మూడు రాజధానుల ఆలోచన అసలు అమలులోకి వస్తుందో లేదో తెలియదు కానీ ఆసక్తికరంగా అనిపించింది. ఆ తరువాత మరీ మూడేనా అనిపించింది. కొందరు ఒక్కో జిల్లాకి ఒక్కో రాజధాని ఇస్తే పోలా అన్నారు కానీ అందువల్ల ఖర్చు ఎక్కువవుతుంది. అలా కాకుండా నాకు మరో ఆలోచన వచ్చింది. అదే రిలే రాజధానులు. హిప్పీలు మొదలయిన సంచార జాతుల వారు ఒక దగ్గర వుండకుండా తమ నివాస స్థలాలని మారుస్తూ వుంటారు. అదే విధంగా రాజధానిని కూడా ఎప్పుడూ ఒకే చోట వుంచకుండా నెలకి ఒక జిల్లాకి మారిస్తే ఎలా వుంటుంది? ఇలాంటి సంచార రాజధాని వల్ల చాలా లాభాలు వున్నాయి. శాశ్వత భవనాలు, వగైరా ఖర్చులు వుండవు. ఎంచక్కా అప్పటికే వున్న R&B భవనాలో, PWD గెస్ట్ హవుజుల ముందటో టెంట్లు వేసుకొని నడిపించేయవచ్చు.
ముఖ్యమంత్రి గారు మాత్రం ఆయా భవనాల్లో ఆ నెల పాటూ నివసిస్తే సరి. మిగతా సెక్రటెరియట్, హైకోర్ట్, అసెంబ్లీ, శాఖలు మొదలయినవి పెద్ద పెద్ద టెంట్లు, షామియానాలు వేసి లాగించొచ్చు. కానీ అలా ఒక్కో జిల్లాలో అలా అన్నీ ఒక్కో నెలా తిష్ఠ వేసుకొని కూర్చుంటే మిగతా జిల్లాల వారికి కోపం రావొచ్చు. అలాంటప్పుడు అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టులు విడివిడిగా ఒక్కో జిల్లాకి మారుస్తూ వుండాలి. అయితే ఇందులో కూడా ఒక సమస్య వుంది. ఒక క్రమ పద్ధతిలో ఒక్కో జిల్లాకి వరుసగా ఇవి మారుస్తూ వుంటే చివరి జిల్లాల వారు అసహనం చెందవచ్చు. ఆ ఇబ్బంది లేకుండా లాటరీ పద్ధతిలో ర్యాండమ్‌గా ఒక్కో జిల్లాకి ఇవన్నీ మారుస్తూ వుంటే గనుక ఎవరికీ ఏ ఇబ్బందీ అనిపించదు. అన్ని జిల్లాల వారు, అన్ని ప్రాంతాల వారు తమకి తగిన ప్రాధాన్యం లభించిందని ఆనందపడిపొవొచ్చు.
మరీ సంచార జాతుల వలె టెంట్లు ఏం బావుంటాయని మీరు అనుకుంటే గనక దానికి పరిష్కారం వుంది. టెంట్లకు బదులుగా కారవాన్లు, మొబయిల్ హోమ్‌లు లేదా రిక్రియేషన్ వెహికల్స్ (RV) వినియోగిస్తే సరీ.
గమనిక: నేను ఏ పార్టీ లేదా ఏ హీరో అభిమానిని కాదు. ఇది జస్ట్ నాకు వచ్చిన ఆలోచన మాత్రమే.
అభివృద్ధి ఒక్క హైదరాబాదులోనే ఉంది. వరంగల్ బస్ స్టాండ్ దుస్థితి చూస్తే మీరిలా వ్రాయలేరు. ఆంధ్రాలో ప్రతి ఊరు బాగుంటుంది. తెలంగాణాలో లాగా నిరక్షరాస్యత ఉండదు. ప్రభుత్వ పధకాల గురించి వారికీ 80 శాతం అవగాహన ఉంటుంది. వరి, మిర్చి లాంటి పండించడం తెలుసు అమ్ముకోవడం తెలుసు. తెలంగాణా వారిలా రోడ్ల మీద వేసి కాల్చెయడం, టమాటా లారీల్లో తెచ్చి పారబోయడాలు చేయరు. సంచార రాజధాని అయినా అడవిలో అయినా బ్రతకనేర్చినవారికి భయం ఉండదు.
ReplyDeleteproblems in agriculture is not confined to a specified region.
Deleteeven farmers in prakasam district throw away their tomatos on road , left the cotton on the fields as expenses are too high and kurnool farmers had left mirchi in the fields as labor cost was too hig
"The crops are all in and the peaches are rott'ning
DeleteThe oranges piled in their creosote dumps"
Deportee (Plane Wreck at Los Gatos): Woody Guthrie, 1948 song
వరంగల్ వెళ్ళి ఎన్నేళ్ళయ్యిందో! ఇండియాలో వున్నప్పుడు తరచుగా వెళుతుండేవాడిని. అప్పట్లో మా అన్నయ్య అక్కడే వుండేవాడు.
DeleteChala rojulakochavu bhayya ..bagunnava? Canada lo na ippudu ? Gurthunnana Mr Yaksha from Keblasa
ReplyDeleteఅవును. చాలా రోజుల తరువాత. కారణం - బ్లాగులు బోర్ కొడుతున్నాయి. ఏదో పురాణ కాలంలో వున్నామా అనిపిస్తుంది - మన బ్లాగావరణం చూస్తుంటే. అప్పట్లో ఎంత హడావిడి వుండేదీ!
Deleteబాగానే వున్నట్టున్నా :)) అవును. కెనడాలోనే ఇప్పుడు. కాస్త కాస్త గుర్తున్నారు మీరు.
యూట్యూబ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి చూడాలనుకుంటున్నా.