నాకు ఇద్దరూ ఇష్టమయినప్పటికీ క్రిష్ణుడంటే ఎక్కువ ఇష్టం. ఎందుకో మీకు చెప్పక్కరలేదు. కెనడాకి వెళుతూ డెట్రాయిటులో మిత్రుడి దగ్గర ఆగినప్పుడు ఆ ఆదివారం మా తెలుగు బడి చూపిస్తానంటూ ఆహ్వానించేడు. మా చిన్నమ్మాయీ, నేనూ వెళ్ళాం. తీరా చూస్తే అది ఇస్కాన్ వారి చిన్న ప్రార్ధనా మందిరం. పెద్ద గుడి డవున్ టవునులో వుంటుందిట. ఒక పాత ఇల్లు కొని ప్రార్ధనా మందిరంగా మార్చేసారు. అందులో పూజలూ, ప్రార్ధనలూ, సాంస్కృతిక కార్యక్రమాలూ, తెలుగు పాఠాలూ జరుగుతుంటాయిట. నా స్నేహితుడు ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడంతో బాటుగా అందులో బోధిస్తుంటాడు.
హరే క్రిష్ణ, హరే రామ భావజాలం గురించి మా మిత్రుడు నాకు వివరించాడు. నేనూ కొన్ని సందేహాలు తీర్చుకున్నాను. నాకు దేవుడి మీద విశ్వాసం లేకపోయినా కూడా తెలుగు వారు అప్పుడప్పుడు అలా కలుసుకోవడం, పరస్పర గౌరవంతో, అంకిత భావంతో సామూహికంగా అలా గడపడం నాకు నచ్చింది. మా అమ్మాయి కూడా తోటి పిల్లలతో తెగ ఆడుకుంది. నాస్తికులు, హేతువాదులూ ఎవరయినా అలా సమిష్ఠిగా గడపగలిగే అవకాశం వుంటే ఇంకా నచ్చేదేమో. నా చిన్నప్పుడు మా నాన్నగారు నాస్తిక సభలకు, శిక్షణా తరగతులకూ తీసుకువెళ్ళేవారు. అలా చక్కగా గడిపేసేవాడిని. గోరా, లవణం, సమరం లాంటి వారి సాంగత్యంలో ఎన్నో విషయాలు ఆకళింపు చేసుకునేవాడిని. ఈ దేశాలకు వచ్చాక నాస్తికులు దొరక్కా, ఆస్తికులతో తిరక్కా మా కుటుంబమూ, నేనూ రెంటికి చెడ్డ రేవడి అయ్యాం.
ఇక్కడ తెలుగు లేదా దేశీ నాస్తిక కూటములు జరిగే అవకాశం ఇప్పట్లో కానరావడం లేదు కాబట్టి పైగా స్పిరుచువాలిటీ మీద కాస్తంత ఆసక్తి కలుగుతోంది కాబట్టి సత్సంగాల కోసం మనస్సు బార్లా తెరిచి ఎదురుచూస్తూవున్నాను. సహజ మార్గం లాంటివి కొన్ని పరిశీలించాను కానీ వాటి మీద ఆసక్తి కలగలేదు. ఒషో మార్గం మీద బాగా ఆసక్తి కలిగింది కానీ ఎప్పుడో ఒకప్పుడు తప్ప ఆ సమావేశాలు జరగడం లేదు. దాంతో ఆధ్యాత్మిక ఆర్తి తీరడం లేదు. చిన్మయ మిషన్ వారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు కానీ అదంటే అంత ఆసక్తి లేదు, అయినా సరే ప్రయత్నించాను కానీ మా ప్రాతంలో ఎవరయినా సత్సంగాలు నిర్వహిస్తున్నారేమో తెలియడం లేదు. చికాగోలోని చిన్మయ కేంద్రం మాకు గంట దూరంలో వుంటుంది. ఓసారి వెళ్ళి మా వైపు వాళ్ళు ఎక్కడ సమావేశం అవుతున్నారో కనుక్కోవాలి.
