నేనూ దర్శకత్వం వెలగబెట్టానోచ్!?

అది 2007 జనవరి. కొన్ని కారణాల వల్ల కొన్ని నెలలు ఇండియాలో గడపాల్సి వచ్చింది. ఎలాగూ దర్శకత్వం మీద ఆసక్తి వుంది కదా అని దిల్‌షుక్‌నగర్ లోని ఓ దిక్కుమాలిన ఫిల్మ్ ఇన్స్టిట్యూటులో చేరాను. పేరు గుర్తుకులేదు - అది ఇంకా అక్కడే వుందో లేదో తెలియదు. అందులో దర్శకత్వం కోర్సు తీసుకున్నది నేను ఒక్కడినే. నటన మీద ఆసక్తి వున్న పిల్లకాయలు కొంతమంది అమాయకంగా (నాలాగే?!) అందులో చేరారు. ఆ ప్రిన్సిపాల్ వాళ్ళకు అరచేతిలో వైకుంఠం చూపించి వీలయిననన్ని డబ్బులు నొక్కేసేవాడు. అలా అమాయకంగా పల్లెటూర్ల నుండి, టవున్ల నుండి వచ్చిన అబ్బాయిలు వృధాగా డబ్బులు ధారపోస్తుంటే జాలి అనిపించేది కానీ ఏమీ చెయ్యలేక ఆ ప్రిన్సిపాల్ కూడా బ్రతకాలి కదా అని నిట్టూర్చేవాడిని. 

ఆ అబ్బాయిలవి కృష్ణానగర్  కథల్లాగా దిల్‌షుక్‌నగర్ కథలు అన్నమాట. ఒక్కో అబ్బాయిది ఒక్కో దిక్కుమాలిన  కథ. ఎన్నో సమస్యలు వున్నా చిత్రరంగపై ఆసక్తితో, నటన మీది మక్కువతో ఆ ఫిల్మ్ స్కూలులో చేరేవారు. అందులోనే నివసించేవారు. వారు తమ తమ జీవితాలు నా దగ్గర వెళ్ళబోసుకుంటుంటే మహా జాలి కలిగేది.  అప్పట్లో నా పరిస్థితి కూడా అంత గొప్పగా ఏమీ లేదనుకోండి. నామీద నేను కూడా జాలి కురిపిస్తున్న రోజులవి కానీ నా కహానీ వారికి చెప్పేవాడిని కాదు.

ఓ RMP డాక్టర్ మాకు అధ్యాపకుడు. ఆయనకేదో చిత్రరంగంలోనో నాటకాల్లోనో ఏదో కొద్దిగా అనుభవం వున్నట్లుంది. దర్శకత్వం విద్యార్ధిని నేను ఒక్కడినే కాబట్టి నన్నూ నటన తరగతిలో పెట్టి చెప్పేవారు. నట విద్యార్ధులు చేసే ప్రాక్టీసు తమాషాగా అనిపించేది. క్లాసులు మంచి కాలక్షేపంగా జరిగిపోయేవి. ఏవో కొన్ని డైరెక్షన్ మెళుకువలు  నేర్చేసుకున్నాలెండి.   మొత్తం మీద కోర్సు పూర్తి అయ్యిందనిపించాం. ఇక దర్శకత్వం వహించాలనే దురద ఆగుతుందా? నాదో చిన్న వీడియో కెమెరా వుండేది. దాంతో ప్రయొగాత్మకంగా ఓ వీడియో సినిమా తియ్యాలని నా వుద్దేశ్యం. డబ్బులు ఏమో ఎక్కువ లేవు. అయినా సరే సిద్ధపడ్డాను.

