అతని కొడుక్కి నా పేరు పెట్టుకున్నాడు!

నా జీవితంలోని తృతీయ కృష్ణుడు ఎవరో నాకే తెలియదు. అంటే ఎవరో సరిగ్గా నాకు గుర్తులేదు. బహుశా నా ఇంకో బాల్య స్నేహితుడు అయివుండొచ్చు అనుకుంటున్నా. మా ఊరి వాడే అతను.  మా ఇంటికి దగ్గర్లోనే గది కిరాయికి తీసుకొని వుండేవాడు. తినడానికి తన గదికి వెళ్ళినా కూడా మిగతా సమయమంతా మా ఇంట్లోనే గడిపేవాడు. రాత్రి కూడా మా ఇంట్లోనే పడుకునేవాడు. అలా ఒకే పక్కలో కొన్ని రోజులుగా పడుకుంటూ వుండటంతో సరదాగా ఆటలు మొదలెట్టాం కానీ అతనికి అంత ఆసక్తి వుండేది కాదు. నాకూ అతనంటే ఆ విషయంలో అంత ఇష్టంగా అనిపించేది కాదు. అందువల్ల ఒక రెండు, మూడు రోజులు మేము పెద్దగా ఏమీ చేసుకోలేదు కానీ పైపైన ఆనందించాం. ఆ తరువాత ఆపేసాం.

అతను ఇప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్సులో ఒకడు కాబట్టి తరువాత తరచుగానూ, ఇండియా వెళ్ళినప్పుడు అప్పుడప్పుడూనూ కలుస్తూవుండేవాడిని. అయితే మేము అమ్మాయిల కబుర్లు తప్ప ఈ విషయాలు ముచ్చట్లాడుకునేవారం కాదు.

మా స్నేహం ఎంత గొప్పదంటే... అతని చిన్న కొడుక్కి నా పేరు పెట్టుకున్నాడు! మొదట ఆ విషయం నేను ఇండియాలో వున్నప్పుడు తను చెబితే నేను అసలే నమ్మలేదు.  తీసుకువెళ్ళి తన స్కూటర్ మీద వ్రాయించిన తన కుమారులిద్దరి పేర్లూ చూపించాడు. ఆ తరువాత అతని ఇంటికి వెళ్ళి ఆ శరత్తుని చూసాననుకోండీ.  అతని కొడుకు కూడా నా అంత గొప్ప వాడు కావాలని ఆశిస్తుంటాడు!?  నేనిలాంటి వ్రాతలు వ్రాసేటంత గొప్పవాడినయానని తెలిస్తే తన కొడుకు పేరు పీకి పడేస్తాడేమో తెలియదు. హి హీ.   ఈ పేరా వ్రాసినందువల్ల మాకు తెలిసినవారు ఎవరయినా ఆ స్నేహితుడిని గుర్తించవచ్చునేమో కానీ మేము చేసుకున్నది పెద్దగా ఏమీ లేదు కాబట్టి లైట్ తీసుకొని వ్రాసేసాను.

ఈ వారం అంతా మగాళ్ళ మీదే పడ్డాను కాబట్టి వచ్చే వారం మళ్ళీ ఆడాళ్ళ మీద పడతాలెండి. అనగా మళ్ళీ అమ్మాయిల కబుర్లు చెప్పేసుకుందాం.  నాకూ మిగతా ఎన్నో విషయాలు వ్రాయాలని వుంటుంది కానీ ఇవి వ్రాసేవారు ఇంకెవరూ ఇంతవరకు తెలుగు బ్లాగుల్లో లేకపోవడం వల్ల  ఆ శూన్యత భర్తీ చెయ్యడం కోసం కనీసం నేనయినా వ్రాయాలని వ్రాస్తున్నాను. అయినా మిగతా విషయాలు వ్రాయడానికి ఎంతో మంది చక్కని బ్లాగర్లు వున్నారు కదా. మళ్లీ నేను కూడా ఎందుకు లెద్దురూ - నా ఇమేజ్ ఖరాబు అవుద్ది కాదూ :))

2 comments:

  1. nijanga mee dharyaniki mechchukovachchu sir. Ammayilatho unna sambandhalane chala secret ga maintain chestaru andaru, kaani meeru ekanga abbayilatho unna sambandhalu kuda vivaranga cheptunnaru...its great.kaani ee vishayalu andariki theliste meeku embracing ga anipinchadaa ?

    ReplyDelete
  2. @ అజ్ఞాత
    నా విషయాలు అందరికీ తెలిస్తే తెలిసినవారికే ఎంబారాసింగుగా వుండొచ్చేమో కానీ నాకు కాదు :) మనం ఏదయినా పొరపాటు చేస్తున్నాం అనుకున్నప్పుడు ఇతరులు ఏమనుకుంటారో అన్న బెంగ వుంటుంది. నేను చేస్తున్న దాంట్లో తప్పు లేదనుకున్నప్పుడు ఇతరులు ఏమనుకునేదానికి ప్రాధాన్యత నివ్వను. నేను ఎక్కువగా నాకు ఇష్టం వచ్చిన పద్ధతిలో జీవిస్తాను - ఇతరుల ఇష్టాలకు తగ్గట్లుగా కాదు.

    ReplyDelete