ఇబ్బందికరమయిన ఆ నిశ్శబ్దం

మా పట్టణంలో ఒకరు మెడిటేషన్ మీటప్పులు నిర్వహిస్తుంటారు. ప్రతి వారం ఆదివారం సాయంత్రం ఆ కలయికలు వుంటాయి. 7 గంటల నుండి ఒక గంట ధ్యానం వుంటుంది. ఆ తరువాత స్పిరిచువల్ విషయాల్లొ చర్చలు వుంటాయి. 20 మంది వరకు రావచ్చు. ఒక్కోసారి అంతకు మించి సభ్యులు ఆసక్తి చూపించినా ఆ రోజుకి అవకాశం వుండదు. నేను ఎప్పుడో ఒకసారి వెళుతుంటాను కానీ వెళ్ళినప్పుడల్లా దేశీని నేను ఒక్కడినే వుంటుండేవాడిని.

నిర్వహణ కానీ, ధ్యానం కానీ, చర్చలు కానీ, ఇతర సభ్యుల సహకారం కానీ బాగానే వుంటుంది కానీ నాకో చిన్న ఇబ్బంది ఏర్పడింది. ధ్యాన సమయంలో అందరూ పూర్తి నిశ్శబ్దంగా వుంటారు. అప్పుడప్పుడు మాత్రం ఇతరుల కదలికలు కొన్ని వినపడుతుంటాయి.  అలా పూర్తిగా ఏమాత్రం శబ్దం రాకుండా వుండగలనా అని నాకు సందేహంగా వుంటుంది. ఏమాత్రం కదిలినా, దగ్గినా, తుమ్మినా ఇతరుల ధ్యానానికి ఇబ్బంది కలుగుతుంది కదా అనే అనుమానం పీడిస్తూ నా ఏకాగ్రతని చెడగొడుతూవుంటుంది. అలా పూర్తి నిశ్శబ్దం కాకుండా ధ్యానానికి తగ్గట్టుగా వుండే లైట్ మ్యూజిక్ ఏదయినా వినిపిస్తుంటే బావుండు అనిపిస్తుంది. అలాగే అగరువత్తుల పరిమళమూ సోకుతూ వుంటే ఇంకా చక్కగా అలౌకిక ఆనందంలోకి వెళ్ళవచ్చు అనిపిస్తుంది. ఆ రెండు విషయాలూ ఈ సారి వెళ్ళినప్పుడు సూచించి చూస్తాను.

ఈ మధ్య ఒకసారి చికాగోలొ వున్న షిర్డీ సాయిబాబా గుడికి మా కుటుంబంతో వెళ్ళాను. ఆ సాయిబాబా మా ఆవిడ ఇష్ట దైవం. అక్కడి ఆధ్యాత్మిక వాతావరణంలో, షీర్డీ సాయి స్త్రోత్రాలు వినపడుతూ వుండగా, అగరొత్తుల సుగంధ పరిమళాలు పీల్చుకుంటూ ఎంచక్కా ధ్యానంలోకి వెళ్లిపోయాను. 

నా చిన్నప్పుడు మా గ్రామానికి దగ్గర్లో వున్న మరో గ్రామంలో వుండే మల్లన్న దేవుని గుడికి మా అమ్మతో కలిసి వెళ్ళేవాడిని. అక్కడ సాయం సమయంలో భక్తులందరూ భజనలు చేసేవారు, కోలాటాలూ వేసేవారు. అలా శరీరం అలసిపోయిన తరువాత ధ్యానిస్తే ఎంతో బావుంటుంది కదా అనిపిస్తుంది. అందుకే అలా అలిసిపోవడానికనే ఓషో ఏక్టివ్ మెడిటేషన్లు సూచించాడు. అయితే దానికి కొద్దిగా గుంపు వుంటేనే ఉత్సాహంగా వుంటుంది. అందరితో కలిసి ఆడుతూ పాడుతూ అలౌకిక ఆనందంలోకి వెళ్ళవచ్చు.



