ప్రియపై ఓ పొస్ట్‌మార్టం

ప్రియరాగాలు బ్లాగర్ ప్రియ మరణించిందనే వార్త చెప్పిన టపా చూసి నాకు చిరాకు అనిపించింది. దాంట్లో ఏడుపులు తప్ప వివరాలు ఏమీ లేవు. ఎందుకు, ఎలా, ఎప్పుడు మరణించింది, ఎవరి ద్వారా ఆ వార్త తెలిసింది వగైరా కనీస వివరాలు లేవు. ఏదో ఆత్రంగా టపా వ్రాసివుంటారని సరిపెట్టుకున్నాను.  ప్రియ బ్లాగులు ఒకటి రెండు సార్లు మాత్రమే చదివినట్లున్నాను. అలా ఆమెని చదవకపోవడానికి ఓ కారణం వుంది.

నేను బ్లాగుల్లోకి వచ్చిన కొంతకాలానికి ఆమె వ్రాసిన ఒక పోస్టు చూసాను. ఏదొ సీతాదేవి పాతివ్రత్యం గురించి వ్రాసిందనుకుంటా. అందులో పొరపాటున, అమాయకంగా కొందరు వ్యాఖ్యలు చేసారు. ఆ వ్యాఖ్యలకి లేనిపోని ఉద్దేశ్యాలు, విపరీతార్ధాలు తీసి ఒక్కక్క వ్యాఖ్యాతను అతిగా ఆడిపోసుకున్నది. అవమానించింది. ఎగతాళి చేసింది. ఎకసెక్కం చేసింది. అమాయకంగా కామెంటు చేసిన తాడేపల్లి లాంటి కొందరు సీనీయర్ బ్లాగర్ల పట్ల కూడా విపరీతంగా ప్రవర్తించింది. ఎంటీ ఈ అమ్మాయికి ఇంత అతి అనుకున్నాను. పేరు చూస్తే మధురంగా వుంది కానీ మనస్సు చూస్తే ఇంత ఛండాలంగా వుందేంటి అని అప్పటి నుండి ఎందుకయినా మంచిదని ఆ బ్లాగుకి దూరంగా వుంటూ వచ్చాను. ఆ తరువాత అయినా ఆమె తన ప్రవర్తన మార్చుకుందో లేదో నాకు అర్ధం కాలేదు కానీ ఎప్పుడో ఒకప్పుడు తప్ప ఆమె బ్లాగు చదవకపోయేవాడిని. చాలా అరుదుగా అందులో ఒకటి రెండు వ్యాఖ్యలు వేసినట్లున్నాను - అదీ భయం భయంగా. వాటికి ఆమె స్పందించినట్లు లేదు. 

ఆ సంతాప వార్త ఫోటో చూసినప్పుడు కూడా ఈ అమ్మాయి ఇంతచక్కగా వుంది - ఈమెకు ఇంత అతి ఏంటా అని అనుకున్నాను. ఆమె బ్లాగులు కానీ ఆమె గ్యాంగు బ్లాగులు కానీ ఎప్పుడో ఒకప్పుడు తప్ప చదవకపొవడం వల్ల ఆ గుంపు సంగతులు నాకు పెద్దగా తెలుస్తుండేవి కాదు. సృజన, గీతాచార్య పెళ్ళిల్లూ మెక్సికోలో ఓడ మీద అంటే ఆ వార్త కొద్దిగా చేపల కంపు కొట్టినా కూడా ఆ వార్తలు వ్రాసింది ప్రసిద్ధ బ్లాగర్లు కాబట్టి కంపు అంటూ వుంటే వాళ్ళకు మాత్రం కొట్టదా అని నాది భ్రమ అనుకొని మూలకు వున్న సెంటు సీసా తీసుకొని వంటిమీద చల్లుకున్నాను. ఆ వార్తలు వ్రాసారంటే వాళ్లకి వీళ్ళు బాగా తెలిసినోళ్ళయి వుంటారనుకుంటాము కానీ వాళ్ళు మరీ సెంటు సీసాలు ముందుగానే మీద గుమ్మరించుకునే వాళ్ళు అయినందువల్ల ఆ కంపు వాళ్లకి చేరలేదని ఎలా అప్పుడు అనుమానిస్తాం? అలా అలా మధురవాణి గారు చెప్పిన మజ్జిగ కథలో నేనూ భాగం అయిపోయాను. ఒకసారి మాత్రం సృజన బ్లాగులోనో, గీచా బ్లాగులోనో 'బాబూ మీరిద్దరూ బ్లాగర్లు అయ్యాక ప్రేమికులు అయ్యారా లేక ప్రేమికులు అయ్యాక బ్లాగర్లు అయ్యారా?' అని అడిగాను. అప్పుడు వారు ఇద్దరు కాకుండా అ ప్రశ్నకి మన్మధుడు స్పందించాడు! ఇదేంటబ్బా అని కొద్దిగా విస్మయం చెందాను. 

