ప్రేమకూ ఆరాధనకూ తేడా ఏంటి?

అసలయితే ప్రేమ కూడా ఉత్కృష్టమయినదే అవాలి కానీ మన సినిమాలూ, ఏసిడ్ బుడ్డీలు పట్టుకొని చేసే ప్రేమలూ, ప్రతిఫలం ఆశించే ప్రేమల వల్ల జనాల్లో దాని విలువ తగ్గిపోయింది. అయితే ఆరాధన అన్న పదం అందరూ ఎక్కువగా ఎక్కడపడితే అక్కడ ఉపయోగించరు కాబట్టి దాని ఉదాత్తత అయినా మిగిలే వుంది. ప్రేమలో కూడా వాస్తవానికి ఆరాధన వుంటుంది, వుండాలి కానీ నిజమయిన ఆరాధన అంటే ఏంటో నా అభిప్రాయం చెబుతాను. అది సరి అయినదో కాదో మీరు చెప్పండి.

ఈ కాలంలో ప్రేమకు అర్ధం పరస్పరం ప్రేమించుకునే ప్రేమ అని ఎక్కువమంది భావిస్తున్నారు. అలా కాకుండా, ఎలాంటి ప్రతి ప్రేమనూ, ప్రతిఫలాన్నీ ఆశించని ప్రేమని ఆరాధన అంటాను నేను. అయితే ఆరాధన అంటే అక్కడే ఆగిపోదు. అలా అని గొంగచాటుగా, వన్ సైడ్ లవ్ అని కాదు. రెండు వైపులా ప్రేమ వుండొచ్చు కానీ అది ప్రధానం కాదు. ఎదుటి వ్యక్తిని బాగా ఇష్టపడుతూ, అభిమానిస్తూ, దేవత లాగా భావిస్తూ పోవడమే ఆరాధన నా దృష్టిలో. నేను ఇంత ప్రేమించాను కాబట్టి నువ్వు అంతా ప్రేమించాలి అనే కొలతలు, లెక్కలు వుండవు. ఆర్య సినిమాలో అదే కాన్సెప్ట్ అనుకుంటాను.   అలా ఎదుటివారినుండి ఏమీ ఆశించని ఆరాధనే నాకు ఎక్కువగా నచ్చుతుంది. ప్రేమలో పడ్డామా పంతాలు మొదలవుతాయి.

అయితే ఈ ఆరాధనలో కూడ తేడాలు, వైవిధ్యాలు, స్థాయిలు వుంటాయి. జస్ట్ ఇష్టపడటమే కాకుండా ఇష్టపడ్డ వ్యక్తి యొక్క ఇష్టాలకి తగ్గట్టుగా జీవించడం ఒకటి. అంటే మన జీవితాన్ని వారికి అంకితం చెయ్యడం. మనసా, వాచా, కర్మేణా మనం ఇష్టపడుతున్న వారికి అంకితం అవడం. మన ఇష్టాల కోసం కాకుండా ఆ వ్యక్తి యొక్క ఇష్టప్రకారం, ఆశల ప్రకారం, ఆశయాల ప్రకారం జీవించడం. ఇందులో ఎంతో ఆనందం వస్తుంది. మన కోసం మనం జీవించడంలో కొత్తదనం వుండదు - అది అందరూ చేసేదే. అదే మరొకరి కోసం వారి యొక్క కనుసన్నల్లో, వారి యొక్క మనస్సుతో జీవిస్తుంటే ఆ ఆనందం చెప్పనలవి కాదు. అయితే అంతగా మన మనస్సుని వారికి అంకితం చెయ్యాలంటే ఎదుటి వారి వ్యక్తిత్వం కూడా వున్నతమయినది అయితేనే కుదురుతుంది. అలా అయితేనే వారిని చాలా ఇష్టపడుతాం కాబట్టి అంతగా మనని మనం సమర్పించుకోగలం. 