మా స్నేహితుని దగ్గరి నుండి కొన్ని చికాగో ఇస్కాన్ కాంటక్ట్స్ తెచ్చాను. వారిని కనుక్కొని మా వైపు హరే క్రిష్ణ సంత్సంగాలు కనుక జరుగుతున్నట్లయితే వెళతాం. అయా సమావేశాలల్లో నాకు కావాల్సినంత మేరకే సంగ్రహించి మిగతా విషయాల్లో మౌనంగా వుంటాను. ఈ భావజాలాన్ని పరిశీలించినప్పుడు వారు రాముడిని తొక్కివేసి క్రిష్ణుడినే బాగా పైకి తెస్తున్నారని అనిపించి ఆశ్చర్యపడ్డాను. మా మిత్రుడిని వివరణ అడిగాను కానీ అతను చెప్పింది అర్ధం కాలేదు. ఇదివరలో హరే రామ, హరే క్రిష్ణ అనేవారుట కానీ కొన్ని వందల ఏళ్ళ క్రితమే ఈ ఉద్యమ నామాన్ని హరే క్రిష్ణ, హరే రామగా మార్చేసారుట. రాముడికి ఎంత అవమానం అని అనిపించింది. ఆ రాముడి మనస్సు గాయపడిందో లేదో కానీ నా మనస్సుకయితే చివుక్కుమంది. పోనీలెండి, దేవుళ్ళందరూ ఒక్కటేనని ఆస్తికులు అంటుంటారు కదా.
అక్కడ ఒక మాతాజీతో మాట్లాడుతూ ఓ పదేళ్ళ క్రితం కెనడాలోని టొరొంటోలో వున్నప్పుడు అక్కడి ఇస్కాన్ టెంపుల్ దర్శించేవాడినని చెప్పాను. అప్పుడు మా ఆవిడకి తోడుగా వెళ్ళేవాడిని లెండి. ఒక్కసారి క్రిష్ణ మందిరానికి వెళితే చాలు - ఆ కొంటె క్రిష్ణుడు ఎప్పటికయినా తనవయిపు లాక్కుంటాడని ఆమె చెప్పింది. నిజమా!? అందుకేనా ఇటువైపు నాకు మనస్సు మళ్ళింది? నాలో నేను నవ్వుకున్నాను. ఏమో. పోనిద్దురూ.
అక్కడ ఒక మాతాజీతో మాట్లాడుతూ ఓ పదేళ్ళ క్రితం కెనడాలోని టొరొంటోలో వున్నప్పుడు అక్కడి ఇస్కాన్ టెంపుల్ దర్శించేవాడినని చెప్పాను. అప్పుడు మా ఆవిడకి తోడుగా వెళ్ళేవాడిని లెండి. ఒక్కసారి క్రిష్ణ మందిరానికి వెళితే చాలు - ఆ కొంటె క్రిష్ణుడు ఎప్పటికయినా తనవయిపు లాక్కుంటాడని ఆమె చెప్పింది. నిజమా!? అందుకేనా ఇటువైపు నాకు మనస్సు మళ్ళింది? నాలో నేను నవ్వుకున్నాను. ఏమో. పోనిద్దురూ.
క్రిష్ణుడి చిలిపితనం, కొంటెతనం, గోపికలతో సరసల్లాపాలు అంటే నాకు భలే ఇష్టం కానీ ఈ ఇస్కాన్ వారు క్రిష్ణుడి ప్రణయాన్ని కూడా కోడికి ఈకలు పీకినట్లు పీకి అవి కూడా ఆధ్యాత్మిక చేష్టలే అని వీలయినంతగా మార్చేసే వుంటారు. ఇంకా స్పష్టంగా తెలియదు. తెలుసుకోవాలి. పోనీలెండి. నాకు అవసరమయిన ఆధ్యాత్మికత నాకు దక్కితే చాలు. మా ఇస్కాన్ మిత్రుడూ అదే అన్నాడు. అంగడిలో అన్నీ వుంటాయి. అందులో మనకు కావాల్సినవి మనం ఏరుకొని తెచ్చుకోవాలి. భావజాలాల్లో అయినా అంతే. అన్నీ సమిష్టిగా ఒకే దగ్గర దొరకాలంటే కష్టమే మరి.
