OCD

మేము సూర్యాపేటలో వుంటున్నప్పుడు మా ఇంట్లో మాకు తెలిసిన ఆంటీ ఒకరు కిరాయికి వుండేవారు. ఆమె రెస్టు రూముకి వెళ్ళివచ్చినప్పుడల్లా తన చేతులు అరిగిపోయేటట్లుగా దాదాపు అరగంట అయినా రకరకాలుగా శుభ్రం చేసుకోవడం గమనించేవాడిని.  మా ఇంటి మధ్యలో ఒక బావి వుండేది. ఆ బావి దగ్గర బండ మీద వేసి చేతులు రుద్దుతూ బోలెడన్ని నీళ్ళు వృధా చేసేది. ఈమేంటబ్బా ఇలా అతిగా చేస్తుందేమిటీ అని ఆశ్చర్యపడిపోయేవాడిని కానీ తరువాత్తరువాత అర్ధం అయ్యింది - అలాంటి లక్షణాలు అన్నీ ఆబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్/ డిజార్డర్ అయివుండవచ్చనీ. 

ఇలా చేసిన పనినే చాలా సార్లు వృధాగా చేస్తూపోవడాన్ని  OCD అంటారు. దీనికి చికిత్స వుంది. ఎవరిలోనన్నా ఇది కనిపిస్తే చికిత్స చేయించండి. అంతగా ఆబ్సెషన్ లేకపోయినా  మనందరిలో కూడా అనవసరంగా కొన్ని కొన్ని పనులు అప్రయత్నంగా చేసేస్తుంటాము. ఉదాహరణకు కొంతమంది ఆడవారు తరచుగా పైట సవరించుకుంటారు. నిజంగా అంత అవసరం అన్ని సార్లూ వుండదు కానీ అభద్రతా భావనతో అలా అప్రయత్నంగా సవరించుకుంటారు. అలా ఎక్కువగా పైట సవరించుకునే వారికే ఇతరులను ఆకర్షించాలని ఎక్కువగా వుంటుందని ఒక అభిప్రాయం వుంది కానీ అది ఎంతవరకు వాస్తవమో తెలియదు.  

అలాగే మగవాళ్ళు జిప్ సవరించుకుంటారేమో. మేతావులకూ, మేధావులకూ కొంత మతిమరుపు సహజం కాబట్టి కొండొకచో జిప్పు పెట్టుకోకుండా ఆఫీసుకి వెళ్ళిన సందర్భాలు నాకు వున్నాయి. ఎవరూ గమనించక ముందే సర్దుకున్నానులెండి. అయినా ఆ భయంతో తరచుగా జిప్పు సరిగ్గా వుందో లేదో అని తరచుగా తడిమి చూసుకుంటూవుంటాను. ఇలాంటి అవస్థే ఇంకా కొంతమందికి వుండవచ్చు.  

ఆ మధ్య మా బంధువు ఒకరు తన తోడల్లుడు గురించి ఒక విషయం చెప్పాడు. వాళ్ళ ఇంట్లో అన్నీ ఆర్డర్ లో వుండాలిట. ఏ వస్తువు ఎక్కడ వుండాలో అక్కడే వుండాలిట. ఏమాత్రం క్రమం తప్పినా తనలో విపరీతమయిన అసహనం వచ్చేసి గొడవ అయిపోద్దిట. అందుకే వారి ఇంటికి వెళ్ళడానికి ఇతరులు తటపటాయిస్తుంటారుట. ఇది  కూడా OCD క్రిందికే వచ్చెస్తుందేమో. వారియొక్క మరో తోడల్లుడు ఇక్కడ యు ఎస్ లోనే మంచి డాక్టరు. మరి తన తోడల్లుడి గురించి ఈ విషయంపై ఎందుకు కేర్ తీసుకోలేదో తెలుసుకోవాల్సివుంది.

13 comments:

 1. OCD కొంత మందికే ఉంటుంది. చాలామందికి NOCD ఉంటుంది :-) అన్నీ చెల్లాచెదురుగా పడేసుకోవటం, ఏ పనైనా ఒకసారి చేసినట్లు మరో సారి చెయ్యకపోవటం, రెస్ట్ రూంకెళ్లొచ్చినప్పుడూ చేతులు కడుక్కోకపోవటం, ఏదీ సవ్యంగా చెయ్యకపోవటం, వగైరా, వగైరా లక్షణాలుంటాయి వాళ్లకి.

  ReplyDelete
 2. @ ఆబ్రకదబ్ర
  బ్లాగింగ్ చేయడం కూడా నాలాంటి వారికి OCD అయిపోయింది. అలాంటి వారికి NOCD మందు వేయాలి :)

  ReplyDelete
 3. మైకల్ జాక్సన్ కి కూడా ఈ OCD వుండేదనుకుంటా :-)) జిప్ విషయం లొ నేను అదే పార్టి ;-)))

  ReplyDelete
 4. @ మంచు పల్లకి
  ఇంకా ఎవరెవరు మన పార్టీలో చేరతారో చూద్దాం ;)

  ReplyDelete
 5. అబ్రకదబ్ర,
  NOCD ఉన్న వాళ్ళు మా ఇంటికొస్తే చంపేయాలని ఉంటుంది నాకు.:-)))) ఇదేమి డిజార్డరో!

