మేము జంతు పరిరక్షణ శాల నుండి పిల్లిని పెంపకానికి తెచ్చుకున్నప్పుడల్లా పిల్లిని ఇంట్లోనే వుంచమనీ, బయటకి వదలొద్దనీ వారు సలహాలిస్తుంటారు. నేను అమాయకంగా ఎలానయితే భావ స్వేఛ్ఛను సమర్ధిస్తానో అలానే పిల్లి స్వేఛ్ఛను అక్కడ సమర్ధించినా నా భావాలు కొట్టిపారేస్తారు. ఇంటిలోపలే వుండే పిల్లి వల్ల ఈ క్రింది సమస్యలు వుండవు అని ఈ క్రింది విధంగా సెలవిస్తారు.
- Injury or death by vehicles
- Poisoned intentionally or accidentally
- Injury or death by fighting with other cats
- Infectious diseases contracted from other cats: FIP,FIV,FeLV,URIs
- Parasites: fleas, ticks, ringworm
- Injury or death by sadists
- Injury or death by dogs or predators
- Killing of wildlife by outdoor cats
- Getting lost, picked up by A/C
- Theft for sale as laboratory animals or "bait" for illicit gaming
- Problems with neighbors: cats littering their yards
అవన్నీ చదివాక ఔరా ఇవన్నీ నిజమే కదా అనుకున్నా. ఇవే మన బ్లాగర్లకి కూడా వర్తిస్తాయని ప్రగాఢంగా నమ్ముతూ బ్లాగర్లందరూ పాటించాల్సిందిగా కోరుతున్నాను. నేను ఎలాగూ ముందు నుండీ వైల్డ్ క్యాట్ లాంటి వాడినే కాబట్టి నాలాంటి వారు ఎలాగూ అవుట్ డోర్ బ్లాగర్లే అనుకోండి. అందుకే నాకు ఈ విషయాలు వర్తించవని మనవి చేసుకుంటున్నాను.
మీ సౌకర్యం కోసం ఇప్పుడు ఒక్కొక్క పాయింటు వివరంగా చూద్దాం. అవుట్ డోర్ బ్లాగర్ మీరయితే :
1. నిరంకుశ బ్లాగు అగ్రిగేటర్ల యాజమాన్యం చేత మీ బ్లాగు తొలగింపబడవచ్చు
2. మీ బ్లాగుకి ఎవరయినా వైరస్ ఎక్కించేయవచ్చు
3. ఇతర బ్లాగర్లతో ముఖ్యంగా రౌడీ లాంటి వారితో గొడవ పడ్దప్పుడు మీ మనోభావాలు గాయపడవచ్చు. అప్పుడు 'యూ ఆర్ నాట్ వెల్కం హియర్!' అన్న బోర్డు బ్లాగులో పెట్టుకోవాల్సివస్తుంది.
4. బ్లాగర్లతో వ్యక్తిగత పరిచయాలు ఎక్కువయ్యి ఎయిడ్స్ రావచ్చు
5. సుఖ వ్యాధులూ రావచ్చు
6. శరత్తు లాంటి శాడిస్టు బ్లాగర్ల చేతిలో మీ బ్లాగు పడొచ్చు
7. కొన్ని విదేశీ శక్తుల ప్రభావం వల్ల మీ టెంప్లేట్ పనికి రాకుండా పోవచ్చు
8. మీకే ఆనందం ఎక్కువయ్యి ఇతర బ్లాగర్ల మనోభావాలను రక్కేయాలనిపించవచ్చు.
9. బ్లాగు మాంత్రికుల చేతిలో పడి మీ బ్లాగు అదృశ్యం అవచ్చు
10. కెబ్లాస లాంటి వారు మీ బ్లాగుతో ఒక ఆట ఆడుకోవచ్చు. మీ బ్లాగుని బకరా బ్లాగుగా చేసుకొని ప్రయోగాలు చేయవచ్చు.
11. మీకు పక్క వారి బ్లాగులో ... చేయాలనిపించవచ్చు. (డ్యాష్ మీరే పూరించుకోండి)

ఇండోర్ బ్లాగరుగా వుంటే ఎన్ని లాభాలో అర్ధమయ్యింది కదా. పై సమస్యలు ఏమీ మీకు రావు. అసలు ఇండోర్ బ్లాగరంటే ఏంటో మీకు తెలిసివచ్చిందా లేదా? ఏ సంకలినిలోనూ తమ బ్లాగు రాకుండా జాగ్రత్త పడేవారే ఇండోర్ బ్లాగర్లు. అస్సలు బ్లాగు ఫీడే బయటకి రానీయకుండా, బ్లాగు అడ్రస్సు ఎవరికీ చెప్పకుండా తమ బ్లాగుని తాము మాత్రమే చదివి మురిసిపోయే బ్లాగర్లే నిజమయిన ఇండోర్ బ్లాగర్లు. వారికి నా వందనాలు!
good. keep Maalika button in your blog.
ReplyDelete- An indoor blogger.