బజ్జుల వాళ్ళ బ్లాగులకు లాభమా లేక నష్టమా?

(లేఖిని ఎందుకో పనిచేయడం లేదు. గూగుల్ వారి ఉపకరనంతో కుస్తీ పడుతూ వ్రాస్తున్నా ఇది)

కొంతమందయినా గూగుల్ బజ్ కి తరలి వెళ్ళారు. అలాంటివారు అప్పుడప్పుడూ బ్లాగుల్లో తచ్చాడ్తున్నారు కానీ ఎక్కువ సమయం బజ్జుల్లోనే గడిపెస్తున్నట్లుగా తోస్తోంది. అందులో కొంతమంది బజ్జులో సమయం బాగా తినేస్తోందని వాపోవడమూ వింటున్నా. ఎనీ వే, చెత్తంతా బజ్జుల్లో కొట్టుకుపోయిన్దనుకోవాలా లేక మేరునగ దీరులందరూ బ్లాగులని నిర్లక్ష్యమ్ చేస్తున్నారు అనుకోవాలా? బజ్జుల వల్లనే బ్లాగులు కాస్త ప్రశాంతంగా ఉంటున్నాయా లేక దానివల్లనే బ్లాగులు బోరింగుగా ఉంటున్నాయా? మీ అభిప్రాయం ఏంటో?

14 comments:

  1. WHAT IS గూగుల్ బజ్ ?

    ReplyDelete
  2. @WHAT IS గూగుల్ బజ్ ?

    Virus

    ReplyDelete
  3. whats google buzz..?
    How these guyz are carried away by it? Please explain in detail.

    ReplyDelete
  4. these guyz???

    who?

    ReplyDelete
  5. మా అన్యాలు అందరూ బజ్ లలో ఆడుకుంటున్నారు
    అసందర్భ కామెంట్స్ , నేను బూట్లు నాకుతా, నువ్వు నా బూట్లు నాకుతావ అనే కామెంట్స్ అన్ని అక్కడే ఉంటున్నాయి


    "బ్లాగు వీధులలో కాదురా , బజ్ ల బజార్ లలో చూసుకుందాం నువ్వు బాగా మొరుగుతావో నేను బాగా మొరుగుతానో "
    (సమర సింహారెడ్డి డవిలాగు ) అని మా అన్యాలు అనుకుంటున్నారు

    మార్తాండ అన్యా మీద బజ్ కొడితే ఒక 100 కామెంట్స్ 20 like లు రాల్తాయి ( నాది హామీ )

    సంకలిని లో కెలుకుడు విభాగం మూత పడింది శానా కాలం గా ఎవ్వరూ కేలుక్కోవడం లేదు

    మీరు బ్లాగ్ ల మీద పుస్తకం రాసినట్లు మా అన్యాలు కూడా రాస్తున్నారు
    "అసందర్భ కామెంట్స్ పెట్టడం ఎలా" -- మార్తాండ శర్మ అన్యా
    "ప్రయత్నం - సింగిల్ ప్యాక్ నుంచి సిక్స్ ప్యాక్ వరకూ" -- రామరాజు అన్యా
    "చింపిరి జుట్టు అమ్మాయి - కుక్కపిల్ల" - రాజ్ కుమార్ అన్యా
    "బెమ్మండం - మా బెమ్మెల జీవితం " - శ్రీ శ్రీ శ్రీ నాగానంద స్వామీ ( నాగ ప్రసాద్ )
    "నా తిండి గోల " -- అల్లం చారు ( అసలు పేరు నాకు తెలియదు )
    (మిగిలిన పుస్తకాల గురించి మా అన్యా రాస్తాడు )

    నేను అయితే మాత్రం బ్లాగులు చదువుతున్నా ( కామెంట్స్ పెట్టడం లేదు )
    రెండు బ్లాగుల్లో స్మైలీ లు పెట్టి
    నాలుగు బజ్ లలో కేవ్వ్వ్వవ్వ్వ్వ్ కేవ్వ్వ్వవ్వ్వ్వ్ మని గోల చేసి
    పది పోస్ట్లు రీ షేర్ చేసి ఏదో ఇట్లా గడిపేస్తున్నా


    అది సరే గాని మీకు కెలుకుడు లేకపోతె నిద్ర పట్టేటట్లు లేదనుకుంటా
    మరెందుకాలస్యం వారందరినీ బ్లాగులలో కి పిలుద్దాం

    @ మలక్ అన్యా వెంటనే మార్తాండ అన్యా మీద కపిత్వం రాయి , నేను, మా భాస్కర్ అన్యా వచ్చి కంమేట్లు రాస్తాం
    శరత్ అన్యాకి బోర్ కొడుతోంది అంట

    ReplyDelete
  6. దానికి తోడు గూగుల్ plus ఒకటి .

