Marco Polo టివి సిరీస్ సీజన్ 1, 10 ఏపిసోడ్స్ నిన్ననే పూర్తిచేసా. సీజన్ 2 ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నా. 12 వ శతాబ్దపు ప్రపంచ యాత్రికుడి చారిత్రిక కథ ఏం ఆసక్తికరంగా వుంటుందిలే అని తటపటాయించా. పైలట్ ఎపిసోడ్ చూడగానే ఈ సిరీస్ కి అతుక్కుపోయా. బావుంది బావుంది. మొత్తం చూసేకా 5/5 రేటింగ్ ఇచ్చా. మిగతా విషయాలు బావుండటంతో పాటుగా అడల్ట్ కాంటెంట్ కూడా చక్కగా వుంది. అలా అని ఇది ఏదో శృంగార చిత్రం అనుకోకండి - అక్కడక్కడా ఆ దృశ్యాలు వుంటాయంతే. అసలు విషయం ఆ యాత్రికుడి సహసాలు, యుద్ధాలు, తంత్రాలు, రాజరికాలు వగైరా వగైరా.
IMDB Rating 8.3/10
ఈ రోజు నుండీ Breaking Bad tv సిరీస్ చూడాలనుకుంటున్నా. అది బావుందని ఓ మిత్రుడు చెప్పేడు. దాని IMDB rating 9.5/10. Wow! సాధారణంగా నేను ఈ సిరీస్ లు వ్యాయామం చేస్తూ చూస్తాను కానీ నేను చేసేది వ్యాయామం కానే కాదని కేవలం స్ట్రెచింగ్ అని మా అమ్మాయి ఎగతాళి చేస్తుంటుంది. తాను స్కూల్లో నేర్చుకున్న వ్యాయామాలు నాతో చేయించాలని చూస్తుంటుంది.
After completing Breaking Bad, watch Prision Break, it is more thrilling.. or Universal hit.. Game of Thrones ....
ReplyDeleteBreaking bad is an Awesome series. Don't miss. Hope you are done with game of thrones, and house of Cards as well
ReplyDeleteఫ్రీ మూవీస్, టీవీ సిరీస్ లు చూపించే వెబ్సైటు ఏంటో చెప్పి కొంచెం పుణ్యం ఖాతా లో వేసుకోండి .
ReplyDeleteడబ్బులు పెట్టాలా ? ఐతే కాస్త చవగ్గా చూపించే సైట్ ఉంటె చెప్పండి
@ అజ్ఞాత
ReplyDeleteమొన్నమొన్నటి వరకూ నెట్‌ఫ్లిక్స్ లో సినిమాలు తప్ప సీరియళ్ళ మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు అవి చూస్తుంటే సినిమాల కన్నా గొప్పగా అనిపిస్తున్నాయి. నెమ్మదిగా మంచి సిరీస్ లు అన్నీ చూస్తాను. ప్రిజన్ బ్రేక్, గేం ఆఫ్ థ్రోన్స్ బావుంటాయని విన్నాను.
@ అజ్ఞాత
నిన్న బ్రేకింగ్ బ్యాడ్ మొదలెడదామనుకున్నా కానీ మా ఫామిలీ ఇంట్లో లేకపోవడంతో అదే సందు అని ఆరెంజ్ ఈజ్ న్యూ బ్లాక్ మొదలెట్టా. మా ఆవిడ వుంటే అది పెట్టనివ్వదు. గేం ఆఫ్ థ్రోన్స్ ఇంకా చూదలేదు - చూస్తాను. హవుజ్ ఆఫ్ కార్డ్స్ లాంటి పొలిటికల్ కథాంశాలూ - ముఖ్యంగా అమెరికన్ ప్రెసిడెంటు కి సంబధించినవి నాకూ నచ్చుతాయి. కొత్తపాళీ గారు ఒకసారి తన బ్లాగులో ఆ సిరీస్ చాలా బావుంటుందని చెప్పారు - గుర్తుంది. పైలట్ ఎపిసోడ్ చూసా - బావుంది. మళ్ళీ మొదలెట్టాలి.
@ అజ్ఞాత13 జనవరి, 2015 8:50 [PM]
ReplyDeleteమీరు ఏ దేశంలో నివసిస్తున్నారో తెలియపరిచితే ఎవరయినా ఆ సైట్లు సూచించడానికి వీలుగా వుండేది. నాకు యుఎస్ లోవి మాత్రమే కొన్ని తెలుసు. ఇక్కడి సినిమాలు, సీరియళ్ళు పైరసీ కాపీలు కానీ, పైరసీ వెబ్ సైట్లలో కానీ చూడటం చట్టపరంగా ప్రమాదకరం.
Netflix.com streaming - I think $9 per month
Amazon.com Prime - I think $100 per year
Hulu Plus - I think $10 per month
iTunes - I think it's pay per view
Youtube.com - Pay per view
Annailu the best is XBMC :)
ReplyDeleteIt is free of cost and the only thing that costs is your network bandwidth ;)