అప్పట్లో యాహూ గ్రూప్స్ తెలుగు సరసమయిన కథల సైట్లలో విరివిగా రచనలు చేసేవాడిని. చాలా స్పందన వచ్చేది - అలాగే విమర్శలూనూ! నావి మామూలు కథాంశాలా మరి? ఎత్తడం ఎత్తడమే నెక్రోఫీలియా సబ్జెక్ట్ ఎన్నుకొని ఓ నవల వ్రాసేసాను. పాఠకులు దడుచుకున్నారు!  ఏమాటకామాటే  చెప్పలి - సబ్జెక్ట్ అది కానీ నవల మాత్రం ఓ యండమూరి సస్పెన్స్, క్రైం థ్రిల్లర్ లాగా ఎంతో బాగా వచ్చింది. నేననుకోవడమే కాదు - కొంతమంది పాఠకులూ అదే అన్నారు. అయితే పాఠకులు ఇవేం సబ్జెక్టులు మహాప్రభో అని అరచి గావుకేకలు పెట్టడంతో పాపం వాళ్ళ మీద జాలిపడి ఆ సైటులోనుండి ఆ నవల తొలగించాను. ఆ తరువాత దాని సాఫ్ట్ కాపీ పోయింది -  ఎంత వెదికినా దొరకలేదు. 

ఆ తరువాత 'బ్రెత్ కంట్రోల్ ప్లే' మీద మాంఛి రోమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ వ్రాసాను. అదీ ఎంతో బాగా వచ్చింది. అయితే కొంతమంది చదువరులు మళ్ళీ నన్ను తిట్టేసారు :( నువ్వు మనిషివా లేక మోహన్‌బాబువా అన్నారు! ఏమాటకామాటే చెప్పాలి - నాకూ నామీద డవుట్ వచ్చింది.  పాఠకుల విజ్ఞప్తి పై ( నిజానికి డిమాండ్ చేసారు లెద్దురూ) అదీ ఆ సైటులోనుండి తీసేసాను. దాని సాఫ్ట్ కాపీ కూడా పోయింది కానీ హార్డ్ కాపీ అప్పట్లో వుండేది. నా నవలల్లో ముగింపు చాలా బాగా వుండేది. ఈ నవల్లో కూడా ముగింపు చదివి గుండె కొన్ని క్షణాలు కొట్టుకోవడం ఆగినట్లు అనిపించిందని కొంతమంది అభిమాన పాఠకులు చెప్పారు. నాక్కూడా ఈ నవల్లోని ముగింపు కూడా బాగా నచ్చింది. నిర్ఘాంతపోయేలా, నిద్రపోతున్న ముఖం మీద చన్నీళ్ళు  చల్లినట్లుగా వుంటుంది అది.  

మామూలు వీడియో సినిమా తీస్తే గుర్తింపు దక్కదని ప్రేక్షకులు హడలిపోయే సినిమా తియ్యాలనుకున్నా. నెక్రోఫీలియా నవల ఆధారంగా సినిమా తీస్తే ప్రేక్షకులు నన్ను పిచ్చికుక్కను తరిమినట్టు తరిమి తరిమి కొడతారనే దృశ్యం అర్ధమయ్యి ఆ ఆలోచన శుబ్బరంగా ముగించా. అన్నట్టు ఆ నవల పేరు "ఓ నేస్తమా, ఇంక సెలవు". ఎంతో చక్కని పేరు పెట్టి ఎంతో ఛండాలమయిన సబ్జెక్ట్ వ్రాసావు అని తిట్టారనుకోండి కానీ అది వ్రాసినందుకు అనుకున్న, ఆశించిన ఫలితం దక్కింది. పాఠకుల్లో యమ గుర్తింపు వచ్చింది. ఓ సంచలన రచయిత అయిపోయాను.  ఇహ బ్రెత్ కంట్రోల్ ప్లే (BCP) మీద వ్రాసిన తుదిశ్వాస నవల మీద దృష్టి సారించాను. అది సినిమాగా తియ్యాలని నిశ్చయించాను. రచయితా, దర్శకుడూ, నిర్మాతా వున్నాడు - ఎవరూ - నేనే. సినిమాటొగ్రఫీ  కోసం ఓ చక్కని స్టుడెంట్ వున్నాడు. వీడియో కెమెరా నాదేలెండి. ఆ నవల్లో ఎక్కువ పాత్రలు వుండవు. ముఖ్యంగా ఇద్దరే - హీరో హీరోయిన్లు. వాళ్ళు కావాలి కదా. నేనే హీరో గా నటిస్తా అంటే చూసిన ప్రేక్షకులు తిరగబడతారేమో అని తోకముడుచుకున్నాను. డబ్బులు ఆదా చెయ్యడానికి హీరోయిన్ వేషం నేనే వేస్తే పోలా అని బ్రహ్మానందం 'అత్తారింటికి దారేది ' సినిమాలో అనుకుంటా చేసినట్లుగా చేద్దామనుకున్నా కానీ మళ్ళీ ప్రేక్షకులు గుర్తుకువచ్చి దడుచుకున్నాను. సినిమా తీసాక చూసేది నేనొక్కడినే కాదు కదా! 

