దాదాపుగా రెండు ఏళ్ళ క్రితం నేనూ వున్నానంటూ బయల్దేరి నా బ్లాగింపు మొదలెట్టి బ్లాగు సాంప్రదాయ పూర్వకంగా కూడలిలో కలిపి...ఆ విషయం మరిచేపోయాను. టెస్టింగ్ కోసమని కొన్ని పోస్టులు వేసాను. ఆహ్వానం అంటూ ఓ రెండు, మూడు కామెంట్లు వచ్చాయి. అందులో ఒకటి జ్యోతి గారిదనుకుంటా. అబ్బో మన బ్లాగు చూడటమే కాకుండా ప్రోత్సాహం కూడానా ఇక వీరి పని పట్టాలి అనుకుని మన పైత్యపు భావాలు కొన్ని వెల్లగక్కుకున్నాను. మళ్ళీ కామెంట్లు వస్తే ఒట్టు. తిట్లను కూడా కామెంట్లు అనుకుంటే అవి వచ్చినట్టే. నా వ్రాతలు చూసి కిక్కు సినిమాలో రవితేజను చూసి జయప్రకాశ్ రెడ్డి అనుకున్నట్లుగా లేదా ఈ రోజుల్లో మార్తాండని చూసి చాలా మంది అనుకుంటున్నట్లుగా 'ఎవడబ్బా వీడు' అని చాలామంది బుర్రలు గోక్కునే వుంటారు.
సరే అని కాస్త ఛేంజ్ కోసమని మా చిన్న పాప ఫోటో వేసుకున్నాను. క్యూట్ గా వుందని ఒకటి రెండు కామెంట్లు వచ్చాయి. ఎంతయినా ఇది మన బ్లాగు మన ఇష్టమే కదా అనుకుని మా దంపతుల ఫోటో వేసేసాను. నెటిజెన్ నుండి అనుకుంటా 'మీ ఆవిడ అనుమతి తీసుకున్నారా ' అని క్వెషన్ వచ్చింది. నా బుర్ర తిరిగిపోయింది. నా బ్లాగులో మా ఫోటో వేసుకోవడం కోసం కూడా అనుమతులు కావాలా అని సందేహం వచ్చింది. మా ఆవిడ యాహూ ఫోటోస్ లోనూ, ఫ్లికర్ లోనూ మా అందరి ఫోటోలు ఎక్కిస్తుంది. ఎన్నడయినా నా పర్మిషన్ అడిగిందా అని బుర్ర గోక్కున్నాను. లే. మా ఆవిడను అడిగాను 'నా అనుమతి లేకుండా నా ఫోటోలు ఆ సైట్లలో ఎందుకు పెట్టావూ? ' అని. నన్నో విచిత్ర జంతువు ను చూసినట్లు ఎగాదిగా చూసింది. ఆమె నన్ను అలా చూడటం తరచుగా జరుగుతుంటుంది లెండి.
ఆ కామెంటుకి ' అవసరమా?' అని స్పందించాను. ఎవరినుండో మరో వ్యాఖ్య వచ్చింది కొంతకాలానికి. 'ఫోటో వెయ్యడమే కాకుండా మళ్ళీ అనుమతి అవసరమా అని అడుగుతావురా ' అని. ఇదేదో తకరారుగా వుందని ఎందుకయినా మంచిదని ఆ ఫోటో తీసివేసాను.
మొదట్లో కొద్ది రోజులు నా బ్లాగు వున్నట్లు ఎవరికి తెలుస్తుందిలె, ఎవరు చూస్తారులే అబ్బా అనుకుని ఏదో కాలక్షేపానికి ఏవో వ్రాసుకుంటే, ఫోటోలు వేసుకుంటే ఇంతమంది ఇలా ఎలా తిడుతున్నారబ్బా అని విస్మయం చెందాను. కొద్ది రోజుల తరువాత కూడలి ఎందుకో చూస్తే నా టపా కనపడి ఉలిక్కిపడ్డాను. ఇదన్న మాట సంగతీ అని అర్ధమయ్యి అప్పటినుండి విజృంభించాను... కానీ ఏం లాభం?
