ఆ ప్రేమ ఎందుకు విఫలం అయ్యిందంటే...

అప్పట్లో ఓ రెండు మూడేళ్ళు మా బంధువుల అమ్మాయితో చాలా గాఢంగా ప్రేమలో పడ్డాను. నిజానికి నేను నచ్చి ఆమె నన్ను ప్రేమలో పడేసిందనుకోండి. ఆ నచ్చడానికి వెనుక చచ్చేంత కారణం ఒకటి వుంది. నిజానికి నేనేమీ నచ్చలేదు కానీ నన్ను నచ్చుకుంది. ఎందుకనగా ఆమె పదవతరగతి చదువుతున్నప్పుడు ఆమెను గిల్లేసాను. అది ఆమె తనమీద ఇష్టం అనుకుంది. ఆ గిల్లుడు మనకు క్యాజువల్ అని ఆమెకు తెలియదు. ఓ అయిదేళ్ళ తరువాత ఇహ మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అని అడిగింది. పెళ్ళి? మన మధ్య ప్రేమే లేదు - అప్పుడే పెళ్ళి దాకా వచ్చావా అని ఆశ్చర్యపోయాను. అప్పుడు ఆశ్చర్యపోవడం ఆమె వంతు అయ్యింది. మన మధ్య ప్రేమ లేదా అని నోరు తెరచింది. లేదు కదా అన్నాన్నేను గోళ్ళు గిల్లుకుంటూ. మరి అప్పుడు గిల్లిందీ అని అడిగింది? ఓసోస్ అదీ ఓ ఇసయమేనా, ఎంతో మందిని అలా గిల్లేస్తుంటాం లేవో అన్నాను. ఆమె మ్రాన్పడిపోయింది.

అప్పుడు ఆ అమ్మాయి గారికి దగ్గరగా కూర్చొని అంతా వివరించాను. అప్పుడెప్పుడో అయిదేళ్ళ క్రితం నిన్ను కెలికాను కానీ ఆ తరువాత మళ్లీ నిన్ను ముట్టుకున్నానా? అసలెప్పుడప్పుడయినా నీతో దోమా, ప్రేమా అని డైలాగులేసానా అని ప్రశ్నించాను. లేదు అంది. మరి ప్రేమ అని ఎలా అనుకున్నావ్ అని పళ్ళు నూరాను. నాతో ఎంతో బావుండేవాడివి కదా అంది. నాకు నచ్చిన ఆడాళ్ళందరితో నేను అలాగే వుంటానూ, అలా స్నేహాన్ని ప్రేమ అనుకుంటే పొరపాటు కాదా అని దులిపేసాను. సరే జరిగిందేదో జరిగింది కానీ ఇకపై నన్ను ప్రేమించెయ్ అని ఏకపక్షంగా తీర్మానించింది. నా వల్ల కాదు మొర్రో అన్నా వినకుండా ప్రేమ ముగ్గులోకి దింపింది.

అలా లవ్వులోకి పీకలోతుగా మునిగిపోయాక నన్ను మార్చాలని చూసింది. అలాగే ఓయ్యెస్ నేను మారతా నువ్వూ మారూ మరి నేనూ డిమాండ్లు పెట్టేవాడిని. అతి ప్రేమతో, ఆమె మీది పొజెసివ్నెస్ తో ఆమెను బాగా అవస్థలు పెట్టేవాడిని. నేను నిజంగానే నాలో మార్పు కోసం కృషిచేసి మారిపోయాను. మూడేళ్ళు మారి వుంటే నీలో జీవితాంతం మార్పు వస్తుంది అంది. అయితే ఆమె మాత్రం నాకోసం పెద్దగా మారలేకపోయింది. ఒక ముఖ్యమయిన విషయంలో నేను చెప్పింది ఖాతరు చెయ్యలేదు. దాంతో మాలో మాకు విభేదాలు వచ్చాయి. మాట్లాడుకొని గౌరవంగా విడిపోయాము. ఆమెకు ఇచ్చిన హామీ ప్రకారం మూడేళ్ళు మారి వుండి ఆపై మళ్ళీ నా రూటులోకి నేను వచ్చేసాను.  ఇప్పటికీ మామధ్య ఒకరిమీద ఒకరికి గౌరవం వుంది. ఇండియా వెళ్ళినప్పుడు ఆమెని కొద్దిసేపు కలిసి వస్తుంటాను.