అయితే ఇష్టపడ్డ వ్యక్తిని ఆరాధించడం పెద్ద గొప్పేం కాదు. అది అందరికీ ఇష్టమే. అంకితమవడం మాత్రం అందరికీ సాధ్యపడదు కానీ మనకిష్టమయిన వారికే మనం దాసోహం అంటాము కాబట్టి అదీ ఓకే. అయితే కొన్నిసార్లు ఇష్టమే పడని వ్యక్తిని కూడా ఆరాధించడానికి సిద్ధపడుతుంటాం. అది ఆరాధనలో ఉన్నతమయినది. దాన్నే సబ్మిసివ్నెస్ అంటారు. ఈ రకమయిన ఆరాధనలో మీరు ఎదుటివారి ప్రమేయంతోనో లేక మీకై మీరో వారికి దాసోహం అంటారు. ఎదుటివారిలో మీకు చాలా నచ్చకపోవచ్చు. వారి వ్యక్తిత్వం మీరు అసహ్యించుకోవచ్చు.  వారి భావాలూ, అభిప్రాయాలూ మీ వాటితో ఏమాత్రం పొంతన లేకపోవచ్చు. అయినా సరే మీకు ఆ బలమయిన వ్యక్తిత్వానికి సాగిలపడాలని అనిపించవచ్చు. 

అప్పుడు మీకై మీరు ఆ వ్యక్తికి ప్రణమిల్లి మీ వ్యక్తిత్వాన్ని, అహాన్ని సమర్పించేసుకుంటారు. వారి మనస్సును ఆవాహన చేసుకుంటారు. వారికోసం...వారికొసమే మీరు జీవిస్తారు. మీ హృదయాన్ని పక్కనపెట్టేసి వారి హృదయమే మీదిగా చేసుకుంటారు. అప్పుడు వారి ఇష్టాలే మీవి అవుతాయి. వారి కష్టాలే మీవి అవుతాయి. వారి ఆశలే మీ ఆశయాలవుతాయి. ఇంకా వైరుధ్యాలకి చోటెక్కడ? అంతగా సాగిలపడిపోలేని వారు వెనక్కి తగ్గుతారు. మామూలు ఆరాధనకో లేక, సాధారణ ప్రేమకో లేక సగటు ద్వేషాలకో పారిపోతారు. అలా కాకుండా మనస్సుని, హృదయాన్నీ అనుకున్నవారికి అప్పగించేసి నిశ్చింతగా సేదతీరుతున్నవారు  నిర్మలమయిన జీవనం గడుపుతూవుంటారు. ప్రియురాలి లేదా ప్రియుడి సేవలో, సన్నిధిలో తాద్మాత్మ్యం చెందుతూనేవుంటారు.

21 comments:

  1. కాచుకోండి .....
    ఆ ప్రభువు మిమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటారు. మీరు కూడా ప్రేమించుడి. ఆయన ఒక మంచి గొర్రెల కాపరి, మీరంతా గొర్రెలు.

    ఆరాధన ని బానిసత్వం లా చేస్తున్నారు. ఎంతగా ఆరాధించినా, వ్యక్తిత్వానికి మచ్చ రాకుండా చూసుకోవటం ముఖ్యం కదా.

    మన ఆరాధన అందం వల్లనో, ఆకర్శనీయం గా ఉండటం వల్లనో, లేక ఇలాంటి పై పై ప్రలోభాల వల్ల నో వస్తే ఎక్కువ శాతం అది బానిసత్వానికే దారి తీస్తుంది.

    తప్పుడు విధానాలని విమర్శించండి. మిమ్మల్ని విమర్శించనీయండి. ఎంత ఆరాధించిన, మీ డూటీ మీరు చేయాలె తప్పదు. లేక పోతే బానిసత్వమే.
    మీకు నచ్చింది ఏ అంశం అయినా, ఇద్దరి మధ్య వారి వారి ఇష్టాలకు అనుగుణం గా ఒకరి పై ఒకరికి బంధం ఏర్పడితే మంచిది కానీ, రాజశేఖర రెడ్డి పోయాడు, నేను కూడా పోతా అంటే గొర్రె ని పెంచి కూరొండు కున్నట్లే(డైరెక్ట్ గా కాకపోయినా వాళ్ళ పతనానికి కారణం అవుతారు.)

