బలవంతపు బ్లాగు బ్రహ్మచర్యం


నా ఆత్మాభిమానానికి ఎక్కడా పెద్దగా సవాళ్ళు ఎదురుకావు ఒకవేళ ఎదురుపడినా నా అత్మాబిమానం ముందు మరేదీ లెక్కచేయకుండానే నెట్టుకొస్తున్నాను కానీ...కూడలి, జల్లెడల ముందు మాత్రం చతికిలపడిపోయాను. అవి సాంప్రదాయకపు బ్లాగులు కావడంతో, స్వాతి లాంటి సకుటుంబ పత్రికలలో వచ్చేటటువంటి విషయాలు వ్రాసినా బ్లాగు పిల్లలు హడలి ఛస్తారు కాబట్టి  అలాంటి బ్లాగులు వేసుకోము, టపా మీరితే తోక కోస్తామంటారు కాబట్టి కాస్త వళ్ళు దగ్గరపెట్టుకొని శరత్కాలం బ్లాగులో వ్రాస్తూ వస్తున్నాను. కాస్త జూలు విదిల్చినప్పుడు సి బి రావు గారు లాంటి నా బ్లాగు శ్రేయోభిలాషులు హెచ్చరిస్తూ నన్ను తగ్గిస్తూవస్తున్నారు. 

ఇలా బ్లాగుల్లో నాకు నచ్చినట్టు వ్రాసుకోకుండా సంకలినుల షరతులకి లోబడి నా భావ స్వేచ్చను అదిమి పెట్టుకొని బలవంతంగా బ్లాగు బ్రహ్మచర్యం పాటిస్తూ  రోజులు నెట్టుకొస్తున్నాను. ఈలోగా అడపాదడపా రసజ్ఞ బ్లాగులో వ్రాస్తూనేవున్నాను కానీ అది హారంలో మాత్రమే రావడంతో అలా వచ్చే హిట్స్. తిట్స్ ఎక్కువగా వుండవు.   మనలో విషయం వుంటే సంకలినులు అవసరమా అని కొందరంటారు కానీ సంకలినులలో రాకపోతే జనాలకి ఫోకస్ పోతుందనేది నా నమ్మకం. ఉదాహరణకు కొత్తపాళి గారివి, అరుణ పప్పు గారివి సంకలినులలో రావడం లేదు కదా. స్వయంగా నేను వారి బ్లాగులకి వెళ్ళి చూసి చదివే సందర్భాలు తక్కువే. అలా కాకుండా అగ్రిగేటర్లలో కనపడితేనే నాకు చదవడానికి ఈజీగా వుంటుంది.  అందుచేత సంకలినులను తూచ్ అనేంత దృశ్యం మనకు లేక అనువు కానప్పుడు అధికులమనరాదు కదా అణిగిమణిగి వ్రాస్తూ వస్తున్నాను.

అత్మాభిమానం, భావ స్వేఛ్చ ముఖ్యమా లేక ప్రజాదరణ ముఖ్యమా అన్న రంధిలో మొత్తమీద నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి కూడలి, జల్లెడలలో నిభాయించుకువస్తున్నాను. కూడలి, జల్లెడలు ప్రైవేటు వ్యక్తులవి కాబట్టి ఎక్కువగా విమర్శించలేము. కావాలంటే నువ్వే ఓ అగ్రిగేటర్ పెట్టేస్కో అంటారు. అలా నేను ప్రయత్నించీ  చతికిల పడ్డాను. ఎవరికి ఏది నచ్చకపోయినా విమర్శించకూడదు, స్వంతంగా పెట్టేసుకోవాలి అంటే మనం ఒక దినపత్రికనూ, ఛానాల్నూ, సినిమా హాలునూ వగైరాలనూ పెట్టేసుకోవాలి లేకపోతే ఉన్న వాటినే తిట్టేసుకుంటూ చూస్తూపోవాలి కదా. అందుకే  అలా మనకు నచ్చినా నచ్చకపోయినా, ఇష్టమయినా, కష్టమయినా అలా అలా ఇప్పటివరకూ ఆయా సంకలినులల్లో వుంటూ వస్తున్నాను. అలాంటి ఇరుకు సంకలినులల్లో మనగలడం ఇబ్బందే అయినా అది మన గరుజు కాబట్టి భరించకతప్పలేదు.    

