పాత్రలూ - 'పాత్ర'ధారులూ

నా తుదిశ్వాస నవలను వీడియో సినిమాగా తియ్యాలని నిశ్చయించాకా హీరో, హీరోయిన్ల కోసం వేట మొదలయ్యింది. అప్పట్లో ఈటివి లో ఏదో ప్రొగ్రాం ఏంకరింగ్ చేసే అమ్మాయి మా ప్రిన్సిపాలుకి కాస్త తెలుసు. ఫోటో చూస్తే ముద్దుగానే వుందికానీ నిజంగా అంత అందగత్తె కాదని చెప్పారు. ఆమె ఏదో ముగ్గుల పోటీనో ఏదో నిర్వహిస్తే చూసాను కానీ ఆమె నచ్చలేదు. ఒక ఔత్సాహిక యువకుడు హీరోగా దొరికాడు. అతనికి అనుభవం లేదు కానీ చూట్టానికి బానే వుంటాడు. అసలయితే హీరో కన్నా విలన్ గా బాగా సూట్ అవుతాడేమో. ఏమయితేనేం అతన్ని హీరోగా నిర్ణయించాం. హీరోలదేముంది లెండి బోలడెంతమంది దొరుకుతారు. మంచి హీరోయిన్ దొరకడం కష్టమే. 

కొన్ని కాంటాక్ట్స్ ద్వారా ఒక యువతి వచ్చింది. సుధీర్ అనే సినిమా (అదో దిక్కుమాలిన సినిమాలెండి - అలాంటివి విడుదలకు నోచుకోవు) లో నటించిందంట - స్టిల్స్ చూపించింది. నాకు ఆమె బాగానే సెక్సీగా అనిపించింది కానీ ఒక చిక్కొచ్చింది. మా హీరో గారికి ఆవిడ నచ్చలేదు - నాకేమో నచ్చింది. ఆవిడతో కెమిస్ట్రీ కుదరాల్సింది హీరో గారికి కానీ నాకు కాదు గదా అనుకొని ఆమెను వద్దు అనేసాము. ఆ తరువాత ఎంత వెతికినా మంచి హీరోయిన్ దొరకలేదు. రోజులేమో దొర్లిపోతున్నాయి. మాకు అందరికీ చిరాకు వేస్తోంది. అప్పుడు మళ్ళీ మాకు వున్న కాంటాక్ట్స్ ద్వారా ఒక అమ్మాయి వచ్చింది. ఏదో మామూలుగా వుంది - మా హీరో గారికి అయితే నచ్చింది. అతనూ చూసిచూసి విసిగిపోయి ఏదో ఒక అమ్మాయి అని ఆమెకు సరే చెప్పినట్లున్నాడు. నేను కూడా ఆమె అంతగా నచ్చకపోయినా తొందరగా సినిమా స్టార్ట్ చెయ్యాలని వొకే చెప్పేసాను. 

షూటింగ్ మా టవునులో ఒక మాజీ MLA ఇంట్లో నిర్ణయించాం.  వాళ్లింట్లో ఓ చిన్న తోట వుందిలెండి. అక్కడయితే సినిమాలో ప్రేమికులు కబుర్లు చెప్పుకోవడానికి బావుంటుందని అనుకున్నాం. లోకల్ ఫ్రెండ్ ఆ మాజీతో మాట్లాడి అనుమతి తెచ్చాడు. ఇహ హైదరాబాదు నుండి మా టవునుకి వెళ్ళాలి కదా. మనది లో బడ్జెట్ ఫిల్మ్ కాబట్టి కార్లూ గట్రా ఏర్పాటు చేయించలేకపోయాను. సాయంత్రం బస్సుస్టాండుకి వెళితే ఎన్ని బస్సులు చూసినా ఖాళీ లేదు. దాంతో మా ఈరోయిన్ను గారికి చిరాకేసింది. కారు ఏర్పాటు చేయొచ్చుగా అని అన్నట్టు అంది. నేను ఆ మాటలు వినిపించుకోనట్టు నటించాను. మొత్తమ్మీద ఆ రాత్రి మా టవునులో దిగాము. షూటింగ్ సామాగ్రి మొయ్యడానికి మా ఈరో గారు ఏమాత్రం ఉత్సాహం చూపలేదు. అస్సలు సినిమా స్టార్టే కాలేదు - మా హీరో గారికి అప్పుడే కొమ్ములు పెరిగాయని అర్ధం అయ్యింది. నేనూ, మిగతా వాళ్ళం మోసుకుంటూ దగ్గర్లో వున్న స్నేహితుడి ఇంటికి వెళ్ళాం. హీరోయిన్ గారికి వాళ్ళ ఇంట్లో బస ఏర్పాటు చేసాం. హీరో గారికి లాడ్జిలో చేసాం. 