    నాకు తెలిసి విషయం బయట పడితే ప్రేమ లేకపోతే ఆరాధన

    ReplyDelete
  2. @ కాయ
    వ్యక్తిత్వం? ఇంకెక్కడి వ్యక్తిత్వం! చివరి రెండు పేరాల్లో నేను వ్రాసింది వ్యక్తిత్వాన్ని వదిలేసి ఎదుటివారి తత్వాన్ని అలవరచుకొమ్మనే.

    బానిసత్వం? ఎగ్జాక్ట్లీ. బానిస అయిపోవడం గురించే నేను వాసింది. ఇదో జీవన విధానం. అది తెలియని వారికి విస్మయంగానే వుండొచ్చు. అయితే ఈ బానిసత్వం కష్టంతో కాదు - ఇష్టమయ్యే.

    ప్రతిదానికి వున్నట్లే ఈ విషయాలకీ కొన్ని మినహాయింపులు వర్తిస్తాయి. ఇహ మీరు చెప్పినవన్నీ సాధారణ సంగతులే. అది అందరూ చేసేదే లేదా చెయ్యాలనుకునేదే. కొత్తదనం లేదు, కొన్ని విషయాలకి పరిష్కారమూ లేదు.

    ReplyDelete
  3. japanese bomma(lu) suparo super.

    ReplyDelete
  4. శరత్ గారు,
    మీ పోస్ట్ నా ఐక్యు కు అర్థం కాలేదు...మీ స్థాయి లో ఆలోచించే స్థాయి నాకు లేదు అనుకుంటాను..కాని మీ పోస్ట్ లోని సోల్ మాత్రం ఆర్థం చేసుకోగలిగాను..నిన్న రాత్రి నా స్నేహితుని తో ఇదే విషయం మీద చర్చ జరిగింది..అతను నన్ను మీ దృష్టి లో ప్రేమ ని నిర్వచించండి అన్నాడు..నేను నాకు నేనుగా నా ఇష్ట ప్రకారం నన్ను నేను అర్పించుకుంటూ బానిసల ఒక స్లేవ్ లా తన దగ్గర ఉండటం ఇష్టం అని చెప్పాను..ఇక్కడ బానిసా అంటే వ్యక్తిత్వం చంపుకుని,ఇష్టాలను చంపుకోవడం కానే కాదు..మనకు ఇష్టమయిన వారి కోసం వారికి ఏది సంతోషం కలుగుతుందో ఆ విదంగా మనల్ని మనం మార్చుకోవడం..ఆ మార్పు కుడా ఆనందం గానే ఉంటుంది..కాని అతను నాతో పూర్తిగా ఏకిభవించలేదు అనుకోండి..ఈరోజు నేను రాద్దాం అనుకున్న పోస్ట్ మీ బ్లాగ్ లో చూసేసరికి ఆనందం గా అనిపించింది..మీ స్థాయిలో రాయడం నాకు చేతనయ్యేది మాత్రం కాదు..మీ పోస్ట్ ని పూర్తిగా అకళింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను..మంచి పోస్ట్ కు ధన్యవాదాలు:)

    ReplyDelete
  5. @ అజ్ఞాత
    అవి జపనీస్ బొమ్మలు కావండీ బాబూ :) అవి జపనీస్ పదాలు అనుకుంటాను. వారి పదాలు అక్షరాల్లాగా వుంటయనుకుంటా.

    @ పురుషార్ధం
    సంతోషం

    ReplyDelete
  6. @ వివేక్
    బానిసలకు వ్యక్తిత్వం వుంటుందా? వ్యక్తిత్వం వుంటే బానిసత్వం ఎలా అవుతుంది? మీరు లిమిటెడ్ గా కండీషనల్ గా మారాలనుకుంటే అది మిమ్మల్ని మీరు సమర్పించుకోవడం ఎలా అవుతుంది? అది ప్రేమ అవుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఓ వ్యాపార ఒప్పందం అవుతుంది. సబ్మిసినెస్ అన్నది ఒక ఉన్నతమయిన జీవన విధానం. దాన్ని తేలిగ్గా తీసుకోకండి.

