బరువు తగ్గించకుండానే బొజ్జ తగ్గించడం ఎలా?

ఎలా...? నాకు తెలిసింది తక్కువ - మిమ్మల్ని అడగాల్సిందే ఎక్కువ. అందుకే మీకు తెలిసిన విషయాలుంటే చెప్పండిక. నా బరువు 52 కేజీల ప్రాంతంలో తిరగాడుతోంది. ఈ వారంతానికల్లా 50 కి దిగొచ్చు. అంతకంటే బరువు దిగడం నా ఆరోగ్యానికి హానికరం కాబట్టి ఇక బరువు తగ్గించకుండా మిగతా పొట్టను తగ్గించే కృషిలో వున్నాను. నా నడుము/బొజ్జ/పొట్ట సైజు 32 అంగుళాలు వుంది. ఆటగాడి శరీరం కావాలంటే దాన్ని 28 కి తగ్గించక తప్పదు.

మనం కనుక బరువు ఎక్కువగా వుంటే పొట్ట తగ్గించడానికి ముందు చెయ్యాల్సింది బరువు తగ్గడం అనుకుంటాను. అది సరే. బరువు తగ్గినా సరే ఇంకా పొట్ట తగ్గాల్సినప్పుడే వస్తుంది సవాలు. పెద్దగా శరీరక శ్రమ చెయ్యని కంప్యూటర్ కళాకారులు లాంటివారు , టివిలు, వీడియోలు చూస్తూ శ్రమించే గృహిణులూ లాంటివారు ఎక్కువగా ఈ ఇబ్బంది పడతారు. ఎందుకంటే వేరే అవయవాలని పెద్దగా పని చేయించేది లేదు కాబట్టి కాలరీలు సరాసరి బొజ్జలోకి వెళ్ళి బజ్జుంటాయి.

అయితే ఈ విషయానికి పరిష్కారం పొట్ట వ్యాయామాలు అంటూ బెల్లీ ఫ్యాటుని కరిగించే ప్రయత్నాలు చేస్తూ అపసోపాలు పడుతుంటారు కానీ నా అవగాహన ప్రకారం ఆ ప్రయత్నాలు వ్యర్ధం. మనం చెయ్యాల్సింది మిగతా అవయవాలకు శ్రమ కలిగించడం. అలాంటప్పుడు కాలరీలు అన్నీ అక్కడ ఖర్చు అయిపోతాయి కాబట్టి నడుము దగ్గర కొవ్వు పేరుకుపోవడం తక్కువవుతుంది. నా అభిప్రాయం కరెక్టేనా?

అందుకే నేను నిన్నటినుండి వెయిట్ లిఫ్టింగ్ మొదలెట్టాను. అంటే మీరు మరీ ఊహించేసుకోకండి. డంబెల్స్ ఎత్తడం మొదలెట్టాను. ఎంత బరువువి అని కూడా అడగమాకండి. సిగ్గుపోతుంది. మా అమ్మలు అయితే ఆ డంబెల్స్ ను తన చిటికెనవేలుతో ఎత్తగలనని చెప్పేసింది. సర్లెండి. ప్రారంభం కదా. ఎలాగోలా కానిచ్చేద్దాం.   ఓ గంట సేపు అవి చేసాను. హిందీ సినిమా తీస్మార్ఖాన్ చూసుకుంటూ నడిపించేసాను. అన్నట్లు ఆ సినిమాలోని మై నేం ఈజ్ షీలా అన్న పాట మా అందరికీ సూపరుగా నచ్చేసిందండోయ్.

అంచేత నా అవగాహన ప్రకారం బరువు తగ్గకుండానే బొజ్జ తగ్గాలంటే పొట్ట వ్యాయామాలు మానివేసి మిగతా అవయవాలలో కండ పెంచడం మొదలెట్టాలి. ఒక ప్రత్యేక ప్రదేశంలో కొవ్వు కరిగించడం అన్నది అపోహ అని నా ఫిజికర్ ట్రైనర్ ఒకరు అప్పట్లో చెప్పారు. మనం మజిల్ పెంచడం మొదలెట్టినప్పుడు శరీరం అంతా కూడా కొవ్వు తగ్గుతుంది. అలాగే పొట్టలో పేరుకుపోయిన కొవ్వు సంపద కూడా కరిగిపోతుంది.

