జ్ఞాపకాలు: మాకు నయాగరా ఫాల్స్ పైనుండి చూపించిన పైలట్

మేము నయాగరా ఫాల్స్ సిటీ (దగ్గర) లో నాలుగేళ్ళు వున్నాం కాబట్టి రోజూ చెంబట్టుకు వెళ్ళినట్లుగా వుండేది లెండి. ఓ ఎనిమిది నెలలు అయితే  నయాగరా నదికి పక్కనే ఇల్లు కిరాయికి తీసుకొని వున్నాం. అప్పుడు ఆ నది ఒడ్డున చెట్ల క్రింద విశ్రమిస్తూ మా యాహూ గ్రూప్స్ కోసం అని కొన్ని నవల్లు వ్రాసేవాడిని. నాకు కొంతమంది వీరాభిమానులు వుండేవారు. వారు నన్ను యాహూ మెసెంజర్ ద్వారా సంప్రదిస్తుండేవారు. మరీ కొందరయితే నేను వ్రాసే నవలల్లో తమ పేరుతో పాత్ర పెట్టమని కోరేవారు. కొందరు నన్ను చూడాలనేవారు. వెబ్ కేం లో నది పక్కనే నిలబడి నన్ను చూపించేవాడిని.

ఒకసారి వాషింగ్టన్ నుండి బఫలో కి విమానంలో వస్తున్నాను. "మీకు పైనుండి నయాగరా ఫాల్స్ చూపించాలని ATC ని సంప్రదించి నయాగరా ఫాల్స్ పై నుండి వెళుతున్నాను. అద్దాల నుండి ఫాల్స్ వీక్షించండి" అని పైలట్ మాకు అందరికీ ప్రకటించాడు. వీలయినంత కిందికి విమానం నడుపుతూ చూపించాడు. సంతోషంగా అందరమూ ఎగబడి అద్దాలనుండి ఫాల్స్ చూసాం. అద్భుతం! ఆ తరువాత విమానం దిగుతూ అందరం ఆ పైలట్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసాం.

2 comments:

  1. @ చాతకం
    అది నేను తీసిన పిక్ కాదులెండి - గూగుల్లోనుండి ఎత్తుకొచ్చింది. నాకు ఫోటోలు తీయడం మీద అంత ఆసక్తి వుండదు. మా ఆవిడ గనుక నా పక్కన అప్పుడు వుండి వుంటే నన్నో పక్కకి లాగి తరువాత ఫోటోల్లో చూద్దువుగానీలే అని ఆ ఫోటోలు తీసేదే.

    ReplyDelete