పొలం పనులు ప్రారంభిస్తున్నామోచ్

మా ఇంట్లో గార్డెన్ స్పేస్ లేకపోవడం వల్ల మా పొరుగూరు మున్సిపాలిటీ వారు కిరాయికి ఇస్తున్న భూమిని మేమూ, ఇంకో కుటుంబమూ కలిసి కిరాయికి తీసుకున్నాం. దానికి ముద్దుగా 'పొలం' అని పేరెట్టేసా. 25 ఇంటూ 30 అడుగులు వున్న ఆ స్పేసుకు ఈ సీజనుకు గాను కిరాయి $80. మా షేర్ $40. ఇవాళ సాయంత్రం అందరమూ వెళ్ళి ఆ క్షేత్రంలో వ్యవసాయం మొదలెడతాము. కూరగాయల మొక్కలూ, ఆకుకూరలూ పండించాలనేది మా అభిమతం.  అవి మొలకలు ఎత్తేదెప్పుడో, పెరిగేదెప్పుడో, కాయగూరలూ, ఆకుకూరలూ మాకు అందివచ్చేదెప్పుడో కానీ అందాకా అది మాకు చక్కని ఆరోగ్యకరమయిన  కాలక్షేపం అవుతుంది. మాకూ, మా పిల్లలకూ అహ్లాదకరమయిన వాతావరణంలో ప్రకృతి సిద్ధమయిన వ్యాయామాన్ని అందిస్తుంది. 

నాగరికత పెరుగుతూవున్నా కొద్దీ ప్రకృతికి దూరం అవుతున్నాం. అందుకే వీలయినంతవరకూ మట్టికీ, నీటికీ, చెట్టుకూ, పుట్టకూ, గాలికీ, వానకూ కొద్దిగానయినా దగ్గరగా మెలగాలని ప్రయత్నిస్తూనేవుంటాను.  పిల్లలూ అవి ఆస్వాదించేలా ప్రోత్సహిస్తూనేవుంటాను. మేము సూర్యాపేటలో వున్నప్పుడు మా నాన్న గారు గార్డెనింగ్ చేస్తూ సహాయం కోసం నన్ను పిలిచేవాడు. ఓ పది రూపాయలు పెట్టి కూరగాయల మార్కెట్లో కొనుక్కునే బదులు ఇంత కష్టపడాలా అని విసుక్కుంటుండేవాడిని. ఆ తరువాత హైదరాబాదుకి వచ్చేక తోటపని మీద ఆసక్తి కల్గింది, దానియొక్క ప్రాముఖ్యత తెలిసింది కానీ ఆ కిరాయి ఇళ్ళల్లో అంత దృశ్యం వుండేది కాదు. కొన్నేళ్ళ తరువాత  కెనడాలో స్వంత ఇల్లు కొనుక్కొని ఒక ఏడాది మాత్రం గార్డెనింగ్ చెయ్యగలిగాము. ఆ తరువాత అక్కడినుండి వచ్చాము కాబట్టి మళ్ళీ కుదరలేదు. మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత ఇప్పుడే.

అంచేతా మాకు దండిగా ఆకుకూరలూ, కాయగూరలూ పండాలని మీరూ కోరుకోండి మరి. మరీ విరగకాస్తే మీకూ పంపిస్తాం లెండీ. ఇక్కడ ఏ చెట్లు అయితే బాగా పెరుగుతాయో చెప్పండేం. మా పొలం పనుల ఫోటోలూ అప్పుడప్పుడు వేస్తుంటాగా.  

14 comments:

  1. Since your time is less, choose short term vegetable plants that we eat regularly, like methi leaves, cilantro, spinach, mint, tomatoes, egg plant, cucumber and green pepper etc.

    ReplyDelete
  2. Replies
    1. మీ పొలం పనులు చాలా బాగుందండి. నాకూ మా home గుర్తుకు వచ్హింది. నీను నా school days, collage days లో చాలా బాగా ఇష్టంగా చేసేదాన్ని. 14 colors rose flowers ఉండేవి. Onion flowers అంటే చాలా ఇష్టంగా పెంచడం నాకు అలవాటు. dahlia flower అంటే చాలా ఇష్టం. నాకు చిన్నతనంలో కొత్తిమీర smell నచ్చేది కాదు. So వాటిని నాశనం చేసేదాన్ని. మా అమ్మ తో full గా తన్నులు తినెదాన్ని.

