ఇన్ఫెక్షన్లు నన్ను ఎడపెడా వాయిస్తున్నాయి. కొన్ని వారాల క్రితం కంటి ఇన్ఫెక్షన్, ఓ వారం నుండీ సైనస్, ఓ మూడు రోజుల నుండీ కళ్ళ కలక. అనుకుంటూనే వున్నా. ఇలాంటి పరిస్థితి రావచ్చనీ - వచ్చేసిందీ. కారణం నాలోని సప్రెస్డ్ ఇమ్యూనిటీ, దానికి కారణం సిస్టమేటిక్ ఇన్ఫ్లమ్మేషన్, దానికి కారణం ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్, దానికి కారణం నా వెయిట్ లిఫ్టింగూ. హ్మ్!
జిమ్ములో బరువులెత్తడం అనగానే నేనేదో భీభత్సంగా బరువులెత్తేస్తానని అనుకోకండేం. ఎత్తాలనే వుంటుంది కానీ నా శరీరం సహకరించదు అని తెలుసు కాబట్టి ఈమధ్య మళ్ళీ కొద్దిగానే ఎత్తాను, తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే వున్నాను. అయినా సరే ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్ వచ్చేస్తోందని అర్ధమయ్యి త్వరలోనే విరమించా. లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా వుండేది.
ఆ తరువాత నుండీ ఇహ అలవాటయిన రొటీనే కనుక ఇన్ఫెక్షన్లు రావొచ్చని ఎదురుచూస్తూ కూర్చున్నాను. వచ్చేసాయి. నా పరిస్థితి గురించి ఇంకా పరిశోధన చేసాను, ఇంకా కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఈమధ్య జరిగిన రక్త పరీక్షల్లో నా శరీరంలో ఇన్ఫ్లమ్మేషన్ ధృవపడింది. నాలోని ఇమ్యూనిటీ సిస్టం పెరగడానికి ప్రయత్నిస్తున్నాను. ఇహ కుదుటపడ్డాకా వారానికి ఒక్క రోజు మాత్రమే వెయిట్ లిఫ్టింగ్ చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఏరోబిక్ వ్యాయామాల వల్ల నాకు సమస్య వుంటుండకపోవచ్చు. అవి వారానికి రెండు, మూడు సార్లు చెయ్యాలనుకుంటున్నా.
ఇలాంటప్పుడు బరువులెత్తడం ఎందుకూ, ఇవన్నీ కొని తెచ్చుకోవడం ఎందుకూ అంటున్నారా? వెయిట్ లిఫ్టింగ్ వల్ల చాలా ప్రయోజనాలు వున్నాయి లెండి. అందుకే నా శరీరం ఎంత వరకు భరించగలదు అనేది ట్రయల్ అండ్ ఎరర్ విధానం ద్వారా తేల్చుకుంటున్నాను.
ayyo*
ReplyDeletehave a spoonful of chawanprash or Honey+Lemon+warmwater mixture daily ,half an hour before breakfast..
ReplyDeleteGet well soon
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteఅబ్బే, ఖంగారేమీ లేదండీ. ఈ సెల్ఫ్ ఇంఫ్లిక్టెడ్ ఇన్ఫెక్షన్స్ అన్నీ నాకు అలవాటయిన రొటీనే లెండి. వారానికి ఒకసారి వెయిట్స్ చేసినా మళ్లీ ఇదే గతి నాకు పడితే మాత్రం ఇహ వెయిట్స్ పక్కన పడేసి కేవలం ఏరోబిక్ వ్యాయామాలు చేస్తాను.
@ అజ్ఞాత
చ్యవనప్రాశ్ లేదు కానీ ఇండియన్ స్టోర్స్ లో దొరకవచ్చు. బ్రేక్‌ఫాస్టుకు ముందు? హ్మ్. అంత పొద్దుటే నాకు అలా చేసుకునే ఓపిక గానీ, ఇతరులకు అంత పొద్దుటే నాకు చేసిపెట్టేంత దృశ్యం కానీ లేవు లెండి. సాయంత్రం ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.
@ జై
థేంక్స్.
Costco lo pasupu dorukutundi. Chalamanchidi. Roju 2 putala spoon tene lemon juice lo 2gms pasupu kalipi kasta neellalo kalipi tagandi. Taggipotundi
ReplyDeleteపసుపు మా ఇంట్లో వుంది మరియు ఇండియన్ గ్రోసెరీ స్టొర్సులో కూడా దొరుకుతుంది. ఇంటికి వెళ్ళాకా అదే పని చేస్తాను. ఇంట్లో తేనె మాత్రం వుందో లేదో, చూడాలి, లేకపోతే కొనాలి.
ReplyDeleteమా డాక్టర్ (DO - Doctor of Osteopathy) కూడా ఈమధ్యటి రక్త పరీక్షలు చూసి నాలో Ph వాల్యూ సరిగా లేదనీ, శరీరం అంతా ఎసిడిక్కుగా వుందనీ, అందుకు గానీ నిమ్మ, నారింజ లాంటి ఆల్కలైన్ ఆహారాలు వాడమన్నారు. తేనె రోజూ వాడమనే ఎప్పటి నుండో చెబుతున్నాడు. మీరూ ఇతరులూ అదే చెబుతున్నారు. ధన్యవాదాలు. ఇవాళ నేను కాస్త కోలుకుంటున్నట్లే వుంది.