గుడిలో వస్త్రధారణపై ఆంక్షలు మానవ హక్కుల ఆంశమా?

ఒక టపాలో పిల్ల కాకి బ్లాగర్ క్రిష్ణ ఈ క్రింది సందేహాలు వెలిబుచ్చారు:
@ శరత్ గారు,


వారాంతం ఎంజాయ్ చేస్తున్నారా ? సరే , గుడిలో వస్త్ర ధారణ , బడిలో గే పంతులు ... మోకాలికి , బోడి గుండుకి వున్నంత సంబంధం కూడా కనిపియ్యలేదా ! ఒక్కొసారి మనకి అనవసరం అనిపించే విషయాలని మన మనసు సరిగా పట్టించుకోదు. పోలిక చెబుతా మరి.

1) గుడికి వచ్చే వారు ఇలా వుండాలి అని కట్టుబాటులు - ఒక బడిలో పంతులు గారు ప్రిఫరెన్సెస్ ఇలానే వుండాలి తమ చర్య ద్వారా చెప్పిన బడి యజమాన్యం.

2) తమ వస్త్రాలతో అసభ్యంగా వున్నారా లేదా అన్నది ముఖ్య విషయం కాకుండా , పాశ్చాత్యత , సంప్రదాయత ముఖ్య విషయం కావడం - తమ విధ్యార్దులని ఎబ్యూజ్ చేస్తుండడానికి స్ట్రెయిటా , గే నా అన్నది ముఖ్యం కాదని గుర్తించక పోవడం !

3) పాశ్చాత్య వస్త్ర ధారణలో కూడా సభ్యత వుండవచ్చని, గే కూడా సభ్యత సంస్కారాలు కలిగే వుండవచ్చని గుర్తించక పోవడం !

4) గే అయ్యినంత మాత్రాన , బడిలో కూడా అదే యావ తో వుంటారనుకోవడం - గుడిలో పాశ్చాత్య వస్త్ర ధారణ తో వున్నంత మాత్రాన విచ్చల విడిగా వుంటారు అనుకోవడం ! ( ఈ రెండు అభిప్రాయాలు పిచ్చ తప్పు .. ఇది పాపులర్ అభిప్రాయం. స్కర్టులు వేసుకున్న పిల్ల బరి తెగించడం ఎంత నిజమో, చీర కట్టుకున్న వారు అందరూ పాతివ్రత్యం పాటిస్తారన్నది అంతే నిజం )

5) తన ప్రవృత్తి ఇది అని చెప్పుకున్న గే ని చూసి ఎవరైనా గే అయ్యిపోతారా ? ( ఆ లక్షణాలు వున్న వారు బహుశా అప్రోచ్ అవ్వచ్చు నేమో ?) వారిలో ఆ లక్షణాలు వుండాలి గాని - పాశ్చాత్య వస్త్ర ధారణ లో వున్న వాళ్లని చూడగానే మనసు చెడిపోతుందా ? ( ఆ చెడిపోయే వారు చీర కట్టుకున్న వారిని చూసి చెడిపోరా ?) రెండు సందర్భాలలో అలా మారి పోయేవారిదే తప్పు గాని, మార్చే వారు ఎవరైనా వుంటారా ?

6) స్ట్రెయిట్ లెక్చరర్లు అమ్మాయిలని వేదించడం చూసి చూడనట్టు ఊరుకునే యజమాన్యాలు, ఆ విషయాలు బయటకి పొక్కి తరువాత గొడవ అవ్వడం..

మగ వారు వస్త్రధారణ అసభ్యంగా ( పాశ్చాత్యమా లేక సంప్రదాయమా అని కాదు అసభ్యమన్నదే ప్రశ్న )వున్న పట్టించుకోని గుడి పెద్దలు ( ఒక్కో చోట చొక్కా నిషిద్ధం.. ఒక్కో చోట పై పంచే కూడా నిషిద్ధం వారే చేస్తారు ) ..

