యోగాశ్రమానికీ, బుద్ధ బోధనలకీ వెళ్ళొచ్చాను

శనివారం ఉదయమే లేచి ఎనిమిదిన్నర గంటలకు వున్న హఠ యోగా క్లాసుకి అందుకున్నాను. యోగా ఎప్పుడో ఇండియాలో వున్నప్పుడు బహుశా పదిహేనేళ్ళ క్రితం చేసివుంటాను. ఇప్పుడు మళ్ళీ చేస్తుంటే అనిపించింది - ఆధునిక జీవితం వల్ల అవయవాలు వంగడం అన్నది ఎంత కష్టం అయిపోయిందనీ. క్లాసు చక్కగా నచ్చింది. ఎందుకంత బాగా నచ్చింది అన్నది చెబితే ఔచిత్య భంగం అవుతుంది. అందుకని ఆ వివరాలు వద్దులెండి. యోగా తరువాత అరగంట ధ్యానం కూడా జరిగింది. ఆదివారం కూడా యోగా తదితర కార్యక్రమాలతో  ఒక పూట అక్కడే గడిపెయ్యొచ్చు కానీ వెళ్ళలేకపోయాను. పచ్చని పరిసరాలతో ఆ యోగా సెంటర్ బావుంది కానీ హైవేకి కాస్త దగ్గర్లో వున్నందున వాహన రణగొణ ధ్వనులు వినపడుతూనేవున్నాయి. ఆ యోగాశ్రమ నిర్వాహకురాలితో కాస్సేపు మాట్లాడాను. ఆమెతో ఇంకా వివరంగా మాట్లాడాల్సి వుంది. ఆ కేంద్రంలో చాలా ఆరుబయట చాలా జాగా వుంది. నేను పైపైన పరిశీలిస్తే నాకు గార్డెన్ ఏమీ కనిపించలేదు. వారేమయినా తోటని పెంచుతున్నారేమో లేదా తోటను పెంచే వుద్దేశ్యం వుందేమో కనుక్కుంటాను. వారికి తోట కానీ లేదా ఆ వుద్దేశ్యం కానీ వుంటే నేను వారితో కలిసి పని చెయ్యడానికి ఉత్సాహం చూపిస్తాను. ఆ నిర్వాహకురాలు ఆదే ప్రాంగణలోని మరో భవంతిలో నివసిస్తుంది.

ఆదివారం మధ్యాహ్నం ఒక పూట ఒక చర్చిలో ఒక శ్రీలంక బౌద్ధ భిక్షువు ద్వారా బోధనలు వున్నాయి. అందులో ప్రేమైక ధ్యానం గురించి కూడా చక్కగా చెప్పి శిక్షణ ఇచ్చారు. నాకు సిద్ధార్ధుడు అంటే చిన్నప్పటి నుండీ ఇష్టమే అయినా కూడా ఇలా బోధనలు వినడం ఇదే మొదటి సారి. ఆ నాలుగు గంటల తరగతికి నేను కాకుండా ఇంకా పదిమంది వచ్చారు. అంతా తెల్లోళ్ళే. బోధనల మధ్యలో రెండు విడతలుగా ధ్యాన శిక్షణ ఇచ్చారు. మేము ధ్యానంలో వుండగా ఆ బుద్ధ భాంతే మాకు సూచనలు ఇచ్చారు. అలా మేమంతా సుషుప్తిలో (ట్రాన్స్) వుండగా వారిచ్చిన సూచనలు నాకు హిప్నటిక్ సజెషన్స్ లాగానే అనిపించాయి. అందువల్ల బలీయమయిన ట్రాన్స్ లోకి వెళ్ళగలిగాను.

అయితే ఈ బౌద్ధ సంఘం మొదలెట్టింది 2002 లోనే కావడం వల్ల వారికింకా ఒక ఆలయం అంటూలేదు. అందుకే విశాల మనస్థత్వం కలిగిన యూనిటేరియన్ చర్చిలల్లొ బోధనలు జరుపుతున్నారు. స్థలం కొన్నారట కానీ ఆలయ నిర్మాణం ఇంకా మొదలవలేదు. ప్రధాన బిక్షువు చాలా కష్టాలు పడి ఇక్కడ తమ సంఘాన్ని స్థాపించి సిద్ధార్ధుని బోధనలను, ధ్యానాన్నీ ఇక్కడి వారికి అందివ్వాలని కృషి చేస్తున్నారు.