    మీరు ప్రేమించాలనుకుంటున్నారా, ఆరాధించాలనుకుంటున్నారా లేక సమర్పించుకొవాలనుకుంటున్నారా అన్న విషయంలో స్పష్టత అవసరం. ఏ సమస్యలూ వద్దనుకుంటే లేదా కనీస సమస్యలు మాత్రమే కావాలనుకుంటే, హద్దుల్లేని ఆనందం మీ దరిచేరాలనుకుంటే, వైరుధ్యాలే వద్దనుకుంటే, మమేకం మీద మమకారం వుంటే, అర్పించుకోగలంత ఓపిక, సహనం, శక్తీ వుంటేనే మిమ్మల్ని మీరు సమర్పించుకోండి.

    ReplyDelete
  7. అవి బూతు బొమ్మలా ? జపనీసు పదాలా ?

    ReplyDelete
  8. @ అప్పి
    ఎవరి ఆలోచనా రీతిని బట్టి వారు అవి జపనీస్ పదాలుగానో బూతు బొమ్మలుగానో అనుకోవచ్చు :))

    ReplyDelete
  9. అర్ధం కాని జపనీసు భాషలో ఏదో రాసి వైణి పదాలు అంటారా ?
    私はあなたを愛して = ఐ లవ్ యు
    http://translate.google.com/#auto|en|%E7%A7%81%E3%81%AF%E3%81%82%E3%81%AA%E3%81%9F%E3%82%92%E6%84%9B%E3%81%97%E3%81%A6%0A

    ReplyDelete
  10. @appi

    http://www.google.com/imgres?imgurl=http://rlv.zcache.com/i_love_you_in_japanese_tshirt-d23552716935279623412ky_210.jpg&imgrefurl=http://bigicetees.com/search.php%3Fkeywords%3Djapanese%2Bwriting&usg=__iwbihJdaT2yRd21UzRIB_ra0kaE=&h=210&w=210&sz=13&hl=en&start=0&sig2=wxaf_GCO-A3V-Gt2_LwpxA&zoom=1&tbnid=8e0fvXBflxQIGM:&tbnh=140&tbnw=140&ei=aD_hTY3KI8fEgQfj3oW3Bg&prev=/search%3Fq%3Di%2Blove%2Byou%2Bin%2Bjapanese%2Bwriting%26hl%3Den%26sa%3DX%26biw%3D1366%26bih%3D643%26tbm%3Disch%26prmd%3Divns&itbs=1&iact=hc&vpx=539&vpy=271&dur=319&hovh=168&hovw=168&tx=95&ty=93&page=1&ndsp=20&ved=1t:429,r:15,s:0&biw=1366&bih=643

    ReplyDelete
  11. వామ్మో..., అయ్యో, అయ్యో ... అవేవో ఏ చైనీస్/జపనీస్ పదాలేమో అనుకున్నా.. పై కామెంట్ల వల్ల పరీక్షగా చూస్తే తెలిసింది.. బూతు బూతు.. బూతు.. అని నాలుగు పక్కల నుంచీ వినిపించింది.. ఏమిటి గురువు గారు ఈ పిచ్చి.. రాసే ప్రతి టపాలో శృంగారానికే పెద్ద పీటా ? ఇలా వదిలేస్తే ఏమైపోతారో..
    ఏమైతాడంటావ్ అప్పి భాయ్ ..

    ReplyDelete
  12. @ కాయ
    మీలా మరీ ప్రతి దాంట్లోనూ నేను బూతును చూడను :)

    ReplyDelete
  13. ఇంకా ప్రేమా ఆరాధనా లాంటి పదాలు వింటున్నందుకు సంతోషం...ఇక్కడ అంతా మారిపోయింది గురూగారూ...లుక్స్..కట్ చేస్తే...‍*^%+&^@@...:)

    ReplyDelete
  14. మరో మాట జపనీస్ భంగిమలు బావున్నాయ్..ఏమిటో ఎంత మార్చి మార్చి చూసినా అలానే కనబడుతున్నాయి సార్..

