నిన్న దూకుడు సినిమాకి వెళ్ళాం. మహేశూ, సమంతా ఇద్దరూ ఇష్టమయిన వాళ్ళు కావడంతో సినిమాకు వెళ్ళక తప్పలేదు. సమంతా ఇంకాస్త లావుంటే బావుండేది. ఈ సినిమా గురించి ఇప్పటికి చాలామంది చాలా చెప్పేసారు కాబట్టి పెద్దగా నేను చెప్పడానికి ఇంకేమీ లేదు. కానీ ఒకట్రెండు విషయాలు. సినిమా అంటే చెవుల్లో పూలే అని తెలిసే వెళతాము కానీ అలా అని మరీ క్యాబేజీ పూలు పెడితేనే చిరాకు వస్తుంది. ఈ సినిమాలో పెద్దాయనకు బయటి ప్రపంచం తెలియకుండా అన్నేళ్ళు అందరూ అలా నాటకాలాడుతూనే వుండటం అనే విషయం నాకంతంగా జీర్ణమయ్యింది కాదు. ఆ కథా లోపం వున్నా కూడా సినిమాలో మిగతావన్నీ మంచిగా కుదిరాయి కాబట్టి ఆ దూకుడులో ఆ లోటు కొట్టుకుపోతుంది కాబట్టి సినిమా అబవ్ ఏవరేజిగా మిగిలిపోయింది. అలాంటి కొన్ని పొరపాట్లూ సవరించుకొని వుంటే పోకిరీకి దీటుగా దూకేదేమో.
ఈ సారి బాగానే నేను చదివినంత వరకు వెబ్ సైట్లు కానీ, బ్లాగర్లు కానీ కథలోని ముఖ్యమయిన మలుపులు బయటపెట్టలేదు. ఒక వెబ్సైటులో ఒక ట్విస్ట్ గురించి చిన్న హింట్ ఇచ్చి వదిలారు. అదేంటా అనుకుంటూ ఉత్సుకత పడుతూ వుంటే a2z డ్రీంస్ గారు తమ డోంట్ క్లిక్ బ్లాగులో ఎంచక్కా అది చెప్పెయ్యడంతో నా ఉత్సుకత నీరు కారిపోయింది. సినిమా చూసిన అత్యుత్సాహంలొ అలా చెప్పేసి వుంటారు కానీ చెప్పకపోయివుంటే బావుండేది. ఆ విషయం సినిమా చూస్తూ తెలుసుకుంటే కాస్త సంభ్రమంగా వుండేది. ప్చ్.
అందుకే అందరికీ ఓ విన్నపం. సినిమాలు చూడండి - ఎలా వుందో చెప్పండి కానీ ముఖ్యమయిన ట్విస్టులన్నీ విప్పదీసి మాకు చూపకండి. నగ్నమయిన సినిమాను చూసేందుకు ఇంకేం మిగిలివుంటుంది? విశ్లేషకులకు, రంధ్రాన్వేషకులకు ఇంకా ఎనలైజ్ చెయ్యాలని వుంటుండొచ్చు కానీ మాలాంటి మామూలు జనాలకు కాస్త కాస్త తెలుస్తుంటేనే చూడబుద్ధి అవుతూ వుంటుంది. కదూ. ప్లీజ్.
ఇక నుంచి నేను కూడా చెప్పను. మీ మీద ఒట్టు.
ReplyDeleteమీరు సినిమా గురించి అన్ని బ్లాగుల్లోనూ చదివి మరీ సినిమాకెళ్లడం దేనికో నాకర్ధం కాదు. ఫలానా బ్లాగులో చెప్పేశారు అని తెగ ఇదైపోవడమొకటి మళ్ళీ.
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteసంతోషం :)
@ మినర్వా
కొద్దికొద్దిగా తెలుసుకోవడం కోసం అవన్నీ చూస్తుంటాను. కథ మొత్తం తేటతెల్లం చేస్తారు కాబట్టి కొన్ని బ్లాగుల సినిమా పోస్టులు చదవను. ఉదాహరణకు రవి గారు బ్లాగు. ఎంచక్కా విప్పదీసి చూపిస్తారు - కథ. ఇహ వెబ్ సైట్లు కథ చెబుతున్నాయని అనుమానం వస్తే కళ్ళు తిప్పేసుకుంటాను. టైటిల్లోనే ట్విస్టులు చెప్పేస్తే మాత్రం తిట్టుకోకుండా వుండలేను.