అవతార్ సినిమాలో నవిలకు తోకలెందుకు పెట్టారూ అని దర్శకుడు కేమరూనిని అడిగితే తోకలకు వున్న ప్రాముఖ్యత పెంపుడు జంతువులను పెంచుకుంటున్నవారెవరికయినా అర్ధమయిపోతుంది అన్నారుట. అలాగే నాకూ మా పోకిరి పిల్లి యువరాజావారిని దత్తత తీసుకున్నదగ్గరినుండీ అర్ధం అవసాగింది. అవతారం సినిమా చూసాక తోకల్ని శ్రద్ధగా పరిశీలించే గుణం అబ్బటంతో మా పిల్లిగారు మా ఇంట చేరిన దగ్గరినుండీ ఆ తోకగారి యొక్క చిత్ర, విచిత్ర విన్యాసాలను కళ్ళారా వీక్షిస్తూవస్తున్నాను.
అబ్బో దానితో మా యువరాజావారు ఎన్ని హొయలు వలికిస్తారూ? మగ పిల్లి అయ్యింది కాబట్టి ఇంకా బాగా వయ్యారాలు పోవడంలేదేమోనని నాకో డవుటు. వారు తమ తోకగారితో ఎన్నెన్ని విన్యాసాలు, ఎన్నెన్ని మెలికలు, ఎన్నెన్ని పొజిషన్లు, ఎన్నెన్ని, ఎన్నెన్ని!! ఆ తోకనే చూస్తూ అబ్బురపడుతూ బ్లాగులు రాయడం మానివేసి దేశసేవకి పుల్‌స్టాప్ పెట్టాలనిపిస్తుంది కానీ నా అభిమానులు ఊరుకోరు (పనికి వెళ్ళకపోతే మా ఆవిడా ఊరుకోదు) కాబట్టి కదలాల్సివస్తోంది.

అస్సలే మగతోకవారు కదా. మళ్ళీ యువరాజావారాయే. అబ్బో ఏం రాచఠీవి, ఏం రాచఠీవి. ఏమి హుందాతనం, ఏమి దర్పం! బ్రిటన్ ముసలి యువరాజు ఛార్లెస్ లాగా కాకుండా మా యువరాజు మళ్ళీ వయస్సులో వున్న కుర్రాడాయే. వారెలా చురుగ్గా చంగుచంగున గంతులేస్తారో వారి తోకగారు కూడా వారితో పోటీ పడుతూ కదులుతూవుంటారు.
తోకగారి కష్టాలు: అప్పుడప్పుడు అత్యుత్సాహంతో అస్మదీయులెవరో, తస్మదీయులెవరో మరిచిపోయి మా ఆవిడ పడుకున్నప్పుడు వారియొక్క తోక అలా అలా అలవోకగా మా రాణిగారి ముఖం మీద విశ్రాంతికి ఇచ్చినప్పుడు మాత్రం మా యువరాజావారి కళ్ళు బైర్లు కమ్ముతాయి. అర సెకనులో వెయ్యోవంతులో మాహావేగంతో వారెక్కడికో విసిరివేయబడుతారు. నాకేమయ్యిందబ్బా, నేనెక్కడున్నానబ్బా అని యువరాజావారు తమ తోకని ప్రశ్నార్ధకం లాగా పైకెత్తి పెట్టి తత్వ విచారం చేస్తుండటం కద్దు.

వారి తోకకి ఇంకా చిన్న చిన్న కష్టాలు వున్నాయిలెండి. మా ఇంటి అద్దాలలోనుండి ఉడుతలో, తొండలో బయట చెట్ల క్రింద చూసినప్పుడు తోకని అలెర్టుగా పెట్టి ఎటాక్ పొజిషన్లో వుండిపోతుంది కానీ ఏం లాభం వారు ఇండోర్ యువరాజావారాయే. తమ తోక పప్పులుడక్క కళ్లతొ మాత్రమే వాటిని వేటాడాగలిగి తోకవాల్చేసి నాలుక తడుపుకుంటూ మ్యావ్ అంటూ మూలుగుతుంది.
ఇలా తోకని పరిశీలిస్తుంటే కలుగుతున్న పరవశంతో నాకు కొన్ని గొప్ప గొప్ప ఆలోచనలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరి తోకలని ఊప్స్ తోక వున్న ప్రతి జంతువు తోకలని పరిశీలిస్తూపోయి దానిమీద ఒక ఉద్గ్రంధం వ్రాస్తే ఎలా వుంటుందని! మీరు 'కొని' చదువుతానని హామీ ఇస్తే సీరియస్సుగా ఆలోచిస్తా! లోకంలో ఎన్నో హాబీలు వున్నాయి. ఇలా తోకాధ్యయనం కూడా ఒక హాబీగా ఎందుకు వుండకూడదు? కొంపదీసి ఆల్రెడీ ఇది హాబీగా వుందా? దానికో పేరు కూడా వుందా? పేరు గనుక లేకపోతే మనమే ఓ పేరు పెట్టేద్దాం. అలా మన పేరు తోక శాస్త్రంలో చిరస్థాయిగా వుండిపోతుంది. జంతు పరిశీలనలో భాగంగా జంతు శాస్త్రజ్ఞులు వాటి తోకలని కూడా అధ్యయనం చేస్తారు కానీ అలా సైంటిఫిక్ పనుల కోసం కాకుండా సరదాగా తోకలను పరిశీలించే హాబీ ఏదయినా వుందా అన్నది నా ప్రశ్న. మీకు నా అంత ఆనందం లేకపోయినా ఈ టపా చదివిన స్ఫూర్తితో దగ్గర్లో వున్న తోకల్ని ఓ చూపు చూడండి. గమనిక: మనుష్యులకు తోకలు వుండవు.

