బుద్ధుని విగ్రహం కూడా ఎత్తేసి హుస్సేన్ సాగర్లో విసిరేద్దాం

ట్యాంకుబండ్ మీద విగ్రహాలు కూలగొట్టారు. గ్రేట్. అభినందనలు. మంచిపని చేసారు. సంతోషం. బుద్ధ విగ్రహాన్ని మాత్రం ఎందుకు వదిలెయ్యాలి? బుద్ధుడు సమైక్యాంధ్రా వాడు కాకపోవచ్చు కానీ దాన్ని ప్రతిష్టించిన రామారావు సమైక్యాంధ్రుడే కదా. ఇంకా రామోజీ ఫిల్మ్ సిటీ, మిగతా ఫిల్మ్ స్టుడియోలూ, తెలంగాణా వారివి కాని ఇతర నిర్మాణాలూ, సంస్థలూ అన్నీ కూల్చేస్తే తొందరగా తెలంగాణా వస్తుంది. తాలిబాన్లు అవన్నీ తేలిగ్గా కూలగొట్టడానికి వీలుగా అందరం ఏవేవి కూలగొడితే బావుంటుందో లిస్ట్ ఇచ్చేద్దాం. తెలంగాణా వచ్చాక హాయిగా ఏలుకోవచ్చు - ఓ స్మశానాన్ని. అప్పుడొస్తారు పర్యాటకులూనూ, అప్పుడొస్తాయి పెట్టుబడులూనూ.

మీడియాకి తగిన శాస్తి జరిగింది. ఇంకా జరగాలి. అలాగే కేకేకీ, యాష్కీకి తగిన శాస్తి జరిగింది.

15 comments:

 1. తెలంగాణ వచ్చాక మళ్ళీ పెట్టుకుందాం గురువు గారు.. విగ్రహాలదేముంది.. ఎన్నైనా పెట్టుకోవచ్చు.. పాపం అతనెవరో అమాయకంగా పురుగుల మందు తాగాడంట .. ఇన్ని విగ్రహాలు పెట్టుకుని.. తనని తాను ఎందుకు హింసించుకోవలనుకున్నాడు .. పిచ్చొడు..

  విగ్రహాల తోటే ఆగితే మంచిది కదా.. మనుష్యుల దాక వస్తే ?

  ReplyDelete
 2. ఈ గుంట నక్క కేసీ ఆర్ (ఆంధ్రా), రాములమ్మ (ఆంధ్రా)...మరి వీళ్ళని ఏ సాగర్ లో ముంచాలో...

  ReplyDelete
 3. @ కాయ
  ఇదే ఆవేశం, ఆగ్రహం సెపరేషన్ మీద కాకుండా సమస్యల మీద వుంటే బావుండేది.

  అవును మనుష్యుల దాకా రావడమూ మంచిదే. ఎలాగంటే ఆత్మహత్యలూ, బలిదానాలకు బదులుగా సమస్యలను పరిష్కరించలేని చచ్చు రాజకీయ నాయకులను తగలేస్తే అందరి మద్దతూ ఉండేది, ఇస్స్యూలను తొందరగా పరిష్కరించాలనే చురుకుదనమూ, చలనమూ వారిలో వచ్చేది. గ్రేటాంధ్రాలో డాక్టర్ దుర్గాప్రసాద్ చక్కగా వ్రాసారు చూడండి:

  http://telugu.greatandhra.com/sangathulu/1-03-2011/ejip_10.php

  ReplyDelete
 4. మీ "బుద్ధుని విగ్రహం కూడా ఎత్తేసి హుస్సేన్ సాగర్లో విస..." పోస్ట్‌పై అజ్ఞాత క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:

  మీ ఆలోచన బాగుంది గురూగారూ...సమైక్యాంధ్రవాళ్ళ కంపెనీలను, సంస్థలను పడగొట్టడంతోబాటు వాళ్ళ కంపెనీలలో ఉద్యోగాలు చేసే తెలంగాణావాళ్ళను కూడా చంపేయాలి...ఎందుకంటే వాళ్ళు సమైక్యాంధ్రవాళ్ళ ఉప్పు తింటున్నారు కాబట్టి.