అన్నట్లు పిట్స్‌బర్గ్ కి గంటన్నర దూరంలోని ఇస్కాన్ వారి న్యూ బృందావనం చాలా బాగుంటుందిట కదా. చాలా మంది చెప్పారు. ఫోటోలూ చూసాను. నాకూ వెళ్ళి చూసి రావాలని వుంది కానీ మాదగ్గరి నుండి 9 గంటల ప్రయాణం. మీలో ఎవరయినా ఆ క్రిష్ణ మందిరానికి వెళ్ళివచ్చేరా?
http://newvrindaban.com/
అన్నట్లు పిట్స్‌బర్గ్ కి గంటన్నర దూరంలోని ఇస్కాన్ వారి న్యూ బృందావనం చాలా బాగుంటుందిట కదా. చాలా మంది చెప్పారు. ఫోటోలూ చూసాను. నాకూ వెళ్ళి చూసి రావాలని వుంది కానీ మాదగ్గరి నుండి 9 గంటల ప్రయాణం. మీలో ఎవరయినా ఆ క్రిష్ణ మందిరానికి వెళ్ళివచ్చేరా?
http://newvrindaban.com/
మా మిత్రుడు ఆ భావజాలంలో పడిపోయి అందుకు తగ్గట్టుగా పూర్తిగా మాంసాహారం మానివేసాడు. అలా బాగా శుష్కించిపోయాడు. మిగతా విధాలుగా అయినా ప్రొటీన్ తీసుకొమ్మని సూచించి వచ్చాను.
Pittsburgh lo Iskcon Temple okkasaari choodaalsinde! And MD lo undi oka temple. We love it there. Sundays evening velithe baaguntundi akkada. Lots of crowd too!
ReplyDeleteMD lo ekkada vundo konchem cheptaara please. I know there is one in D.C.But not able to see the MD ISCKON sofar.
Deleteఈ లింక్ ఏమయినా మీకు ఉపయోగపడుతుందేమో చూడండి:
Deletehttp://iskconofdc.org/
ISKCON of DC:
10310 Oaklyn Dr,
Potomac, MD 20854
హరే కృష్ణ హరే రామ మంత్రంలో రామ అంటే త్రేతాయుగ రాముడు కాదండి బలరాముడు.
ReplyDeletenijanga na????. ippati varaku 'Hare Rama' lo Rama ante Tretayuga Sreeramudu ani anukuntunnanu.
DeleteDhanyavadalu, pedda(chinna) sandehan teerchinanduku.
:venkat
@ జలతారు వెన్నెల
ReplyDeleteమేము దాదాపుగా ఏడాదికి ఒకసారి అయినా చికాగో నుండి న్యూజెర్సీ, న్యూయార్క్ డ్రయివ్ చేసుకుంటూ వెళతాము. ఈ సారి వెళ్ళినపుడన్నా ఆ బృందావనం మీది నుండి వెళతాం.
@ విజయమోహన్
భలే ట్విస్ట్ ఇచ్చారు కదా. మా మిత్రుడు కూడా బలరాముడంటూ ఏదో చెప్పాడు కానీ నాకు ఎక్కలేదు అప్పుడు.
Sarat garu
ReplyDeleteWe visited the NewVrindavan temple twice before. We did drove from Detroit once and from MD too. You should visit that temple. You can stay there in one of those cottages of the Ashram. It will be an awesome experience. They provide freshly cooked vegetarian food too. Iam sure you will enjoy the stay. Try once.
ISKCON is the worst hindu organization, takes hinduism to its lowest levels.