ఇక హీరో హీరోయిన్ల కోసం వేట మొదలయ్యింది. ఎంత గొప్ప నటులు ఆ పాత్రల కోసం దొరికారో "పాత్రలూ - 'పాత్ర'ధారులూ" అనే తరువాయి ఎపిసోడులో చదువుదురు గానీ ఇప్పటిక సశేషం.  

సెక్సీ సైడ్ ఎఫెక్ట్ ;)

సెలెక్సా (SSRI)  మెడిసిన్ వాడుతున్నప్పుడు ఇతర సైడ్ ఎఫెక్ట్సుకు తోడుగా ఒక ముఖ్యమయిన సైడ్ ఎఫెక్ట్ - సెక్స్ వాంఛ (లిబిడో) తక్కువయ్యేది. కొందరిలో అయితే అది (లైంగిక వాంఛ) పూర్తిగా పోతుంది కూడానూ - అమ్మాయిలని చూస్తే యాక్ అనిపించవచ్చు.  నా జీవితంలో ఆ ఆనందం ఆవిరి అయినట్టుగా అనిపించేది. కృంగుబాటు కావాలా లేక కోరిక కావాలా అనేది తేల్చుకోవాల్సి వచ్చింది. కృంగుబాటు వద్దనుకుంటే కోరిక పోతుంది - కోరిక కావాలంటే కృంగుబాటూ వుంటుంది.  అందువల్ల కొన్ని నెలలు అది వాడేసినా కొద్దిగా కుదుటపడగానే అది మానేసి ప్రత్యామ్నాయాలు ప్రయత్నించేవాడిని. అవి పెద్దగా ఫలించేవి కావు కానీ లిబిడో సాధారణ స్థితికి వచ్చేది. ఈలోగా తగుదునమ్మా అంటూ క్రుంగుబాటూ వచ్చి చచ్చేది. మళ్ళీ మందులూ - కోరిక కనుమరుగు అవడం - మళ్ళీ కొన్ని నెలలకే మానివెయ్యడం ఇలా సైకిల్ తిరుగుతూవుండేది. నా స్థితికేమో చాలా ఏళ్ళు ( బహుశా జీవితాంతం) ఆ మందు వాడాలి. హ్మ్!

నెట్టులో పేషెంట్ ఫోరంస్ వగైరా తవ్వితవ్వి చూడగా వెల్బట్రిన్ (DNRI)  ఆ మందుకి విరుగుడు అని తెలిసింది. ఎగురుకుంటూ డాట్రు బాబు దగ్గరికి వెళ్ళి అడిగితే అది ఇచ్చాడు కానీ సెలెక్సా మానివేయమన్నాడు. నిజానికి రెండూ ఒకే సమయంలో వాడిచూడాల్సింది. అయితే అది వాడాక కోరిక మామూలుగా అయ్యింది - కృంగుబాటూ కంట్రోల్ లోనే వున్నట్టుంది కానీ ... కానీ మరో సమస్య వచ్చి పడింది. అదే ఆందోళన ( ఏంగ్జయిటీ)! హ్మ్. ఓ నెల చూసి ఇహ లాభం లేదనుకొని మళ్ళీ వెనక్కు వచ్చేసా :( 