      మా అక్క పెళ్లి పందిరి కోసం మా ఇంట్లో మొక్కలు అన్ని తీసెసారు. After marriage మా బావ గారి దగ్గర daily money తీసుకునెదాన్ని flowers కొసం అని .....haha very funny

      Delete
  3. శరత్ గారు. చాలా మంచి పని. కాలక్షేపం, వ్యాయామం,ఆహారం,ఆరోగ్యం,మానసిక ఉల్లాసం,
    బావుందండి. మీ పొలం లో పంటలన్నీ బాగా పండాలని మనసారా కోరుకుంటూ .. పృకృతి సిద్ధి ప్రాప్తిరస్తు... (అని దీవించవచ్చా !లేదో ?)
    శాక దానం మంచిది అని చెపుతారు. మీరేమో మాట ఇచ్చేస్తున్నారు..అందరికి పంచుతానని. "షిప్పింగ్ " తడసి మోపెడవుతుంది. జాగ్రత్త అంది .:)))))

    ReplyDelete
  4. హమ్మయ్య

    మంచి వ్యాపకం మొదలెట్టేరు. ఈ మధ్య తెగ రోగాల గురించి రాస్తూంటే ఈ అబ్బాయి గారికి ఇట్లాంటి పని బడితే 'సర్వ రోగ నివారణం' అగునని అనిపించింది. ఈ మీ కొత్త ప్రయత్నం తో సర్వ 'బ్లాగ్' రోగాలు నివారణ మగు గాక !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  5. Ma Maryland lo 3yrs varaku kali ledata community gardening lo.....they enrolled me in after 3 yr list LOL......

    ReplyDelete
  6. @ అజ్ఞాత
    నిన్న ఒక మడి దున్ని, విత్తనాలు వేసి వచ్చాం. దోస, వాటర్ మిలన్, టమోటో, పూల విత్తనాలు ఇంకా ఇంకెవో మా వాళ్ళు వేసారు. శ్రమదానం చేస్తూ ఆ పేర్ల మీద శ్రద్ధ పెట్టనందువల్ల గుర్తుకులేవు. మీరు ఇచ్చిన సమాచారం మా వాళ్ళకి ఇవాళే పాస్ చేసాను. థేంక్స్.

    @ వర
    $80 ఈ సీజనుకి అండీ, అంటే సెప్టెంబర్ వరకూనూ.

    ReplyDelete
  7. @ పావనీ
    ఓ మీకూ గార్డెనింగ్ అంటే ఇష్టమే - గుడ్. ఉల్లి పూలు ఎలా వుంటయ్యబ్బా - గుర్తుకులేదు - కానీ ఉల్లి చెట్లు పెంచడం, తుంచడం, వాటిని పప్పులోనో వేసి వండితే తినడం నాకు ఇష్టం. ఈసారి కొన్ని ఉల్లి మొక్కలు అయినా పెట్టాలి. దహిలా పూలు అంటే? తెలుగులో ఏమంటారు? కొంపదీసి అది తెలుగు పేరేనా?! ఓ మీకూ కొత్తిమీర నచ్చదా - నాకూనూ. అయినా సరే వద్దో అంటున్నా కూడా కూరల్లో మా ఆవిడ వేసేస్తుంటుంది, నేను తీసేస్తుంటాను - ప్లేటు లోంచి.

    ReplyDelete
    Replies
    1. http://canvassingmyfriends.files.wordpress.com/2012/03/spring-onion-flower.jpg
      this is onion flower.
      http://image44.webshots.com/44/9/40/94/2237940940086836239ZYAtCC_ph.jpg
      this is daliya flower. its looks like చామంతి flower only. but size is like sunflower.