హారంకు తోడుగా ఇప్పుడు మాలిక సంకలిని కూడా వచ్చింది కాబట్టి నాకు, నాలోని భావావేశానికీ కొద్దిగా ఆశలు రెక్కల్లా విచ్చుకున్నాయి. అలా అని పూర్తిగా కూడలి, జల్లెడలలోనుండి వైదొలుగుతానని కాదు గానీ కొంతకాలం పాటు ప్రయోగాత్మకంగా వాటిల్లో నా బ్లాగును అసెంబ్లీలాగా సుప్తచేతనావస్థలోనో, సుషుప్తావస్తలోనో (inactive) వుంచేయమని త్వరలో కోరి నా శరత్ కాలం బ్లాగులో నాదైన పద్ధతిలో వ్రాస్తూపోవాలని, మా ఉద్యమ గళం కూడా అందరికీ వినిపించాలని, మా హక్కులు కూడా అందరూ గుర్తెరగాలని ఆశిస్తున్నాను. హారంకి వలనే మాలికలో కూడా భావ ప్రకటనా స్వేఛ్ఛ ఎక్కువంటున్నారు కాబట్టి మనకు ఇబ్బందులు ఎదురుకావనే ఆశిద్దాం.  అయితే ఈ బ్లాగులో రసజ్ఞ అంత ఘాటుగా విషయాలు వుండవని తెలియజేసుకుంటున్నాను. మడిగట్టుకొని వున్నవారు మడిగట్టుకొని వున్న అగ్రిగేటర్లని చూస్తారు కానీ మనం మాత్రం ఫ్రీడం ఆఫ్ ఎక్స్ప్రెషనుని, వైవిధ్యాన్ని, వివిధ హక్కులని ప్రోత్సహించే సంకలినులని ఎక్కువగా ఆదరించాల్సిన అవసరం వుంది.  

4 comments:

 1. Kottapali used to put his blog on all but given his "standards"(?) he differed to stay away from these for reasons he only should know. So it is a person's will to decide whether it should come on maalika or haram or whatever. No aggregator can add my blog against my wishes. So unless YOU wish it NOT to appear, aggregator can always put it on his page. If you however send mail to aggregator (like Kottapaali) and ask him to remove your blog, he "has to remove it." Otherwise legal actions are possible. Not literally legal actions but they have a case to go to court. So aggregator will have to compile with the request.

  That's what happened to Kottapaali. He sent mail (as I know) and then even on koodali it used to appear on sahityam section without his knowing it. Later he sent mail to get it removed even from sahityam section.

  Nothing to lose anyway. One partridge does not make the spring. The world goes on. When newsgroups collapse people find other ways to find what they want. For example there used to be a KVRao newsletter about India a few years ago. Enter web and he is nowhere these days except the overseas visitors insurance etc.

  Change is imminent. It is only how we accommodate that change into our lives that matters. If one or two bloggers drop out because of their "standards" haaram or koodali or maalika will not collapse. Importantly, even if they collapse people find other ways to access what they want and new avenues will always show up either one way or the other. My two rupees. HTH.

  ReplyDelete
 2. Good luck with that.

  ReplyDelete
 3. ఈ టపా కేవలం మాలిక నిర్వాహకులని ఇండైరెక్ట్ గా, "మీ రూల్స్ ఏంటి?" అని అడుగుతున్నట్టుగా ఉంది!

  ReplyDelete
 4. @ అజ్ఞాత
  మీరు చెప్పింది నిజం. మార్పు అనివార్యం. మార్పుని ఎప్పుడూ స్వాగతించాల్సిదే.

  @ అజ్ఞాత
  ధన్యవాదాలు

  @ అజ్ఞాత
  మాలిక రూల్స్ లోతు చూద్దామా :)

  ReplyDelete