మిగతా విశేషాలకేమి లెండి గానీ అవన్నీ అందరికీ వుంటాయి గానీ ఒక విషయం మాత్రం మీతో పంచుకోనీండేం. మా పెద్దమ్మాయి అంతర్ముఖి. ఫోనులోనో సిస్టం లోనో ఏదో ఒకటి వీక్షిస్తూ కాలం గడిపేస్తూంటుంది. తనని మాతో పాటు వెకేషనుకి తీసుకెళ్ళినప్పుడూ పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. ఇంటికెప్పుడెళ్ళిపోదాం అని తరచుగా అంటూండవచ్చు అనుకున్నాను.
అలాంటిది స్కి జెట్టులో మా చిన్నమ్మాయిని వెనకాల వేసుకొని నీళ్ళళ్ళో రివ్వున దూసుకెళ్ళింది. 45 మైళ్ళ మ్యాగ్జిమం వేగంతో ఓ గంట ఆడేసింది. స్లింగ్‌షాటులో అకాశంలోకి పదేపదే దూసుకుపోయింది. స్నోర్కెలింగులో కీవెస్ట్ దగ్గరి సముద్రంలో అందరికంటే ఎక్కువగా అల్లంత దూరానికి వెళ్ళి ప్రపంచంలో మూడవ గొప్ప కోరల్ రీఫ్ ని ఓ గంట పరిశీలించింది. ఇంకా ఇలాంటివి మరికొన్ని. మా ఆవిడా నేనూ ఔరా అనుకున్నాం. మిగతావాళ్లకి ఇవి అంత గొప్పగా అనిపించకపోవచ్చేమో కానీ మా అమ్మాయికి అవి గొప్పవే.
మా కుటుంబం కోసం ఇంకా ఇలాంటి సాహస కృత్యాలు ఏర్పాటు చెయ్యాలిక. స్కూబా డైవింగ్, వాటర్ బోర్డింగ్ తదితరాలు ఈసారి పలు కారణాల వల్ల కుదర్లేదు. క్రూయిజ్ కి వెళ్ళడానికి ఈసారి కూడా కుదర్లేదు. మా స్నేహితుడి కుటుంబ సభ్యులకు పాస్‌పోర్టులు సిద్ధంగా లేకపోవడంతో అది వాయిదా వేసుకున్నాం. బహుశా మార్చిలో బహామాస్ వెళ్ళొచ్చు. మీరూ ఎవరయినా వస్తారా?
పై వారం లాంగ్ వీకెండుకి లూయివిల్ (కెంటకీ) వెళ్ళాలనుకుంటున్నాం. మీలో ఎవరయినా అక్కడ కానీ చుట్టు పక్కల కానీ వున్నారా?
Wow..photo super..Is that you ??
ReplyDelete@ నీహారిక
ReplyDeleteఅంతలేదండీ. ఆ ఫోటో నాది కాదుగానీ అలా చెయ్యడం పెద్ద కష్టం కాదు. మా అమ్మాయి తన జెట్ స్కి మాగ్జిమం స్పీడ్ అయిన 45 మైళ్ళ వేగంతో దూసుకువెళ్ళింది. మా స్నేహితుడి కొడుకు మరియు డాక్టర్ ఇంకా వేగవంతమయినది తీసుకొని 65 మైళ్ళ మాగ్జిమం వేగంతో వెళ్ళాడు. తనకు పూర్వానుభవం వుంది. వారితో పాటు తమ చెల్లెళ్ళు వుండగా నాతో పాటూ మా ఆవిడా, మా ఫ్రెండు వాళ్ళావిడా ఎక్కేసారు. ఆమె బరువు ఎక్కువా - నేను బరువు తక్కువా - అందువల్ల బ్యాలన్సింగే కష్టం అయిపోయింది. మా ఫ్రెండుకి పని వుండి జెట్ స్కికి రాలేదు. సో మా ముగ్గురితో మాది ముందుకు వెళ్లడం మందగించింది. కష్టకష్టంగా 25 దాకా వెళ్ళాను.
మా ఫోటో వీలుచూసుకొని ప్రొఫయిల్లో పెడతాను. ఇవాళే మా ఫ్రెండు ఒకరు ఆ ఫోటో బావుందని వాట్సాప్ లో అన్నాడు.