  [Edited]

  ReplyDelete
 5. నిన్న మీ టపా మీద మీకొచ్చే కామెంటులు నేనూహించి కామెంటితే, "సత్యాన్వేషి" గారికి ఇంత పొడుచుకొచ్చింది. సీమాంధ్రులు ఏమేం చేస్తారో అవన్నీ నేను వారి మీదకు నెట్టినట్టుగా చెప్పారు. ఇప్పుడేం జరిగింది? తెలంగాణా అనేది ఉద్యమం స్థాయి నుండి ఉన్మాద స్థితి కి చేరుకుంది. ఇదో "మాస్ హిస్టీరియా". మాకేదో అన్యాయం జరిగిపోతోంది, మా కడుపులు కొట్టేస్తున్నారు, మా ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారు అనే ఒక ఆత్మన్యూనతా భావం పెరిగిపోయింది. పిచ్చి కాకపోతే, తిక్కన, ఎఱ్ఱాప్రగడ, క్రిష్ణదేవరాయల విగ్రహాలు పగలగొట్టడమేమిటి? వాళ్ళకి, ఈ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా? శ్రీ కోదండరాం గారు చెప్పారు..మేము ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం అని ...ఇదేనేమో ప్రశాంతత అంటే? ఈ ఉన్మాదస్థితి ఇలాగే కొనసాగితే, సీమాంధ్రులకు కూడా పంతం పెరిగిపోయి ఈ సమస్య ఇంకా జటిలమైపోతుంది...వీరి దృష్టిలో "సీమాంధ్రులు" ధనం,బలం,బలగం ఉన్న అహంకారులు, గుంటనక్కలు కాబట్టి...అవే లక్షణాలతో తెలంగాణా రాష్ట్రాన్ని ఇంక అస్సలు సాధ్యపడనీయరు. తస్మాత్ జాగ్రత్త!!

  ReplyDelete
 6. @ అజ్ఞాత
  అలాంటి అవమానకరమయిన వ్యాఖ్యల వల్ల ఫలితం వుండదని గుర్తించండి. అందుకే ఎడిట్ చేసాను. ఎవరికయినా ఆత్మాభిమానం వుంటుంది - దానిని పరిగణలోకి తీసుకుంటూ సమస్య మీద స్పందించాలి కానీ అవమానిస్తూపోతే విభజనకి అదే కారణంగా చూపుతారు.

  ReplyDelete
 7. బుద్దుడు బరువెక్కువని ఆగినం గురువు గారు... లేక పోతే బుద్దుడికి ఇదంతా చూస్తూ నోరు మూస్కుని ఉంటాడా.. ఎంత ధైర్యం .. ?

  ReplyDelete
 8. Talibans Too destroyed 300 m Buddhas statue in Afghanistan just before their attack on America , 9/11.

  Ante poye kalam vachhindi mana hyderabad ka leka talibans ka...

  I almost cried watching these things,, I am so hurt,,

  ReplyDelete
 9. @Rajesh, please keep on crying... don't stop and eat any thing....

  why you did not cry when police were attacked on girls hostel in OU?