మా వైద్యుడితో లాభం లేదనుకొని సైకియాట్రిస్టుని కలిసాను కానీ పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఆయన గారు సింబాల్టా (SNRI) వాడిచూడమన్నారు కానీ నాకు CoPay కొద్దిగా వాచిపోయింది ($50) కానీ ఆ మందుతో పెద్దగా ప్రయోజనం లేకపోయింది. దాంతో మళ్ళీ మొదటికి వచ్చాను. మళ్ళీ ప్రత్యామ్నాయ మార్గాలు ప్రయత్నించాను కానీ ప్చ్. కోరిక తగ్గకుండానే కృంగుబాటు కనుమరుగు కావాలి. ఎలా?

మళ్ళీ నెట్టులో బాగా పరిశీలించాను. సెలెక్సా మరియు వెల్బట్రిన్ రెండూ ఏక కాలంలో వాడితే ఒకదాని సైడ్ ఎఫెక్ట్స్ మరొకటి పరిహరించి అంతా బావుంటుందని తెలుసుకున్నాను. మా డాక్టరును అడిగితే అలా రెండూ ఒకేసారి తాను ఇవ్వనన్నాడు. కావాలంటే సైకియాట్రిస్టుతో మొరపెట్టుకొమ్మన్నాడు. సరే అంటే చాలా మాంఛి మానసిక వైద్యుడు అని ఒకరిని రిఫర్ చేసాడు. తనని కలిసాను. క్రుంగుబాటు పొట్ట (Gut) లో పుడుతుందని కొత్త సూత్రం చెప్పి అలా ప్రయత్నిద్దాం అని అన్నాడు. అవన్నీ ఇప్పుడు జరిగేపని కాదనుకొన్నాను. పైగా ఆయా మందులు భీమాలో కవర్ కావు కాబట్టి నాకు వాచిపోయేలా వుంటుందని అర్ధమయ్యింది. అందువల్ల అవేమీ ఇప్పుడు వద్దు మహాప్రభో నా మందులు నాకు వ్రాసిమ్మన్నాను. 

అయితే wellbutrin XL (150 mg) ఇవ్వడానికి ఒప్పుకున్నాడు కానీ Celexa క్రమంగా తగ్గిద్దామన్నాడు. అలా ఎందుకో నాకు అర్ధం కాలేదు.  దానికి నేను ఒప్పుకోలేదు. అది బాగానే నాకు పనిచేస్తోంది కాబట్టి దాని అవసరం కూడా వుంటుంది కదా అన్నాను. అతగాడు మౌనం వహించాడు. బుద్ధిగా రెండూ వ్రాసిచ్చాడు.  నెలన్నర రెండూ వాడాను. ఆందోళన కొద్దిగానే పెరిగింది కానీ కోరిక మామూలు స్థితికి వచ్చేసింది. క్రుంగుబాటు కంట్రోల్ లోనే వుంది. హమ్మయ్య అనుకున్నా. కొద్దిగా ఎనెర్జీ, మోటివేషన్ కూడా పెరిగాయి. మళ్ళీ ఆ సైకియాట్రిస్టును కలిసాను. సెలెక్సా క్రమంగా తగ్గించి వెల్బట్రిన్ డోస్ పెంచమన్నాడు. రెండు మందులు కాకుండా ఒక మందుతోనే చూద్దాం అన్నాడు. అంతకుముందు సారి అతను వ్యూహాత్మక మౌనం వహించాడని అర్ధమయ్యి ఈసారి నేను నోరుమూసుకున్నాను. ఎంతయినా మనకంటే నిపుణులకే బాగా తెలుస్తుంది కదా (అది అన్నిసార్లు వాస్తవం కాదు).  అంతకు ముందు అలా ఆ మందు అలా వాడేసి ఇలా వదిలేసిన విషయం గుర్తుచేసాను కానీ పట్టించుకోలేదు.