ఇలా తోకలు వున్న వున్న జంతువులను చూస్తుంటే నాకు కుళ్ళుగా వుంది. జంతువుగా నయినా పుట్టకపోతిని అని విచారంగా వుంది. నాకే గనుక తోక వుంటే ఎన్నెన్ని పనులు చేసేవాడినో ఆ తోకతో. ప్చ్. నన్ను మనిషిగా పుట్టించి పాపం చేసాడు మీ దేవుడు. తోకేగనుక వుంటే చెట్టుకి ఆ తోకతో తల క్రిందులుగా వ్రేలాడుతూ టపాలు వ్రాస్తుంటే వుంటుందీ..మజా. మాటలతొ చెప్పలేననుకోండి...తోకేగనుక వుంటే వ్రాతలతో చెప్పేవాడిని. నాకే గనుక ఫ్యూచర్లో మీ దేవుడెప్పుడయినా ప్రత్యక్షమయ్యి 'నీకేం కావాలో ఒక్కటే వరం కోరుకో శరత్తూ' అని అడిగితే ఆ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యి మాటలు సరిగ్గా రాక ముద్ద ముద్దగా పలుకుతూ ఇలా అంటాను. 'నాతో తోత తావాలి స్వామీ'
You can create a blog like " శరత్తోక.... or శరత్-'తోక'....Or....'శరత్- ఒక తోక'..or..తోక-శరత్..."
ReplyDeleteనీకు తోక అనరాలేదు కానీ.... స్వామీ అనొచ్చిందా.... ??????
ReplyDeleteశరత్ అన్నా....
ReplyDeleteఏదైనా మర్కటం నుండి క్లోనింగ్ చేసి తోక పుట్టించే ఛాన్స్ ఉందేమో అమెరికన్ డాక్టర్స్ ని అడగక పోయారా...
Good post.
ReplyDeleteతోకపైన చాలా క్రియేటివ్ గా వ్రాసారు.
నిజంగా మీకు తోక కావాలని ఉంటే, దేవుడే వచ్చి వరం ఇవ్వడం ఎందుకు, మీరే ఓ తోక తగిలించుకొని తిరుగొచ్చుకదా?
లింగ మార్పిడి (ట్రాన్స్ జెండర్) చేసినట్టే మనుషులకి ఆపరేషన్ చేసి తోక తగిలించుకోవచ్చేమో. మీరే దానికి ఆద్యులు ఎందుక్కాకూడదు? అప్పుడు LGBT వాళ్ళతో Tailed People కూడా కలుస్తారు. వాళ్ళకి మీరే ఆదిపురుషుడు అవుతారు.
ReplyDeleteMan, U rocks. I m a regular follower blog.
ReplyDeleteI have a doubt. Did ur home minister read some of ur posts??? I dnt think so. If she, ur gone.(Kidding.,..)
:)
ReplyDeleteAt Vijayawada, my house owner has a cat and I remember her because of this post.
మీ టైటిల్ ''నాకో కోక కావాలి' అనుకున్నా..నిరాశపరిచారు. అయినా కొకలగురించి రాయకుండా ఈ తోకల గోలేంటి.......
ReplyDelete@ గుబుల్ గిష్
ReplyDeleteమీ పదాలు వింటూ వుంటే వెనుకటికి తెనాలి రామలింగడో మరెవరో తోక మీద వ్రాసిన పద్యం కొద్దిగా గుర్తుకువస్తోంది :)
@ పాక్స్ బాక్స్
నాకు పరమానందం వేసినప్పుడు నత్తి వచ్చి 'క' పలుకరాదు స్వామీ
@ పక్కింటి తమ్ముడూ
అంతెందుకు. బ్రహ్మచారి శతమర్కటహ అన్నారు. మళ్ళీ నేను బ్రహ్మచర్యం అవలంభిస్తే ఓ వంద తోకలు మొలుస్తాయేమో!