ఇవి పోలికలు. ఇక మరొక ప్రశ్న.. ఆస్తిక స్వలింగ సంపర్కులు.. పెళ్లి చేసుకుని గుడికి దర్శనం కి వెళితే ప్రవేశం లేదు అంటే అప్పుడు కూడా గుడీ కాబట్టి హక్కులు గురిచి మాట్లాడనక్కరలేదు అంటారా ? గేల హక్కులు మాత్రమే హక్కులా ? వారిని మాత్రమే మిగిలిన మగ వారి తో / ఆడవారి తో సమానంగా చూడాలా ? మగ ఆడ మధ్య సమానత్వం అక్కరలేదా ? సభ్యత ముఖ్యమా ? సంప్రదాయత ముఖ్యమా ? సంస్కారం ముఖ్యమా లేక సెక్సువల్ ప్రిఫెరెన్స్ ముఖ్యమా ?

దయ చేసి ప్రతి పాయింటుకి సమాధానం ఇవ్వండి.

నా సమాధానం/వివరణ:

1. గుడి అయినా బడి అయినా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందా లేదా అన్నది చూడాలి. తిరుపతి గుడి వస్త్రధారణ ఆంక్షలు హక్కుల ఉల్లంఘనగా పరిగణించలేం. కొన్ని పబ్ లల్లో సూట్ వేసుకొనే రావాలంటారు. అలాంటివాటిని హక్కుల ఉల్లంఘనగా భావించలేం. అలాంటి ఆంక్షల్లొ ఔచిత్యం తప్పితే, మితిమీరితే హక్కుల ఉల్లంఘన జరగవచ్చు. గే ప్రొఫెసర్ అని వెలివేయడం హక్కుల ఉల్లంఘన క్రిందికి వస్తుంది కాబట్టి మనం ప్రొటెస్ట్ చేస్తాం.

2. ఒక డాక్టర్ మంచి పరిజ్ఞ్ఞానం వుండి కూడా చింపిరి గడ్డంతోనూ, చింపిరి దుస్తులతోనూ వచ్చాడనుకోండి - అతని చికిత్స పై మీకు గౌరవం వుంటుందా? ఇదీ అంతే. ఒక ప్రదేశం యొక్క ఔన్నత్యం నిలపడం కోసం అలాంటి ఆక్షలు విధిండంలో పొరపాటు ఏమీ లేదు. అలాంటి ఆంక్షలు సాధారణంగా చాలాచోట్ల వివిధ వేదికలలో కనపడుతున్నదే.

3. పాశ్చాత్య దుస్తుల్లో సభ్యత వుండవచ్చు కానీ సాంప్రదాయం వుండదు. గుడులల్లో సాంప్రదాయం కూడా ముఖ్యమే. మా ఆవిడ (ఒహవేళ) బయట బికినీలు వేసుకొని తిరిగినా నాకు అభ్యంతరం వుండదు కానీ ఆలయాలకూ, తెలుగు ఫంక్షనులకూ వెళ్ళేటప్పుడు చీర కట్టుకుంటే బావుంటుందని సూచిస్తాను. ఓ రెండు నెలల క్రితం చికాగోలో ఓ తెలుగు పాప పుట్టినరోజు ఫంక్షనుకి వెళ్ళాము. అక్కడికి వచ్చిన స్త్రీలందరూ, ఆ పాప తల్లితో సహా ఒక రకమయిన దుస్తుల్లో వస్తే మా ఆవిడను ఒక్కదాన్ని మరో రకం దుస్తుల్లో చూసి ఆశ్చర్యం కలిగింది. మా ఆవిడ కట్టుకున్నది చీర!

4. నిజమే కానీ గుడుల్లో సాంప్రదాయకంగా వుండాలని కోరడం హక్కుల ఉల్లంఘన క్రిందికి రాకపోగా అది సబబు అనిపించుకుంటుంది. బడుల్లో సాంప్రాదాయిక ప్రవృత్తి మాత్రమే వుండాలనుకోవడం ఔచిత్యం కాదు.

5. ఎక్కడయినా చెడు తలపులు రావచ్చు. అయితే ఆ తలపులు తగ్గించడం వారి ఉద్దేశ్యం కావచ్చు. సాంప్రదాయిక మయిన వాతావరణంలో అలాంటి ఆలోచనలకు ఆస్కారం తక్కువగా వుంటుంది.