అలా అలా అప్పటిదాకా మన బ్లాగ్ అంటే ఏమయినా వ్రాసుకోవచ్చనీ, ఏమయినా వేసుకోవచ్చని అనుకుంటున్న నా కళ్ళు త్వరగానే తెరచుకున్నాయి. హిపోక్రాట్ గా వుండాలని, మన గురించి అన్నీ గొప్పలే చెప్పుకోవాలని, ఎప్పుడూ ఇతరుల లోని లోపాలనే ఎత్తిచూపాలని అర్ధమయ్యింది. మన ఆనందాలే వెల్లడించుకోవాలి గానీ మన బలహీనతలు, కష్టాల ఊసు ఎత్తవద్దనీ, ఎవరి మనోభావాలూ గాయపడకుండా కాలక్షేపం బఠాణ్ణీలాగున బ్లాగుతూ వుండాలని బోధపడింది. బ్లాగుబన్ (బ్లాగు తాలిబాన్) ల గురించి కూడా బోధపడింది. మిగతా నా బ్లాగు చరిత్ర మీలో చాలా మందికి తెలిసిందే.
మరి బ్లాగుల్లో మన ఇష్టం వచ్చినట్లు వ్రాసుకునే స్వేఛ్ఛ, మార్గం లేదా? వుంది. అది 'స్వయంతృప్తి' లాంటిది! అలాంటి తుత్తి బ్లాగు నాకొకటి వుంది.
ప్రక్కవాళ్ళని కెలుకుటకు కూడనూ ఒక బ్లాగు ఉండవలె. కెబ్లాస అధ్యక్షులవారు మరిచిపోతిరా! అకటా!
ReplyDeleteహహహహహ .. శరత్ గారు ఫొటోల సంగతేమో కాని, నాకు కూడా నా బ్లాగింగ్ తొలిరోజులు గుర్తొచ్చి నవ్వొస్తున్నాయి. నేనిక పబ్లిష్ అన్నది పూర్తిగా క్లిక్ చేయకుండానే వ్యాఖ్యలు వచ్చేసేవి, "ఆహా . ఒహో ... అసలేలా రాస్తారండి మీరు.. ఎంత బాగా రాసారు... మీ బ్లాగు చూడందే నిద్ర పట్టడంలేదు, అసలు భోజనం కూడా చేయడం లేదు.. మీ బ్లాగు సుపర్బ్" అంటూ, (అసలు మనమేము రాసామబ్బా.... మనకింత టాలెంట్ ఉందా.. అని మనసులో అనుకొన్నా..) బ్లాగులోకంలో మహరాణి ని నేనే అని మురిసిపోయిన రోజులు అబ్బో..భలే గుర్తు తెచ్చారు. థాంక్స్ అండి.
ReplyDeleteఆ తరువాతే తెలిసింది ఎక్కడ చూసినా ఇలాంటి వ్యాఖ్యలే కనిపించసరికి.. ఇవన్నీ కాట్రాక్ట్ బేసెస్ ప్రోత్సాహాలని.పోస్ట్‌లో పస లేకపోయినా ఇవే వ్యాఖ్యలు వచ్చేస్తాయి మొదటి రోజులలో.
@రమణి గారు, మొదట్లో ఆహా..ఓహో అని వచ్చే కామెంట్లు మనల్ని కాస్త ప్రోత్సహించి మరింత బాగా రాసేటట్టు చెయ్యాలన్న ప్రయత్నమే తోటి బ్లాగరులది అన్నది నా భావన. పోనీ మీరు చెప్పండి.. బ్లాగింగ్ హాబీగా ఉన్న తొలిరోజుల్లో ఎవరైనా బాలేదు,ఏంటి ఈ పిచ్చి రాతలు అని మనకు చెప్తే ఇంకో పోస్ట్ రాయాలన్న ఆసక్తి వస్తుందా? మనవల్ల కాని పనిలే అని మానేస్తాము కదా..ఇంకో విషయం ఏమిటంటే బ్లాగింగ్ లో రాసే పోస్ట్ లను నాకు తెలిసీ ఎవ్వరూ గొప్ప గొప్ప రచయితలను దృష్టిలో పెట్టుకుని చదవరు..క్యాజువల్ గా చదవుతారు..అందువల్ల కొంచెం బాగా రాసినా చదివినప్పుడు మంచి ఫీలింగ్ కలుగుతుంది..దాని వల్ల వచ్చే కామెంట్లు కొంచెం అతిశయంగా మనకు అనిపించవచ్చు...మరోలా భావించకండి..నేను పరిశీలించిన కొన్ని విషయాలు మీతో పంచుకుందామన్న ఆలోచనే ఈ కామెంట్.