ఆ తరువాత అప్పల్రాజు బ్లాగులో ఫేక్ ఫోటో అంటూ అసలు ఫోటో, కొన్ని పద్యాలూ వ్రాసాడు. ప్రియ టపా చదివి వుండకపోవడం వల్ల ఎవరి బ్లాగుని ఉద్దేశ్యించి అది వ్రాసాడొ అర్ధం కాక నోరారా అక్కడ 'ఇది ఎవరి గురించి?' అని అడిగాను. ఒక్క నా బ్లాగరు కూడా ఆ సందేహాన్ని నివృత్తి చెయ్యలేదు. 

ఇదేదో అతి మేళంలా వుందని ప్రియ, సృజన, గీచాల గుంపుని ఎప్పుడొ పట్టించుకోకపోయెవాడిని. అందుకే చాలా విషయాలు నాకు తెలియవు. ఈ విషయాల్లో నాకూ అంత క్లారిటీ లేదు. ఏది నిజమో, ఏది అబద్దమో కూడా నాకు తెలియదు. ప్రతి విషయంలోనూ మనకు అథారిటీ వుండటం కుదరదు కాబట్టి, ప్రతి విషయంలోనూ  అపరాధ పరిశోధకుడిలాగా మనం వేలు పెట్టలేము కాబట్టి చాలా విషయాలు నలుగురితో పాటు నారాయణా అని మనం నమ్మేస్తుంటాం. మన జీవితాల్లో బ్లాగులు ఒక భాగం కానీ కొంతమందిలాగా బ్లాగులే మన జీవితాలు కాదు కాబట్టి పదిమంది గోవిందా అంటే మనమూ గోవిందా అంటాం. ప్రియ గోవిందా అని కొందరంటే నిజమే కాబోలు అనుకొని నేనూ గోవిందా అనుకున్నాను. ఇప్పుడు గోవిందా కాదు అని నలుగురు అంటున్నారు కాబట్టి అదీ నిజమే కాబోలు అనుకుంటాము. రేప్పొద్దున ప్రియనే మళ్ళీ బ్రతికి వచ్చి నన్ను హత్య చెయ్యడానికి భయంకరమయిన కుట్ర జరిగింది అని అన్నా ఏమోలే అనుకుంటాము. ఎవరికి తెలుసు - ఎవరు ఎక్కడ ఎలాంటి కథలు వండుతున్నారో!     

ఎవరయినా చనిపోతే కుళ్ళి కంపు కొట్టకుండా వీలయినంత త్వరగా దహన సంస్కారాలు చేస్తారు. ఆ  మరణం ఒక అబద్ధం కాబట్టి ఆ వార్తకి అలాంటి దహన సంస్కారాలు జరుగక రిగర్ మార్టిస్ జరుగుతూ కుళ్ళి కంపు కొడుతూనేవుంది. అందులో నుండి మట్టి పురుగుల్లా  ఎన్నో టపాలు పుడుతూనే వున్నాయి. అలాంటిదే ఈ టపా కూడానూ.  ఇహ ముక్కు మూసుకోవడమే మన వంతు.  కానివ్వండి. అదే మన ఆరోగ్యానికి మంచిదేమో!

24 comments:

  1. ఆమె బ్రతికున్నపుడూ పట్టించుకోలేదు సరే, ఇప్పుడెందుకు?

    Do you want some mileage out of these things? are you attention starved?

    I am just curious.

    PS: Don't use my name to create another controversy, you know it will backfire on you :)

    ReplyDelete
  2. నాలుగైదు మణిరత్నం సినిమాలు ఒక్కపెట్టున చూసినట్లుంది ఈ టపా చదివితే. ఏమీ అర్ధం కాలా. ప్రియ ఎవరు, ఆమె పోవటమేంటి, బతికి రావటమేంటి??

    ReplyDelete
  3. @ RK
    అవును. ఇదో ఇలా మీలాంటోళ్ళు కామెంటు చెయ్యాలనే.

    @ ఆబ్రకదబ్ర
    హ? కొన్నాళ్ళ నుండి బ్లాగులు చూడటం లేదా ఏంటండీ? ఎన్ని టపాలు రాలాయి ఈమధ్య దాని గురించీ? అందుబాటులో వున్న కొన్ని టపా లింకులు ఇస్తున్నాను. వాటి ద్వారా విషయం కొంత అయినా అర్ధం చేసుకోండి.