6. మగవాడికి ఛాతిమీద ఆఛ్ఛాదన లేకపోయినా అసభ్యం అనిపించుకోదు కదా. మరీ ఇక్కడ కూడా సమాన హక్కులు డిమాండ్ చేసి ఆడాళ్ళు కూడా అలాగే వుండాలని కోరడం బావోదేమో ;)

స్వలింగ సంపర్కుల ఆలయ ప్రవేశం మీద నిషేధం హక్కుల ఉల్లంఘన క్రిందికే వస్తుంది. అందరి హక్కులూ హక్కులే. కాకపోతే అన్నింటికీ అందరూ స్పందించలేరు, పోరాడలేరు కాబట్టి నాలాంటి వారు గే హక్కుల విషయలో ఎక్కువగా స్పందిస్తుంటారు. గుడుల్లో సభ్యత, సంస్కారం రెండూ ముఖ్యమే. సంస్కారం సెక్సువల్ ప్రెఫరెన్సును బట్టి వుండదు - వ్యక్తిత్వాన్ని బట్టి వుంటుంది.

5 comments:

 1. స్వలింగ సంపర్కుల ఆలయ ప్రవేశం ఎందుకు నిషిద్దం .... మన దేవుళ్ళే స్వలింగ సంపర్కులు కదా...అయ్యప్ప ఎలా పుట్టాడో తెలీదా...అందులో తప్పేముంది...ఒక్కోసారి ఒక్కోలా ఉండడం మానవ సహజం ....

  ReplyDelete
 2. శరత్ గారు,
  వివక్ష ఏ స్థాయి లో వుంటే దానిని వివక్ష అంటారు ?
  తండ్రి ని గౌరవంగా నాన్నగారు అని పిలవమనడం కొన్ని ఇళ్లలో చూస్తాము, కానీ తల్లిని ఎవరు అమ్మగారు అని పిలవరు ! కుటుంబం లో ఇద్దరి పాత్ర సమానం అయినా, ఇంటి పని తక్కువ సమానం, పోషణ ఎక్కువ సమానం, కనుక తల్లి తండ్రులు గౌరవనీయులైనా తండ్రి ఎక్కువ గౌరవనీయుడూ !కొంచెం తక్కువ అసమానత్వం !!!
  ఒక గే ని సాటి మనిషిగా చూడాలి అనుకోవడం .. అలా ప్రయత్నిచడం వేరు, మనస్పూర్తిగా అలా చెయ్యడం వేరు ! మీరు గే లా వుండడం తప్పు కాదు అంటూ, ఆ విషయం మీద వెటకారం చేస్తు వుండడం ? ఎక్కడో మనసులో ఒక మూల దానిని ఏక్సెప్ట్ చెయ్యలేక పోవడమే! కొంచెం వివక్ష! కొంచెం వెటకారం !!!
  ఇక గుడి విషయంలో .. సాంప్రదాయత కూడా అవసరం అనుకుంటే..మరి పాంట్లు , షర్టులు ఎవరి సాంప్రదాయం ?చాతీ ప్రదర్శన స్త్రీ పురుషులు ఇద్దరికి అసభ్యతే !మరి పురుషులకి అది ఎలా ఆమోద ప్రాయం !??? సంప్రదాయత గాని, సభ్యత గాని కేవలం స్త్రీలకి మాత్రమే నా ? టైటు పాంట్లు, తొడలు, పొట్టలు ఇంకా చాతీ కనిపించినట్టు వస్త్రధారణ చేస్తే అది పురుషులు చేసె అంగ ప్రదర్శనే ! నేను ఇక్కడ స్త్రీలకి కూడా అంగ ప్రదర్శన చేసె హక్కులు గురించి మాట్లాడడం లేదు స్వామీ! అసలే మీరు బూతు అన్వేషకులు! ఆంక్షలు వుండాలి. కానీ హేతు బద్దంగా వుండాలి. కాలేజీ లో లెక్చరర్లు అందరూ , సభ్యత్గా వుండాలి, గే అయినా , స్ట్రెయిట్ అయినా ! అలాగే గుడిలో సభ్యతగా వుండాలి, స్త్రీ అయినా పురుషుడు అయినా ! వస్త్ర ధారణ కూడా సభ్యతగా వుండాలి, అది ఆధునికమైనా , సంప్రదాయమైనా !
  ప్రమాదకర స్థాయిలో లేదని వివక్ష ని ( హక్కులు అని అనడం లేదు ) భరించడం కరెక్టేనా? ఇలాంటి చిన్న విషయాలు మనసులలో ఒక వివక్షా పూరితమైన భావజాలానికి బీజం అవదా! అసలు చాలా వివక్షలు ఇలానే మొదలు అవుతాయ్ కామోసు ! నెమ్మది నెమ్మది గా బ్రెయిన్ వాష్ చేసి, పీడితులు కూడా ఇది సహజం అని అనుకునేటట్టు చేస్తారు. నిమ్నజాతులు వారు, " వారు పెద్ద జాతుల వారు వారేమి చేసినా చెల్లుతాది " అనుకోడం , స్త్రీలు " మగడి తోడే సర్వస్వం అనుకోడం..అన్నింటికి అణిగి మణిగి పడి వుండడం " ఇలా చిన్న సంఘటనలుతోనే మొదలు అవుతుంది అనుకుంటా!
  ఒకటి మటుకు బాగుంది. ఇప్పుడూ మీ తో ఈ విషయం చర్చిస్తే , మీకు ఎలాంటి ఇంక్లినేషన్ లేదు కాబట్టి, మీ అభిప్రాయం బైయాసెడ్ అనిపించదు. కొన్ని పాయింట్లు మీవి నాకు అంగీకారప్రాయమే! బహుశా బ్లయిండ్ స్పాట్ నాలోనే వుంది.
  అబ్బ తెగ పొడుగు వాఖ్యలు అయిపోతున్నాయి. హ్మ్.. అలసి పోయా!