ReplyDeleteఅలా అలా అప్పటిదాకా మన బ్లాగ్ అంటే ఏమయినా వ్రాసుకోవచ్చనీ, ఏమయినా వేసుకోవచ్చని అనుకుంటున్న నా కళ్ళు త్వరగానే తెరచుకున్నాయి. హిపోక్రాట్ గా వుండాలని, మన గురించి అన్నీ గొప్పలే చెప్పుకోవాలని, ఎప్పుడూ ఇతరుల లోని లోపాలనే ఎత్తిచూపాలని అర్ధమయ్యింది...
ReplyDeleteLessa palikitiri.
శేఖర్ గారు: మీరు కూడా తప్పుగా తప్పుగా అనుకొని, కినుక వహించకండి.. ప్రోత్సహించాలి అంటే .. "ఇక్కడ కొంచం ఇలా కాదు ఈ విధంగా రాయండి" , ఇలా సలహా రూపేణా వ్యాఖ్యలు రాస్తే బాగుంటుంది కాని ఏమి లేని దానికి పొగడ్త అనేది ఇంక అలాగే ఉంటే అందరికీ నచ్చుతుంది అన్న అభిప్రాయాన్ని కలగజేస్తుంది (ఎక్కడ వేసావు గొంగళి అంటే వేసిన చోటే ఉన్నాను అన్నట్లుగా) కాని అది దాటి ముందుకెళదామని అనిపిస్తుందంటారా? కొత్తవారికి ఇచ్చె వ్యాఖ్యలు సలహాలతో కూడుకొన్న ప్రోత్సాహాకాలు కావాలి కాని, ఇలా అక్కడ వత్తులేదు, ఇక్కడ "ళ" చూసుకొండి అని టైపాట్లు కాదు, భావ వ్యక్తీకరణ మరింత మెరుగుపరుచుకొని ముందుకు సాగే అవకాశం ఇవ్వగలగాలి. "అస్సలు బాలేదు మీరు రాసింది " అంటే కచ్చితంగా ఎవరం బ్లాగింగ్ చేయలేమండి ఈ విషయంలో మీతో ఏకీభవిస్తాను. అలా రాయమని చెప్పడం కూడా నా ఉద్దేశ్యం కాదు.
ReplyDelete"ఎక్కడ వేసావు గొంగళి" కాదు "ఎక్కడ ఉన్నావు గొంగళీ" అని చదువుకొండి.. :) టైపాటు.. :(
ReplyDelete"హిపోక్రాట్ గా వుండాలని, మన గురించి అన్నీ గొప్పలే చెప్పుకోవాలని, ఎప్పుడూ ఇతరుల లోని లోపాలనే ఎత్తిచూపాలని అర్ధమయ్యింది. మన ఆనందాలే వెల్లడించుకోవాలి గానీ మన బలహీనతలు, కష్టాల ఊసు ఎత్తవద్దనీ, ఎవరి మనోభావాలూ గాయపడకుండా కాలక్షేపం బఠాణ్ణీలాగున బ్లాగుతూ వుండాలని బోధపడింది."
ReplyDeleteనిజమా? కొత్త బ్లాగరునండి. అందుకే అడుగుతున్నా.
పులి - బా చెప్పారు. IMHO చాలా మటుకు టపాలు మన కోసం వ్రాసుకునేదే కద. ఇంకొన్ని కెలికేదానికి.
ReplyDeleteవ్యాఖ్యలకి వస్తే.. నా బ్లాగు చదివే సంఖ్య కి వ్యాఖ్యలు రాసే సంఖ్య కి కొంచం తేడ ఉందండి. ఆ మిగితావాళ్ళు gtalk లో చెప్పేస్తారు వారి అభిప్రాయం.నాకు నచ్చినట్టు నేను వ్రాస్తే దానికి ఓ "గమనిక" అని పెడుతున్నా.. మళ్ళ ఎవరైన కేసు వేస్తారేమో అని.. ముందు జాగ్రత్త.
కాని మీరు భలే భలే. ఫోటొ అడగకుండా పెట్టారా? వాళ్ళు పెట్టచు. అది వారి ఇష్టం. మనం అడిగి అడుక్కొని పెట్టాలి. :p
మీరు మీఇష్టమొచ్చింది రాయండి బ్రదరూ ఎవరు ఆపిందీ!
ReplyDeleteఇష్టం వచ్చినట్లు అంటే ఏంది......?????
ReplyDeleteమరి మీ బ్లాగ్ అని మీ ఇష్టం వచ్చినట్లు రాస్తే, వాళ్ళకు తోచినట్లు వాళ్ళు అక్షింతలు వేస్తారు మరి.. :-) రడీగుండాలి కదా..