సో, ఇక నా బొజ్జ ఎప్పటికప్పుడు ఎన్ని అంగుళాలు తగ్గుతోందో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనేవుంటాను. ఆసక్తి వున్న వారు, నాలాగే బెల్లీ తగ్గించాలనుకునేవారు, ఆథ్లెటిక్ బాడీ పెంచాలనుకునేవారు ఒక వైపు నాలా కృషి చేస్తూ మరో వైపు నా తాజా సమాచారాల కోసం చూస్తుండండి.

20 comments:

  1. potta taggalante night puta 100% rice thinakandi..in that place eat some raw vegetables and fruits..Just continue this for two months, you can see a big difference in waist size..

    ReplyDelete
  2. miru konchem rojuki oka post rayatam apesi oka 1/2 hr brisk walk cheyyandi.. :-)

    ReplyDelete
  3. @ అమర్
    బరువు, పొట్ట తగ్గడం గురించి తెలుసు. ఆ విషయం గురించి కొన్ని టపాలు వ్రాసాను. అయితే ఇప్పుడు ఛాలెంజ్ ఏమిటంటే ఒక వైపు బరువు పెంచుతూ లేదా బరువు అలాగే వుంచుతూ బొజ్జ తగ్గించడం. నెట్టులో పరిష్కారం కోసం వెతికాను. నేను చెప్పిన విషయాలనే అక్కడా చెప్పారు. మజిల్ పెంచుతూ సరి అయిన మొతాదులో ఆహారం తీసుకుంటూవుండాలి.

    @ అజ్ఞాత
    నాకు ఏ పనీ లేనప్పుడే, టపాలు వ్రాయడం తప్ప ఏ పనీ చెయ్యలేనప్పుడే టపాలు వ్రాస్తుంటాను :) అందుకే సాధారణంగా వీకెండ్స్ నా టపాలు వుండవు.

    ReplyDelete
  4. ayithe weight lifting cheyalantaru. sare mi results chuddam :)

    ReplyDelete
  5. భయ్యా,
    బొజ్జ తగ్గించాలంటే పొట్టలోపల వుండే visceral fat తగ్గాలి. ఇది skin క్రింద వుండే కొవ్వు కాదు, internal organs(చిన్న, పెద్ద ప్రేవులు) చుట్టూ వుండే fat. వ్యాయామం ఒక్ఖటే దీనికి మార్గం. BriskWalk, inclined walk, weight training, P90X(కిసుక్) లాంటివి ఏమన్నా చెయ్యాలి.
    మరీ చిన్న బరువులతో మొదలెట్టి పెంచుకుంటూ పోవడం చాలా సాంప్రదాయకమైన పద్ధతి.ఈ పద్ధతిలో ఫలితాలు చూసేసరికి మనకున్న ఆసక్తి పోవడం ఖాయం. కాబట్టి ఒక మోతాదులో బరువుల్తో మొదలెట్టండి. ఒక 10lb dumbbell ఎక్కువేంకాదు మీకు అనుకుంటున్నాను. కాకపోతే ఏదొ adhoc గా కాకుండా ఒక రొటీన్ ఎంచుకోవాలి (ఇన్ని సెట్స్, ఇన్ని రెప్స్). నాదగ్గరో weight training routine వుంది(చాలా training videos చూసి నేను తయారు చేసుకున్నది). మీకు కావలంటే చెప్పండి, కామెంట్ లాగా పెట్టమంటారా, మీకు email చెయ్యమంటారా?

    ReplyDelete
  6. @ స్వప్న
    కేవలం బరువులు ఎత్తడం అనే కాదు. ముఖ్యంగా మిగతా అవయవాలకి అన్నింటికీ పని చెప్పాలి. పండు గారు ఇచ్చిన సూచనలు చూడండి.
    @ పండు
    పొట్టతగ్గేప్పుడు ముందు తగ్గేది ఆ విసరెల్ ఫ్యాట్ అనే అని చూసాను. నేను వాడుతున్న డంబెల్స్ 5 పౌండ్లవి అనుకుంటాను. ఎప్పుడో కొనుక్కొని నిన్న తీసా కాబట్టి వాటి బరువెంతో మరచిపోయాను. ఇవాళ చూస్తాను. 10 వి కొంటాను.

