ఆప్ విజయం - తెలుగు ముఖ్యమంత్రులకు గుణపాఠం

రోజుకో బ్రహ్మాండమయిన హామీని ఇవ్వడం, అరచేతిలో వైకుంఠం చూపడం తప్ప మన ముఖ్యమంత్రులు పెద్దగా సాధిస్తున్నదేమీ నాకయితే కనిపించడం లేదు. తమను ఎదిరించే మొనగాడు లేకపోవడం, దినపత్రికలు వారికి బాకాలుగా మారడం తదితర కారణాల వల్ల వారికి డాబుసరి పెరగడం, ఒంటెద్దు పోకడలకు పోవడం, సామాన్య ప్రజానీకానికి దూరం అవడం ప్రజలు గమనిస్తూనే వుంటారు.

మళ్ళీ ఎన్నికల నాటికి  తెలంగాణా భావోద్వేగాలు ఎలాగోలా మళ్ళీ రెచ్చగొట్టడం ద్వారా కేసీఆర్ ఎలాగోలా పబ్బం గడుపుకోవచ్చేమో గానీ చంద్రబాబు నాయుడికి అయితే ఇలాగే అలవిమీరిన శుష్క వాగ్ధానాలతో పరిపాలన సాగిస్తే మాత్రం సమస్యలు తప్పవు. మోడీ ఏం పొరపాట్లు చేస్తూ  అపజయం కొనితెచ్చుకున్నాడో ఆ పొరపాట్లకు దూరంగా మన తెలుగు ముఖ్యమంత్రులు పాలన సాగించాల్సివుంది.  ప్రజలకు కావాల్సింది వాస్తవ దూరం అయిన స్మార్ట్ సిటీలు లాంటివి కాదనీ సగటు ప్రమాణాలు అనీ వీరు గుర్తించాల్సివుంది.   

3 comments:

  1. ప్రజలకు కావాల్సింది...స్మార్ట్ సిటీలూ...మెట్రో లు కాదు...అసలు ఇప్పటి జీవన విధానమే చిరాగా ఉంది...సామాన్యుడు కోరుకునేది ఏదీ కూడా కనీస మాత్రంగా ఎన్నికైన ప్రభుత్వాలు చేయడమ్ లేదు...మార్కెట్ లొ ధరలను అదుపు లొ పెట్టే యంత్రాంగం లాంటి వాటి గురించి కనీసమైన ఆలోచన చేస్తున్నట్తు లేదు...ఇక ఏసీబీ..విజిలెన్స్ లను రద్దు చేయడమే బెటర్...అడుగడుగునా అవినీతి ఉద్యోగులు,వారి సంపాదన కి ప్రతిరూపాలు గా బయట విచ్చలవిడి ఆస్తులు కనబడుతున్నా.....ఈ సంస్థలకు ఎవరయినా పిర్యాదు చేస్తే గానీ రంగం లోకి దిగవట!!ప్రతీ కార్యాలయంలొ రొజూ వేలాది రూపాయల అవినీతి వసూళ్ల జరుగుతున్నా....అవినీతి నిరోధక శాఖ వారు నెల వారీ జీతాలు తీసుకోవడం తప్ప మరో పని చేస్తున్నట్టు కనపడదు! అవినీతిని అరికట్టనంత వరకూ ఏ ప్రభుత్వమ్ ప్రజల విశ్వాసాన్ని పొందదు గాక పొందదు...

    ReplyDelete
  2. @ kareem ansari
    Thanks.

    @ kvsv
    ఆప్ అవినీతిని అంతం చేస్తానంటోంది కదా. వేచి చూద్దాం.

    ReplyDelete