ఈమధ్య సెలవులకి US వెళ్ళాను. (ప్రస్తుతం కెనడాలో వుంటున్నా లెండి). ఒక గృహప్రవేశానికీ వెళ్ళాను. సత్యనారాయణ వ్రతం జరుగుతోంది. పక్కనే వున్న మిత్రుడు ఒకరు నాతో అన్నాడిలా 'నేను కనుక బిట్‌కాయిన్ బిలియనీర్ అయితే కనుక నేనూ సత్యనారాయణ వ్రతం చేయిస్తా!'. నేనన్నాను 'సత్యనారాయణ స్వామికి అలా లంచం పడేస్తున్నారా ఏంటీ?!'
అతనన్నాడూ 'తప్పేముందీ? అందరు ధనవంతులూ దేవుడికి ఇలా లంచాలు ఇస్తూనే వుంటారు కదా'. ఈస్నేహితుడు రిటైర్మెంట్స్ సేవింగ్స్ అన్నీ తీసి అందులో పెట్టాడు. అతను కొన్నప్పుడు బిట్‌కాయిన్ $4,000 వుండేది. మూడువారాల క్రితం అది దాదాపుగా $20,000 దాకా పెరిగి మళ్ళీ ఇప్పుడు $16,000 చుట్టుపక్కల వుంటోంది. ధర ఒకేసారి బాగా తగ్గినప్పుడు గుండె పట్టుకున్నాడు.
నేను US లో వ్యక్తిగతంగా కలిసిన మిత్రులందరూ బిట్‌కాయిన్స్ లో గానీ లేదా అలాంటి ఆల్ట్‌కాయిన్స్ (అన్నింటినీ కలిపి క్రిప్టోకరెన్సీ అనొచ్చు) లలో పెట్టుబడిపెడుతున్నారు లేదా పెట్టాలనుకుంటున్నారు. ఒక నాకు తెలిసిన రెసిడెన్సీ చేస్తున్న డాక్టర్ తన ఆదాయాన్నంతా అందులోనే పెట్టేస్తున్నాడు. ఆ మిత్రులని అడిగి కొన్ని సందేహాలు తీర్చుకొని దీని సంగతేంటా అని రెసెర్చ్ మొదలెట్టా.
ఇప్పటిదాకా ఏదో వార్తల్లో చదవడమే కానీ మన బోటివాళ్ళు కూడా ఇలా వీటిల్లో పెట్టుబడి పెట్టొచ్చని నాకు తెలియదు. అన్ని రకాల సలహాలు పరిశీలించాను. వీటిల్లో రిస్క్ ఎక్కువ కాబట్టి మనం కూడబెట్టుకున్న డబ్బు అంతా తీసికెళ్ళి పెట్టడం మూర్ఖత్వం అంటున్నారు. కానీ అసలే ఇందులో పెట్టుబడి పెట్టకపోవడం కూడా మూర్ఖత్వమే అంటున్నారు మరి. అంచేతా... నేనూ ఓ క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారును అవుదాం అనుకుంటున్నా. మార్కెట్ అధ్యయనం చేస్తున్నా. బిట్‌కాయిన్ లాంటివి వందల కొద్దీ వున్నాయి. ఇక్కడి యువతలో మూడొంతులు వీటిల్లోనే పెట్టుబడులు పెడుతున్నారంట. నాకు బిట్‌కాయిన్ మీద ఆసక్తి లేదు. నాకు ఇథేరియం - Ethereum (ఇథ్ కాయిన్ - Eth) ఆసక్తికరంగా అనిపిస్తోంది. ముందయితే అందులో పెట్టుబడి పెట్టి చూస్తా. మరీ ఎక్కువ కాదులెండి. నా నెట్ ఎర్నింగ్స్ లో 10%. రిస్క్ వుంది నాకు తెలుసు - ఈ మాత్రం పెట్టుబడి నేను కోల్పోయినా భరించేయగలను. ఈ రిస్క్ కూడా తగ్గించుకోవడానికి నా ప్లాన్లు నాకు వున్నాయి.
నాకు స్టాక్స్ అర్ధం కావు కానీ ఇది ఆసక్తికరంగా వుండటంతో కాస్తంత అర్ధం అవుతోంది. మొత్తం మీద ఇది ఒక వ్యసనం లాంటిది అని అర్ధం అయ్యింది. ఈ అంటువ్యాధి తగిలితే కనుక వదలడం కష్టం. అందుకే మీకూ ఎక్కించాలని చూస్తున్నా :)) మీలో ఎవరికయినా ఈ వ్యాధి ఇప్పటికే అంటివుంటే వ్యాఖ్యల్లో చర్చిద్దాం రండి.
మీరు ప్రవాసులని తెలుస్తోంది. అయినా భారతదేశానికి సంబంధించినంత వరకు బిట్‌కాయిన్ భారతదేశంలో లీగల్ కాదని భారతప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటన ఈ క్రింది లింకులో చూడచ్చు.
ReplyDeleteGovt of India's present stand on bitcoin
Please read comments on Internet from warren buffet and mark Cuban on Bitcoin and other crypto currencies before you go all out digging gold with Bitcoin. Good luck.