ఇలా సెలెక్సా డోసు క్రమంగా తగ్గిస్తూ అలా వెల్బట్రిన్ XL (300 mg) పెంచేసాను. ఇప్పుడు పూర్తిగా సెలెక్సా మానివేసాను. నా సామి రంగా! లిబిడో జివ్వున ఎగసిపడుతోంది. ఇప్పుడే ఇలా వుంది ఇంకా కొన్ని వారాలు గడిచి సెలెక్సా నా శరీరంలో నుండి పూర్తిగా తొలగిపోయి వెల్బట్రిన్ పూర్తిగా కుదురుకుంటే నా పరిస్థితి ఎలా వుంటుందో నాకయితే అర్ధం కావడం లేదు. గోరుచుట్టుపై రోకలిపోటులాగా అసలే FLR లో వున్నా. అప్పుడప్పుడూ ఎంత అనుకున్నా చీట్ చేయకతప్పడం లేదు కానీ (ఇలా మొగుళ్ళు మోసం చేస్తారనే ఇక్కడి ఎఫెలార్ భార్యలు దానికి వాడే ప్రత్యేక 'బంధనం' కొనుక్కొని వచ్చి వేసి తాళం చెవి దగ్గరపెట్టేసుకుంటారు!) అసలయితే అవుట్ కాకూడదు! ఇహ చూడండి నా అవస్థ :)) అసలే కోతి, ఆ పైన కల్లు తాగింది చందాన నేను వున్నా ఇప్పుడు. వా :((

అన్నట్లు స్త్రీలకు కానీ, పురుషులకు గానీ మిగతా అన్నివిషయాలూ బాగానే వుండి లైంగికవాంఛ మాత్రం తక్కువగా వుంటే ఈ మెడిసిన్ వాడి చూడవచ్చు. ఫ్రిజిడ్ లకు చికిత్సగా ఇది ఇస్తుంటారు. ఇంకో విషయం - మీలో ఎవరికయినా వ్యసనాలు వున్నా అవి మానడానికి ఈ మందు చాలామందికి పనిచేస్తుంది. స్మోకింగ్ మరియు తాగుడు తదితర వ్యసనాలు వున్నవారు ఇది ప్రయత్నించొచ్చు. ఇది వాడితే చాలామందికి అస్సలు తాగాలనిపించదు, పొగ తాగాలనిపించదు! అయితే ఈ వ్యసనాలు పోయి మరొకటి  పుట్టుకురావొచ్చు. పదే పడగ్గది వ్యసనం ;)  ఇహపై మీ ఇష్టం బాబూ - నేను అసలే అమాయకుడిని - నాకేం తెలియదు సుమీ  :))   మీరు మగవాళ్లయితే నిర్భయ చట్టం లాంటివి గుర్తుంచుకోండి, అదే మహిళలయితే మనుస్మృతి లాంటివి గుర్తుంచుకోండేం!

గమనిక: నేను డాక్టరుని కాదు కాబట్టి ఇది వైద్య సలహా కాదు -  పూర్తి వివరాల కోసం,  చికిత్స కోసం మంచి వైద్యుడిని సంప్రదించండి. 

బ్రేకింగ్ బ్యాడ్ బావుందే!


Breaking Bad (2008–2013)

TV Series -  Crime | Drama | Thriller

A chemistry teacher diagnosed with a terminal lung cancer, teams up with his former student, Jesse Pinkman, to cook and sell crystal meth.