    ReplyDelete
  15. @ కేవీఎస్వీ
    అనుభవిస్తే గానీ అధిగమించలేమని జిడ్డు క్రిష్ణమూర్తి అంటాడు. యువతని అలా అనుభవించనీయకపోతే వారికి అందులోని తృష్ణ తీరదు. అది తీరాక ఇక మిగిలేది ప్రేమ, ఆరాధన మాత్రమే. అది తీరక ముందే ప్రేమ, దోమా అంటే ప్రేమలోనే కాంక్షలను తీర్చుకుంటూ, ప్రియురాళ్ళను కాల్చుకుతింటూ అదే ప్రేమ అనుకుంటారు.

    నేనూ ప్రేమ పేరుతో ఒకరిని అవస్థలు పెట్టాలెండి. తదుపరి టపా దానిమీదే.

    ఇక జపనీస్ పదాలు/బొమ్మలు - మన చూపులే అంతండీ బాబూ :)) ఎక్కడయినా మనం చేసేది రంధ్రాన్వేషణే కదా.

    ReplyDelete
  16. రంధ్రాన్వేషణ ? అక్షరాల బూతుల్లో తప్పేమిటంట.. అదొక అందం... క్రియేటివిటి..

    అంటే మీ మాట ప్రకారం ముందు యువత శృంగారానికి అడ్డంకులు చెప్పకూడదు.. మరియు ప్రేమ, దోమ & ఆరాధనలు 30,40 ల్లో మొదలవుతాయి అంతే కదా..

    ReplyDelete
  17. @ కాయ

    కదా.

    యువతలో ఎక్కువ భాగం వుండేది ఆకర్షణే. దాన్నే ప్రేమగా భావించి ఇబ్బందులు పడుతారు, పెడుతుంటారు. ఆ క్లారిటీ లేకనే ప్రేమ పెళ్ళిళ్ళు చాలావరకు విఫలం అవుతుంటాయి. అయితే ఆకర్షణని నేను తప్పు అనను కానీ లాంగ్ టెర్మ్ రిలేషనుకి అది పనికిరాదు. ఆకర్షణలో పడాలి, వదిలి వెయ్యాలి అంతే కానీ జిడ్డులా పట్టుకొని వేళ్ళాడకూడదు - నిజమయిన ప్రేమ అయితే తప్ప.

    ReplyDelete
  18. మళ్ళీ ఈ కండిషన్స్ అప్ప్లై ఏందుకో... యువతలో ఉండేది ఎప్పటికీ ఆకర్షణే... ఎందుకంటే వాళ్ళకి నిజంగా వారేంటో తెలిసే వయసొచ్చేది ఇరవయ్యిల్లో పడ్డాకే.. అందుకని యువత కి "నిజమయిన ప్రేమ అయితే తప్ప." అనే కండిషన్ తీసెయ్యాలి.. ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు తెలుసుకుంటూ సమయం పెరుగుతున్న కొద్దీ చెట్టులా పెరిగితే తప్ప దాన్ని ప్రేమ అనలేం. అందుకని.. స్వేచ్చ గా వదిలేస్తే జంటలను వాళ్ళే చూసుకుంటారు.. ముందుగా జాగ్రత్తలు నేర్పించగలిగితే చాలు..

    ReplyDelete
  19. Sarath Annai,
    Keka bommalu. Keko keka :)) :))

    ReplyDelete
  20. @ కిరణ్
    మీరన్నది నిజమే. అయితే కొందరిదయినా నిజమయిన ప్రేమ అయివుండే అవకాశం వుండొచ్చు కదా అన్నది నా భావన. కొందరిలోనయినా ఆ పరిణతి వుండొచ్చు కదా.

    @ అజ్ఞాత
    బొమ్మలు అంత బావున్నాయంటే నా టపా అంత బాగోలేదనే కదా అర్ధం! వా.. :((

    ReplyDelete