ఆ భాంతే ( బౌద్ధ భిక్షువులను భాంతే అంటారు) ఒక చక్కని దృష్టాంతరం చెప్పారు. వీరి మెడిటేషన్ క్లాసులు విన్న ఒక స్త్రీ ధ్యానం పాటించి మరునాడు వారికి ఫోన్ చేసింది. మీరు నాకు ధ్యానంలోకి వచ్చి నాతో మాట్లాడారనీ, సూచనలు ఇచ్చారనీ చెప్పిందిట. అబ్బే నేను అలా రాలేదు, మీరు నాకు గుర్తే లేరు అని వీరు చెప్పారట. వీరినుండి అవును అన్న సమాధానం ఆశించిన ఆమె ఎంతగానో నిరాశ పడింది. కాదు, మీరు వచ్చారు, నాతో మాట్లాడారు అందిట. లేదు, నేను నా పనుల్లో నేను వున్నాను, నాకంత మహిమలు లేవు అని వీరు అన్నారుట.  మరి నాకు అనిపించిందేమిటి అని ఆమె అడిగింది. అది భ్రాంతి అని ఆమెకి విశదీకరించారు ఈ భిక్షువు. ఇలా కాస్త నేల మీద నడిచే భావజాలం వుంటుంది కాబట్టే నాకు కాస్త బౌద్ధం నచ్చుతుంది.

ఆ క్లాసు నుండి వచ్చి కారు స్టార్ట్ చేద్దామని నా కారు కీస్ పెడుతూవుంటే అసలే పోలేదు. ఏంటబ్బా అనుకొని చూస్తే మరో కారు కీ ఆ కారులో పెట్టేస్తున్నా. మళ్ళీ ఈ సారి కూడా స్పిరిట్ బాగానే తలకెక్కిందనుకొని తల విదిలించుకున్నాను. వచ్చేవారం ఆదివారం ఉదయం పూటంతా యోగా సెంటరులోనూ మధ్యాహ్నం అంతా మరొక బౌద్ధ క్షేత్రం లోనూ గడపాలని చూస్తున్నాను. ఆ క్షేత్రంలో జెన్ బుద్ధ గురించి బోధిస్తారు. ధ్యానమూ కూడా వుంటుంది. వీలయితే శనివారం సాయంత్రం నిన్న వెళ్ళిన బౌద్ధ భిక్షువు దగ్గరికి వెళితే అక్కడ బుద్ధుని జన్మ దినోత్సవ వేడుకలు వుంటాయి. ఆ వేడుకలు చూడటానికి కుటుంబంతో సహా వెళ్ళ వెళ్లవచ్చు. మా వాళ్ళూ వస్తారేమో చూస్తాను.

9 comments:

  1. అరె.. నేను కూడా యోగ కి వెళ్ళాను శనివారం. Yogaworks అని మాకు దగ్గరలో వున్నా స్టూడియో. instructor ఫర్వాలేదు బాగానే చేయించాడు ఆసనాలు..శరీరమే కదలను అని మొరాయించింది..కాని చేసి ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళ్తున్నప్పుడు చాల హాయి గ అనిపించింది. అస్సలు నడుము నొప్పె లేదు రెండు రోజులు.ఇవాళ మల్లి మాములే..నేను కంప్యూటర్ ముందు కూర్చునే విధానం లో తేడా వలన ఈ నొప్పి..ఇక పోతే అతను చేయించిన ఆసనాలు కొన్నిటికి తెలుగు/సంస్కృతం లో పేర్లు సరిగా గుర్తు లేని మూలాన ఇంగ్లీష్ పేర్లే పెడుతున్న..1. downward facing dog, 2. child's pose, warrior's pose, vrikshaasana, bhujangaasana, halaasana and some abs ones..
    ఈ యోగావర్క్స్ వాళ్ళు అయ్యంగార్, మరియు బ్రీతింగ్ యొక్క బ్లెండ్ కలిపి చేయిస్తారు అని చెప్పారు ఇంస్త్రక్తోర్. గాని నాకు అయ్యంగార్ అసనాలే నచ్చాయి..ప్రతి ఆసనం లో ఎక్కువ సేపు వుంచి మనల్ని ఆ శరీర భాగాన్ని ఆకళింపు చేయిస్తారు వాళ్ళు. మీరు చెప్పిన ఈ హధ యోగా గురించి కూడా విన్నాను..వీలుంటే ఒక సారి వెళ్లి వస్తాను..

    ReplyDelete
  2. @ వినీల
    మీరు కూడా యోగా చేస్తున్నారన్నమాట. సంతోషం. చాలా ఏళ్ళ తరువాత మొదలెట్టాను కాబట్టి హఠానికీ, మిగతావాటికీ తేడా తెలియదండీ. గుడ్డేద్దు చేలో పడ్డట్లు చెప్పింది చేసుకు వెళుతున్నాను. యోగాకి తోడుగా ధ్యానం లేదా హిప్నాసిస్ తోడు అయితే పరిపూర్ణత వస్తుంది. మీరు అవీ చేస్తున్నారా? వచ్చే వారం 'టాయ్ చీ' కూడా మొదలెడదామా అని చూస్తున్నా. ఇవన్నీ ఉచితమే కానీ ఇష్టమయితే విరాళం ఇవ్వవచ్చు.

