నా కొవ్వు ఇంత. మరి మీదెంత?

వంటిలో కొవ్వు కొలిచే సాధనం తెప్పిస్తున్నా అని చెప్పాకదా. మొన్నే వచ్చిందది. నిన్న చూసుకున్నా. 22% వుంది నాకు. ఆరోగ్యకరమయిన శాతంలోనే వున్నా. నా వయస్సుకు, జెండరుకూ 12 నుండి 22% వుంటే బావుంటుంది. గత ఏడాది కాలం నుండీ కూడా 21 - 22 మధ్య నా కొవ్వు దోబూచులాడుతోంది. ఈమధ్య బరువైన వ్యాయామాలు చేస్తున్నా కాబట్టి ఇహ ఆ కొవ్వును తగ్గించే విషయమై నేను దృష్టి పెడుతున్నాను. ముందు 20 శాతానికి లోపుగా తగ్గించాల్సి వుంది.

వంట్లో కొవ్వు ఎక్కువయితే పలు వ్యాదులు వస్తాయిట. మధుమేహం, గుండె జబ్బులు వగైరా, వగైరా. అందుకే వంట్లోని కొవ్వు శాతం అదుపులో ఉంచుకుంటే కండ ఆటోమేటిగ్గా పెరుగుతుంది. మరో విధంగా చెప్పాలంటే  శరీరంలో మజిల్ శాతం పెంచితే కొవ్వు తగ్గుతుంది. కొవ్వు తగ్గాలని కడుపు మాడ్చుకుంటే ప్రొటీన్లు గట్రా శరీరానికి సరిపడినన్ని అందక  కొవ్వుతో పాటూ కండ కూడా కరిగిపోయీ అలా కూడా రోగాల పాలవుతాం.   ఎందుకంటే డైటింగ్ చేస్తున్నప్పుడు సరిపడినన్ని ప్రొటీన్లు అందక మన మజిల్ నుండి శరీరం వాడుకుంటుంది. అలా కండ క్షీణిస్తుంది.

మరేం చెయ్యాలి. నాలాగా బరువులు ఎత్తాలి!  వ్యాయామన్నీ, ఆహార నియంత్రణనూ సమతూకం చేసుకోవాలి. అప్పుడే సరి అయిన విధంగా కొవ్వు తగ్గుతూ, కండ దెబ్బతినకుండా వుంటుంది.  ప్రొటీన్ల విలువ తెలియనప్పుడు అనగా సగటు మనిషికి రోజుకి 60 గ్రాముల ప్రొటీన్లు అవసరం అని తెలియనప్పుడు నేనూ గొప్పగా ఆహార నియంత్రణ చేసి ఫ్యాట్ కరిగించాను కానీ దానితో పాటూ మజిల్ కూడా దెబ్బతినివుండొచ్చన్నది గుర్తించలేకపోయాను. ఇప్పుడు ఆయా విషయాలపై అవగాహన పెరిగింది కాబట్టి అది మీకూ అందిస్తున్నాను.

7 comments:

  1. శరత్,
    మీరు చూసింది బహుశా subcutonous fat అయ్యుంటుంది. Visceral fat ఎంతుందో చూసుకోగలిగితే యింకా బావుంటుంది. మీరు కొన్న మషీన్ లో ఆ అవకాశం లేదనుకుంటాను. Elliptical/Stationary bike cardio is the top exercise to burn fat and when you add weight training to it, you will get very good results. Stationary walk/treadmill walk are not that effective. At your age Jogging is not advisable.

    ReplyDelete
  2. @ పులి
    వివిధ రకాల ఫ్యాట్ గురించి నాకు కొద్దిగానే అవగాహన వుంది కనుక ప్రస్తుతానికి విసెరల్ ఫ్యాట్ కొలిచేది తెప్పించుకోలేదు. ధర కూడా తక్కువ కాబట్టి ప్రస్థుతానికి బాడీ ఫ్యాట్ శాతం కొలవడం చాలనుకున్నాను. ముందుముందు అది కూడా తెప్పిస్తాను. అయితే బాడీ ఫ్యాట్ శాతంలో రెండు రకాల కొవ్వులూ కలిపి చూపిస్తాయనే అనుకుంటున్నాను. అది నిజం కాదా? నెట్టులో చూసాను కానీ సరి అయిన సమాధానం దొరకలేదు.

    వెయిట్స్ ముందుగా వార్మప్ కోసం చేసే ఏరోబిక్స్ లో స్టేషనరీ ట్రెడ్మిల్ ఎక్కువగా ఉపయోగిస్తున్నా. ఇకనుండి ఎలిప్టికల్ ఎక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తాను.

    ReplyDelete
  3. నా బరువు అందాజాగా 57 కిలోలు వుండగా నా వంట్లో కొవ్వు అందులో 22% అంటే దాదాపుగా 13 కిలోలు వుందన్నమాట. అయితే కొలతలో Visceral కొవ్వు కలిసే వుందా లేదా అది అదనంగా ప్రత్యేకంగా లెక్కించాలా అనేది నాకు అర్ధం కావడం లేదు.