అప్పటి నా ప్రేమ అన్నది ఆకర్షణ తప్ప నిజం కాదు. అందుకే అందులో విఫలం అయివుంటాను. నాది నిజమయిన ప్రేమ అయివుంటే నేనింత ప్రేమించాను కాబట్టి నువ్వూ అంతగా ప్రేమించాలి అని డిమాండ్ చేస్తానా? నేను ఇంత మారాను కాబట్టి నువూ ఎంతో మారు అని పోరుతానా? నిజమయిన ప్రేమ కానీ, ఆరాధన కానీ అన్‌కండీషనలుగా వుండాలి. త్యాగాలు వుండాలి కానీ తీర్పులు వుండవద్దు. అలాంటి సోకాల్డ్ ప్రేమల్లో వుండే ఇంకో పొరపాటు ఏమిటంటే విపరీతమయిన ప్రేమ - తద్వారా వచ్చే సున్నితతత్వం - అందువల్ల పొజెసివ్నెస్. ఆమెకు వుండేది కాదు కానీ నాకు విపరీతంగా వుండేది. దాంతో ఆమెను మానసికంగా ఎంతో  అవస్థ పెట్టాను. నన్ను వదిలించుకున్నాక హాయిగా ఊపిరి పీల్చుకొనివుంటుంది - శని వదిలిపోయిందని. ఆ ప్రేమానుభవం నుండి పొరపాట్లు తెలుసుకున్నాను కనుకనే ఆ పై నా ప్రియురాళ్లను ఆరాధించేవాడినంతే.  అప్పటినుండి ఎప్పుడూ ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదు.

ఇహపోతే ఆమె  ప్రేమేమీ అచ్చమయింది కాదులెండీ. నిజంగా నేనంటే పిచ్చపిచ్చగా ఇష్టమయి నన్ను ప్రేమిస్తే అది వేరుగా వుండేది. అప్పుడేప్పుడో కెలికాడు కదా, పాతివ్రత్యం నిలబెట్టుకోవాలి అని పట్టుదలవహిస్తే ఫలితాలు ఇలా వుండక ఏం చేస్తాయి? సరే, కష్టమయ్యో, ఇష్టమయ్యో నన్ను కట్టుకుందామని పట్టుదల వహించింది. బాగానే కృషి చేసింది కానీ నేనే ఆమె అభిమానాన్ని నిలుపుకోలేకపోయాను. అయితే ఒక ముఖ్యమయిన, నా సంక్షేమం కోసం బాగా అవసరమయిన విషయంలో ఆమె తగిన విధంగా స్పందించకుండా మొరాయించింది, ప్రాధాన్యత వేరేదానికి ఇచ్చింది కాబట్టి ఆమె మీద నా మనస్సు విరిగింది. ఏదేమయినా గొడవలు లేకుండా ప్రశాంతంగా, చక్కగా విడిపోయాము. అది కూడా ఆమెలో మెచ్చుకోవాల్సిన విషయం.

ఏదేమయినప్పటికీ ఆమెను అప్పుడు ఆరాధించివుంటే, ఆమె నుండి ఎలాంటి ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోకుండా వుండి వుంటే, ఆమె చెప్పినట్లే వినివుంటే మా బంధం బలపడివుండేది - మాకు పెళ్ళి అయివుండేది. అప్పుడింత పరిణతి ఎక్కడిది? ఆమె కూడా అదే నా పట్ల చేసివుండవచ్చు కానీ మనకు లేని పరిణతి ఆమె నుండి మాత్రం ఎలా ఆశిస్తాం? సో, మా ప్రేమ విఫలం అవడానికి బాధ్యత నాదే.