  ReplyDelete
 3. >> మరీ ఇక్కడ కూడా సమాన హక్కులు డిమాండ్ చేసి
  >> ఆడాళ్ళు కూడా అలాగే వుండాలని కోరడం బావోదేమో

  బొత్తిగా లోకజ్ఞానం ఉన్నట్టు లేనట్టుగా వుంది ;)

  see this: http://www.bangordailynews.com/detail/142316.html

  ReplyDelete
 4. @ అజ్ఞాత
  అవును అయ్యప్ప స్వామి పుట్టుక గురించి నేనూ విన్నాను. అలా అయినంత మాత్రాన ఆ వాదనను ఇతర దేవాలయాలు అంగీకరించకపోవచ్చు. ఒకవేళ నిషిద్ధం చేస్తే అది పొరపాటు అని వ్రాసాను. ఆలయ ప్రవేశం వరకు ఎవరికీ పెద్దగా సమస్యలుండవు - ఎవరు గే నో కాదో తెలుసుకోవడం కష్టం కనుక - కానీ ఆ తరువాత ఆలయాల్లొ గే జంటలకి ఇతర జంటలకు చేసేట్లుగా అర్చనలో, పూజలో అక్కడి అర్చకులు జరిపించాల్సి వస్తే అప్పుడొస్తుంది ఆలయాలకు తంటా.

  @ అజ్ఞాత
  ధన్యవాదాలు

  @ క్రిష్ణ
  ఈ విషయంలో మీతో ఏకీభవిస్తాను. గుడుల్లో సాంప్రదాయాలు కేవలం ఆడవారికేనా? ఒక నాస్తికునిగా ఇది నాకు సంబంధించని ఆంశం కానీ ఒక పౌరునిగా నాకు అనిపించేదేమంటే మగవారిని కూడా ప్యాంట్లు విప్పేసి పంచెలు, ధోవతులు కట్టుకొని రమ్మంటే బావుండేది. అలా సాంప్రదాయ దుస్తుల్లో కనీసం ఆలయాల్లోనయినా స్త్రీ పురుషులను చూడటం చూడముచ్చటగా వుండదూ! ఆలయాల్లో స్త్రీ పురుష వస్త్రధారణా విచక్షణ గురించి మనం కాన్సెర్న్ వ్యక్తం చేయడం సబబుగా వుండదు కాబట్టి ఆస్తిక స్త్రీ వాదులు అయినా ఆందోళన చేసివుంటే బావుండేది.

  @ విట్ రియల్
  ;)

  మా షికాగో చట్టం ఏంటో తెలుసా? ఆడవారు తమ చనుమొనలని కనిపించనివ్వకుండా వుంటే చాలు! అందుకే కొంతమంది స్త్రీలు అక్కడ గుండ్రంగా చిన్ని ప్లాస్టరో, పేపరో అతికించేసి బండి లాగించేస్తుంటారు :))

  ReplyDelete