ReplyDeleteFor any doubts, please read MBS articles on ISKCON if you guys think his articles makes any sense.
http://telugu.greatandhra.com/mbs/jan2012/19c_01_12_mbs.php
@ అజ్ఞాత @ Apr 2, 2012 10:07 AM
ReplyDeleteతప్పకుండా వెళతామండీ. ఫోటోలు, వివరాలు చూస్తే నాకు నాచ్చేలాగానే వుంది. మా మేనల్లుడు వాళ్ళు కూడా వెళ్ళి వచ్చి బావుందని చెప్పారు. ఆ గుడి గురించి ఇంకో విషయం నేను గ్రహించింది ఏంటంటే ఓ అయిదు వందల డాలర్లకు లోపు ఫీజుకి ఓ నెలన్నర శిక్షణ అక్కడ ఇస్తారని. వసతి, భోజనం ఆ ఫీజులోనే. ఎప్పుడయినా, ఎవరికయినా తీరికా, ఆసక్తి వుంటే అది చక్కని అవకాశం. నాకు ఎప్పుడయినా అది సాధ్యమవుతోందేమో చూడాలి.
@అజ్ఞాత @ Apr 2, 2012 10:12 AM
ReplyDeleteఇస్కాన్ పై MBS వ్యాసాలు నేనూ చదివాను. ఆ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ సంగతులు నామదిలో మెదలు తూనేవున్నాయి. క్రైస్తవ మత ప్రచారకుల్లా ఇంటింటికీ తిరిగి క్రిష్ణ ప్రచారం చేసి ఇస్కాన్ వాళ్ళు హిందూ మతాన్ని పలుచన చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. అవన్నీ అసలు సిసలు హిందూవాదులు పట్టించుకోవాల్సిన విషయాలు. నేను లౌకిక వాదిని కనుక అవన్నీ నాకు అభ్యంతరాలు కావు. నాకు కొంటె క్రిష్ణుడు అంటే ఇష్టం. అక్కడికి వెళితే కొంత సహవాసం, కొంత కాలక్షేపం, కొంత ఆధ్యాత్మికత నాకూ, మా కుటుంబానికి దొరుకుతాయి. అందుకే వెళ్ళాలనుకోవడం. అలా అని అది ఒక్కటే వెళతానని కాదు ఓషో వాటికీ వెళుతుంటాను. చిన్మయ కూడా చూస్తాను.
Welcome back.
ReplyDeleteగుడి లో కూడా అదే యావ అనకపోతే ఒక విషయం గుర్తుకొస్తోంది. నాకు ఇస్కాన్ వాళ్ల గురించి పెద్దగా అవగాహన లేదు కానీ హైదరాబాద్ లో వుండగా కొన్నిసార్లు ఆబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ కి వెల్లటం జరిగింది, భక్తి కోసం కాదు లెండి. అది అప్పుడు గేలకి ఒక అడ్డా అని పేరొందింది. అప్పటి నుండి నాకు ఇస్కాన్ అనగానే అందమయిన అబ్బాయిలే గుర్తొస్తారు.
ఈ కామెంట్ ఈ టపాకి ఏమాత్రం సంబంధం లేనిది. మీకు నచ్చకపోతే పోస్ట్ చెయ్యకపోయినా నష్టం లేదు.
Hello Sarat,Any good telugu blogs other than yours..on any subject.
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteగుడికి భక్తి కోసం వెళ్ళేవారితో పాటు రక్తి కోసం వెళ్ళేవారూ వుండటం సహజమే. సూర్యాపేటలో మేము వుంటున్నప్పుడు మా మిత్రులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేవారం. అందంగా అలంకరించుకొనివచ్చిన అమ్మాయిలను చూసి ఆనందించడానికి వెళ్ళేవాళ్ళం.
@ ప్రశాంత్
మీ వ్యాఖ్య నాకు సరిగ్గా అర్ధం కాలేదు.
MD lo vunde temple is big.
ReplyDeletehttp://ssvt.org/
అన్నాయ్, రక్తి మానేసి భక్తి మొదలెడతన్నావా, ఏంది?
ReplyDelete@ బుల్లబ్బాయ్
ReplyDeleteదేవుడి మీద విశ్వాసం లేదు కాబట్టి భక్తి అనలేనేమో. అలాంటి ఆధ్యాత్మికతను ఏమంటారో మరి. ఏమయినప్పటికీ అన్నీ బ్యాలన్స్ చేసుకోవాలి కదా.