ఓ బ్లాగాభిమాని నాకు బాగా మిత్రులయ్యారు. నిన్న రాత్రి మా ఇంటికి కుటుంబసహితంగా వచ్చారు. భోజనాల వేళ ఈ విషయం చెప్పారు. తన యుక్త వయస్సులో మొదటిసారి ఒక అష్టావధానం చూసారట. అది మేడసాని మోహన్ గారిది. అప్పుడు అప్రస్థుత ప్రసంగం కోసం ఇది వ్రాసి పంపించారుట "మేడసాని వారూ, మీకు అల్లసాని వారు కానీ గానీ, సాని వారు కానీ బంధువులా (లేక పరిచుతులా)?". ఖచ్చితంగా గుర్తుకులేదు కానీ మొత్తమ్మీద అలాంటి అర్ధం వచ్చే విధంగా అడిగారుట. అలా ఆ ప్రశ్నలో మేడసాని వారిని అల్లసాని వారంత గొప్ప వారిని చేసి మళ్ళీ సాని దగ్గర కుదేసారుట. ఆయన ఏం సమాధానం ఇచ్చారో మా మిత్రుడికి గుర్తుకులేదట కానీ 'నూనూగు మీసాల నూత్న యవ్వనం లోనే నీకు సానిపై మనసాయనా!' అని మేడసాని వారు సరదాగా అన్నారుట. మిగతావాళ్ళంతా ఈ ప్రశ్న అడిగిందెవరబ్బా అని ఆసక్తిగా ఇతగాడి వైపు చూసి భళా అన్నారుట.
కొన్నేళ్ళ క్రిందట మోహన్ గారిని ఒక చికాగో తెలుగు సంఘం పికినిక్కులో చూసాను, వారి ప్రసంగం విన్నాను. ఎందుకో నాకు వారు అంతగా నచ్చలేదు. ఎందుకో గర్విష్టి అనిపించింది. నా అభిప్రాయం పొరపాటు కావచ్చు.
ఇంతవరకూ నేను ఏ అవధానమూ చూడలేదు. చూడాలని వుంది. మీరు చూసారా?
మీరు చెప్పినది ఈ వీడియో నుండే https://www.youtube.com/watch?v=IwPprUoivrU
ReplyDelete@ ఖమ్మం
ReplyDeleteమీరు సూచించిన వీడియో ఇంకా నేను చూడలేదు ఇంటికి వెళ్ళాక చూస్తాను కానీ అది యుఎస్ లో జరిగిన అష్టావధానం లో రికార్డ్ చేసినట్లు గమనించాను. మా ఫ్రెండ్ చెప్పిన ప్రకారం అది ఎప్పుడో ఇండియాలో జరిగింది అనుకుంటాను. అలాటి ప్రశ్నే మళ్ళీ ఎవరయినా అడిగివుండవచ్చు.