    ReplyDelete
  4. ఎందుకో మరి మీ బ్లాగ్ కి వస్తే కామెంట్ వ్రాయకుండా వెళ్ళ బుద్ధి కాదు
    మీ ఆరోగ్యం పట్ల మీరు చూపించే శ్రద్ధ చూస్తుంటే, నేను ఎప్పుడు మారతానా అని అనిపిస్తుంది
    మూడేళ్ళ క్రితం వరకూ నా బరువు 50 -55 కేజీలు మాత్రమే
    డిప్రెషన్ లోకి వెళ్ళాక ఆమాంతం 20 కేజీలు పెరిగా (single ప్యాక్ శాస్త్రి గారు )

    మా అన్నగారు వాకింగ్ జిమ్ బాక్సింగ్ వగైరా చేస్తుంటే నేను కూడా ఏదన్నా చెయ్యాలి అనుకుంటా
    కానీ ఇట్లాగే సరిపోతోంది
    నేను కూడా ఏదో ఒకటి చేసెయ్యాలి

    కాకపొతే అప్పుడు అప్పుడు అనుకుంటా "నాది డేటింగ్ చేసే వయస్సు డైటింగ్ చేసే వయ్యస్సు కాదు" అని
    ఇంతకీ కొవ్వు కొలిచే సాధనాలు కూడా ఉంటాయా ?
    టీవీ లు చూడక పేపర్ లు చూడక ఎంత వెనకబడిపోయాను :(

    ఇంతకీ నాది ఏ (A ) గ్రేడ్ కామెంట్ ?!
    ఈ మద్య ఇదో సమస్య అయిపొయింది నాకు

    ReplyDelete
  5. @ అప్పి
    అయినా ఏ గ్రేడ్ బ్లాగులోకి వచ్చే కామెంట్లన్నీ కూడా ఆటోమేటిగ్గా ఏ గ్రేడ్ కావూ?

    ఎన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకున్నా మనకు తెలియనిదేదయినా ముంచుకురావచ్చు. అయినా సరే ప్రయత్న లోపం లేకుండా చూసుకోవాలి కదా. అహా. కొవ్వూ కొలిచే సాధనాలూ వున్నయ్, కొవ్వులో రకాలూ కొలిచే సాధనాలూ వున్నయ్. ఇంకా మా ఇంట్లో వాళ్ల కొవ్వు కొలవలేదింకా. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు నాకు ఆ సాధనం దొరికింది. ఇహ ఎవరింటికి వెళ్ళినా అదీ పెట్టుకెళ్ళి వాళ్ల కొవ్వు కొలుస్తా. అలా వారిని ఎజుకేట్ చెయ్యడం ద్వారా నన్ను నేను ప్రోత్సహించుకుంటా.

    ఈ సారి ఇండియా వస్తే పట్టుకొస్తా లెండి. అప్పుడు మీదీ కొలుద్దాం - కొవ్వు!

    ReplyDelete
  6. ఏ గ్రేడ్ బ్లాగులు వ్రాసే వాళ్ళది ఏ గ్రేడ్ ?!
    ఏ గ్రేడ్ బ్లాగులలో కామెంట్స్ వ్రాసే వాళ్ళది ఏ గ్రేడ్ ?!
    ఏ గ్రేడ్ బ్లాగులలో పోస్ట్లు చదివే వాళ్ళది ఏ గ్రేడ్ ?!
    ఏ గ్రేడ్ బ్లాగులలో కామెంట్స్ చదివే వాళ్ళది ఏ గ్రేడ్ ?!
    మీది, నాది, మీ శిష్యులైన పిందే, కాయ, పండు, పులి, సింహం అందరమూ ఏ గ్రేడ్ ?!
    నోట్ :- ఒకసారి చదివితే ప్రశ్న రెండో సారి చదివితే సమాధానం :))
    నన్నుఈ మద్య ఎవరో Brigadier అని అన్నారు .


    కొవ్వు కొలిచే సాధనాలతో పాటు "కొవ్వు కరిగించే సాధనాలు" ఏమన్నా పట్టుకురండి
    కొవ్వు ఎక్కువ ఉన్నవాళ్ళందరికీ కరిగించేద్దాం

    మర్చిపోయాను చెప్పటం
    రెండు వారాల క్రితం మీ ఉరి చదివా
    పిచ్చి ఎక్కించేసారు ట్విస్ట్లు బాగున్నాయి చివరలో,
    క్లైమాక్ష్ అదిరిపోయింది :))
    సారీ -మధ్యలో బోర్ కొట్టింది :(

    ReplyDelete
  7. @ అప్పి
    మీ లిస్టులోని సిమ్మం గారు నామీద అలిగినట్లున్నారు - ఇటేసి కామెంటెయ్యట్లా.

    మిమ్మల్ని బ్రిగేడియర్ అని ఎందుకు అన్నారబ్బా...

    ఉరి చదివేసినందుకు మీకు నచ్చేసినందుకు సంతోషం. అవును, మధ్యలో సాగతీతగా వుందని కొంతమంది చెప్పారు కానీ ఆ తెలుగు స్క్రిప్ట్ పోయింది కాబట్టి ఆ నవలను ఎడిట్ చెయ్యలేను. అసలు అంతకంటే చక్కని నవల్స్ రెండు రాసాకానీ హార్డు మరియు సాఫ్ట్ కాపీలు రెండూ మిస్స్ అయ్యాయి.

    ReplyDelete