    1

    2

    3

    4

    5

    6

    7

    8

    ReplyDelete
  4. అదా సంగతి. మణిరత్నం సిన్మాల్లోకన్నా ఇక్కడి స్క్రీన్‌ప్లేలే బాగున్నట్లున్నాయే.

    ReplyDelete
  5. నాకు ఎందుకో Mauli (Orange)అనే ID గీతాచార్య దే అని ఒక చిన్న doubt.

    ReplyDelete
  6. sarath gaaroo jaagraththa..., priya ipudu prethaathmagaa maari priya deyyamgaaru avathaarametthindi... idi koodaa fake aada deyyame..., nijamaina aada deyyamaithe meeru vodulthaaraa...

    ReplyDelete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. మూరెడు ముందుకు పోయి , బారెడు వెనక్కి కుంగినట్టుంది... వ్యవహారం !

    ReplyDelete
  9. చాలా బాగుంది మీ పోస్ట్ మార్టమ్. చాలా బాగా చురకలంటించారు diplomaticగా. ఇంతకుముందు కూడా చెప్పాను...మరోసారి చెబుతున్నాను. మీ భావ వ్యక్తీకరణ బాగుంది.

    ReplyDelete
  10. బంగాళాఖాతంలో ఓడలు ఉన్నప్పుడు అట్లాంటిక్ సముద్రం దాక ఎందుకు అనే డౌట్ మీకు రాలేదా? ఆ డౌట్ వచ్చుంటే గీతాచార్యుడి పెళ్లి బండారం ఎప్పుడో బయట పడేదే.

    ReplyDelete
  11. బాగా తలంటి పాడె కట్టకుండా ఈ ఆడాళ్ళంతా ఎందుకు వూరుకుంటున్నారో! అన్నింటికీ కెలికేసి పారేస్తాం అనే బకరాధ్వాజ్ అండ్ కో మౌనానికి అర్ధం ఏమిటో!
    గీచా ఇంకా కామెడీ చేస్తూ బ్లాగుల్లో యాక్టీవ్ గా ఎందుకున్నాడో!
    సమాధానం తెలిసీ ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పని బ్లాగర్ల బ్లాగులు వేయి వక్కలవుతాయి.
    -
    -బ్లాగు భేతాళుడు

    ReplyDelete
  12. I remember you were one of the first to express doubts on this Priya person

    https://www.blogger.com/comment.g?blogID=7582551890741578786&postID=2144580782527779708

    ReplyDelete
  13. @@@@బాగా తలంటి పాడె కట్టకుండా ఈ ఆడాళ్ళంతా ఎందుకు వూరుకుంటున్నారో! అన్నింటికీ కెలికేసి పారేస్తాం అనే బకరాధ్వాజ్ అండ్ కో మౌనానికి అర్ధం ఏమిటో!@@@@



    @బ్లాగు భేతాళుడు

    మీరు ఇ౦త గా బెదిరి౦చాలా...నాకు తెలిసి౦ది ఇది ..

    బకరధ్వాజ్ గారు ఇప్పుడు బాఘా బిజీ , నేను గీతాచార్య అని అనామక ప్రచార౦ చేయి౦చడ౦ లో ...నా టపా కి , ఆయనకి స౦బ౦ధ౦ యేమిటి ?

    కనీస౦ ఒక జాగ్రత్త చెప్పినపుడు, చర్చి౦చాలి కాని ..చాటు గా వచ్చి (బజ్) బెదిరి౦పు తో మొదలు పెట్టి మాట్లాడాల్సిన ఖర్మ ఎ౦దుకో ...వారి వెనుక నడిచిన మగువల కైనా తెలుసా ...

    మరి అన్నీ స్వయ౦ గా ట్రాక్ చేసికొని, నేను , నా బ్లాగు రియల్ అని తెలుసుకొని కూడా దారి మార్చుకోలేద౦టే ....ఇ౦కెవ్వరూ మాట్లాడకూడదు అని బెదిరి౦పా :)

    ReplyDelete
  14. Mauli gaaru
    api bhetala prashnalu mimmalani uddesinchi kadandi.

    vaalla bedgirimpulu ivvala kottavi kadulendi. bhedi ristaaru veli vestaru. vaalla matavini banisala padi vunte vaalla group lo vunchukuntaru.

    evadiko mandi nijanjaga bhayata mettaga tannedaaka inthe. vastundhi a roju dhirudu vastadu chustuvundandi.

