మంగళవారం 25 జనవరి 2011

ఆహా ఎంత చక్కగా నను దోచాడే వాడూ!

కెనడాలో నయాగరా ఫాల్సులో వుంటున్న రోజులవి. అక్కడ ఒక కాలేజీలో చదువుతుకుంటున్న విద్యార్ధి పరిచయం అయ్యాడు. కేవలం కెనడా రావడానికని ఆ కాలేజీ ఉపయోగపడుతుంది. దేశీలదే ఆ కాలేజీ కూడాను. ఆ కాలేజీలో చదువు పేరు చెప్పుకొని చాలామని స్టుడెంట్ వీసాలు తెచ్చుకొని అక్కడ బ్రతికేస్తుంటారు. అబ్బాయి మంచివాడిలాగానే అనిపించాడు. కొన్ని సార్లు ఫోనులో మాట్లాడుకున్నాం. ఆ తరువాత మా పిల్లల పుట్టినరోజు వేడుక ఒకటి వుంటే పిలిచాను. వచ్చి గడిపి వెళ్ళాడు. అంతవరకు బాగానే వుంది.

కొన్నినెలల తరువాత ఒకరోజు ఫోను చేసి ఫీజుకో దేనికో అర్జంటుగా $2750 కావాలన్నాడు. నేను గుండె పట్టుకొని గుమ్మడిలాగా అంతడబ్బు నావల్ల ఏమవుతుంది బాబూ అన్నాను. మొత్తమ్మీద బేరం ఆడి ఓ $300 డాలర్లకి ఒప్పించాను. దానికయినా సరే విసుగ్గా ఒప్పుకున్నాడు. ఆ మూడువందలు కూడా వస్తాయో రావో తెలియదు. ఆ అబ్బాయితో ఏదో కొద్దిగా పరిచయం అంతే కదా. సరే అని రిస్క్ తీసుకొని మరీ మన తెలుగు విద్యార్ధికి అవసరాల్లో ఆదుకోకపోతే మళ్ళీ మన అంతరాత్మ మనని ఇంటరాగేట్ చేస్తుందేమో అని భయపడి ఆ మొత్తం అతని బ్యాంక్ ఎక్కవుంటులోకి బదలాయించాను. అంతే. అప్పటినుండీ మళ్ళీ ఆ మనిషి పత్తా లేకుండా అయిపోయాడు. ఈమెయిల్స్ ఇస్తే స్పందన వుండదు. ఫోన్లు చేస్తే ఎత్తడు. అతను ఎక్కడ వుంటాడో తెలియదు. మొత్తమ్మీద అలా అలా అతనిని సంప్రదించడానికి కొంత ప్రయత్నించి ఇహ వృధా ప్రయాస అని వదిలేసాను.  అతను చదువుతున్న కాలేజీకి వెళ్ళినా ప్రయోజనం వుండకపోవచ్చు అనో ఏమో మొత్తమ్మీద ఆ ప్రయత్నం చెయ్యనట్లున్నాను.  ఆ కాలేజీకి పిల్లలు వచ్చేది వీసాల కొసం కానీ తరగతుల కోసం కాదు కదా. అతను అక్కడ వుంటాడు అనుకోను.    

వాడు చేసిన వంచన గుర్తుకు వచ్చినప్పుడల్లా సహజంగానే కోపం వస్తుండేది. కనపడితే నిలదీయాలని అనిపించేది. కానీ ... గత కొన్ని రోజులుగా బ్లాగులు చదువుతున్న నా మనస్సు మారిపోయింది. అతనే గనుక ఈ సారి నాకు కనపడితే కోర్చోబెట్టి దండ వేసి దండం పెట్టి గౌరవిస్తాను.  ఎంతో చక్కగా నన్ను మోసపుచ్చాడు కదా అని మురిసిపోతాను. ఆ ముచ్చట పదిమందికీ ఇలాగే చెప్పి సంతొషిస్తాను. అంతే కదా మరి. ఈమధ్య బ్లాగుల్లొ మనం నేర్చుకుంటున్నదేమిటి? ఎవడయినా మనని ఎంత ఘోరంగా మోసగిస్తే వాడికి అంతపెద్ద వీరతాడు వెయ్యాలి.  అతగాడి మీద కోపం తెచ్చుకొకూడదు, అన్యాయం అయిపోయామని చింతించవద్దు. అతగాడిని ప్రస్థుతిస్తూ పరవశం చెందాలి.  అతని గుణగణాలని కీర్తిస్తూ భజన చెయ్యాలి. అందుకొసం ఓ టపా వెయ్యాలి. అందుకే నేనూ ఈ టపా వేస్తున్నాను. అతగాడి పేరు మరిచాను కానీ అతనెక్కడన్నా మీకు కనపడితే అతనికి ఓ సన్మాన కార్యక్రమం సిద్ధంగా వుందని తెలియజేయండి.    