      Delete
  8. @ వనజ వనమాలి
    మంచి విషయం అభిలషించడానికి సంకోచాలు అవసరం లేదండీ. ధన్యవాదాలు. పంటలు పండాయా లేదా అన్నది మా వాళ్ళకి బాగా ముఖ్యమేమో కానీ నాకు మాత్రం తోట పని చేసామా, ప్రకృతిలో మేమూ, పిల్లలమూ గడిపామా అన్నది ముఖ్యం. దానికి అదనంగా పంటలు బాగా పండితే బోనస్సు లాంటిదే. నిన్న 'శ్రమదానం' చేస్తుంటే సన్నని వర్షం పడుతుంటే మా అమ్మలు వర్షంలో తడుస్తూ గంతులేసింది. ముందు వర్షంలో తడవొచ్చా అని అడిగింది. ఎంచక్కా ప్రకృతిలో పరవశించడానిక్కూడా ప్రశ్నలా అని ప్రోత్సహించాను. మేమందరమూ వర్షంలో తడుస్తూ పనులు చేసాము. తడిచిన మట్టి వాసనా, కురుస్తున్న వర్షమూ ఇంకా ఇంకా నేచర్ని అలా అలా అనుభవించేసామనుకోండీ. చీకట్లు పడ్డాక ఇక చాల్లే అని ఇంటికి తిరిగివచ్చాం.

    శాకదానం VPP లో చేస్తామండీ :)) ఆ సిస్టం చిన్నప్పుడు వింటుండేవాడిని. ఇప్పుడు ఇండియాలో ఏమంటారో తెలియదు. అంటే సరుకు అందాకా రవాణా ఖర్చులు మీరే చెల్లించి తీసుకోవాలన్నమాటా!

    ReplyDelete
  9. how can we find our nearest field?
    please provide some information if you have ( web site etc..)

    ReplyDelete
  10. @ జిలేబీ
    అవునండీ మరీ ఏం చేస్తాం. అందరు బ్లాగర్లేమో మానవాతీత వ్యక్తులాయే - నాకు తప్ప అందరికీ రోగాలూ రొష్టులూ ఎందుకొస్తాయీ :)) బ్లాగుల్లో మనిషిని నేనొక్కడినే అని అనిపిస్తూవుంటుంది. మనిషికి వుండే సగటు భావోద్వేగాలని నేను తప్ప ఎవరు వ్రాయడం లేదు అనిపిస్తుంది.

    అవునండీ, నాకూ మా కుటుంబానికీ చక్కని వ్యాపకం ఎన్నుకున్నాం - పెద్దమ్మాయికి తప్ప. తనని పిలిస్తే నేచర్ కావాలంటే వీడియోల్లో చూసుకోవచ్చు కదా అంటోంది! వదిలేసి వెళ్ళాం. మళ్ళీ నచ్చచెప్పి, వివరించి చూస్తాను.

    మా గార్డెన్ స్పేసులో (క్యాంపింగ్) టెంట్ వెయ్యాలని మహా దురదగా వుంది కానీ ని'బంధనాలు' ఒప్పుకోవే. ప్చ్.

    @ ప్రశాంత్
    ధన్యవాదాలు.

    ReplyDelete
  11. @ అజ్ఞాత @ 16 మే 2012 9:50 ఉ
    మా ఊర్లో కూడా రెండేళ్ళ నుండీ గార్డెన్ స్పేసులు అద్దెకు ఇవ్వడం లేదట, ఎందుకో తెలియదు. అందుకే పక్కూర్లో పొలం తీసుకున్నాం. 15 నిమిషాల డ్రయివ్ కానీ ఉపయోగకరమే. మీ దగ్గరి టౌన్లలో ప్రయత్నించి చూసారా?

    @ అజ్ఞాత @16 మే 2012 10:36 ఉ
    మీ విలేజ్/టవున్ ఆఫీసుకి ఫోన్ చేసి గార్డెన్ స్పేసులు కిరాయికి ఇస్తారేమో కనుక్కోండి. Garden spaces for rent అని నెట్టులో వెతికి చూడండి.

    ReplyDelete
  12. అజ్ఞాత16 మే 2012 10:36 ఉ:
    Serach using "Comminity gardening plots in" ur Zip code"

    ReplyDelete