హిల్లరీ క్లింటన్ 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుందంట. అమెరికా అధ్యక్ష పదవిలో ఒక మహిళను చూడాలని నేను ఉవ్విళ్ళూరుతున్నా ఎందుకోగానీ హిల్లరీ అంతగా నాకు నచ్చదు. ఆమె గొప్ప పదవులు చేపట్టివుండవచ్చును గానీ అంత గొప్ప పనులు ఏం చేసిందబ్బా? పోనీ అందగత్తెనా అదీ కాదూ.
ఆమెకు బదులుగా మోనికా లెవెన్‌స్కీ కి నా వోటు. ఈమెను ఈ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చెయ్యాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను. ఇంతకీ ఈవిడెవరూ అని ఎవరయినా అడుగుతున్నారా?! హ్మ్. హెంత హమాయకులండీ మీరూ. నేను చెప్పలేను బాబూ. మీరే తెలుసుకోండి. చాలా గొప్పగొప్ప పనులు చేసింది తను. అందుకే నా వోటు ఆమెకే. నేనేదో ఎగతాళిగా అనట్లేదు - మనస్ఫూర్తిగానే అంటున్నాను. పైగా ఎంత అందగత్తె తనూ.
మరి మీ వోటు ఎవరికి? అమెరికాలో మాకు వోటు లేదు కదా అని సందేహించకండి - నాకు మాత్రం వుందా ఏంటీ - సరదాగా చెప్పండంతే.
మన ఓటు సంగతి తరువాత, ఒకవేళ మోనికా లెవెన్‌స్కీకూడా నిలబడితే క్లింటన్ ఎవరికి ఓటు వేస్తాడంటారూ ???
ReplyDelete$iddharth
అందులో సందేహం ఏముందీ? ఎవరికి వేసిందీ బయటకు తెలియదు కదా - తెలిస్తే హిల్లరీతో సమస్య గానీ తెలియదు కాబట్టి ఖచ్చితంగా మోనికాకే వేస్తాడు.
ReplyDelete