9 comments:

 1. ఐతే కథలో చెప్పినట్టు, అమెరికాలో చదవడం, మీరు ఇండియాకి రమ్మన్నా రాకపోవడం కాదా ఐతే విడిపోవడానికి కారణాలు? మరి 'దీప్తి' గురించి చెప్పలేదు? :)

  ReplyDelete
 2. @ యజ్ఞ
  :) మా ప్రేమను ఆసరా తీసుకొని నేను వ్రాసిన నవలను బాగానే గుర్తు పెట్టుకున్నారే. దీప్తి పేరు ఆ నవల్లో ఎవరికి పెట్టానో గుర్తుకులేదు. ఒకరికి అయివుండవచ్చని అనిపిస్తోంది కానీ నా నవల మరోసారి తిరగేసి చెబుతా.

  ఒక ముఖ్యకారణం వల్ల మాలో విభేదాలు వచ్చాయని టపాలో చెప్పా కదా. అదే అది. నేను కొన్ని విపత్కర పరిస్థితుల్లో వుండగా ఆమె దూరంగా యూనివర్సిటీ చదువు చదువుతూ పోయింది. చావు తప్పి కన్నులొట్టబోయి నేను ఆ స్థితి దాటాక తీరిగ్గా వచ్చి ఇప్పుడు బాగానే వున్నావు కదా అంది. నో, థేంక్స్ అని చెప్పా.

  ఆసక్తి వున్న వారు 'ఉరి' సైకలాజికల్ థ్రిల్లర్ ఇక్కడ చదవచ్చు:
  http://sites.google.com/site/sarathkaalam/novels

  ReplyDelete
 3. శరత్ గారూ,
  అసలు మర్చిపోతే కదా... ఆద్యంతం ఒక జీవితాన్ని చదివిన అనుభవాన్నిచ్చింది ఆ నవల.
  అది చదివిన తరువాత, మీ బ్లాగ్ పోస్టులు ఒక్కటి కూడా వదలకుండా మొత్తం చదివి, చాలా పాత్రల్ని పోల్చుకోగలిగా... అప్పుడు అర్థం అయ్యింది ఆ నవల నిజంగా నిజమని, ఒక జీవితమని.
  Thanks for sharing such a wonderful novel. :)

  ReplyDelete
 4. @ యజ్ఞ
  :)

  ఇంకా నవల తిరిగెయ్యలేదు. నాకు సహాయం చేసిన అమ్మాయి పేరు దీప్తి అయితే కనుక - ఆ అమ్మాయి తరువాత నాకు చాలా దగ్గరయ్యింది కానీ ఓ నాలుగేళ్ళ తరువాత ఆమెని పూర్తిగా దూరం చేసాను. ఎందుకన్నది ఒక టపాగా వ్రాస్తేనే బావుంటుంది. మనుషులు మారిపోతారు. తన ఉన్నతమయిన వ్యక్తిత్వాన్ని కోల్పోయిందామె.

  ReplyDelete
 5. fail అయిన ప్రతి ప్రేమను, కొంత(చాలా) కాలం తర్వాత 'ఆకర్షణా' అనేసి ఆత్మవంచన చేసేసుకోవడం ;) లేదంటే, అప్పటి immaturity అని కొట్టేయడం... రొటీనే...

  ReplyDelete
 6. ninnane neunu maaraanani raasinattu gurth !

  ReplyDelete
 7. Transition happens

  ReplyDelete
 8. హమ్మయ్య..., ఇలాంటి పోస్టులు ఇకనుండి రాయరేమో అనుకున్నా,

  ReplyDelete
 9. @ భాను, అజ్ఞాత, మిర్చి
  నా శారీరక సంబంధాల గురించి మాత్రమే వ్రాయను అన్నాను. ప్రేమ వ్యవహారాల మీద టపాలు వుంటాయి. అయితే ఈ ప్రేమకి మూలం శారీరకమయినదే అవడంతో కొద్దిగా ఆ విషయం ప్రస్థావించక తప్పలేదు.

  ReplyDelete