My Yukon Show పేరిట ఇక్కడి విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆసక్తి వుంటే చదవండి - లేకపొతే లైట్ తీస్కోండేం.
యూకాన్ అనేది కెనడాలోని ఒక కేంద్ర పాలిత ప్రాంతం. అలాంటి ప్రాంతాలు ఈ దేశంలో మరో రెండు వున్నాయి. ప్రాంతం పెద్దదే కానీ జనాబా తక్కువ. సులభంగా వుండేందుకై ఈ ప్రాంతాన్ని రాష్ట్రంగా వ్రాస్తాను. ఈ రాష్ట్ర జనాభా 44 వేలు వుంటుంది. అందులో రాజధాని వైట్‌హార్స్ (తెల్ల గుర్రం) జనాభా 33 వేలు. నేను ఈ రాజధానిలోనే వుంటాను. ఈ రాష్ట్రం గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే కాశ్మీర్ అంత అందంగా వుంటుంది. ఇప్పుడు సమయం రాత్రి 11. ఇప్పుడిప్పుడే చీకటి పడుతోంది. అదేంటీ ఇంత ఆలస్యంగానా అని మీ అనుమానం కదూ. హహ. ఇంకో రెండు నెలలు అయితే వేసవిలో మేము అర్ధరాత్రి కూడా ఎంచక్కా సూర్యుడిని చూడొచ్చు. అప్పుడు రాత్రి రెండు మూడు గంటలు వుంటుంది అంతే. ఎందుకంటే ఇది ధ్రువానికి దగ్గర్లో వుంటుంది కాబట్టి.
ఇంటిపైకప్పునుండి బయట గోడపక్కగా నీటి ధార కారుతోంది. సన్నగా వర్షం పడుతోంది. దానికి తోడు ఇంటికప్పు మీద వున్న మంచు కూడా కరుగుతోంది. చిటపట చినుకుల శబ్దం ఆహ్లాదంగా వినపడుతోంది.
ఇక కరోనా సంగతికి వస్తే ఇక్కడ ఇప్పుడు ఏక్టివ్ కేసులే లేవు. దాదాపు 65 శాతం మందికి రెండు డోసుల వాక్సిన్ పూర్తి అయ్యింది. వారం క్రిందటే నేను రెండో డోసు వాక్సిన్ వేయించుకున్నాను. ఈ రాష్ట్రం దాటి ఎటు వెళ్ళి వచ్చినా లేదా బయటి నుండి ఈ రాష్ట్రానికి ఎవరు వచ్చినా రెండు వారాలు ఐసోలేషనులో వుండాలి. ఇండోర్ ప్లేసుల్లో మాస్క్ పెట్టుకోవాలని తప్ప వేరే పెద్దగా నిబంధనలు ఏమీ లేవు కాబట్టి హాయిగా ఆఫీసుకి వెళ్ళివస్తుంటాము, కలుస్తుంటాము, తిరుగుతుంటాము. కెనడాలో ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో కరోనా ప్రకారంగా అత్యంత సురక్షితమయిన ప్రాంతాల్లో ఇది ఒకటి అని చెప్పవచ్చు. అందుకే ఐసోలేషన్ గురించి ప్రసక్తి వస్తే మా స్థానిక మిత్రుడు రాజీవ్ అంటాడూ - మనం ఎలాగూ ఐసోలేటెడ్ నే కదా - ఇంకా వేరే ఎందుకూ? అని. అవును మరీ. ఈ ప్రాతం నార్త్ పోల్‌కి నియర్లో వుంటుంది. ప్రకృతి సౌందర్యం మీద మక్కువ వుంటే తప్ప ఇక్కడ ఇలా దూరంగా వుండలేం. ఇక్కడి గాలి, నీరు 98 శాతం స్వఛ్ఛంగా వుంటాయి.
మరిన్ని విశేషాలతో మరోసారి కలుద్దాం. ఇంకో రెండు వారాల్లో చాలా అవుట్ డోర్ ఏక్టివిటీస్ మొదలెట్టాల్సి వుంది. ఆ కబుర్లూ మీతో పంచుకుంటాను.
చాలా నెలల తరువాత , తరచుగా వ్రాయండి శరత్ గారూ
ReplyDeleteశ్రీ గారూ. అవునండీ. విరామం తీసుకున్నాను. ఈ తెలుగు బ్లాగావరణంలో నేను డిస్కనెక్ట్ అయిపోయానేమో అనిపిస్తోంది. ప్రస్తుత వాతావరణంలో నేను ఇమడలేనేమో అనిపిస్తోంది. ఫేస్‌బుక్ లో వ్రాయడం మొదలెట్టాను. ప్రస్తుతానికి ఇక్కడి కంటేనూ అక్కడే బావుంది. ఇక్కడ ఇక వ్రాయడం అనవసరమేమో అనిపిస్తోంది. చూస్తాను.
ReplyDeleteమీరు కోరా కి రండి సర్ . కోర లో మీరు చాల ప్రశ్నలకి సమాధానం ఇవ్వొచ్చు .
ReplyDeleteతెలుగు కమ్యూనిటి కూడా ఇప్పుడు బాగా పెద్దది అయింది .
మీ ఫేస్బుక్ ఐడి ఏంటండీ ?
mee facbook profile link ivvandi sir.
ReplyDelete