ఈమధ్య ఇంట్లో వ్యాయామం చేస్తూ నెట్‌ఫ్లిక్స్ లో బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ చూస్తున్నా. అది చాలా బావుంటుందని కొంతమంది మిత్రులు చెప్పారు. IMDB రేటింగ్ చూస్తే 9.5/10 వుంది! వావ్! మొదటి కొన్ని ఎపిసోడ్లు కాస్త బోరింగుగా వుండవచ్చని తరువాత మాత్రం ఇక ఆగలేమని ఫ్రెండ్స్ చెప్పారు. ఇకటి రెండు ఎపిసోడ్స్ చూడగానే హుక్ అయిపోయాను. ఇప్పటికి 6 ఎపిసోడ్స్ చూసాను. ఇందులో ఎమోషన్స్ ని చాలా సహజంగా చిత్రీకరించారు. కెమిస్ట్రీ అంటే ఇష్టం వున్నవారికి ఇది ఇంకా బాగా నచ్చుతుంది. కెమిస్ట్రీతో ఎన్ని  క్రైమ్స్ చెయ్యవచ్చో ఇందులో చూడొచ్చు! అయితే ఇది మా ఆవిడకి అంత ఆసక్తికరంగా అనిపించలేదు. మొదటి కొన్ని ఎపిసోడ్స్ కాస్త బోరింగుగా వుంటాయన్నా వినడం లేదు. మళ్ళీ Lost చూడటానికే ఆసక్తి చూపిస్తోంది.

కురూపి (I) సినిమా అంత సేపు చూడగలమా?

చిన్నప్పుడు పాఠ్యపుస్తకంలో ఓ రాక్షసుడి బొమ్మ ఓ పేజీ పూర్తిగా వుండేది. ఆ పేజీ చూడాలంటేనే దడుచుకొని అది గబగబా తిప్పేసేవాడిని. ఇప్పుడు 'ఐ' ఫోటోల విషయంలోనూ అంతే. భయం వేసి కాదు కానీ అసహ్యం వేసి చూపులు పక్కకు తప్పిస్తుంటాను. ఫోటోలలోనే కురూపి విక్రం ని చూడలేకపోయినవాడిని ఇక సినిమా హాలుకి వెళ్ళి గంటల కొద్దీ ఏం చూస్తానబ్బా? అది మరీ గొప్ప సినిమా అని అందరూ అంటే పోనీలే అని ఒక కన్ను మూసుకొని మరోకన్నుతో చూసేద్దామనుకున్నా. థియేటర్లో రిమోట్ నా చేతిలో వుండదు కాబట్టి నచ్చనప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోలేనుగా.  ఇహ డివిడి లేదా విఓడి వచ్చేదాకా ఎదురుచూసి గొప్పగా వున్నాయనుకున్న సన్నివేశాలు చూసేసి అసహ్యమయిన లేదా పనికిమాలిన సన్నివేశాలు ఫాస్ట్ ఫార్వార్డ్ చేసుకోవాలి. 

ఇంతకీ ఈ సినిమాకి ఐ అని ఎందుకు పేరెట్టారో నాకయితే అర్ధం కాలేదు. ఎక్కడా కూడా ఆ వివరణ చూడలేదు. మీకు ఏమయినా తెలిస్తే చెప్పండి.

మా దగ్గర ఈ సినిమా ప్రీమియం షో వేస్తున్నారని ఓ స్నేహితుడు కొద్దిరోజుల క్రితం చెప్పాడు. అతన్ని ప్రీమియర్ షోకి వెళ్ళి వచ్చి రివ్యూ చెప్పమని ప్రోత్సహించాం (నిజానికి అతన్ని బుక్ చేద్దాం అనుకున్నాం - టికెట్ ధర ఎక్కువగా వుంటుంది కదా - సినిమా బాగాలేకపోతే మేం బ్రతికిపోతాం)  కానీ పడలేదు. ఛస్తే అందరం కలిసి చద్దామని మొరాయించాడు.