8 comments:

  1. ఎందుకో ఏమోDecember 9, 2011 at 12:18 PM

    షరామామూలుగా భావుకత్వం పొంగిపోర్లింది

    ReplyDelete
  2. bhakthi ki dhyanani ki

    samanvayam kanipisthunnadi

    nice

    ?!

    ReplyDelete
  3. @?!
    లేదండీ. నాది (ఇంకా) దొంగ భక్తే. ఇదివరలో తిండి కోసం ఆలయల్లోకి వెళ్ళే వాడిని - ఇప్పుడు ధ్యానించడానికి అనువైన ప్రదేశాలని వెళుతున్నాను. అందువల్ల ఫుడ్డుకీ, మెడిటేషనుకీ సమన్వయం కుదురుతోందని అనుకోవచ్చు :)

    ఎక్కడ భజనలు జరుగుతాయా అని చూస్తున్నాను. కోలాటాలు కానీ చెక్క భజనలు కానీ ఇక్కడ వుండేంత దృశ్యం కనిపించడం లేదు. (ఇహ నేనే నేర్చుకొని మొదలెట్టాలేమో!). ఏ దేవుడి భజనలు అయినా, ఏ దేవాలయం అయినా కూడా నేను స్మరించుకునేది మాత్రం నా దేవతలనే.

    ReplyDelete
  4. :) :) :)

    చిత్తూర్ నాగయ్య గారి వేమన Movie చూసారా ?

    అభిరాముడు సూర్య నమస్కారం చేస్తుంటే

    వేమన ఏదో అంటాడు, దానికి అభిరాముడు
    శివ శివ పొద్దున్నే ఏమిటి ఇది
    శుభమా అంటూ సూర్య నమస్కారం చేస్తుంటే అనగానే
    వేమన ఇలా అంటాడు

    సగం చదువు కున్న వాళ్ళతో ఇదే పేచి

    "ఉషః కాలే వేశ్యా ధ్యానం" సర్వ0 సిద్ధి కరం లి
    correct sentence formation జ్ఞాపకం లేదు కాని మీ reply చూస్తుంటే
    ఆ seen జ్ఞాపకం వస్తున్నది
    వీలైతే ఆ movie చూడగలరు
    ?!

    ReplyDelete
  5. @?!
    హహ. ఆ సినిమా చిన్నప్పుడు చూస్తే చూసానేమో కానీ గుర్తుకులేదు. వేమనగా నాగ్ వేషం వెయ్యబోతున్నాడని ఎక్కడో ఓ పుకారు విన్నా :)) అప్పుడు ఆ డైలాగ్ వుంటుందేమో చూస్తా లెండి. పాత వేమన దొరికినా చూస్తాను.

    ReplyDelete
  6. ఏమయ్యా.. ఏందుకో ఏమో?

    విప్పీ విప్పకుండా చూపించి ఏడిపించే హ్హీరోయిన్ల లెక్క ..వేమన ఇలా అంటాడు అని వేశ్య అనే ఒకే పదం అర్థం అయ్యేలా వ్రాశావ్.. పూర్తిగా ఏమన్నాడో చెప్పు మరీ..

    ReplyDelete
  7. ఇదేమిటో చోద్యం, ధ్యానం చెయ్యటానికి ఇంత కష్ట పడతారు. నేను రోజు రాత్రి పడితే టాం అని ధ్యానంలోకి జారుకుంటాను, తెల్లారి ఆరుదాక ధ్యానం లో ఆదమరిచి ఏక్టివ్ గా ఉంటాను. ఈ పాటి దానికి వీళ్ళు, గుళ్ళూ, మెడిటేషన్ సెంటర్ లు ఎందుకు చుడతా రబ్బా ? అంతా ఈ కాలం పోకడ ! ఈ కుర్రకారుకి ధ్యానం అంటే వేరే ఏమిటో అనుకున్నట్టునారు సుమీ !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  8. @ జిలేబీ
    మా ఇంట్లో అప్పుడప్పుడు నేను కూడా మీ లాగే కవరింగ్ ఇచ్చుకుంటుంటాను. శవాసనంలో ధ్యానిస్తా అని చెప్పేసి హాయిగా బజ్జుంటా.

    ReplyDelete