ఉదయం మా ఫ్రెండు ఇంటికి వెళ్ళాను.  హీరోయిన్ బావోలేదనీ, హీరో బాగానే వున్నాడని మా స్నేహితుని భార్య మా హీరోయిన్ లేనప్పుడు చూసి కామెంట్ చేసింది. ఆమెను ఎందుకు ఎన్నిక చేయాల్సివచ్చిందో వివరించాను. ఇక ఆరోజు షూటింగ్ మొదలెట్టాం. ఆ విశేషాలు మరోసారేం.

10 comments:

  1. hi, sudden gaa cinema loki vellipoyaarenti? F L R kaburlu cheppochugaa.

    ReplyDelete
  2. ఎప్పుడూ ఆ కబుర్లే చెబితే బోర్ కొట్టదుటండీ మీకూ? అందుకే మిగతావి కూడా వ్రాస్తుంటానేం. FLR మీది మీ ఆసక్తికి సంతోషంగా వుంది. దాని గురించి ఎన్నయినా, ఎంతయినా వ్రాయొచ్చు కానీ మరీ ఎక్కువవుతుందని నిగ్రహం పాటిస్తుంటాను. నిజానికి దాని మీద ఈమధ్య ఓ టపా వ్రాసి ప్రచురించే ధైర్యం లేక డ్రాఫ్ట్ లోనే వుంచాను. అలాంటివి వ్రాస్తే ఇతరులకు అతిగా అనిపిస్తుందేమో అని సందేహిస్తున్నా. అది 'నా' బంధనం గురించిన టపా.

    ReplyDelete
    Replies
    1. Hi,interest vndi.kaani partner accept cheyyaali kadaa.

      Delete
    2. హెల్లొ, ఇంట్రెస్టింగ్ ఉన్నయ్. చెప్పండి ప్రోగ్రెస్.

      Delete
    3. మీరు పురుషులో లేక స్త్రీనో తెలిస్తే తగు విధంగా మీకు సలహాలు ఇవ్వవచ్చు. మీరు ఇంతవరకు ఏమయినా ప్రయత్నించారాలేదా? FLR సైట్లు, బ్లాగులు, ఫోరంస్ తిరగేసారా లేదా? వాటిల్లో మీ పార్ట్‌నర్ ని ఈ బంధానికి ఎలా మళ్ళించొచ్చో టిప్స్, టెక్నిక్స్ వుంటాయి. వీలయితే ముందు ముందు ఆ టాపిక్ మీద నేను కూడా వ్రాస్తాను. ఈలోగా ఆయా వెబ్ సైట్లు తిరగేయండి.

      Delete
    4. @అజ్ఞాత5 ఫిబ్రవరి, 2015 9:24 [AM]
      అలాగేనండీ. మా FLR ప్రోగ్రెస్ గురించి తరచుగా తరచుగా వ్రాస్తుంటాను. ఒక అజ్ఞాతగా ఈ బ్లాగు వ్రాసివున్నట్లయితే ఇంకా ఎన్నో వ్రాసివుండేవాడిని కానీ పబ్లిక్ గా వ్రాస్తున్నాను కాబట్టి అన్నీ మీతో పంచుకోలేను. పైగా అది కాస్త అడల్ట్ టాపిక్ - ఇదేమో అడల్ట్ బ్లాగు కాదు కాబట్టి కొన్ని కొన్ని ఫిల్టర్ చేసి వ్రాయాల్సొస్తోంది.

      Delete
  3. బ్లాగ్ లోకం లో డేరింగ్ డాషింగ్ అనబడే మీరు కూడా ప్రచురించడానికి భయపడుతున్నారా ?

    ReplyDelete
  4. 'అతి సర్వత్రా వర్జియేత్' కాదుటండీ? దేనికయినా కొన్ని పరిమితులు వుంటాయి - వుండాలి కూడానూ. ఉదాహరణకు నాది అడల్ట్ బ్లాగు కాదు కాబట్టి ఎంత డేషింగుగా వ్రాసినా అలాంటి విషయాలు నర్మగర్భంగా, లైటుగా మాత్రమే వ్రాయగలను కదా. నేను వ్రాస్తున్నది ఇతరులకి awkward గా అనిపిస్తుందనుకున్నప్పుడు కొంతకాలం డ్రాఫ్ట్ లోనే వుంచి మెరుగులు దిద్దడమో లేక తీసివెయ్యడమో జరుగుతుంది. ఇంకా కొన్ని సార్లు అయితే ప్రచురించినవి కూడా మంచిగా అనిపించక, నాకే నచ్చక తీసిపారేస్తుంటాను.

    ReplyDelete
  5. Replies
    1. హ్మ్. వ్రాయాలి కానీ మూడూ, తీరికా దొరకడం లేదు. కొద్ది రోజుల్లో వ్రస్తానేమో. చూద్దాం.

      Delete