AUM మెడిటేషనులో ఏనిమిదవ మెట్టులో అందరం ఎవరికి వారం ఓ పావు గంట విచారపడుతూ కూర్చున్నాం. ఒకరినొకరు ఓదార్చుకుంటూ కూడా కూర్చోవచ్చు కానీ మా టీచర్ ఎందుకో అప్పుడు అలా చెప్పనట్టున్నాడు. కొంతమంది పొర్లి పొర్లి వెక్కి వెక్కి ఏడ్చారు. ఇంత ఆనందంగా, అందంగా ఏడవచ్చునని నాకు అప్పుడే తెలిసింది. మగ జన్మ ఎత్తినందుకు గానూ మనకు ఏడుపు వచ్చినా దిగమింగుకోవాలాయే. మనం ఏడుస్తున్నది ఇతరులు చూస్తే అది మన బలహీనత అనుకుంటారేమో అన్న భయంతో మనలోని సహజమయిన స్పందనలను తొక్కిపడుతుంటాము. ఈ విషయంలో ఆడవాళ్ళు అదృష్టవంతులు. ఎంచక్కా ఎంతసేపయినా ఏడ్చేయగలరు. అది వారియొక్క వజ్రాయుధం కదా. అందువల్ల ఈ స్టేజ్ స్త్రీలకేమో గానీ పురుషులకు అయితే చాలా బాగా ఉపయోగకరం.
నేను వెక్కివెక్కి ఏడవకపోయినా దిగులుగా, భారంగా నేను ఎదుర్కొన్న అన్ని అవమానాలూ, నిరాశలూ, నిస్పృహలూ గుర్తు తెచ్చుకొని బాధపడిపోయాను. కాసిన్ని కన్నీళ్ళు కూడా వచ్చేసాయి. నా కన్నీళ్ళు ఆర్పేవాళ్ళు ఎవరూ లేరు. అందరూ తలో దిక్కునా చేరి లబోదిబోమనే వారే కదా అక్కాడ. అలా నిరభ్యంతరంగా శుబ్బరంగా దిగులు చెందాను. పనిలో పనిగా మీరు నన్ను తిట్టే తిట్లు కూడా గుర్తుకు తెచ్చుకున్నాను :)) మరీ పావుగంటేనా ఇలా ఏడవడం అనిపించింది. ఓ రోజంతే బాధపడే అవకాశం వుంటే ఎంత బావుండును అనిపించింది.
Eighth Stage - Sadness
When one allows their expression
to be one of vulnerability, to cry, one begins to heal pain and move towards a
connection with their heart, towards joy.
Participants asked to sit
supported with someone else and allow their tears to come.
ఇహ తొమ్మిదవ స్థితిలో అందరం పగలబడి నవ్వాము, చక్కిలిగింతలు పెట్టుకున్నాము. నాకు కూడా అగకుండా నవ్వు వచ్చింది. అలా పదో, పదిహేను నిమిషాలో అందరం ఆగకుండా పొర్లి, పొర్లి నవ్వుకుని అలసిపోయాము. జీవితంలోని సంతోషకరమయిన సంఘటణలు గుర్తుకుతెచ్చుకున్నాము.
Ninth Stage - Joy
It is well known that laughing is
healing for body and mind. Tragedies turn into comedies and you can start to
see the funny side of a situation.
Participants are guided to switch
to the opposite emotion of joy. Giggle, have a belly laugh, move, make jokes,
be playful and have fun.
మనసు పొరల్లో అణిచిపెట్టుకున్న సంతోషం, కోపం, బాధ, దుఃఖం ఏదో ఒక విధంగా బయటకి వెళ్లిపోతే ఆరోగ్యానికి చాలా మంచిది. AUM మెడిటేషను మీరు ఏవిధంగా enjoy చేస్తున్నారో కానీ, తెలియకుండానే మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. Good for you :)
ReplyDelete@ సిద్ధార్ధ్
ReplyDeleteఅవును. అయితే అలాంటి అవకాశం ఇన్నాళ్లకి లభించింది. అలా అని చెప్పి ఈ ధ్యానాలు మనకు మనమే చేసేసుకుంటే అంత ఆసక్తికరంగా అనిపించకపోవచ్చు. గ్రూపుగా చేస్తేనే ఉత్సాహంగా వుండటంతో పాటూ ఎక్కువ ఫలితాలు చేకూరుతాయి. మళ్ళీ గ్రూపుగా చేసే అవకాశం ఎప్పుడు కలుగుతుందో చెప్పలేను. ఈ వారాంతం ధ్యానం కాదు కానీ ఒక ఓషో ధ్యానం వుంది. అది ఏక్టివ్ మెడిటేషన్ అయివుండవచ్చు.
నేను నేర్చుకున్న విషయాలను మా కుటుంబంలోనూ, పిల్లల్లోనూ ఎలా అనువర్తింపజెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. మా ఇంట్లో గెట్ టుగెదర్లు జరిగినప్పుడు ఒక్కో సారి ఒక్కో స్టేజ్ థీముగా ఏర్పాటు చేస్తే ఎలా వుంటుందా అని చూస్తున్నా. ఒకసారి అంతా అందరూ పగలబడి నవ్వుకోవడం, మరోసారి అందరూ ఏడ్చెయ్యడం అలా అలా. మిగతా కుటుంబాలూ అర్ధం చేసుకొని ఉత్సాహం చూపిస్తే అలా చెయ్యవచ్చు. ప్రయత్నిద్దాం.
Potluck పార్టీల్లో ఇలాంటివి చేస్తే బాగానే వుంటుంది. ముఖ్యంగా మగవాళ్లు ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటారు కానీ కన్నీరు పెట్టటం అంటే నామోషీ గా ఫీల్ అవుతారు. కోపం వస్తే గట్టిగా అరిచెయ్యటం, బాధలో వుంటే ఏడ్చెయ్యటం మంచిది, మగైనా, ఆడైనా. షికాగో స్వామి నారాయణ్ టెంపుల్ లో ఇలాంటి క్లాసెస్ వుంటాయని విన్నాను. మీరు వెళ్లేది అక్కడికేనా ?
ReplyDelete@ సిద్ధార్ధ్
ReplyDeleteఇలాంటి క్లాసులు మరో చోట వున్నట్లు ఇంతవరకయితే నేను వినలేదు. స్వామి నారాయణ్ - చికాగో వారి వెబ్ సైటుకి వెళ్ళి చూసాను కానీ ఆ వివరాలేమీ లభించలేదు. నేను చేసిన AUM ధ్యానం నెదర్లాండ్స్ లోని హ్యూమనివర్సిటీ వారిది. అక్కడ శిక్షణ పొందిన లండన్ నివాసి పని మీద షికాగో వస్తే అతనితో ఈ క్లాసు ఏర్పాటు చేయించాం. AUM ధ్యాన శిక్షకులు చికాగోలో కూడా ఒకరు వున్నారుట కానీ వారు బాగా బ్యుజీ అట. అందుకే ఆ క్లాసులు ఇక్కడ జరగడం లేదు. ఇహ మాలో మేమే కిందామీదా పడాల్సివుంటుందేమో.