    P90X కిసుక్కేంటో ముందు అర్ధం కాలేదు కాని నెట్టులో చూసాను.

    కామెంటే పెట్టండి. నాలాంటి వారికి ఇంకెవరికయినా కూడా ఉపయోగపడుతుంది కదా. థేంక్స్.

    ReplyDelete
  7. ఇదిగోనండి నేను తయారు చేసుకున్న రొటీన్. ఒక్కో exercise ఎలా చెయ్యాలో గూగులమ్మనడిగితే బొమ్మల్తో సహా చూపిస్తుంది. ఇంకో ముఖమైన విషయమేంటంటే, ఏ exercise చేసేటప్పుడైనా form is very important. ఎంతబరువెత్తాం అన్నది కాదు.

    Start with 5-8 minutes of Cardio such as 5-8 Minutes of treadmill / Elliptical Machine at moderate speed.(IMPORTANT: Do not exhaust yourself)

    Chest & Back:
    • Incline Press -- 10 Reps
    • Bent-over Rows -- 10 Reps
    • Incline Press -- 10 Reps
    • Bent-over Rows -- 10 Reps
    • Flat Bench Flyes -- 10 Reps
    • Single Arm Rows -- 10 Reps(10 with each arm)
    • Flat Bench Flyes -- 10 Reps
    • Single Arm Rows -- 10 Reps(10 with each arm)
    • Incline Pushups -- 10 Reps
    • Decline Pushups -- 10 Reps
    Legs:
    • Squats -- 10 Reps
    • Standing Calf Raises -- 10 Reps
    • Squats -- 10 Reps
    • Standing Calf Raises -- 10 Reps
    • Lunges -- 10 Reps (10 with each leg)
    • Stiff Leg Dead-Lifts -- 10 Reps
    • Lunges -- 10 Reps (10 with each leg)
    • Stiff Leg Dead-Lifts -- 10 Reps
    Shoulders & Arms:
    • Shoulder Press -- 10 Reps
    • Lateral Raises -- 10 Reps
    • Shoulder Press -- 10 Reps
    • Fontal Raises -- 10 Reps
    • Alternate Bicep Curls -- 10 Reps(10 with each hand)
    • French Press -- 10 Reps
    • Alternate Bicep Curls -- 10 Reps(10 with each hand)
    • French Press -- 10 Reps
    • Concentration dumbbell Curls -- 10 Reps (10 with each hand)
    • Triceps Kickbacks -- 10 Reps(10 with each hand)
    • Concentration dumbbell Curls -- 10 Reps(10 with each hand)
    • Triceps Kickbacks -- 10 Reps(10 with each hand)
    Abdominals:

    • Trunk Twists -- 1 Minute
    • Standard Crunches -- 1 Minute
    • Alternate Bicycle -- 1 Minute
    • Oblique Crunches ( 30 per side)
    • Leg Raises -- 1 Minute

    ReplyDelete
  8. @ పండు
    థేంక్స్ బడ్డీ. ఇంతకూ మీది ఆథ్లెటిక్ బాడీనా లేక సిక్స్ ప్యాకా?

    వెయిట్ ట్రైనింగ్ మీద ఇంతమంచి అవగాహన వున్నందుకు అభినందనలు. మీరు ఇచ్చిన లిస్టులో నాకు చాలా తెలియవు కానీ నెట్టులో చూసుకుంటాను. కొత్తింటికి మారాక ప్రింట్ తీసి గోడకు పెట్టుకుంటాను.