    ReplyDelete
  15. ఈ రెండు ప్రొఫైల్స్ చూడండి. జ్యోతి గారు కూడా ఫేక్ ప్రొఫైల్స్ పెడుతున్నారని నా అనుమానం
    http://www.blogger.com/profile/06164226002602514311
    http://www.blogger.com/profile/04737906349191408474

    ReplyDelete
  16. @ ప్రవీణ్
    హ హ. లొకేషన్ ఒకరిది ఒకరు కాపీ చేసారు లెద్దూ. ఎవరు ఎవరిది కాపీ చేసేరంటావ్?

    ReplyDelete
  17. జ్యోతి గారిని అంత సులభంగా నమ్మలేను. బ్లాగుల్లో ఫేక్ ప్రొఫైల్స్ పెట్టడం సులభమే. మహేశ్ గారిని నేను నమ్ముతున్నానంటే అందుకు కారణం నేను ఆయన్ని ప్రత్యక్షంగా చూడడమే. ఆయన నన్ను imaxకి రమ్మన్నట్టు కూడా గుర్తు. ప్రత్యక్షంగా చూస్తే గానీ ఒక బ్లాగర్ నిజంగా ఉన్నాడో లేడో చెప్పలేము.

    నేను ప్రత్యక్షంగా చూసిన బ్లాగర్ల లిస్ట్:
    1)కత్తి మహేశ్ కుమార్
    2)పలివెల కృపాల్ కశ్యప్
    3)వీవెన్
    4)యనమండ్ర సతీశ్
    5)సుజాత
    7)శ్రీహర్ష
    6)చక్రవర్తి
    7)అరిపిరాల సత్యప్రసాద్
    8)భార్గవరాం
    9)తెలుగు లినక్స్ ప్రవీణ్
    10)రహ్మానుద్దీన్
    11)సిబి రావు
    12)కాట్రగడ్డ అరుణ
    13)కౌటిల్య
    14)శ్రీనివాస కుమార్
    15)దుప్పల రవి కుమార్
    16)కస్తూరి మురళీకృష్ణ

    నేను ప్రత్యక్షంగా చూసిన బ్లాగర్లు మినహా మిగిలిన వారిలో ఎంత మంది అసలు పేర్లో తెలియదు. గీతాచార్య ఒక్కడే 5 + పేర్లతో వ్రాసాడు.

    ReplyDelete
  18. @ ప్రవీణ్
    నువ్వు నన్ను చూడలేదు కదా - మరి నేను నిజంగా వున్నానంటావా లేక లేడంటావా? అస్సలు ఈ టపా, ఈ వ్యాఖ్య కూడా నిజమా లేక భ్రాంతినా?

    ReplyDelete
  19. @ప్రవీణ్ గారూ, ఏమిటీ మధ్య మీరు బ్లాగడం లేదు?

    ReplyDelete
  20. శరత్ , మీరు గేనా?

    ReplyDelete
  21. @ప్రవీణ్ నేనొప్పుకోను నేను మీలోనే ఉన్నా మీరు నన్ను చూడలేదని రాసారు.
    నేను, మీ అజ్ఞాతను.
    నన్ను లిస్ట్ చెయ్యండి
    ఆ చీచీ రావును మీరెప్పుడు కలిసిన్రు?

    ReplyDelete
  22. ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు నాకు!!

    of-course నేను ఈమధ్య బ్లాగుల్లో సరిగా ఉండటం లేదు కాబట్టి నాకేం తెలియటం లేదు...

    ReplyDelete
  23. 'ప్రియ దెయ్యంగారు' అనే బ్లాగ్‌లో ఇచ్చిన ఫోన్ నంబర్లలో రెండు గీతాచార్యవి కావు. అవి అతని కుటుంబ సభ్యులవి. ఆ నంబర్లు ఇచ్చినది శ్రీనివాస రాఘవ (గీతాచార్యవాళ్ల కజిన్). గీతాచార్య వాళ్ల అన్నయ్య నంబర్‌కి ఫోన్ చేసినప్పుడు ఈ విషయం తెలిసింది. నా ఫోన్ నంబర్ నీకు ఎవరిచ్చారు అని గీతాచార్య వాళ్ల అన్నయ్య అడిగాడు. నెట్‌లో చూశాను అని చెప్పాను. అతను నమ్మలేదు. తరువాత గీతాచార్య నాకు ఫోన్ చేసి ఆ నంబర్లు ఇచ్చినది శ్రీనివాస రాఘవ అని, అతనికి తప్ప ఎవరికీ వాళ్ల అన్నయ్య నంబర్ తెలియదని చెప్పాడు. గీతాచార్య కంటే పెద్ద సూడో శ్రీనివాస రాఘవ.

    ReplyDelete