ReplyDeleteohh,inko subject?*
ReplyDeletehttps://www.youtube.com/watch?v=5F5265jEl28
ReplyDeletethe person in the video looks similar to you.
@ విన్నకోట నర్సింహా రావు
ReplyDeleteఇండియాలో ఇవి ఇంకా లీగల్ చెయ్యలేదు కానీ ఇల్లీగల్ కూడా కాదులెండి. కొన్ని ఎక్ష్చేంజ్ లు పనిచేస్తున్నాయి. కొనేవాళ్ళు కొంటూనే వున్నారు.
@ అజ్ఞాత
పలు అభిప్రాయాలు తెలుసుకుంటూనే వున్నాను. వారెన్ బఫెట్ కంటే కూడానూ మార్క్ క్యూబన్ అభిప్రాయాలు ప్రాక్టికాలిటీకి దగ్గరలో వున్నాయి.
@ అజ్ఞాత*
య్యా. నార్మల్ ఈజ్ బోరింగ్ కదా మనకు. కొత్త విషయాలు తవ్వుతూనే వుండాలి మరి.
@ కాళిదాసు
వీడియో సగం చూసానండీ. సంతోషం.
ఈ బిట్ కాయిన్ పెరిగిపోవటం ఎంటో గాని అందులో పెట్టని వాళ్ళ నస భరించడం కష్టంగా ఉంది.. నేను వేలు పెట్టలేదు..ఇప్పుడు పెట్టేంత పెద్ద వేళ్ళూ లేవు నాకు.. వాళ్ళేమో రోజూ వీటిని డిస్కస్ చేస్తూ చంపేస్తున్నారు.. మరీ మొహం మీద చెప్పలేక, హెడ్ సెట్ పెట్టుకుని తప్పించుకుంటున్నా.. అయినా ఏదో క్షణంలో దొరుకుతానేమో అని భయం.. అయినా చేతులు కాలాక ఇప్పుడేం పెట్టుబడి పెడతారు మీరైనా నేనైనా ? మీరు ఎథీరియం అంటున్నారు.. ఇంకోడు రిపుల్ అంటున్నాడు.. ఎవడిది పట్టుకోవాలి..
ReplyDeleteగురుగారు.. మన ఊళ్ళదగ్గర భూముల రేట్లు బాగ పెరిగినయ్ అంట.. ఇప్పుడు పది అంటున్నరు.. రేపు ఇరవై అంటారు.. అక్కడ పెడదాం పదండి..
హేమిటి గురూజి.. అక్కడ 24గంటలు కరెంటూ, నీళ్ళూ, ఇంటర్నెట్టూ అంటూంటే మీ అట్రాక్షన్ లా అటు పోవట్లేదా? అట్రాక్షన్ లా కి మినిమం ధర్మం అనిపిస్తేనే పనిచేస్తుందని నా ఫీలింగు..మీకు అక్కడ పెట్టాలని లేదా.. కొత్తవి మాత్రమే అంటించుకుంటారా..
ReplyDeleteBro.. How about Porn-x , which is based on ethereum ,
ReplyDeleteit will be on presale from feb11 to feb25.
Porn is a huge industry and most of the users stop at the creditcard payment details as it exposes the identify of the buyers. So these guys seem to have a solution for it.
Please review and let us know your thoughts :)
gaayab ipoyaaru?*
ReplyDelete@ కాయ
ReplyDeleteకొన్ని నెలల పాటు ఈ మార్కెట్ పరిశీలించాకా నాకు ఏమి అర్ధం అయ్యిందంటే నాకు ఏమీ అర్ధం కాలేదనీ. అయినా ఒక్క డాలర్ పెట్టుబడి పెట్టకుండా ఏం అర్ధం అవుతుంది చెప్పండీ? ఒక లక్ష డాలర్లన్నా పెడితే కానీ బాహ్గా అర్ధం అవుతుందనుకుంటా :)) మొత్తమ్మీద ప్రస్థుతానికి అయితే వాయిదా. ఇందులో పెట్టుబడి పెట్టేంత ధైర్యం, వగైరా ఇప్పుడయితే నాకు ఇప్పుడు లేవు మరీ.
అక్కడ అంటే ఎక్కాడ? నాకేం అర్ధం కాలేదు!
@ అజ్ఞాత
చూసా. వావ్! :))
@ అజ్ఞాత*
ఇదివరలో టైం పాస్ కోసం వ్రాసేవాడిని - ఇప్పుడు టైం పెట్టుకొని వ్రాయాల్సొస్తోంది. అంతగా దేశసేవ చేసే ఉద్దేశ్యం లేకా...:))
నాకూ వ్రాయాలనీ, మీ అందరితో ఇలా కాంటాక్టులో వుండాలనీ వుంటుందండీ కానీ సమయం లేకా...
@అజ్ఞాత*
ReplyDeleteఎన్నో కబుర్లు వున్నాయి మీ అందరితో పంచుకోవడానికి - ఇదివరలో వ్రాసేసిన తరహాలో కూడా. నా దగ్గర కబుర్లు లేకపోతే విశేషం కానీ వుంటే విశేషం ఏముందీ. కదా :))