ఈమధ్య నా బ్లాగులో వ్రాయడం లేదని ఆలి, నెలబాలుడు, మరికొంత మంది మిత్రులు కాస్త విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ వివరణ.
ఆఫీసులో: నాకు ఇంట్లో తీరిక వుండదు - ఆఫీసులో తీరిక వుండకపోవడం అంటూ వుండదు. రోజుకి సరాసరి అయిదు నిమిషాల పనితో, నా ఆఫీసు గదిలో గోళ్ళు లేదా ఇంటర్నెట్ గోక్కుంటూ కూర్చుంటాను. ఆఫీసు పాలిట్రిక్స్ చేయడానికి + ఎంజాయ్ చేయడానికి దేశీ లెవరూ మా ఆఫీసులో లేరు మరియు మిగతావాళ్ళందరూ చాలా మంచాళ్ళు! నా టెక్నాలజీలో పనిచేసేది నేనొక్కడినే కావడంతో ఇతర వుద్యోగులతో ఇంటరాక్షన్ పెద్దగా అవసరం లేక నాది సాలిటరీ కన్ఫయిన్మెంట్ అనిపిస్తూవుంటుంది. అఫీసులో కూర్చుని బ్లాగులు చదవడం అయితే ఓక్కె గానీ మరీ బ్లాగులు వ్రాయడం అన్నది బావుండదేమో అన్న నైతిక (?) సందేహం వచ్చి ఆపేసాను. అసలు విషయం ఏమిటంటే గబుక్కున మా మేనేజర్ వచ్చి చూస్తే నా బ్లాగింపు కనపడ్డం బావుండదు కదా అని.
ఇంట్లో: నా ల్యాప్టాప్ (బాగుపడలేనంతగా) ఖరాబు అయ్యింది. ఇంకో ల్యాప్టాప్ మా పెద్దమ్మాయి ఎవరికీ ఇవ్వదు. మరింకో లాప్టాప్ మాయింట్లో వాళ్ళని బ్రతిమలాడితే కొద్దిసేపు నాకు పడేస్తారు. ఆ కొద్ది సేపట్లో ఏం బ్లాగగలం? ఆ సిస్టం ను మా ఆవిడ, చిన్న పాప, మా మాంగోరు వన్ బై వన్ ఉపయోగిస్తుంటారు - నేను అడిగితే చిరాకు పడతారు :( అలా నాకు కంప్యూటర్ గతిలేక నాలోని బ్లాగాగ్నిని ఇప్పటివరకూ శాంతపరుస్తూ వస్తున్నాను.
ఇహ లాభం లేదని మొన్ననే ఓ నెట్ బుక్ + మొబయిల్ బ్రాడ్ బ్యాండ్ ఆర్డర్ చేసాను. కొరియర్ లో ఇవాళ రావాల్సి వుంది. దానిని మా ఇంట్లో ఎవ్వరికీ ఇవ్వొద్దని కంకణం కట్టుకున్నాను! ఇక రేపటి నుండి మళ్ళీ నా బ్లాగింగ్ దడదడ లాడిస్తానేమో. ఈ బ్లాగు ఏమో గానీ నా ఇంకో బ్లాగు వుంది చూసారూ - అందులో చాలా వ్రాయాల్సి వుంది. ఓ బుక్కు మొదలెట్టాను కదా అది ముగించవలసి వుంది.
అజ్ఞాతంగా: బహిరంగంగా బ్లాగింగు చేయడం నాకు సౌకర్యంగా లేదు. ఏదయినా వ్రాయవలసి వస్తే ఎవరినీ నొప్పించకుండా. మన వ్యక్తిగత విషయాలు, భావాలూ ప్రకటించుకోకుండా చాణుక్య నీతితొ వ్రాయాల్సి వస్తోంది. అజ్ఞాతంగా వ్రాసే వారి స్వేఛ్ఛ చూస్తే నాకు అసూయ కలుగుతోంది. త్వరలో అజ్ఞాతంగా కూడా ఓ బ్లాగు మొదలెడతానేమో. నా శైలిని బట్టి ఎవరయినా కనిపెట్టినా గమ్మున వుండండేం!
Hi Sharat
ReplyDeleteGood to see your Post.Please do not stop writing blog,try to Post atleast once in a week.I don't know why every blogger is writing serious Posts now a days.we desperately need Posts from you
Thanks
Ali
ఇంతకీ ఈ పోస్టు ఆఫీసులోంచా, ఇంట్లోంచా? ఆఫీస్లోంచైతే మేనేజర్ ఊర్లో లేడా? ఇంట్లోంచైతే మీ ల్యాప్టాప్తోనా, ఇంకో ల్యాప్టాప్తోనా, మరింకో ల్యాప్టాప్తోనా? మీదైతే బాగెప్పుడయింది? ఇంకొటైతే మీ పెద్దమ్మాయెక్కడికెళ్లింది? మరింకోటైతే ఆ ముగ్గురూ ఎంత చిరాకు పడ్డారు?
ReplyDelete@అబ్రకదబ్ర
ReplyDeletelol
శరత్ తత్త్వం ఇప్పటికి భోధ పడిందా?మిస్టర్ ఇండియా కి వున్న పవర్ , అనిల్ కపూర్ కి వుండదు . అజ్ఞాత లో విజ్రుమ్భించు ,శరత్ లో శాంతించు . అప్పుడే నీ వేడి చల్లారుతుంది . అల్ ది బెస్ట్ .
ReplyDeleteహ్మ్... పునరంకితమయ్యారన్నమాట. శుభం.
ReplyDelete@ ఆలి
ReplyDeleteమీ ఆసక్తికి చాలా సంతోషంగా వుంది. తరచుగా వ్రాయడానికి ప్రయత్నిస్తాను.
@ అబ్రకదబ్ర
:(( నా కష్టాలేవో నేను వెల్లబుచ్చుకుంటే వాటిని శల్య పరీక్షలు చేస్తూ ధర్మ సందేహాలు లేవనెత్తడం మీకు న్యాయమేనా!
మిమ్మల్ని ఖండిస్తున్నాను :))
@ పానీపూరీ
మిమ్మల్నీ ఖండిస్తున్నా!
@కాగడా
ఇక ఎవరు అజ్ఞాతంగా వ్రాస్తున్నా కొంపదీసి నేనే అనుకోరు గదా ఈ ప్రజలు!
@ మినర్వా
ధన్యవాదాలు :)
టైగర్ శరత్ చంద్ర గారు.. మీ లాప్టాప్ కష్టాలు తీరాయా.. ఇన్నాళ్ళు ఎమయిపొయారా అనుకున్నా.. ఇంకా జీడిపప్పు జాడ తెలెయలేదు..
ReplyDeleteBack 2 form.. sounds nice.. Keep rock.. we miss you
ReplyDeletemiru super netlo ado chusthunte mi blog chusa chala bagundi motham dorikinavani open chec chauvthunnanu 2hr ga mi blog chala intresting intlo manishitho matladuthunatu vundi.
ReplyDelete