నాకు నచ్చిన ఓ చక్కటి బ్లాగ్



ఎంత చక్కగా వున్నాయీ ఆ వ్రాతలూ - ముచ్చటేస్తోంది. ఆవిడ/అమ్మాయి ఎవరో కానీ ఎంత స్వఛ్ఛంగా వ్రాస్తోందీ! ప్రకృతీ, పల్లెటూర్లూ, పచ్చదనమూ, ప్రశాంతతా అంటే ఎంతెంత ఇష్టం తనకీ - నామల్లే! ఈ రాత్రి నిద్రపట్టక అదో ఇదో చూస్తూ ఈ బ్లాగు కూడా చూస్తుంటే వాళ్ళ నాన్నగారి గురించిన పోస్ట్ చదివితే నా కళ్ళళ్ళో ఆర్ద్రత ఆగలేదు సుమా - ఇంకా చెమ్మగిల్లుతూనే వున్నాయి. మా నాన్నా నాకు గుర్తుకురాకుండా వుంటారా మరి. 

ఈ బ్లాగు పేరు ఇంగ్లీషులో కాకుండా తెలుగులో వుంటే ఇంకా బావుండేది - కదూ?

7 comments:

  1. అన్నా మరో కెలుకుడా?

    ReplyDelete

  2. చాలా మంచి బ్లాగు బర్ఫీచయం చేసారు ; మహావిష్ణు ప్రియ గారి టపాలు ఆణి ముత్యాలు

    జిలేబి

    ReplyDelete
  3. మొన్నెప్పుడో టాంక్ బండ్ మీద ఎంపిక చేసిన తెలుగుబ్లాగరు విగ్రహం పెడతానన్నావు. ఎంత దాకా వచ్చింది ఆ పని?

    ReplyDelete
  4. @ అజ్ఞాత
    హవ్వ. ఇది మీకు కెలుకుడులా అన్పించిందాండీ?!

    @ జిలేబీ
    కదా.

    @ అజ్ఞాత
    నాదేనా?! దాందేవుందీ - పెట్టేద్దాం. ముందు మీరు విరాళాలు పంపించండి.

    ReplyDelete
  5. మహి విష్ణుప్రియJuly 6, 2015 at 11:30 AM

    ఈ రోజు నా బ్లాగ్ ని ఇంత మంది చూసారేంటి అనుకుంటున్నా.మీ పోస్ట్ చూసాక కారణం అర్థమైంది.బ్లాగ్ నచ్చిందన్నారు.ధన్యవాదాలు.

    ReplyDelete
  6. I think its geethacharya in disguise .. if you remember, what do you say??

    -Mr.Yaksha

    ReplyDelete
  7. @ మహి విష్ణుప్రియ
    :)

    @ యక్ష
    మీరెక్కడికో వెళ్ళిపోయారు... కానీ కాదులెండి.

    ReplyDelete