండా వెళ్ళడం కష్టం. అందుకే ఉదయమే చేసిపడేస్తే ఓ పని అయిపోయినట్లుగా వుంటుంది.
@ జై
అవి తెలియవండీ. నేనో సాధారణ కంప్యూటర్ కళాకారుడిని.
Anny...nuvvu kevvu kaka.....neku intha samayam ela vuntundi....Zym, meditation, ofice and more over everyday two blog posts and following the comments....
ReplyDelete@ అజ్ఞాత తమ్ముడూ
ReplyDeleteరోజుకి రెండు కాదు...సగటున రోజుకి మూడు టపాలు వ్రాస్తుంటాను. టైం మేనేజెమెంట్ వల్ల అవన్నీ కుదురుతాయి. నీకు పెళ్ళయ్యిందో లేదో కానీ తమ్ముడూ, ఇవన్నీ ఒకేత్తు, ఇంటికెళ్ళింతరువాత మరొక ఎత్తు. ఈ పనులేమీ సమస్యగా అనిపించవు కానీ ఇంటికెళ్ళగానే చాలా పనులు మీద పడుతాయి. క్షణం తీరిక వుండదు. అందరి హెల్త్ అప్పాయింట్మెంట్లు, ఏక్టివిటీ స్కెడ్యూల్స్, హోం వర్కులూ, పాఠశాలల నుండి వచ్చే పేపర్లు, మా ఆవిడ గొణుగుళ్ళు, మా పాప ఏడుపులు అలా అలా వీటన్నింటికీ సమయం దొరక్క అవస్థపడుతుంటాను. ఈ దేశాల్లో పెళ్ళయి, పిల్లలున్న వారందరి సాయంత్రాలు దాదాపుగా ఇలాగే అఘోరిస్తాయి.
నీకు పెళ్ళయ్యిందో లేదో కానీ తమ్ముడూ, ...ayyindi annay...Anduke adiga. Enni panulu ela chesthav ani. nenu intiki vellaka me sayantram lene na sayantram gadusthundi.
ReplyDelete"అవి తెలియవండీ. నేనో సాధారణ కంప్యూటర్ కళాకారుడిని"
ReplyDeleteYou are too modest. The quality of your work on this blog is definitely not "సాధారణ".
మీకు సమయం దొరికితే ISO, CMM, TQM, six sigma లాంటి విషయాలు చదవండి. ఈ విషయాలపై మీరు ఒక బ్లాగు రాస్తే బాగుంటుంది.
@ జై
ReplyDeleteమీ ప్రశంస నన్ను సంతోషపరిచింది. ధన్యవాదాలు :)
మీరు ప్రస్థావించిన విషయాలపై నాకు ఆసక్తి లేదండీ. అందువల్ల వాటి గురించి వ్రాయలేను.
Very Nice Post
ReplyDeleteTop Most of your Entire blog
(In my view)
Thanks For Sharing with all of Us.
Keep it up sir
bye bye
?!