'రిచ్ డాడీ - పూర్ డాడీ' పుస్తకం మరో సారి తిరగేసాకా స్టాక్స్ మీదకు ఆసక్తి మళ్ళింది. అనగా ఆ దురద మొదలయ్యింది. స్టాక్స్ అనగా ఇప్పటిదాకా నాకు అది ఓ బ్రహ్మ పదార్ధం. ఏవీ అర్ధం కాదు. స్టాకులల్లో అందరూ మునిగిపోయామని చెప్పినవాళ్ళే కానీ సంపాదించామని చెప్పినవారు ఒక్కర్నీ చూడలేదు. అయినను నేనూ స్టాక్సులో పెట్టుబడి పెట్టితీరవలె! ఎంతున్నాయి డబ్బులు, ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు అనే కొంటె ప్రశ్నలు మాత్రం అడక్కండేం.
సో, నాలాంటి డమ్మీస్ కోసం ఓ మాంఛి పుస్తకం సూచించండి మరి.
Being in your mid-40s(guestimate), you may be a little late to the game. But, better late than never!
ReplyDeleteI recommend:
The Intelligent Investor by Benjamin Graham
http://www.amazon.com/Intelligent-Investor-Definitive-Investing-Essentials/dp/0060555661/ref=sr_1_1?s=books&ie=UTF8&qid=1429752352&sr=1-1&keywords=intelligent+investor
Good luck!
http://varudhini.blogspot.in/
ReplyDeletehttp://optionszilebi.blogspot.in/2015/02/covered-call-strategy-for-aurobindo.html
Mana zilebi garini adangandi..variki manchi experience vunnatundi..
http://economictimes.indiatimes.com/markets/stocks/news/what-to-shop-for-in-the-stock-market-in-2015/articleshow/45644863.cms
visit
ReplyDeletehttp://kinige.com/ksearch.php?searchfor=sriniwaas
http://telugufinancialschool.blogspot.com/
You wouldn't find anything better than this.
ReplyDeletehttp://www.investopedia.com/
Invest yourself. Either you will become rich or an author! !
ReplyDeleteYes, investopedia.com is a very good resource.
ReplyDelete@Edge
ReplyDeleteవయస్సెంతున్నా నా మనస్సు ఎప్పటికీ ఇరవై ఆరే :)
మీరు చెప్పిన పుస్తకం అమెజాన్ లో ఇప్పుడే ఆర్డర్ చేసాను. థేంక్స్.
@ అజ్ఞాత
జిలేబీ గారి స్టాక్స్ బ్లాగ్ చూసాను. అంతా నాకు లాటిన్ లా వుండి భయపడ్డాను. ఆ బ్లాగు నాలాంటి దద్దమ్మలకు కాదులెండి.
@ శ్వేత రెడ్డి
మీరు సూచించిన తెలుగు బ్లాగు కొద్దిగా చూసాను. బావుంది. నాకు ఉపయోగపడుతుంది. థేంక్స్.
@ శ్రీకాంత్ చారి
ReplyDeleteథాంక్స్. సైట్ కొద్దిగా చూసాను. బావుంది. ముందు ముందు బాగా వినియోగించుకుంటాను.
@ సూర్య
హ్మ్. అది మంచి ఆలోచనే. ఇదివరకు నేనూ ఆలోచించాను కానీ మన తెలుగు వాళ్ళకి పుస్తకాలు, నవలలు చదివే ఓపిక రొజురోజుకీ సన్నగిల్లిపోతోంది. అందువల్ల అలా డబ్బు సంపాదన కష్టం. మీరన్నట్లే ఓ మంచి రచయిత అయితే అవగలనేమో. నిజానికి నాకు సంపాదన మీద ఆసక్తి వుండదు. హాయిగా ఏ ఆశ్రమం లోనో, ఏ చెట్టు క్రిందో సేద తీరుతూ పుస్తకాలు వ్రాసుకోవాలని వుంటుంది కానీ ఇంట్లో వాళ్ళు ఊరుకోవద్దూ. ఈ దేశాల్లో రచనలకూ, రచయితలకూ మంచి విలువా, సంపాదనా వున్నాయి కానీ నాకు ఇంగ్లీషులో వీళ్లతో పోటీ బడి మరీ వ్రాసేంత దృశ్యం లేదు.
http://en.wikipedia.org/wiki/Peter_Lynch పుస్తకాలు పుస్తకాలు చుడండి, అన్ని చికాగో గ్రంధాలయం లో ఉంటాయి - కొనవద్దు, అతని నియమాలు "Invest in what you know" పాటించండి . ముందు ఒక డమ్మి ఆట portfolio తో రెండు మూడు నెలలు (నిజమైన డబ్బుతో) కాదు చేసి చూడండి. పుస్తకాల కన్నా ప్రతి రోజూ స్టాక్స్/etfs మార్కెట్ ని గమనించడం ముఖ్యమ్.
ReplyDeleteOne Up on Wall Street (ISBN 0671661035)
Beating the Street (ISBN 0671759159)
Learn to Earn
@ RaPaLa
ReplyDeleteథాంక్ యూ. దీనిమీద విజృభించడానికి నాకు ఇంకా కొద్దిగా సమయం అవసరం వుంది. ఆ తరువాత మీరు చెప్పిన పుస్తకాలు చూస్తాను. మీరన్నట్లు గానే కొన్ని నెలలు ఒక డమ్మీ ఆట ఆడాలనే నిర్ణయించుకున్నా. అందులో డబ్బులు సంపాదిస్తే అప్పుడు పెట్టుబడి పెట్టవచ్చు. మా పెద్దమ్మాయికీ స్టాక్స్ మీద ఆసక్తి వుంది. నేను ఇకపై కొన్ని నెలలు తీరిక లేకుండా వుంటా కాబట్టి ఆ ఆట తనను ఆడి చూడమని చెప్పాను.