ఈ సినిమా హీరోయిన్ అమీ జాక్సన్ నాకు బాగా నచ్చుతుంది. ఆమె కోసమన్నా థియేటరుకి వెళ్ళి ఈ సినిమా చూడాలనిపిస్తుంది కానీ అంత ధైర్యం లేదు. ఆ అమ్మాయి దేశీ నేమో అనుకున్నా - ఆంగ్లో ఇండియన్ కాచ్చనుకున్నా. పక్కా బ్రిటిష్ మోడల్ అని తెలిసి ఆశ్చర్యం, సంతోషం వేసింది. చాలా దేశీ సినిమాల్లో విదేశీ అమ్మాయిల పేరిట చప్పిడి ముఖాలు చూపిస్తుంటారు - ఈ దేశాల్లో దాదాపుగా పాతిక శాతం అయినా భలే అందంగా వుంటారు. వాళ్లని వదిలేసి మన నిర్మాతలకు, డైరెక్టర్లకు ఆ చప్పిడి మొఖాలు ఎందుకు తెచ్చుకుంటారో అని తల గోక్కునేవాడిని. హమ్మయ్య, అమీ నయినా చక్కని దానిని ఎన్నిక చేసుకున్నందుకు సంతోషంగా వుంది.

ఇకపోతే ఎంచక్కా రోజూ ఇంట్లో  ఓ గంట వ్యాయామం చేస్తూ  ఆ సమయం వృధా(!?) చెయ్యకుండా 'ఆరెంజ్ ఈజ్ ద న్యూ బ్లాక్'  సిరీస్ చూసేస్తున్నా. ఇంకా సీజన్ 1 లోనే వున్నా.  ఒకవైపు సిరీస్ చూస్తూ మరో వైపు ఎక్సర్సైజ్  చెయ్యడం కాస్త కష్టం గానే వుంది కానీ నడిపిస్తున్నా. ఆ ఇబ్బంది సిరీస్ చూట్టానికి కాదు వ్యాయామం చెయ్యడానికి అని మీకు అర్ధమయ్యే వుంటుంది. మంచి దృశ్యాలు వచ్చినప్పుడు వాటికి కళ్ళప్పగించి చెయ్యాల్సిన పని మరచిపోతున్నాను మరి.

Orange Is The New Black!

 
Orange Is the New Black

(2013– )

TV Series  - Comedy | Crime | Drama

IMDB Rating 8.5/10


ఓ దశాబ్దం క్రితం చేసిన ఒక నేరానికి గాను ముప్పయిలలో వున్న పైపర్ చాప్మన్ అనే ఆమెకు 15 నెలల జైలు శిక్ష పడుతుంది. జైల్లో ఆమె, ఇతర నేరస్తులూ, జైలు అధికార్ల మధ్య జరిగే సన్నివేశాలు, అనుభవాలతో ఈ టివి సిరీస్ ఆసక్తి కరంగా వుంటుంది. ఇందులో చాలా అసభ్యమయిన భాష, శృంగార సన్నివేశాలు, లెస్బియన్ సన్నివేశాలూ బాగా వుంటాయి. ఈ సిరీస్ యొక్క పైలట్ రెండు నిమిషాలలోనే ఈ చిత్రం ఎలా వుంటుందో మీకు అవగతం అవుతుంది. ఆ మాత్రం చూసి మీకు నచ్చకపోతే మానివెయ్యొచ్చు. యుఎస్ లో మహిళల జైలు జీవితం ఎలా వుంటుందో ఈ సిరీస్ వల్ల చాలా బాగా అర్ధం అవుతుంది.

