ఈ మధ్య విగ్రహాల హత్యలూ, వాటి తాలూకు గొడవలూ ఎక్కువయ్యాయి కదా. అందరి విగ్రహాలూ సరే, మరి నా విగ్రహం సంగతేం ఆలోచిస్తున్నారూ అని మిమ్మల్నదరినీ నిగ్గదీసి, నిలదీసి ప్రశ్నిస్తున్నాను. తెలుగు వారి కీర్తిని ప్రపంచమంతా చాటుతున్నాను. కాదు కాదు తెలంగాణా కీర్తినే చాటుతున్నా అని కొందరు ఆకతాయిలు అంటుంటారులెండి. నేను బేసిగ్గా తెలుగోడిని. అంచేతా నేను వ్యాపింపజేసేది తెలుగు ప్రతిష్ఠే. అంచేతా ఇహ మీరు ప్రతిష్ఠించాల్సింది నా విగ్రహమే. నా విగ్రహం కోసం ఇంతవరకు నిగ్రహంగా వేచి వున్నా కానీ ఎవరి దగ్గరినుండీ ఉలుకూపలుకూ లేదు కాబట్టి నేనే కోడై కూయాల్సొస్తోంది. ఖర్మరా బాబూ. నా విగ్రహం కొసం నేనే డిమాండ్ చెయ్యాల్సొస్తోంది. నేనే ఆందోళనలు చెయ్యాల్సొస్తోంది.
ఆ మధ్య ట్యాకంబండ్ మీద మహనీయుల విగ్రహాల మూకుమ్మడి హత్య జరిగినప్పుడే సెలవించ్చాను - నా విగ్రహం ఎవరన్నా ట్యాంక్బండ్ మీద ప్రతిష్టించండయా బాబూ అని. ఎవరూ వినిపించుకున్నారు కాదు. అందుకే మళ్ళీ పాత డిమాండును కొత్తగా తెర మీదికి అనగా బ్లాగు మీదికి తీసుకురావాల్సొస్తోంది. పోనీ ట్యాంక్ బండ్ మీద కాకపోయినా పుర కూడళ్లలోనయినా పెట్టండయ్యా బాబులూ. మీక్కాస్త పుణ్యం వుంటుంది. ఏం పతోనికీ విగ్రహాలు నెలకొల్పగా లేనిది పుట్టినప్పటినుండీ కాదు లెండి లే.. వద్దులెండి వయస్సు వచ్చినప్పటి నుండి లైంగిక హక్కుల కోసం ఆడా, మగా అనే తేడా లేకుండా పోరాడుతూనే వున్నా కదా. అంచేత నా డిమాండులో న్యాయం కొంతయినా వుందని మీరు అంగీకరించాలి. అంచేతా నా విగ్రహం నాకు అర్జంటుగా కావాలి.
నా విగ్రహం వల్ల చాలా లాభాలు వున్నాయి. మనుషులూ, కుక్కలూ కాలెత్తుకొవచ్చు, పక్షులూ, పిట్టలూ రెట్టలు వేయొచ్చు, రాత్రి కాగానే నా నీడన చీకటి పనులూ చేసుకోవచ్చు. అలా అలా ఎన్నో, ఎన్నెన్నో. ఎవరో నేను మహానుభావుడిని కాదని నిన్ననే అన్నారు. అలాంటి రూమర్లు వ్యాపించకముందే నా విగ్రహం పెట్టేసెయ్యండి, పెట్టేసెయ్యండి. అయినా బ్రతికి వున్నవాడికి విగ్రహాలేంటయ్యా అని మీరడగవచ్చు. ఆ ప్రశ్న నన్నడగకండి మాయావతి సోదరిని అడుక్కోండి. నేను బ్రతికి వున్నప్పుడే నా విగ్రహానికి గతిలేదు కానీ నేను చచ్చాక దాని గురించి పట్టించుకుంటారని నాకు ఇసుమంతయినా నమ్మకం లేదు. అంచేత కానివ్వండి, కానివ్వండి. అలా అని చెప్పి నా విగ్రహం కోసం నా దగ్గరే చందా వసూలు చెయ్యాలనే దుర్మార్గమయిన ఆలోచన తక్షణం మానుకోండి. అది పద్ధతి కాదు. గుర్తించండి. కొంపదీసి మీకు రాని ఆలోచన గానీ నేను గానీ ఏమయినా ఇచ్చేసేనంటారా?!