  ReplyDelete
 10. గి పిస పాగల్ గాళ్ళకు చరిత్ర తెలిస్తే గద.రాజుల కాలం ల తెలుగోల్లందరూ కల్సే ఉంటిరి .నడిమిట్ల తుర్క బాడ్కౌలు చేసుట్ల తెలంగాణా అని,ఆంధ్ర అని వేర్గ అన్కున్దబట్టిరి.గా తుర్కొల్లకు 12 % రిజర్వేషన్ ఇస్తార్బే.గాళ్ళు చేసిన నాశనం బే గీడ తెల్గు భాష దొబ్బింది. తెల్గు మాట్లాడిన , నేర్పిన జిల్లా బెట్టేతోల్లు. నేనైతే తెలుగోడిని బై.నాకు తెలంగాణా separate రాష్ట్రము వద్దే వద్దు. అందరు కల్సున్డుడే గావాలె.అరె తమ్మీ జర్రంత సోచయిన్చున్ద్రి. అస్లి చరిత్ర సడువుంద్రి. శాంతి యుతం, గాంధీ అంటరు.గిదేనా.దిల్సుఖ్ నగర్ల హోటల్ ఇంట్ల మంది వున్నగూడ మంట బెట్టి సంపనీకి సూసుడు, దొంగ నిరాహార దీక్షలు,తెలంగాణాకు సప్పోర్ట్ జేసేటి వేరే పార్టి లోల్లమీద చెప్పులు,కొట్టుడు బడుగోల్లకు పదవులు , ముఖ్యమంత్రి అంటడు, గాని గిడ నిజమ్బాడ్ల mla జీపు తలగ వెట్టుడు,కొట్టుడు, మద్దతు ఇచ్చిన prp అనిల్ ను కొట్టుడు అన్ని ఎరుకయ్తానే ఉన్నై.కెసిఆర్ గాడ్కి పదవి గావాలె అంతే.వేరేతోళ్ళకు పేరు గూడా రావద్దు.నిజంగ తెలంగాణా మీద మీకు ప్రేమ ఉంటె గిట్లనే తెలంగాణా వోల్లనే కొడతర.
  తార్నాకల రాళ్ళేసి కొట్టిన్రు స్టూడెంట్స్ ఎవ్వరకి పోనియ్యకుంట,ఆ రాళ్ళు ఎవర్కి తల్గినయ్యో సుల్లె.తెలంగాణా వోల్లకే తల్గినై.వాన్ డ్రైవర్,మల్ల ఒక ఆడామె.వాళ్ళు దార్లె పోతుంటే తెలంగాణా రౌడి గాల్లారా మీకు నిజంగ కావాల్సింది తెలంగాణా కాదని ఏర్కైతున్నది.
  గియ్యల మీరు చేసిన సిగ్గులేని పనికి మిమ్మోల్ని హోలీ మంటల అగ్గివెట్టాలే.థూ మీ ...
  నిజ్జమ్గా ఆంధ్రోల్లన్నట్లు తెలబాన్ లాగానే చేసింరు.బుద్దుడి బొమ్మలు పల్గ్గోతిన్రు ఆ పాగల్ సాయితాన్ గాళ్ళు.
  గిప్పుడు మీరు అదే బుద్దుడి ముంగట యాఖ్ థూ..థూ.
  తెలంగాణా స్టూడెంట్స్ ఏమ్గావలె మీకోసం సస్తుంటే ,వాళ్ళ బతుకు చెడగోడ్తున్నారు పరిక్షలు రాయనియ్యరు.అంటె వాళ్ళు ముస్కోని, మంచిగావ్వకుంట మీ ఎంట రోడ్ల మీద రౌడిల్లెక్క తిర్గాలన.లేకున్న్తే పోలిస్ తానల సుట్టు తిర్గల్న.
  గిదే జెప్తున్న నేను తెలంగాణా వాడినైన నాకు మీ అసొంటి వల్ల సర్కారి వద్దు. మీకు అధికారం వస్తే మాకు ఏమ్జేస్తారో బాగానే తెలుస్తున్నది.
  నాకు తెలంగాణా రాష్ట్రం వద్దు .కల్సున్డుదేటి రాష్ట్రమే కావాలె .
  రాయల్సీమోల్లు ఎవరన్న గీ కేసిఆర్,కే టి ఆర్ , హరీష్ గల్లను బాంబులేసి లేపెయ్యరాదే.
  నాకు తెలంగాణా రాష్ట్రం వద్దు .కల్సున్డుదేటి రాష్ట్రమే కావాలె
  నాకు తెలంగాణా రాష్ట్రం వద్దు .కల్సున్డుదేటి రాష్ట్రమే కావాలె
  అరె కాంగ్రెస్ లుచ్చా గల్లార ,సూసింద్ర ఇయ్యల్ల మీరు సపోర్ట్ చేశ్న గూడా మధు యాష్కిని ,కాకా గదిని ఎం జేసినరో. రేపు మీ పార్టి కి గూడ అంతే అంటరు.ఇప్పటికైన సమఝ్ జేస్కొని ఈ తీవ్రవా దులని కంట్రోల్ చేయున్ద్రి .కొజ్జగాల్లార(కాంగ్రెస్ గాల్లు) .

  ReplyDelete
 11. @why you did not cry when police were attacked on girls hostel in OU?

  :))

  ReplyDelete
 12. @సీమాంధ్రులందరూ బుద్దిమంతులు , గాంధీలు కాబట్టి తెలంగాన ఇచ్చేస్తే హైదరాబాద్ లో ఇటువంటి గొడవలు, దాడులు వుండవు – హరీష్ రావు


  LLOOOOOOOOOOLZ

  ReplyDelete
 13. See they are not repenting for what they did and starting blame game about OU girls..,

  We know,why lights in the premises of OU girls hostel are always blown out with stones...

  They might be repenting for not vandaliing mahatma's and sardar's statues as they are the ones who freed them from nizam's rule.

  Anna manaki poyekalam daggarlone vundi....

  Jai Afghanistan Jai Pakistan Jai ,,,,,,,,,

  ReplyDelete
 14. మీ "బుద్ధుని విగ్రహం కూడా ఎత్తేసి హుస్సేన్ సాగర్లో విస..." పోస్ట్‌పై Ajay Kumar క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:

  :"ఇజ్జత్ పోయిందిర భయ్"
  :"యెందుకు అన్న"
  :"యెందుకంట వేందిర భయ్… చిన్న చిన్న విగ్రహలను పడేస్తె ఏమొస్తది… బుద్దుడి విగ్రహం పడేస్తె, సక్కగ తాలిబాన్లు కూడ తెలంగానకి సప్పొర్ట్ చెసెటొల్లు.. మనకి తుపాకులు, రాకెట్లు, బాంబులు వచ్చెటియ్యి, వాటితొ ఉద్యమం చెసి తెలంగాన సాధించెవాల్లం.. తెలంగాన వచ్చినంక తాలిబాన్లు మనకి ఇచ్చినయ్ మల్లి నక్సలైట్లకి అమ్మేసుకుని మన నిరుద్యోగులకి (రాజకీయ) జీతాలు ఇవ్వొచు..
  మన చేతకాని నాయకులు మనల్ని సరైన దారిలొ నడపటం లేదుర భయ్…"

  ReplyDelete