మా ఆవిడ వున్నప్పుడు నన్ను ఈ సీరియల్ పెట్టనివ్వదు. అందుకే ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెట్టేసుకుంటాను.  ఇది బావుందని మా ఫ్రెండుకి చెబితే పైలట్ రెండు నిమిషాలు చూసి ఝడుసుకొని 'ఫామిలీస్ తో కలిసి చూసేది కాదు మహాప్రభో' అని మొరపెట్టేసుకున్నాడు. ఇంట్లో అతగాడి పెళ్ళాం తిట్టేసిందేమో నాకు తెలియదు. ఈ శనివారం ఇంకో స్నేహితుడి ఇంట్లో ఆ ఫ్రెండుతో కలిసి ఈ సిరీస్ చూడాలని కుట్ర పన్నుతున్నాం. ష్! మా ఆవిడకి చెప్పకండేం. మరి మా స్నేహితుడు ఈ చలిలో తన ఇంట్లో వాళ్ళను ఎలా బయటకి పంపిస్తాడో తెలియదు! 

ఓసోస్, ఇంట్లో కలిసి నీలి చిత్రాలు చూడంగా లేనిది ఇది చూడలేమా అని మీలో కొందరు అనుకోవచ్చు. ఇందులో కొన్ని సన్నివేశాలు క్రూడ్ గా వుంటాయి. ఉదాహరణకు ఒక జైలు అధికారి జైలు జీవులకు ఇచ్చే పెద్ద గిన్నెలో వున్న సూపు లో శుబ్బరంగా  మూత్ర విసర్జన చేస్తాడు!? భాష సహజత్వానికి దగ్గరగానే వుంటుంది కానీ మనకు మహా గలీజుగా అనిపించవచ్చు. ఇవి పోగా ఈ సీరియల్ చాలా బావుంటుంది. చిత్రీకరణ, నటన, పాత్రలు, పాత్రధారులూ, వారి జీవితాలూ, సన్నివేశాలూ చాలా బావుంటాయి. నేను ఇదివరలో అక్కడక్కడా కొంత చూసాను కానీ శ్రద్ధగా నిన్నటి నుండే మొదటినుండీ మొదలెట్టాను. నిన్న సాయంత్రం మా కుటుంబం  బయటకి వెళ్ళింది. అదే సందు అనుకొని మొదలెట్టా. తిరిగివచ్చినప్పుడు మూసేసా.


మార్కో పోలో మొత్తం చూసేసా

Marco Polo టివి సిరీస్ సీజన్ 1, 10 ఏపిసోడ్స్ నిన్ననే పూర్తిచేసా. సీజన్ 2 ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నా. 12 వ శతాబ్దపు ప్రపంచ యాత్రికుడి చారిత్రిక కథ ఏం ఆసక్తికరంగా వుంటుందిలే అని తటపటాయించా. పైలట్ ఎపిసోడ్ చూడగానే ఈ సిరీస్ కి అతుక్కుపోయా. బావుంది బావుంది. మొత్తం చూసేకా 5/5 రేటింగ్ ఇచ్చా. మిగతా విషయాలు బావుండటంతో పాటుగా అడల్ట్ కాంటెంట్ కూడా చక్కగా వుంది. అలా అని ఇది ఏదో శృంగార చిత్రం అనుకోకండి - అక్కడక్కడా ఆ దృశ్యాలు వుంటాయంతే. అసలు విషయం ఆ యాత్రికుడి సహసాలు, యుద్ధాలు, తంత్రాలు, రాజరికాలు వగైరా వగైరా.


IMDB Rating 8.3/10



ఈ రోజు నుండీ Breaking Bad tv సిరీస్ చూడాలనుకుంటున్నా. అది బావుందని ఓ మిత్రుడు చెప్పేడు. దాని IMDB rating 9.5/10. Wow! సాధారణంగా నేను ఈ సిరీస్ లు వ్యాయామం చేస్తూ చూస్తాను కానీ నేను చేసేది వ్యాయామం కానే కాదని కేవలం స్ట్రెచింగ్ అని మా అమ్మాయి ఎగతాళి చేస్తుంటుంది. తాను స్కూల్లో నేర్చుకున్న వ్యాయామాలు నాతో చేయించాలని చూస్తుంటుంది.