- పనులు తొందరగా జరుగుతాయి. అవినీతి అంతగా లేని దేశాల్లో అధికారులు లంచమూ తీసుకోరు, పనులూ చేయరు. భారత్ లో అయితే లంచం తీసుకొని అయినా పనులు త్వరగా చేస్తారు. యు ఎస్ లాంటి దేశాల్లో లంచాలు తీసుకోరు కనుక ప్రభుత్వ పనులు తొందరగా జరగవు. చిన్న పనికోసం నెలలకు నెలలు తీసుకుంటారు.
- అవినీతితో సంపాదిస్తే ఇంట్లో పెళ్ళాం, పిల్లలూ మెచ్చుకుంటారు. సాధారణంగా వాళ్లకి కావాలిసింది వాళ్ల కోరికలూ, సరదాలూ తీరడం కానీ డబ్బు ఎక్కడనుండి వచ్చింది అనేది పట్టించుకోరు. పైగా ప్రోత్సహిస్తారు కూడానూ. లంచం తీసుకొనే అవకాశం వున్నా కూడా తీసుకోకుండా మడి కట్టుకొని వుంటే ఇంట్లో వాళ్ళు అలాంటి వారిని సన్నాసుల్లా చూస్తారనేది నా ప్రగాఢాభిప్రాయం. నా అదృష్టం కొద్దీ నేను అందరికీ లంచం ఇవ్వడమే కానీ నాకు ఎవరూ లంచం ఇచ్చే స్థితి లేదు. అలాంటి స్థాయే వుంటే లంచం తీసుకోకా, ఇంట్లో ఆ ప్రోత్సాహం భరించలేకా నలిగిపోయివుండేవాడిని.
- అమెరికా ఆర్ధిక స్థితి పట్టాలు తప్పుతుండటానికీ, భారత్ ఆర్ధిక స్థితి బాగా మెరుగుపడుతూ వుండటానికి కారణం అవినీతే అని నా నిశ్చితాభిప్రాయం. అమ్రికా భారత్ నుండి నేర్చుకోవాల్సింది ఎంతయినా వుంది. మన దేశీలు శాయశక్తులా కృషిచేస్తూనే వున్నారు లెండి కానీ అమ్రికా అంత త్వరగా అందిపుచ్చుకోవడం లేదు :( ఓ పదేళ్ళ క్రితం కెనడాలోని మా మిత్రుడొకడు శుబ్బరంగా లంచం ఇచ్చి డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నాడు. ఇంకో మిత్రుడు తన గ్రోసరీ షాపు వెనకాల వున్న చిన్న వీధిని నెమ్మదినెమ్మదిగా కలిపేసుకున్నాడు.
ఇంకా చాలా లాభాలు వుండేవుంటాయి కానీ అవన్నీ మీరే చెప్పండి. అన్నా హజారే లాగే అమెరికాలో అవినీతి (పెంచడం) కోసం ఓ సున్నా హజారే ఎవరయినా ఉద్యమం లేవదీస్తే కానీ ఈ దేశం బాగయిపోదేమో!
మన వాళ్ళకి కొంచెం లంచం ఇవ్వండి...మీరు కోరుకునే సున్నా ఉద్యమం మొదలు పెడతారు...
ReplyDeleteలంచం ఇచ్చినోడికి కావాల్సిన పని అయితే, పుచ్చుకొన్నోడికి ధన లాభం. ఇందులో ఎవరికీ అన్యాయం జరగలేదు కాబట్టి, అన్యాయం జరిగింది అని ఎవరూ కంప్లైంట్ చేయలేదు కాబట్టి, అంటే కక్షిదారులు ఎవరూ లేరు కాబట్టి, వారిద్దరి మీద ఎవరూ విచారణ చేపట్టరాదు. ఒకవేళ చేపట్టినా అప్పటికే లంచాలు తీసుకొన్న వారు, తీసుకొంటున్నవారి మీద విచారణ లు చేపట్టలేదు కాబట్టి, వీళ్లను కూడా ఏమనకూడదు,
ReplyDeleteఅందుకని లంచం ఇచ్చేవాడూ మంచోడే, తీసుకొనేవాడూ మంచోడా, లంచాలు లేని సమాజం అభివృద్ది చెందదు కాబట్టి సున్న ఉద్యమం అమెరెకాలో రావాల్సిందే, అవసరమయితే ఆ ఉద్యమం కోసం ఓ ఓదార్పు యాత్ర కూడా చికాగో లో పెట్టిస్తే పోతుందేమో ఆలోచించండి :)
సరే ఈ సారి ఎప్పుడన్నా పోలీసు ఆపినప్పుడు ఒక ఏభయ్యో వందో చేతిలో పెట్టి మొదలెట్టండి మరి. ఆలీసం ఎందుకు, రేపే స్పీడ్ గా లాగించండీ కారు ను మరి.