అదో, విగ్రహం పెట్టగానే సరిపోదండోయ్, దాని చుట్టూ పూల మొక్కల సర్కిలూ, తగిన రక్షణా, పోలీసులూ వుండాలి. ఇనుప కంచె కూడా పెట్టించండి. బాంబ్ స్క్వాడులూ దగ్గర్లో వుండాలి. అలాగే ఓ డాక్టరూ, మొబయిల్ వైద్యశాలా దగ్గర్లో వుండాలి. అబ్బా డాక్టర్ అంటే డాక్టర్ కాదు లెద్దురూ. తాపీ మేస్త్రీ గురించి నేననేది. నాకు అనగా నా విగ్రహానికి ఎవరయినా రాళ్ళేసి చెయ్యో, కాలో విరిగితే కట్టు కట్టాలి కదా. అందుకూ. అసలే నాకు శత్రువులు ఎక్కువాయే. పతి పతివ్రతా నామీద పుచ్చు టమాటోలో, మురిగిపోయిన కోడిగ్రుడ్లో విసరాలనుకునేదాయే.
మొత్తానికి మీరు నా విగ్రహం నెలకొల్పాలని నిర్ణయించుకున్నందుకు అభినందనలు. ఇప్పుడో ధర్మ సందేహం. నాది నగ్నవిగ్రహం ప్రతిష్టిస్తారా లేక సాధారణ విగ్రహమా. మీరే చెప్పండని మాత్రం నన్ను అడొగవద్దు. అది ప్రజలే నిర్ణయించాలి. ఎందుకంటే ఎల్లప్పుడూ మెజారిటీ నిర్ణయానికీ, ప్రజా బలానికీ నేను తల వంచుతాను కనుక. మీ అభిప్రాయం ఏంటో, నా విగ్రహం ఎలా వుంటే ఎలా బావుంటుందో కామెంట్ల ద్వారా సెలవివ్వండి మరీ. నాది మరో ధర్మ సందేహం. ఒహవేళ నా నగ్న విగ్రహమే ప్రతిష్టించాలని నిర్ణయించుకున్నారే అప్పుడు ఆ విగ్రహంలో... వద్దు లెండి. మరి కొన్ని పుచ్చు టమటాలూ, మురిగిపోయిన కోడిగుడ్లూ కామెంట్లుగా పడతాయి. వద్దులెండి. అన్నీ ప్రజలే నిర్ణయించాలి. నాదేముందీ, నిమిత్తమాత్రుడిని. అన్నట్టు నా విగ్రహం ప్రతిష్టించుకోవడానికి ఎవరూ ఒప్పుకోకపోతే కనీసం వేశ్యావాటికల్లో నయినా ప్రతిష్టించండయ్యా...వాళ్లయితే నన్ను వద్దనరూ.
అవును గానీ నా విగ్రహంలో నా చూపుడు వేలు ఎటువేపు చూపిస్తుందేమీటీ? అది మరో ధర్మ సందేహమూనూ. దాన్నిక మీరే తీర్చాలి మరి.
choopudu velu badulu madhya velu ayite better
ReplyDeletei like your photos collection.. where are you getting all photos..
ReplyDeletei planing to start one statue manufacturing company in India.
శరత్తు వారు,
ReplyDeleteనా 'నిగ్రహం' సంగతేంటీ అని వుండాలి కదా టపా పేరు !
చీర్స్
జిలేబి.
ఒక చేయి దిశ చూపిస్తే ఇంకో చేయి ఏం చేస్తుంది ?
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteఅలాగే, మధ్యవేలే పెట్టేద్దాం. కానీ మళ్ళీ నాదో ధర్మ ఫందేహం. అది పైకి చూపుతూ వుండాలా లేక క్రిందికి చూపుతూ వుండాలా? అంటే టాపా బాటమా అనేది నా ప్రశ్న.