ReplyDelete'ఫోటో వెయ్యడమే కాకుండా మళ్ళీ అనుమతి అవసరమా అని అడుగుతావురా ' అని.
హ హ హ నిజం గా అలానే అడిగేరా?
రమణి గారు నేనింకోటి కూడా గమనించాను ఇక్కడ ఏదో సొల్లు కబుర్లు రాసినప్పుడు వచ్చినన్ని కామెంట్లు ఏదైన స్టఫ్ ఉన్న పోస్ట్ కి రావు గమనించారా!
ReplyDeleteఎవరైనా బ్లాగు మొదలెట్టిన కొత్తలో ఉబుసుకుబోక లేకుంటే ఏది రాయాలో అలవాటుకాక ఏదో కబురులు రాస్తే అబ్బా అహా ఓహో అంటూ రాసిన పెద్దలు అదే బ్లాగులో ఆతరువాత వచ్చే దమ్మున్న అంశాలకు లేద కవితలకో పసవున్న వ్యాసాలకో కామెంట్లు రాయరు వీళ్ళెక్కడ ఎదిగిపోతారో నన్న భావమే రాయనీయదేమో! కామెంట్లు రాకపోతే ఇకపై అలాంటివి మానేసి ఉస్కు బుస్కు రాస్తారు అని.
ఇంకోటి గమనించారా మంచి పేరున్న మరియు ప్రింటు రచయితల బ్లాగులకు ఎన్ని కామెంట్లు వస్తున్నాయి! వాళ్ళను తరిమికొట్టడానికి పట్టించుకోనట్టుగా ప్రవర్తిస్తారు. ఇక్కడ వ్యాఖ్యలు రాయమని డిమాండ్ చేయడంలేదు కానీ రమణి గారన్నట్టు కొందరు వ్రాస్తున్న వ్యాఖ్యలు చూస్తే అసహ్యంగా అనిపిస్తుంది.
శ్రాస్తవిజ్ఙానం లాంటి బ్లాగులను ఏమాత్రం ప్రోత్సాహిస్తున్నారు. బ్లాగులంటే సాహిత్యం అంటూ డప్పు కొట్టుకున్న పెద్దలు కూడా కవితలు, కథలు ఉన్న బ్లాగులవైపు పోరు.వాళ్ళ కబుర్లు ఎనకబడిపోకుండా కబుర్ల బ్లాగులనే ప్రోత్సాహిస్తారు.
ఎన్నడయినా నా పర్మిషన్ అడిగిందా అని బుర్ర గోక్కున్నాను. లే. మా ఆవిడను అడిగాను 'నా అనుమతి లేకుండా నా ఫోటోలు ఆ సైట్లలో ఎందుకు పెట్టావూ? ' అని. నన్నో విచిత్ర జంతువు ను చూసినట్లు ఎగాదిగా చూసింది. ఆమె నన్ను అలా చూడటం తరచుగా జరుగుతుంటుంది లెండి.
ReplyDelete>> ఏమి రాసారండి బాబు ఒక అరగంట నుంచి నవ్వలేక చస్తున్నా :) మీ రైటింగ్ స్టైల్ నిజంగా చాల బాగుంటుంది.
కాని మీకు నచ్చిన విషయాలు అందరికి నచ్చాలంటే ఎలా మాస్టారు, అందుకే నచ్చినప్పుడు పొగుడుతారు, నచ్చకపోతే తెగుడుతారు అంటే కదా ?
"ఇవన్నీ కాట్రాక్ట్ బేసెస్ ప్రోత్సాహాలని."
ReplyDeleteఈ అభియోగాన్ని తీవ్రంగా నిరసిస్తున్నా. అంటే మెచ్చుకుంటూ వ్యాఖ్యలు రాసేవాళ్ళు పనిలేక తీరి కూర్చుని రాస్తున్నారనా మీ ఉద్దేశం? మీ రచనలని చదివి మెచ్చుకున్నందుకు మీ పాఠకుల మీద మీకు చాలా చక్కటి అభిప్రాయమే కుదిరింది. చాలా సంతోషం.
శరత్ మామా, సంఘంలో బతుకుతున్నందుకు కాస్త మర్యాదగా మన్ననగా ఉండాలి అన్నంత మాత్రాన హిపోక్రేట్లైపోయినట్టు కాదు.
ReplyDelete