    ReplyDelete
  9. ఈ విషయం లో నేను చాలా లక్కీ అండి. నేనేమి చెయ్యకుండానే కరెక్ట్ యాబ్స్ వచ్చేసాయ్ చిన్నప్పుడెప్పుడో. పారంపర్యం అనుకుంటాను. మా తాతయ్య కి, మయ్య కి కూడా అంతే. మయ్యకయితే మరీను..8pack యాబ్స్..అరిపిస్తాడు ఇప్పటికి. నేనేమో 6 అడుగుల 2 అంగుళాలు ఎత్తు తో, మీరంటున్న అథ్లెటిక్ బాడీ తో ఉండేవాడిని. మధ్యలో నడుం నొప్పి వచ్చి, ఆ కాన్ఫిడెన్సు ని కుల్లబోడిచేసింది. ఇప్పుడు సెట్ అయిపోయాను.మళ్ళా అథ్లెటిక్ బాడీ ఇచ్చే కాన్ఫిడెన్సు ని ఎంజాయ్ చేస్తున్నాను.

    ReplyDelete
  10. గీడ సుడున్డ్రి
    http://exercise.about.com/od/abs/ss/abexercises.htm

    ReplyDelete
  11. @ ప్రబంధ్
    చక్కని విషయం. కీప్ ఇట్ అప్. మీలాంటి కొందరు జెనెటికల్లీ సూపరుగా వుంటారు. నాలాంటి వారు కృషిచేసి అయినా అలాంటి స్థాయికి వచ్చేసి అది నిలుపుకోవలసి వుంటుంది.

    @ శ్రీకాంత్
    థేంక్స్.

    ReplyDelete
  12. Blaagulu raayadam, gelakadam, kaamentadam etc kaaryakramaalani tagginchi, kaasta blaagu lokam nundi, internet lokam nundi bayatapadi o nela rojulu undi chudandi. mee potta alias bojja taggi potundi.

    cheers
    zilebi
    http://www.varudhini.tk

    ReplyDelete
  13. మీ అందరి అమూల్యమైన సలహాలు సూచనలకు ధన్యవాదాలు...more to Sarath and Pandu..

    ReplyDelete
  14. గురువు గాఆఆఆరు

    నేనొచ్చేసా... మా ఆఫీస్ లో ఎలాగో కామెంట్లు పెట్టకుండా బ్లాక్ చేశారు.. ఇన్ని రోజులూ చదివేవాడిని కానీ... చెప్పలేక పోయేవాడిని..

    ReplyDelete
  15. @ కాయ
    మీరొచ్చారు కానీ నేనే... మళ్ళీ రావడం ఆలస్యం అవుతోంది - పలు కారణాల వల్ల.

    ReplyDelete
  16. నువ్వు కొలస్ట్రాల్ ఎక్కువై కొట్టుకుంటున్నావు బాసూ

    ReplyDelete
  17. na wife weight 77kg kani thana height ki 57kg undali chala weight undhani feel avuthundhi anni yoga lu chesundhi kani e madya apesindhi yoga vallaa surya namaskaram cheyadam valla pillalu puttaru ani doubt, edhi nijama, ite yedhaina salaha evvandi plz

    ReplyDelete
  18. na wife wait 77kg undhi thaggalani yoga lu, surya namaskaralu chesedhi kani pillalu puttaru ani anadam tho apesindhi, kani wait unnandhuku she is crying a lot, plz give me any suggestion. her age is 23y only

    ReplyDelete
  19. @ ప్రత్యూష/ అజ్ఞాత
    బరువు పెరగడానికి ఎన్నో కారణాలు వుండవచ్చు. డాక్టరుని కలిసారా? ఏమన్నారు? మందగించిన థైరాయిడ్ కూడా కారణం కావచ్చు. హైపోథైరాయిడిజం గురించి తెలుసుకోండి. అందుకోసం క్రింది సైట్ కూడా చూడండి.

    http://www.stopthethyroidmadness.com/

    అయోడిన్ లోపం వల్ల కూడా థైరాయిడ్ సమస్యలు వచ్చి బరువు పెరుగుతారు. అయోడిన్ లోపం వుందేమో పరీక్ష చేయించండి.

    ఇంకా సూచనలు కావాలంటే నాకు ఈమెయిల్ ఇవ్వండి లేదా మీ ఈమెయిల్ ఐడి తెలియజేయండి.

    ReplyDelete
  20. I know this web site provides quality dependent posts and extra stuff, is
    there any other site which offers such information in quality?

    ReplyDelete