ఇహనుండి అందరం కూడా మన మీద జరిగే అన్యాయాలకు, ఆక్రమాలకు పాజిటివ్గా స్పందించాలి. గాంధీ గారు ఏమన్నారు? ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించమన్నారు. పొరపాటు. కొత్త బ్లాగు సిద్ధాంతం ఏమిటంటే అలా కొట్టిన వాడిని కూర్చోబెట్టి దండ వేసి దండం పెట్టాలి. ఎంత మంచాళ్ళండీ మన బ్లాగర్లూ! గాంధీనే మించిపోయారు. ఈ పాలసీ తెలిస్తే మున్నాభాయ్ సినిమాలు ఇంకా గొప్పగా ఆడేవి కదా. ఫర్వాలేదు అప్పటికయినా ఇంతటి మంచితనం మసాలాగా పెట్టి మూవీగా తీస్తే మస్తు ఆడుతుంది - సందేహం లేదు.  

ఇంకొంతమంది నన్ను మోసం చేస్తే చేసాడులే కానీ డబ్బులు గుంజలేదు కదా అని అల్ప సంతోషపడుతుంటారు. నిజమే, డబ్బులు గుంజకపోతే చాలు ఎదుటివాడు ఎన్ని అన్యాయాలు చేసినా ఉత్తముడే. కీర్తించవచ్చు - సందేహం లేదు. ఎక్కడన్నా రేప్ జరిగిందనుకోండి - అందులో డబ్బులు లేవు కదా - మన్నించవచ్చు. లేదా ఏ బందిపోటు దొంగలన్నా వచ్చి పడి మన మెడ మీద మోదినా, వళ్ళంతా చితక్కొట్టినా వాళ్ళకి మన ఇంట్లో బంగారం దొరకలేదనుకోండి. ఆ కోపంతో మళ్ళీ చితక్కొడుతారు. అయినా సరే ఆ బందిపోటు దొంగలను ఏమన కూడదు. వాళ్లకు డబ్బు దసకం దొరకలేదు కదా - వాళ్ళ తప్పేం వుందీ. మనని ఎంత చక్కగా తన్నారో రివైండ్ చేసుకుంటూ పరవశించాలీ, ప్రస్తుతించాలీ. మనని ఎంత బాగా చితకతంతే ఆ దొంగ అంత పెద్ద వ్యూహకారి. మరి మామూలు దొంగ అయితే అంతగా తన్నలేడు కదా. మనకి బాగా నొప్పి పెట్టేట్లు తన్నాలంటే ఆ దొంగ గారికి చాలా కళలు తెలిసివుండాలి.  ఎంత సాహసవంతుడు, ఎంత దృఢకాయుడు అయితే అంత బాగా చితక్కొడుతాడు కదా. పైగా రోజూ అతగాడు వ్యాయామం చేస్తున్నాడేమో వీలయితే కనుక్కోవాలి. ఎందుకంటే ఆ దొంగలు వెళ్ళాక ఇలా బ్లాగుల్లో ఆ దొంగ గారి గొప్పదనపు గుబాళింపులు వెదజల్లాలి కదా. అప్పుడు ఆ దొంగలకూ, మనకూ ఎవరన్నా వీరతాళ్ళు వేయ్యకపోతారా? ప్రతిదానికీ వీరతాళ్ళు పంచేందుకు కొంతమంది పెద్దమనుషులు సదా ఇక్కడ సిద్ధంగా వుంటారు.  అదండీ బ్లాగుల్లోని లేటేస్ట్ ట్రెండూ. బాంది కదా. ఆలస్యం ఎందుకు - మీరూ మీకు జరిగిన ఓ అన్యాయాన్ని ప్రస్తుతిస్తూ ఓ టపా వ్రాయండి మరి.

అన్నట్లు నేను ఈ టపా వ్రాసి మీలో పాజిటివ్ దృక్పధం పెంపొందించినందుకు గాను నాకూ ఓ వీరతాడు...ప్లీజ్! 

22 comments:

అజ్ఞాత చెప్పారు...

Mee style lo kummesaru gaa

Vineela చెప్పారు...

మీకు ఒక వీరతాడు అ౦డి :)))

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అజ్ఞాత
:)
@ వినీల
:)
మీ పేరు బావుందండీ.

కాయ చెప్పారు...

ఆహా... నీ.... హారిక గారి పై మీకు ఎప్పుడు కాలిందో తెలియదు కానీ.. దొరికినప్పుడల్లా.. ఆ మాలోకాన్ని జోగీ జొగీ రాసుకుంటే రాలే బూడిద నీ టపా అని బాగా.. వాతలు పెడ్తారు...

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ కాయ
అబ్బా...ఒక్క ఆ...హారిక గురించి కాదులెద్దూ ఈ టపా. జెనెరలుగా బ్లాగు మాలోకంలో ఇదే ట్రెండు నడుస్తోంది కదా. నేనూ అదే ట్రెండ్ అనుసరిద్దామనీ...

Mauli చెప్పారు...

మిమ్మల్ని కూడా మోస౦ చేసాడా..హ హ ..ఇది మాత్ర౦ అస్సలు నమ్మ౦ :)..

