పులి రాజు

విజయవాడ V K కంప్యూటర్స్ లో విద్యార్ధిగానూ, బోధకుడిగానూ పనిచేస్తున్న పద్దెనిమిది ఏళ్ళ క్రితం రోజులవి. ఒక రోజు దినపత్రికలో విజయవాడలో 'పులి రాజు' అనే వ్యక్తి చేసిన ఘనకార్యాల గురించి కథనం వచ్చింది. అతని చేష్టలూ, నా భావాలూ ఒకే రకం కావడంతో అక్కడి మిత్రులూ, స్టాఫూ ఆడ, మగా అందరూ నాకు పులి రాజు అని పేరు పెట్టేసారు. క్రమంగా అక్కడి పరిస్థితి ఎలా అయ్యిందంటే అందరూ నా అసలు పేరు పక్కన పెట్టి పులి రాజు అని సంబోధించడం మొదలెట్టారు.   

కట్ చేస్తే కొన్ని ఏళ్ళయ్యాక పూనేలో పి జి చేయడానికి వచ్చాను. అక్కడి మిత్రులకి ఎలాగో నా నిక్ నేం తెలిసిపోయి పులి పులి అనడం మొదలెట్టారు. మా మిత్రులు అలా పిలుస్తున్నందుకు కొద్ది రోజులు ఛాతి విరుచుకొని తిరిగినా తరువాత అలా వాళ్ళు పిలవడం వెనుక వున్న మరో ద్వందార్ధం తెలిసిపోయి వుడుక్కున్నాను.
  
అందరూ నన్ను పులి పులి అని ఎందుకు అంటున్నారో అర్ధం కాని తోటి తెలుగు విద్యార్ధిని (క్లోజ్ ఫ్రెండ్ లెండి) నన్ను అడగనే అడిగింది 'ఎందుకు నిన్ను అలా పిలుస్తున్నారూ ' అని. మింగలేక కక్కలేక ఎలాగోలా వాళ్ళు పిలుస్తున్న అర్ధం చెప్పేసాను. తానూ పులి పులి అని పిలవడం ప్రారంభించింది. "మరి నువ్వేమన్నా ఓవెన్ ఫ్రెష్ నా?" అని సరదాగా ద్వందార్ధంలో తిరిగి వెక్కిరించాను. అంతటితో ఆమె నన్ను అలా పిలవడం మానివేసింది. 

కట్ చేస్తే పన్నెండేళ్ళ క్రితం కెనడా వచ్చేసాను. ఆ తరువాత ఒక ఏడాదికి విజయవాడ నుండి యు ఎస్ కి ఒక మిత్రుడు వచ్చేసాడు. కెనడాలోని మా గదికి ఫోన్ చేసాడు. మా రూమ్మేట్స్ "ఎవరు కావాలండీ" అని అడిగారు. 
"పులి .. పులి రాజు వున్నాడా" అని అడిగాడు.
నా కెనడా రూం మేట్స్ కి నా ఘనచరిత్ర అంతగా తెలియదు కాబట్టి నాకు అలాంటి పేరు ఒకటి వుందని తెలియక కంగారు పడ్డారు. "పులి రాజా? అలాంటి వారెవరూ ఇక్కడ లేరే!" అని సమాధానం ఇచ్చారు. 
నా విజయవాడ మిత్రుడికి నా అసలు పేరు అస్సలు గుర్తుకురాక ఖంగారు పడ్డాడు. "అదేనండి పులి.. పులిరాజు.." అంటూ నసిగాడు.
మా మిత్రులకి ఎందుకో సందేహం వచ్చి "శరతా?" అని అడిగారు.
"ఆ. ఆ. అవును. అవును"

అప్పుడు నేను గదిలో లేను. నేను వచ్చాక నా రూం మేట్స్ పొర్లి పొర్లి నవ్వుతూ ఈ విషయం చెప్పారు.