ReplyDeleteడబ్బు ఉన్నవాళ్ళు లంచమిచ్చి పని చేయించుకుంటారు. డబ్బు లేని వాళ్ళకు పనులెలా అవుతాయి ? లంచానికి అలవాటుపడితే అది ఇవ్వనిదే విధినిర్వహణ చెయ్యటానికి ఇష్టపడరు ఎవరూ.
ReplyDeleteడబ్బులు ఉన్నవారికి కూడా అలా లంచాలు ఇచ్చుకుంటూ పోతే మళ్ళీ ఆ డబ్బు సంపాదించటానికి వాళ్ళూ తిరిగి లంచాలు తీసుకుంటూ ఉంటారు. ఇదొక విషవలయం అయిపోతుంది.
అవినీతి అంతగా లేనిదేశాల్లో లంచమూ తీసుకోరు. పనులూ త్వరగా చేయరు. అంటున్నారు. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
లంచాన్నీ ఆశించేవారు అది ఇస్తే త్వరగా పనులు చెయ్యటం ఇవ్వకపోతే ఆలస్యంగా చెయ్యటం అంటే విషయం తెలుస్తూనే ఉంది.
కానీ లంచాలు అలవాటు లేని చోట పనులు ఆలస్యంగా చేస్తున్నారంటే ఇదేదో అర్ధం కాని విషయంలా ఉంది. వాళ్ళు త్వరగా పనిచెయ్యకపోవటానికి కారణమేమిటో ???
ఆ సున్నా హజారే మీరే ఎందుకు కాకూడదు . పైగా పేరులో మొదటి అక్షరం కూడా కలిసింది .
ReplyDeleteభారతీయ అవినీతిని గురించి కొందరు బహుళజాతి సంస్థల అధినేతల్ ఎకానమిస్టు పత్రికతో మొత్తుకున్నారట - ఎక్కడైనా లంచమిస్తే పని తొందరగా జరుగుతుంది. ఇండియాలో లంచమిచ్చినా పని జరుగుతుందని నమ్మకం లేదు సరిగదా సదరు ఆఫీసరు మన ప్రత్యర్ధి నించి ఇంకాస్త ఎక్కువ మింగి వాళ్ళకి మన నెత్తిన టోపీ వేస్తాడు - అని.
ReplyDeleteమనలోమాట - అమెరికాలోనూ ఉంది అవినీతి, కాపోతే కొంచెం కర్సెక్కువ అంతే. కనీసం ఓ మిలియన్ గిట్టుబాటయితే తప్ప, పదికీ పాతిక్కీ కక్కుర్తి పడరు. ఏడాది రెండేళ్ళ కిందట ఒక లూసియానా కాంగ్రెస్మన్ని అరెస్టు చేశారు - గురుడు రిఫ్రిజిరేటర్లో దాచాట్ట నోట్ల కట్టల్ని.
@ kvsv
ReplyDeleteఉద్యమానికి నన్నే ఊపిరిపొయమంటారు!
@ అజ్ఞాత
బావుందండీ మీ విశ్లేషణ ;) విన్ విన్ సిచువేషన్ కదా.
@ భావన
చూసారా - అవినీతి వల్ల లాభాలేంటో మీరే చెబుతున్నారు. కార్లు వేగంగా వెళితే పనులు కూడా వేగంగా అవుతాయి కదా.
@ అజ్ఞాత
ReplyDeleteత్వరగా పని చెయ్యకపోవడానికి అలసత్వం కారణం. లంచం వచ్చే అవకాశం వుంటే అది పని చెయ్యడానికి ఉత్ర్ప్రేరకంగా పని చేస్తుంది. పని తొందరగా చేసినా చెయ్యకున్నా వచ్చే నష్టం లేదు కాబట్టి ఇక్కడి ప్రభుత్వోద్యోగులూ పనులు తాపీగా చేస్తారనుకుంటున్నాను.
@ లలిత
మీ అందరి ప్రొత్సాహం చూస్తుంటే మొదలెట్టాలనే అనిపిస్తోంది. చూస్తా చూస్తా ఇక్కడ లంచం తీసుకోవడానికి తగిన బకరా ఎవరయినా దొరుకుతాడేమో చూస్తా.
@ కొత్తపాళీ
అవినీతి అనేది ఎక్కడయినా వుంటుంది లెండి కానీ శాతాల్లోనే తేడా అంతా. అంతగా అవినీతి లేకపోతే ఇండియా జనాలు ఇబ్బంది పడతారనేది నా దృఢాభిప్రాయం. అందుకే అక్కడి అవినీతికి నా వంతు సహకారం అవసరం అయినప్పుడల్లా (అనగా తప్పనప్పుడల్లా చచ్చినట్లు) సహకరిస్తూనే వుంటాను.
మీరు పోలీసు ఉద్యోగానికి ట్రయ్ చేస్తున్నపుడే అనుకున్నా ఇలాంటి అయిడియా ఎదో ఉంటుందని!
ReplyDelete@ గాలి
ReplyDeleteఅప్పుడు లేదు కానీ ఇప్పుడు మీ వ్యాఖ్య చూసింతరువాత వచ్చింది :)
నిజమే..., అవి "నీతే"...
ReplyDelete