వారి తో సమాన౦ గా చాలా మ౦ది కనిపిస్తున్నారే మోస౦ ఇ౦కా చేస్తు...ఇప్పుడు కూడా ఆ ఒక్కడి నే అనలేక తిప్పలు :)

murali చెప్పారు...

maastaaru baavundi..prati parichayaanni ardhika koNam lo choose ekaiake desham edanna undi ante adi manade...so atani tapopu ledu perigina vaataavaranam alaantidemooo..

Indian Minerva చెప్పారు...

Good! like all of your satires.

Rishi చెప్పారు...

:))))

అజ్ఞాత చెప్పారు...

మీకు మూడింది నీహారిక చేతిలో! తర్వాతి పోస్టు మీ గురించే రాస్తుంది బూతులు తిడుతూ

చందు చెప్పారు...

Good one. నేను మీలాగే మోసగించబడ్డా, ఒక సారి కూడా కాదు రెండు సార్లు. ఎందుకో చదువు, ఆరోగ్యం విషయాలలో ఎవరైనా అడిగితే కాదంటే మనసు నిలదీస్తుంది. మనుషులకి తీసుకునే తప్పుడు ఉన్న బాధ్యత ఇచ్చేటప్పుడు ఉండదు.

cbrao చెప్పారు...

చదువుతున్నంతసేపు నవ్వాగింది కాదు. మంచికి, చెడుకీ ఇప్పుడు వీరతాళ్ళ కాలం కాబట్టి LGBT ఉద్యమానికి మీ సేవలు గుర్తించి ఇస్తున్నాము ఒక వీరతాడు. అందుకోండి. తెలుగు బ్లాగులలో ఈ ఉద్యమం పట్ల మొదటగా అవగాహన కల్పించింది మీరే.

ఆ.సౌమ్య చెప్పారు...

what a satire! :)

కాయ చెప్పారు...

గురువు గారు,
నా చిన్నప్పుడు అంటే దాదాపు తొమ్మిదో పదో చదివే రోజుల్లో, మా ఊరి కి వెళ్ళటానికి బస్టాండ్ లో వెయిట్ చెస్తుంటే.. ఒకడు నన్ను చిన్నపిల్లవాడిని చేసి ఊరు వెళ్ళేందుకు పైసలు లేవు అని...మొదట పది, తర్వాత 20 ఆ తర్వాత 30 రూపాయలు బతిమాలి బతిమాలి తీస్కున్నాడు.. మా కాలేజ్ కి వచ్చి మరీ ఇస్తా అని చెప్పినవాడు.. మా కాలెజ్ పేరు చెప్తుండగానే ఉరికి బస్ ఎక్కేశాడు..

అజ్ఞాత చెప్పారు...

దోచాడు అంతే నేనింకేదో మిద్దె మీదో మేడ మీదో ఇంకేదో దోచాడనుకున్నా టైటిల్ చూసి ... hmmmm

వెలక్కాయ చెప్పారు...

@ కాయ,

మీ ఊరిలో తొమ్మిదీ పదీ తరగతులు కాలేజీలో చదువుతారా?

buddy చెప్పారు...

baaga chepparu...even to think abt this ppl..see wht i have analysed..actually it was done long back..now its time to knw the points.. just watch here in ma blog

http://kittutalkz.blogspot.com/2011/01/blog-post.html

కాయ చెప్పారు...

@వెలక్కాయ: యా.. కాలెజ్ పేరు చెప్పడం గుర్తుంది.. సో ..అది ఇంటర్ లో అయ్యింది అనుకుంట..

అజ్ఞాత చెప్పారు...

శరత్,
అదేమిటో అందరు అసహ్యిన్చుకోవాల్సింది పోయి,ఏదేమైనా వాడు చాల తెలివి గలోడు అంటూ పొదగటం ఏమిటో నాకూ మింగుడు పడటంలా. అంటే ఇంకొందరు ఇలా చేస్తే, తమనీ మెచ్చుకుంటారు అని తాయారు అవుతారు.ఇదేం ప్రోత్సాహమో ! హమ్మయ్య, కనీసం ఒక్కరైన ఇలా ఫీల్ అయ్యే వారు ఉన్నారు అన్నమాట. చాల ఆనందంగా ఉంది ఈ టపా చూసి, నవ్వు ఆగట్లేదు.

Mauli చెప్పారు...

హ్మ్ ...మీ టపా, బొర్ గా అనిపి౦చి ము౦దు పూర్తి గా చదవలేదు అ౦డి ..

సూరి ని చ౦ఫాడని భాను ని (మోసమే కదా చేసాడు :) ) ...మెచ్చుకోకు౦డ ఉ౦డలేని వారి పైన నా మీ సెటైర్ !!

మీరేమన్నా భాను కి మాత్ర౦ వీరతాడు :)

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ మౌళి
వార్నీ, మీరు అలా వచ్చారే! మీ రూటే సెపరేటండీ :))

నిజానికి నేను వ్రాసింది ఆ భానుడి గురించి కాదు - నేను వ్రాసింది ప్రియను చంపేసిన బ్లాగు భానుడి గురించండీ బాబూ.

Mauli చెప్పారు...

చూశారా, బ్లాగు భానుడు అని మీరే ఒప్పుకున్నారు :)