రాజన్న సినిమా బావుందని సమీక్షలు వస్తున్నాయి కానీ సినిమా హాళ్ళలో జనాలు అంతగా లేరని తెలుస్తోంది. తెలంగాణా రజాకార్ ఉద్యమం గురించి విన్నప్పుడు నాలో ఉద్వేగం ఎలుగెత్తుతుంది. ఎందుకంటే మా నాన్నగారు తెలంగాణా పోరాట యోధులు. యోధులే కాకుండా నాయకులు కూడానూ. సోదర యోధులు అందరూ మల్లన్నా అని పిలిచేవారు. నా చిన్నప్పుడు నాన్నగారు నన్ను వడిలో కూర్చోబెట్టుకొని వారి యొక్క ఉద్యమ సాహసగాధలు వినిపించేవారు. మా అమ్మగారు కూడా అప్పటి విశేషాలు మా అందరికీ చెబుతూ నాన్నగారికీ, ఆ పోరాటానికి తను ఎలా సహకరించిందో, ఎన్ని కష్టాలు పడిందో చెప్పుకువచ్చేవారు.
అయితే రాజన్న లాగా మల్లన్న పాటలు పాడలేదు కానీ వివిధ క్యాంపుల నిర్వహణలో పాలుపంచుకున్నారు. అందులో ముఖ్యమయినది పాలేరు క్యాంపు. ఎన్నో సాహస గాధలు చెప్పారు కానీ చాలావరకు మరిచేపోయాను. కొన్ని మాత్రం గుర్తుకువున్నాయి. రజాకార్ల కంటపడకుండా వారు రాత్రి పూట ఎలా జాగ్రత్తగా సంచరించేవారో, అప్పుడు ఒకసారి రోడ్డుపక్కన వున్న నీటిలో కనిపించిన చంద్రుడిని చూసి అది రజాకార్ల టార్చ్ లైట్ అని భయపడి పరుగులు తీసిన వైనం లాంటివి కొన్ని గుర్తుకువున్నాయి.
నాన్నగారు జరిగిపోయి కొన్నేళ్ళవుతుంది కాబట్టి ఈ సారి ఇండియా వెళ్ళినప్పుడు మళ్ళీ మా అమ్మగారితో ఆ గాధలు చెప్పించుకోవాలి. అవన్నీ విని బ్లాగస్థం (గ్రంధస్థం లాగా చదువుకోవాలి) చెయ్యాలని వుంటుంది కానీ అది జరిగేదేప్పుడో. అంతకంటే మా అమ్మ చెబుతూ వుంటే వీడియో తీసి యూట్యూబులోకి ఎక్కించడం సులభం అనుకుంటాను. చూద్దాం.
మాస్టారూ, మల్లన్న గురించి మీరు చెపుదురుగాని గానీ, రాజన్న గురించి ఇప్పుడే అందిన వార్త ....
ReplyDeleteమూడు గంటలు తలుపులేసి ఇరగ్గుమేశాడంట ...
పుచ్చలపల్లి సుందరయ్య గారి వీర తెలంగాణా విప్లవ పోరాటం పుస్తకం విశాలాంధ్ర గారు ప్రచురించినది చదవండి. మీకు ఉపయోగపడవచ్చు.
ReplyDeleteinspiring. You should definitely record those stories.
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteఅంటే మీరు చెప్పిన వార్త పాజిటివే కదా. ఇరగదీసాడంటే పాజిటివ్వే కానీ మూడుగంటలు తలుపులేసి అని మీరంటేనే అనుమానం వస్తోంది.
@ క్రిష్ణ
ఎన్నో తెలుగు పుస్తకాలు చదవాలనే వుంటుంది కానీ ఇక్కడ సౌలభ్యం లేక నెట్టులో అన్నన్ని డాలర్లు పెట్టి కొనాలేక అవస్థ నాది. ఇండియా వచ్చినప్పుడు తెచ్చుకోవాలిక.
@ కొత్తపాళీ
ధన్యవాదాలు. చెయ్యాలి... రికార్డ్ చెయ్యాలి.
ఎందుకు అనుమానం ...నా ఉద్దేశం అదే. ఇరగ్గుమేశాడు అంటే, లొపల కుర్చోపెట్టి ఆడుకున్నాడు అని ...సింపుల్ గా చెప్పాలంటే, బాగోలేదు అని
ReplyDeleteThe spirit of Telangana lives on inspite of betrayals. The present struggle for statehood is a new dawn for this land.
ReplyDeleteఅరె మీరవన్నీ ఈ పాటికే రికార్డ్ చేసి ఉండవలసింది. ఇప్పటికైనా మించిపోలేదు. మీ అమ్మగారి ద్వారా విని మీరు బ్లాగులో రాయండి అన్ని వివరాలు.
ReplyDelete@ సౌమ్య
ReplyDeleteఎన్నో పనులు పూర్తిచేసుకోని రావాలని ఇండియా ట్రిప్పుకి వస్తాం కానీ దేనికీ సరిగ్గా సమయం సరిపోదండీ. ఈ సారి అయినా వీలు చూసుకోవాలి.