  ReplyDelete
 6. @అయినా ఆ భయంతో తరచుగా జిప్పు సరిగ్గా వుందో లేదో అని తరచుగా తడిమి చూసుకుంటూవుంటాను.

  inka nayam zippu mathrame undho ledho ani choosukuntunnaru. (ఈ పేరాలో ద్వందార్ధం ఏమీ లేదు)

  ReplyDelete
 7. సుజాత గారు హ..హ..హ.. మీరు మరీనండీ !
  నాకు మాత్రం ఇల్లంతా తిరుగుతూ తలదువ్వుకునేవాళ్ళను నిలబెట్టి గుండు కొట్టించెయ్యాలనిపిస్తుంది . ఇంట్లో తలవంట్రుకలు కనిపిస్తే నాకు సివాలెత్తిపోతుంది .దీన్నేవంటారో

  ReplyDelete
 8. ఈడిసార్దార్స్ రావడానికి disturbed childhood కారణం వావరిలో ఆత్మవిశ్వాసం తక్కువ అవడం, పేరెంట్స్ సపోర్ట్ లేకపోవడం వంటి కారణాల వల్ల ఇవి బయట పడుతూ ఉంటాయి. వీళ్ళకి ఒక attitude అంటూ ఉండదు. త్వరగా మోసపోతారు కూడా.

  ReplyDelete
 9. @శ్రీనివాస్ - మిరు డక్టరా? సైకియాట్రిస్టా ? ఏం లేదు OCD కి కారాణాలు అంత కరాఖండిగా చెప్పేస్తున్నారు? నాకు ఉంది ఇది. నాకు నయాపైసా disturbed childhood లేదు.. నేనే నా childhood లో చాలా మందిని disturb చేసానని ఇప్పటికి చెప్తుంటారు.. అలాగే మీరన్న మిగితాది ఏది లేదు.. మోసపోవడం కాదు కాని... సహారా లో వదిలేసిన బ్రతికేస్తామని మా ప్రొఫెసర్ చెప్పేవారు. అందుకని ఇంకో మాట చెప్పండి.

  @సుజాత గారు - ejjActly. చేయి కడుకున్నాకా బేసన్ చుట్టు నీళ్ళు ఉన్నా నాకు చిరాకు. అలా ఒదిలేస్తే నేను వెంఠనే తుడిచేస్తా.

  గురూ నాకు కొన్ని అలవాట్లు ఉన్నాయి చెబుత.. ఇనుకో.. సాక్స్ అన్ని ఒకటే విధం గా మడతబెట్టాలి... పేర్చాలి. అలనే బట్టలు కూడా. మడతబెట్టిన వాటిల్లో ఎక్కడైన ఒక్కటి మడత తప్పితే అన్ని మళ్ళీ మడతబెడతాను. కార్ windshield, windows ఎక్కడ వేలు ముద్ర ఉండకూడదు.. కార్ కడిగినప్పుడు ఓ గంట కేవలం windows కే పడుతుంది క్లీన్ చేసేదానికి. ఇలా ఇంకో రెండు మూడు ఉన్నాయి. :-)

  ReplyDelete
 10. ఈ డిసీజ్ మా బంధువుల్లో ఒకావిడకు ఉందండీ ..వినటానికి నవ్వులాటగా అనిపించినా వారితో సహజీవనం చేసేవారికి చాలా బాధాకరం !భర్త ,పిల్లలు ,తల్లితండ్రులు ఎవరికైనా చాలా ఇబ్బందే ..అది అనుభవించేవారికే తెలుసు .దురదృష్టవశాత్తూ చాలామంది దీన్ని ఒక అలవాటుగా కొట్టి పడేస్తారు కాని సరైన ట్రీట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేయరు. పైగా చులకనగా మాట్లాడటంతో వారు మరింత ఒత్తిడికి లోనవుతారు.

  ReplyDelete
 11. 2nd pic about CDO is so apt and funny.

  Seeing comments, it looks like lot of people here have OCD.hmm, interesting !

  ReplyDelete
 12. @ టప్ టపా టప్
  పనిలో పనిగా ప్యాంటు కూడా వుందో లేదో చూసుకుంటాలెండి :)

  @ శ్రీనివాస్
  మీరు చెప్పినవి కారణాలో కాదో తెలియదు కానీ మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్సులోని అపసవ్యత వల్ల కూడా ఇలాంటి లక్షణాలు వస్తుంటాయి. మందులతో ఆ అపసవ్యతను సరిచేయవచ్చు.

  @ పరిమళం
  అవునండీ. ఇటువంటి చిన్ని చిన్ని డిజార్డర్లు ఎన్నో వున్నాయి. స్వల్పమయిన చికిత్సతో బాగుపడుతాయని చాలామందికి తెలియదు.

  @ అజ్ఞాత
  :)

  ReplyDelete
 13. @ శశాంక్
  మరి అంత అవస్థ పడే బదులు డాక్టర్ని ఏమయినా సంప్రదించకూడదా?

  ReplyDelete