కట్ చేస్తే కొన్ని ఏళ్ళ తరువాత ఇండియా చూడటానికి వచ్చాను. ఈలోగా ఎయిడ్స్ ప్రకటనల పుణ్యమా అని పులి రాజు ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రసిద్ధి చెందాడు. నాకు పులి రాజు అన్న పేరు వుంది అని తెలుసున్న బంధుమిత్రులంతా "పులి రాజుకి ఎయిడ్స్ వచ్చిందా?" అని అడగసాగారు. దానితో నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాక ఆ తరువాత మళ్ళీ ఎవరికీ నాకు అలాంటి నిక్ నేం వుందని చెప్పుకోలేదు. మళ్ళీ మీకే చెప్పడం. ష్. ష్.. ష్...!     

10 comments:

  1. ఇప్పుడే జురాన్ సినిమా బ్లాగులో పులి రాజా అన్న పేరుతో వ్యాఖ్య చూసాను! అలాంటి పేరుతో ఒక బ్లాగర్/వ్యాఖ్యాత వున్నారని నాకు ఇంతకుముందు తెలియదు!

    ReplyDelete
  2. బాగుందండి. హాస్యంగా వ్రాసారు

    ReplyDelete
  3. పులి రాజు.. భలే ఉంది మీ పేరు. ఇప్పటి నుండి నేను అలనే పిల్లుద్దాం అని డిసైడ్ అయ్యా. ఉంటనండి పులి..

    ReplyDelete
  4. పొద్దున్నే నవ్వించేశారు. ధన్యవాదాలు. అయినా ఇట్లాంటివి రహస్యంగా ఉంచాలికదండీ. శశాంక్ గారు అప్పుడే మొదలుపెట్టేశారు. నాకు మాత్రం ఇలా ఎవరినైనా మారు పేర్లతో పిలవడం అస్సలు ఇష్టం ఉండదు పులి గారూ.

    ReplyDelete
  5. చాలా కాలం తరువాత వచ్చిన 'శరత్ కలం' బాగా నవ్వించింది. V K Computers అంటే చిన్నపుడు సిటి కేబుల్ లో చూసిన ప్రకటన గుర్తొచ్చింది.

    ReplyDelete
  6. శరత్ గారు ఫన్ని అండ్ యు అర్ ఓపన్ హార్ట.

    ReplyDelete
  7. హ్హ హ్హ హ్హ! నేను విశాఖపట్నంలో పనిచేసేటప్పుడు మా ఆఫీసులోనూ ఒక పులిరాజా ఉండేవాడు. తనూ మీలాగే సరదా మనిషి :) వెల్‌కం బాక్. మీ కొత్త లాప్టాప్ వచ్చిందనుకుంటాను.

    ReplyDelete
  8. @ చందు
    :)

    @ శశాంక్
    హ్మ్మ్. కొంపదీసి పులి అంటే ఏమిటో అర్ధం కాలేదు కదా మీకు! ఏంటోనండి - ఇంట్లో పిల్లిని - బయట పులిని.

    @జీవని
    నా బ్రతుకు పుస్తకం అందరికీ తెరచిన పుస్తకమే కదండీ. నిక్ నేమ్స్ పెట్టడమూ, పిలిపించుకోవడమూ రెండూ ఇష్టమే.

    @గణేశ్
    వి కె అంటే అందులో చదివినవారు కానీ, పనిచేసిన వారు కానీ స్పందిస్తారని ఆశించాను. అనుకున్నట్టుగానే ఆశ్చర్యకరంగా అందులో పని చేసిన ఒకరు ప్రైవేటుగా స్పందించారు. చాలా సంతోషం వేసింది.

    @ పవన్
    :)

    @ బ్లాగాగ్ని
    వచ్చిందండీ. చిన్ని నెట్ బుక్. అది నాకేనని మా చిన్ని పాప తెగ గొడవ :( నా చెడిపోయిన సిస్టం బాగు చేస్కొమ్మంటోంది!

    ReplyDelete
  9. పులి అంటే మరి మరి ఓ ఐదారు అర్థాలు వచ్చాయి. అందులో ఏది మీకు వర్తిస్తుందో తెలీదు కద.. ఓ మంచింది మీరే ఎన్నుకోండి.. దానికే ఫిక్స్ అయ్యే ప్రయత్నం చేస్తా..

    ReplyDelete
  10. బాగా చెప్పారు పులి రాజా గారు ;)

    ReplyDelete