ఎన్నాళయ్యింది చలి కాచుకొని...

నా చిన్నతనంలో ఎంచక్కా పల్లెటూరిలో పెరిగాను. చలికాలం వచ్చేసిందంటే చాలు మా తాత పెందరాళే పడుకొని చలిపెట్టినప్పుడు నిద్రలేచి మా జీతగాడిని లేపి చలిమంట వేయించేవాడు. ఆ హడావిడికీ, వెలుగుకీ మగాళ్ళం లేచేసేవారం. మిగతా పనివాళ్ళు కూడా లేచేవారు. అందరం ఆ మంట కాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఎంతోసేపు గడిపేసేవారం. అయితే ముందువైపు నుండి చలికాగుతూ వుంటే ముందు వైపు బాగానే వుండేది కానీ వెనుకవైపు నుండి బాగా చలిపెట్టేది. మళ్ళీ ఎవరికి నిద్ర వస్తే వారు అక్కడి నుండి లేచి వెళ్ళి పడుకునేవారు.

క్రమంగా పట్టణాలకూ, నగరాలకూ ఆపై విదేశాలకూ వచ్చి ఎంతో అభివృద్ధి సాధించాము కదా. శీతాకాలం చలిమంటలు మోటయ్యాయి కాదూ. ఇప్పుడు మనకందరికీ ఎయిర్ కండీషన్లాయే.   ఇంట్లో ఎంత వేడి పెట్టుకున్నా, ఫైర్ ప్లేసుల ముందు చలికాగినా ఆరుబయట అలా ముచ్చట్లాడుకుంటూ మంట కాగేంత ఆనందం వస్తుందీ? అయితే ఆ అదృష్టం మాకు అప్పుడప్పుడు తటస్తిస్తుంటుంది.  క్యాంపింగుకు అప్పుడప్పుడు వెళుతూవుంటాము కదా.  అప్పుడు వేసుకుంటాము చలిమంట. మాతో పాటుగా వచ్చిన బంధుమిత్రులతో కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఆ మంట ముందు కాలక్షేపం చేస్తుంటాము.  గత ఏడాది క్యాంపింగుకి వెళ్ళాం. మళ్ళీ ఈ ఏడాది కాస్త వాతావరణం బాగా అయిపోగానే వెళతాం. 

వచ్చేవారాంతం చికాగోలోని ఒక గుడిలో హోళీ జరుగుతోంది. దానికి మేమూ వెళుతున్నాం. అక్కడ ఓ రెండు గంటల సాంస్కృతిక ప్రదర్శనల తరువాత రంగులు చల్లుకోవడం వుంటుంది. ఈదేశాలకి వచ్చాక హోళీ వేడుకలో పాల్గొనడం మాకు ఇదే మొదటిసారి అవుతుంది. ఆ తరువాత సాయంత్రం ఆరు గంటల నుండీ బాన్‌ఫైర్ ఏర్పాటు చేస్తున్నారక్కడ. ఇంకేం ఎంచక్కా అక్కడ చలి కాగుతూ కాలక్షేపం చేస్తాం. మా బంధుమిత్రులకి కూడా ఆ సమాచారం ఇచ్చాను. వారందరూ కూడా వస్తే మాకు ఇంకా సందడిగా, సరదాగా వుంటుంది.

మీరు ఈ ఏడాది హోళీ ఆడుతున్నారా లేదా?మరి ఆ రోజు చలిమంటేసుకుంటున్నారా లేదా?

7 comments:

  1. కానీ వెనుకవైపు నుండి బాగా చలిపెట్టేది super Joke.....మీరు వెనుక వైపు కూడా ఒక మంట వేసుకుంటే సరిపోయేది ........లేక పోతే మీ పనివాడిని గట్టిగ వెనుక నుండి పట్టుకోమని అంటే సరిపోయేది .....అప్పుడు ఈ ఐడియా రాలేదా గురు జి.

    ReplyDelete
  2. ఇదే మండుద్ది, ఆయన మటుకు ఆయన ఏదో బుద్దిగా చిన్ననాటి జ్ఞాపకాలు చెపుతూ ఉంటే, మీరు ఇలాంటి వ్యాఖ్య చేయడం సబబా? శరత్ గారు కేవలం లైంగిక, శృంగార విషయాలపై మాత్రమే రచనలు చేసే వ్యక్తి గా చిత్రీకరించడం..ఆయన్నో బూతు మనిషిగా తృణీకరించడం, కొంతమంది ఈయనకి దైవచింతన లేదన్నట్టు వాటి మీద రచనలు చేయమని సలహాలివ్వటం...తన దారిన తాను పోతుంటే మళ్ళీ మనమే రెచ్చ గొట్టడం ...

    ReplyDelete
  3. @ శ్వేత
    అలాక్కాదుగానీ వెనక్కి తిరిగి కాస్సేపు కూర్చుంటేపోలా అనిపించేది కానీ ము... కాలుతుందేమోనని భయం వేసేది.

    @ అజ్ఞాత
    కదా. నేనూ మనిషినే కదా. నాకూ శరీరమే కాకుండా మనస్సు కూడా వుంటుంది కదా. అర్ధం చేసుకోరు ఈ జనాలూ.

    పోనీలెండి. శ్వేత సరదాగా అన్నారు అంతే కదా. ఈ టపా జాన్రే సరిగ్గా వారు దృష్టిలో పెట్టుకోలేదంతే. ఒకే బ్లాగులో అన్ని రకాల విషయాలు వ్రాస్తుంటా కాబట్టి అలా అవుతుంది.

    ReplyDelete
  4. శ్వేత సరదాగా అన్నారు అంతే కదా. ..... ya నేను నిజంగా సరదాగానే అన్నాను.మీరు awesome . ..... మీru వ్రాసిన విదానం చదువుతూ వుంటే నవ్వు ఆపుకోలేక పోయాను.

    ReplyDelete
  5. Sir,
    prastutam india lo vesavi modalayindi. Inka em chali mantalu sir. Ee endalaki vallanta mantalu mandipotunte meeru maree jokulu vestunnare!
    Kalyani

    ReplyDelete
  6. Since how many yerars you are living in US..are you citizen of that country...?

    ReplyDelete
  7. @ కల్యాణి
    అవును. ఇండియాలో ఎండలు మండిపోతున్నాయట కదా. నేను మాలాంటి చలివున్న ప్రాతపు వాసులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే వ్రాసానండి.

    @ ప్రశాంత్
    US లో ఓ అయిదేళ్ళ నుండి వుంటున్నాం. పౌరసత్వం లేదు.

    ReplyDelete