@ అజ్ఞాత
గూగులమ్మ వుండగా మనకు ఫోటోల కొదవేల? అయితే సందర్భానికి తగ్గట్టుగా వెతకడంలోనే వుంది కళ.
శుభం. నా విగ్రహంతోనే బోణీ చేయండి.
@ జిలేబీ
నా విగ్రహం చూసయినా నాకు నిగ్రహం తన్నుకు వస్తుందేమోనని. అంటే విగ్రహం పెట్టాక అని కాదు కానీ పెట్టి ఓ ఏడాది గట్రా అయ్యాక చూసుకుంటే... ఎంతమంది ఏం విసర్జిస్తారో నా మీద. హ్మ్.
+1 for Zilebi's comment.
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteఒక చేయి నా విగ్రహాన్ని బలాత్కారం చేసి పారిపోతున్న వాడి వైపు చూపిస్తే ఇంకో చెయ్యి ప్యాంటు పైకి లాక్కుంటూ వుంటుంది.
@ వంశీ
:)
పర్ సపోజ్ మీ విగ్రహం పెట్టారే అనుకోండి. పర సపోజ్.. దానిపైనే దాడి జరిగిందనుకోండి. మీ బాడీలో ఏ పార్టు లేపెత్తరో ఊహించండి శరత్తుగారు. మీరైతే బాగా ఊహిస్తారు.
ReplyDelete@ సీతారాం
ReplyDeleteహెంత కుట్ర పన్నారండీ నా (మీద) విగ్రహం మీద. ఆలూ, చూలూ లేదు కానీ అప్పుడే అసలుకి ఎసరెట్టేసారే! విగ్రహ ప్రతిష్టాపన జరగ్గముందే ఇన్ని కుట్రలయితే, హే ఓషో, జరిగాక జరిగే కుట్రలకు అంతు వుంటుందా స్వామీ!
ఏ పర్లేదండీ, దానికో బ్యాకప్ ప్లాన్ వుందిగా. అక్కడో రంధ్రం తొలిపించేస్తాగా. అప్పుడందరూ ఎంచక్కా నాలో నా భావాల గురించి రంధ్రాన్వేషణ చెయ్యొచ్చు.
Use 'Nagarjuna Cement'... for that your...
ReplyDelete@ మిర్చి
ReplyDeleteతప్పకుండా :)
మీ వంటరి విగ్రహం ఎపుడైనా నిగ్రహం కోల్పోయే ప్రమాదం ఉందికాబట్టి తోడుగా పక్కనే ఇంకొక విగ్రహం కూడా పెడితే బెటర్. ఎవరు కావాలో కోరుకోండి..( హమ్మో..నా వంక చూడద్దు..నేనూ, నా విగ్రహం ఆ టైపు కాదు )
ReplyDelete@ జాన్
ReplyDeleteకరెక్టే, నా విగ్రహ నిగ్రహ సమస్యను మీరు అర్ధం చేసుకున్నట్లుగా వేరెవరూ ఇంతవరకూ అర్ధం చేసుకోలేకపోయినందుకు ప్రగాఢంగా చింతిస్తున్నా. అవును, విగ్రహాలకీ మనస్సు వుంటుంది, వాటికీ వ్యాయామం కావాలి. వాటికీ తోడు కావాలి. ఎవరిది పెడదాం చెప్మా! ఎవరిదయినా సరే మళ్ళీ నగ్నవిగ్రహమే పెట్టితీరాలి. అలా పెట్టకపోతే నా విగ్రహం మనోభావాలు గాయపడతాయి. ఎవరి విగ్రహం పెట్టాలి అనే విషయం ప్రజలే నిర్ణయించాలి కాబట్టి ఓ పోల్ పెట్టేద్దాం. మా ప్రవీణ్ బావ విగ్రహం మాత్రం నా పక్కన ససేమిరా పెట్టొద్దు. మా ప్రవీణ్ బావ తెలుసుకదా మీకు?