మొన్న మా ఇంటికి మా ఊర్లోనే వున్న మా బంధువు రాం, అతని భార్యా వచ్చారు. అందరం కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ అలా అలా బాల్య స్మృతుల్లోకి వెళ్ళాం. చిన్నప్పుడు ఎలాంటి కూరలు తినేవాళ్ళం అన్న విషయానికి వెళ్ళిపోయింది మా ముచ్చట. ఒట్టిచేపల కూర మా అమ్మమ్మ చేసిపెడితే ఎంతో ఇష్టంగా తినేవాడినని చెప్పాను. ఆ కూర ఎలా వుంటుందో ఓ దృశ్యం వేసుకున్నాం. ఎండబెట్టిన చేపల కూరలో ముదురు గోంగూరా, దోసకాయ, టమాటా వేసి వండితే నా సామి రంగా అంటూ రాం నోరు ఊరించాను. అతనికీ తన ఊర్లో తన తాతయ్య వండించిన కూరలు గుర్తుకువచ్చాయి. అవి తాను చెప్పుకువచ్చాడు. అలాంటి కూరలకు తోడుగా కల్లు వుండాలీ...ఆహా అని నోరు కార్చుకున్నాను నేను.
కట్ చేస్తే ఆ బంధువు/మిత్రుడు ఇంటికి నిన్న నాన్నల రోజు సందర్భంగా పిలిచి పార్టీ ఇచ్చారు. మళ్ళీ ఆ కూరల టాపిక్ వచ్చింది. మొన్న ఇంటికి వచ్చి ఒట్టి చేపల కూర వండేసుకున్నామని చెప్పేడు అతగాడు. ఆ రోజు అలా నేను కూర గురించి చెప్పాకదా. అదే రోజు వాళ్ళావిడ గ్రోసరీకి వెళితే ఎండు చేపలు కనిపించాయిట. ప్రయోగం చేద్దామని తీసుకువచ్చింది. భర్త దర్శకత్వం కొంత తీసుకొని ఆ కూర వండేసింది. అలా ఆ కూర చాలా చక్కగా వచ్చేసిందిట - మా రాం లొట్టలేకుంటూ తిన్నాడంట. నాకు నోరూరింది. ఆ కూర ఏమన్నా మిగిలివుందా అని అడిగా. లేదు అయిపోయింది అని చల్లగా చెప్పాడు. పోనీ అంటు ఏమయినా వుందా అని అడిగేసా నాలుక తడుపుకుంటూ. ఊహు, అంటు చుక్క లేకుండా అయిపోజేసా అని అన్నాడు. నేను ఉసూరుమన్నాను. అలాంటి చక్కని కూర వండుకొని తినడమేనా ఊర్లో వున్న మాకు ఏమయినా ఇచ్చేదిలేదా అని గయ్ మన్నాను. వాళ్ళింటికి మా ఇల్లు కొద్దిదూరంలోనే వుంటుంది. మరోసారి కూరవండితే అలాగే ఇవ్వడమో లేదా నన్ను పిలవడమో చేస్తా అని హామీ ఇచ్చేడు.
వాళ్ళింట్లో లోపలి గదిలో కబుర్లాడుతున్న మా ఆవిడని పిలిచి చెప్పాను - రేపే ఎండు చేపలు పట్రమ్మని. అలాగే అని హామీ ఇచ్చింది కాని నాకంత నమ్మకం లేదు. ఆమెకు ఆ ఎండుచేపల వాసన అంటే అసహ్యం - ఇంకేం తీసుకువస్తుందీ. ఇహ నేనే తెచ్చుకొని వండేసుకొని రాం ని ఊరించెయ్యాలి. కూర సరిగ్గా కుదురుతుందంటారా? ఎలాగూ ఇక్కడ కల్లు వుండదు కాబట్టి వైనో, బీరో ముందెట్టుకోవాలి. చేపల కూరలోకి వైను బెటరా లేక బీరు బెటరా?
విశ్వనాథ్ గారు "పోకిరి" సినిమా డైరెక్ట్ చేసినట్టో, పూరి జగన్నాథ్ "శంకరాభరణం" డైరెక్ట్ చేసినట్టో ఉంది మీరు ఇలాంటి వంటింటి కబుర్లు, చేపల పులుసు కబుర్లు చెపుతుంటే...మనకెందుకు గురూగారు ఈ "వంట- వార్పు" కబుర్లు? ఎంత ఎఫ్ ఎల్ ఆర్ లో ఉంటే మాత్రం మరీ ఇంత మమైకమైపోవాలా?
ReplyDeleteWINE. Konchem kalluki daggaraga undedi ade. Beerlo unde chedu valana Enduchepa ruchi thelavadani na anumanam.