    ReplyDelete
  3. ఇక్కడ ఎవరు కూడా ను ధ్యానం చేయించడం లేదండి. నాకు చెయ్యడం ఇష్టమే కాని కరెక్ట్ గ చెయ్యకపోతే మైండ్ డైవెర్ట్ అవుతుంtumది..అందుకనే చెయ్యడం మానేసాను..ఒకటి రెండు సార్లు మా ఫ్రెండ్ నేను హికింగ్ కి వెళ్లి కొండ ఎక్కి ఒక పావుగంట ప్రానాయమం చేసాము చాల బాగుంది..మీకు ఉచితం గ ఎలాగా దొరికాయి అండి ఈ ధ్యాన మందిరాలు..నేను కుడా మీటప్ లో చూసాను కాని అంత గొప్ప గ ఏమి దొరకలేదు. యోగావోర్క్స్ గ్రుపోన్ లో ౫౦$ కి ఒక ఆఫర్ దొరికింది..అయ్యంగార్ వాళ్ళు ఒక్కో క్లాసుకి ౧౫-౨౦$ వసులు చేసారు. చాల ఎక్కువ అనిపించింది. సో ఈ నెలలో నేను ఏమేమి నేర్చుకుంతానో నా బ్లాగ్ లో రాసి పెడతాను..ఎప్పుడైనా మల్లి ప్రాక్టిస్ చేసేప్పుడు ఉపయోగ పడుతుంది. మీ బ్లాగ్ తో ఒక ఇన్స్పిరేషన్ కలిగించినందుకు ధన్యవాదాలు :)

    ReplyDelete
  4. "క్లాసు చక్కగా నచ్చింది. ఎందుకంత బాగా నచ్చింది అన్నది చెబితే ఔచిత్య భంగం అవుతుంది."
    అంటే ఏంటో.. మొదలు పెట్టగానే డౌటు... ఇది మీరు క్లీయర్ చేస్తే మిగతాది మొదలుపెడ్తా...

    ReplyDelete
  5. వినీల అక్క: ప్రాణాయామం కొండ ఎక్కి చేయాలా ?

    ReplyDelete
  6. @ వినీల
    ఆ యోగా సెంటర్ వాళ్ళ విధానం ప్రకారం యోగా అందరికీ అందుబాటులో వుండాలిట. అందుకే ఫీజు వసూలు చేయరు కానీ ఎంతోకొంత, ఇవ్వగలిగినంత విరాళాలు మాత్రం ఆశిస్తారు. వారు ధ్యానం కూడా నేర్పుతారు. ఇహ ఒక బౌద్ధ క్షేత్రంలో టాయ్ చీ (తాయ్ చీ అనాలా?) ఉచితంగా నేర్పిస్తారు అనుకుంటున్నాను. ఇంకా వెళ్ళలేదు కాబట్టి పూర్తి వివరాలు తెలియదు. అలాగే మరో బౌద్ధ సంఘం ధ్యానం ఉచితంగానే నేర్పిస్తుంది అనుకుంటున్నాను. వివరాల్లో ఫీజు గురించి లేదు.

    మనం చేస్తున్న మంచి విషయాలు ఇతరులతో పంచుకుంటూవుంటే అవి మన మనస్సుల్లో కూడా బాగా నాటుకుపోతాయి. ఇతరుల వ్యాఖ్యల వల్ల మనకు ఆయా విషయాలపై మరింత అవగహన రావడమే కాకుండా వాటిల్లో నిబద్ధత పెరుగుతుంది. నా నుండి ప్రోత్సాహం పొందినందుకు సంతోషం :)

    @ కాయ
    ఊహు.

    ReplyDelete
  7. మీ ఊహు మొదటి ప్రశ్న కా.. ? రెండవ ప్రశ్నకా..

    ReplyDelete
  8. @కాయ గారు,
    కొండ పైన చల్లని గాలి, ప్రశాంత వాతావరణం వల్లనో, లేక ఇంట్లో వున్నప్పుడు చేస్తే ఈ జంక్ తినాల లేక ఆఫీసు కి ఎక్కడ లేట్ అవుతుందా అనే కంగారు లో సరిగా ధ్యానం చేయలేకపోవడం వలన కొండ మీద బాగా అనిపించింది..అలా రెండు మూడు సార్లు చేసి ధ్యానం కుదరక మానేసాను.
    @శరత్ గారు,
    మీరు తాయ్ చీ గురించి తెలుసుకున్న తరువాత ఒక టపా పెట్టండి ఎలా వుందో..

    ReplyDelete
  9. @మరో కారు కీ ఆ కారులో పెట్టేస్తున్నా....
    పరాకు గా ఉంటే ఎలా అండీ ..కారు గాబట్టి సరిపోయింది..

    ReplyDelete