    ReplyDelete
  7. @ అజ్ఞాత
    Google Buzz is a social networking and messaging tool from Google that is integrated into the company's web-based email program, Gmail. Users can share links, photos, videos, status messages and comments organized in "conversations" and visible in the user's inbox.

    http://en.wikipedia.org/wiki/Google_Buzz

    బజ్జుల్లో మన భట్రాజులే వుంటారు తప్ప అనామకులు, అజ్ఞాతలు వుండరు కనుక కొంతమందికి అది సౌకర్యంగా వుంటుంది. అది గ్రూప్ ఏక్టివిటీ. మనం అనుమతించిన వారికే మన బజ్జు చేరుతుంది కనుక మనకు దానిమీద కంట్రోల్ వుంటుంది. బ్లాగుల్లో కూడా అలాంటి సౌకర్యం వుంది కానీ బ్లాగులు సాధారణంగా వీలయినంతమందికి చేరడానికని వ్రాస్తాం. బజ్ మన గ్రూపు కి చేరడానికి మాత్రమే వ్రాస్తాం. బజ్ వల్ల తక్కువమందితో ఎక్కువ స్నేహం చెయ్యవచ్చు. తెలిసిన వారితోనే బజ్ చేస్తాం కాబట్టి కంఫర్టబులుగా వుంటుంది.

    ReplyDelete
  8. @ అప్పి భాయ్
    బోరు కొట్టడం ఏమీ కొట్టడం లేదు. హాయిగా, ప్రశాంతంగా వుంది :))

    @ కొత్తపాళీ
    ధన్యవాదాలు. సవరిస్తాను. మేరు అనే నగరంలో ధీరులు వుండేవారేమో అనుకుంటున్నా :)

    ReplyDelete
  9. తెలిసిన వారితోనే బజ్ చేస్తున్నామన్నది అ౦దమైన భ్రమ :) , బ్లాగుల్లో ఒకరు వేరే వేరే ఐడీ లతో ఎన్ని బ్లాగులైన వ్రాసినట్లే, అదే పేర్లతో బజ్జులో ఉ౦టారు కదా . ప్రతిసారి పేరు టైప్ చెయ్యక్కరలేదు కాబట్టి అజ్ఞాత గా వ్రాయవలసిన పని లేదు. 'బజ్జు పేరు' పెట్టుకోవచ్చు.

    ReplyDelete
  10. శరత్ అన్నయా
    మీరు కూడా బజ్ లలో ప్లస్ లలో కి వచ్చెయ్యకూడదూ , 'బ' లాగులో ప్రశాంత వాతావరణం ఉంటుంది :))))

    ReplyDelete
  11. @ మౌళి
    ఎదుటివాడు వేషాలు వేస్తుంటే బ్లాక్ లేదా బ్యాన్ చేసే వీలు అందులో వుంది కదా. నమ్మకం వున్న వారికే బజ్ ఏక్సెస్ ఇవ్వాలి మరి.

    @ అప్పి
    నన్ను కూడా బజ్జాత్కారం చేద్దామనే! బ్లాగుల్లో కనీసం నేను కూడా లేకపోతే మరీ బోసిపోయినట్లే అయిపోతుందండీ బాబూ :))

    ReplyDelete
  12. well said Sarat,miru kuda lekapote blogs bosi pothayi.

    Ippatike regular bloggers anta buzz lo settle ayyaru.Chala boring ga undi blog world.

    ReplyDelete
  13. @ అజ్ఞాత
    నేను కూడా ఈమధ్య సాధు జంతువుని అయిపోవడం వల్ల వెరయిటీ టపాలు వెయ్యలేకపోతున్నాను. కొంతకాలం ఇలా విశ్రాంతి తీసుకుంటున్నాను. మళ్ళీ ఎప్పుడు నా రెగ్యులర్ ట్రాకులోకి వస్తానో తెలియదు. ఇహ మిగతావారూ అవో ఇవో వ్రాస్తున్నారు కానీ వైవిధ్యం తక్కువే వుంది కాబట్టి నాకూ ఆసక్తి తగ్గిపోతోంది. మరీ అందరూ హుందాగా వ్రాస్తున్నారు. బ్లాగుల్లో వేధింపులు వద్దని అనుకుంటే చిలిపితనాలు కూడా కరువయినట్లున్నాయి.

    ReplyDelete