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteఅంతేనంటారా? అయితే నాకూ ఇమేజ్ సమస్య వచ్చేసిందన్నమాట :) అలా ఇమేజ్ చట్రంలో కూరుకుపోవద్దనే అప్పుడప్పుడన్నా ఇలా కాస్త అవో ఇవో వ్రాస్తుంటాను.
@ అజ్ఞాత
మందు తాగేవాడు చేదుకి సిద్ధంగానే వుంటాడు లెండి. ఇక్కడ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పేటియోలో కూర్చొని బీరు కొడుతూ ఈ కూర నంజుకోవడమే చక్కటి కిక్కు ఇస్తుందనుకుంటా. నిన్న శాంస్ క్లబ్బులో ఎండు చేపల కోసం వెతికాను కానీ కనిపించలేదు. ఫ్రోజెన్ వి మాత్రమే అక్కడ వున్నాయి. మళ్ళీ ఎక్కడన్నా వెతకాలి.
try in Korien shop
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteమంచి సూచన ఇచ్చారు. ఎండు చేపలు ఎక్కడ దొరుకుతాయా అని ఆలోచిస్తున్నాను. మా ఇంటికి దగ్గర్లోనే ఒక కొరియన్ షాప్ వుంది. అక్కడ ప్రయత్నిస్తాను.
మీకొచ్చే కామెంటులన్నీ అజ్ఞాత గానే ఎందుకు?
ReplyDeleteమీకు మీరే కామెంటులు రాసుకుంటారా?
బజ్జుకి వచ్చేయండి
అక్కడ ఈ అజ్ఞాతల గొడవలుండవు
@ అజ్ఞాత
ReplyDeleteఅవునండి. మీరు వేసిన కామెంటు కూడా నేను వ్రాసుకున్నదే!
ఒక వైపు మీరు అజ్ఞాతంగా కామెంటుతూ మిగతావారు ఎందుకు అజ్ఞాతంగా కామెంటుతున్నారంటే ఇహ నేనేం చెప్పేది? మీరెందుకు అజ్ఞాతంగా వచ్చారో అలాగే వారి కారణాలు వారికి వుంటాయి. కొంతమంది సిగ్గుపడో, కొంతమంది బహిరంగంగా వ్యాఖ్యానిస్తే మైల అంటుతుందనో కూడా అలా వస్తుండొచ్చు. అయినా అలాంటి వ్యాఖ్యలతో నాకు ఎప్పుడో ఒకప్పుడు తప్ప సమస్య ఏమీ లేదే. అజ్ఞాతంగా కామెంట్ వేసేవారే తమ మనసులోని మాటలు మొహమాటం లేకుండా చెబుతారు. వారిలోని ఫ్రాంక్నెస్ నాకు నచ్చుతుంది.
బజ్జులో వ్రాసుకుంటే కేవలం మన భజన బృందం మాత్రమే చూస్తుంది. పరిధి తక్కువవుతుంది. అందుకే ప్రస్థుతానికయితే నేను బజ్జో దలుచుకోలేదు.
మీ "ఒట్టిచేపల కూర వుందా? పోనీ అంటు అయినా వుందా?" పోస్ట్‌పై అజ్ఞాత క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:
ReplyDeleteబజ్జులో వ్రాసుకుంటే కేవలం మన భజన బృందం మాత్రమే చూస్తుంది. పరిధి తక్కువవుతుంది. అందుకే ప్రస్థుతానికయితే నేను బజ్జో దలుచుకోలేదు.
-----------
ఇది అన్నేయం అద్దెచ్చా .. బజ్జుల్లో రాసేటోళ్ళు బజన సంగాలు అనడాన్ని తీవ్రంగా కండిత్తన్నాం.
బజ్జుల్లో మనోడు సృష్టించుకున్న 22 ఫేకు ఐడీలూ, తానా అంటే తందానా అనే లేడీ [Edited]ఏమయిపోవాల?
@ అజ్ఞాత
ReplyDeleteమీరు బూతులేమీ వ్రాయకపోయినా ఆ జంతువుకి వచ్చిన ఖ్యాతి వల్ల ఎదవ గొడవ ఎందుకులే అని ఎడిట్ చెయ్యకతప్పింది కాదు.
ఏమోనబ్బా, ఫేక్ ప్రొఫయిల్ చేసుకొని మరీ రావచ్చనుకోండి కానీ ఆ కాంటాక్ట్స్ ఏక్సెప్ట్ చేసేవారికయినా తెలిసివుండాలి కదా. తెలవకుండానే బజ్జులకి ఆమోదిస్తే వాళ్ళ ఖర్మ. అయినా బజ్జుల గురించి నాకు ఎక్కువ తెలియదులెండి. అవి చూడడం లేదూ - చెయ్యడం లేదూ.