అగ్రిగేటర్లలో బ్లాగులు చూస్తుంటే నవ్వూ, నిస్పృహా వస్తున్నాయి. ఏం బ్లాగులో ఏంటో. కనపడే బ్లాగులల్లో సగం సినిమా వార్తలూ, రాజకీయ వార్తలూనూ. అక్కడెక్కడో ఎత్తుకొచ్చి ఆ కబుర్లన్నీ ఇక్కడ వదిలేస్తున్నారు. ఆ రెండూ కాకపోయినా దర్జాగా వేరే న్యూస్ పోర్టళ్ళ నుండీ, దినపత్రికల వెబ్సైట్ల నుండీ ఎత్తుకొచ్చి వేస్తున్న విశేషాలే వుంటున్నాయి.
ఇలాంటి బ్లాగులని సంకలినిలు ఏరిపారేస్తే బావుంటుందంటాను. మీరేమంటారు? ఎత్తుకొచ్చి ఏసే వార్తలు, కబుర్లు భావ ప్రకటన క్రిందికి రావు కాబట్టి నిక్షేపంగా అలాంటి బ్లాగులకి కత్తెర వేయడం మంచిది. అగ్రిగేటర్ల నిర్వాహకులూ, దయచేసి మా విన్నపాన్ని ఆలకించండి. కాస్త అసలు, సిసలయిన బ్లాగులని మీ సైట్లలో చూడనివ్వండి.
నా మిగతా భావాలతో, అభిప్రాయాలతో సంబంధం లేకుండా నా సూచన నచ్చిన వారందరూ వ్యాఖ్యల ద్వారా బలపరిస్తే ఈ విషయం సంకలినులు నిర్వాహకుల చెవినెక్కడానికి అవకాశం వుంటుంది. నేను తప్ప మీరెవరూ ఈ విషయం పట్టించుకోకపోతే లైట్.
I agree with you. There are dedicated sources where we can read political and movie related news.
ReplyDeleteఇది ఇప్పుడు ఉన్నదే కాదా ? సినిమా టపాలు, రాజకీయ టపాలు, పెద్దలకు మాత్రమే లు.. కొన్ని సంకలిని లలో ఉన్నవే కదా ? ...
ReplyDeleteyou are still using those aggregators ? I never , i am very happy to prepare my own list in GREADER .
ReplyDeleteI think once you said you are using it right ?
స్వంతంగా రాసిన కవితలు భావ ప్రకటన క్రిందకు వస్తుందా? వాటిని సంకలనిలలో ఉంచొచ్చా?
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteఅవును కదా.
@ కాయ
అవి ఎప్పటినుండో వున్నవే కానీ ఈమధ్య ఎక్కువయిపోతున్నాయి. సంకలినుల్లో సగం అవే కనపడుతుండేసరికి చిరాకెత్తేస్తోంది.
@ అజ్ఞాత
అప్పట్లో అగ్రిగేటర్ల మీద చిరాకేసి గూగుల్ రీడర్ వాడాను కానీ కొత్త బ్లాగులు అందులో కనపడవు కాబట్టీ, నాకు నచ్చిన అగ్రిగేటర్లు రాబట్టీ మళ్ళీ వెనక్కు వచ్చాను.
@ భాస్కర్
కవితలు, కథలు కూడా మన భావాలను వ్యక్తం చెయ్యడానికి ఉపయోగపడతాయి. అయితే అవి అసలు సిసలయిన టపాలు కాదు కాబట్టి కవితలు, కథలు వ్రాస్తున్నప్పుడు వాటిని సూచిస్తూ హెడ్డింగులో ట్యాగ్ పెడితే బావుంటుంది. ఉదాహరణకు నాకు కవితల ఏమాత్రం ఆసక్తి వుండదు. సాధారణంగా కవితల హెడ్డింగులు బావుంటాయి కాబట్టి తెలియక ఆ బ్లాగుల్లోకి వెళ్ళి బుక్కయిపోతుంటాను. అది కవిత అని హెడ్డింగులోనే తెలిసిపోతే నాలాంటివారికి సౌకర్యంగా వుంటుంది.
అగ్రిగేటర్ admin కి లేని దూల నీకెందుకు బె....
ReplyDeleteఎవరి ఇష్టం వారిది......
నీ మాట వింటే రోజుకు 10-20 బ్లాగులు మాత్రమె దర్శనమిస్తాయి.
తెలుగులో వార్తలు , కవితలు వగైరాలకోసం ఒక్కొక్క సైట్ వెతికే దౌర్భాగ్యం ఎందుకు.?
ఒకే చోట చూసుకుంటే సరిపోలా ...
పతి ఒక్కరూ ఏ విషయాన్నైనా ఎక్కడో ఒక చోట నుండి గ్రహిస్తారు.. దాన్ని కాపి చేస్తే తప్పేంటి ...!! ఆయా వార్తలకోసం ఫలానా సైట్ వెతికి చూడకుండా ఇది మంచికే కదా...
"రాజకీయాలు", "సినిమా" విషయాలకు వస్తే ప్రతి ఒక్కటి దానితోనే ముడి పడి ఉంటాయి.
బ్లాగు భావ ప్రకటనలకే కాదు...
సంకలినులు 18+ బ్లాగులను తప్ప ఎలువంటి టపాలనైనా ప్రచురిస్తాయి..
నిజమే... శరత్ జీ..., మొదట్లో నేను కూడా అక్కడా ఇక్కడా కాపీ కొట్టి రాసేవాడిని, కానీ ఇపుడు అలా చేయడం మానేసా. రాజకీయమైనా ఇంకోటైనా నా సొంత అభిప్రాయం మాత్రమే రాయడం మొదలెట్టా.
ReplyDelete@ మిర్చి
ReplyDeleteమంచిపని చేసారు. సంతోషం. అలాంటి బ్లాగులు సంకలినిలల్లో ప్రధాన పేజీలో కనపడకుండా వుంటే బావుంటుంది. మిగతా పేజీలల్లో వున్నా ఫర్వాలేదు అనేది నా అభిప్రాయం.
బ్లాగులోకంలో జగన్ బాకా బ్యాచ్ పెరిగిపోతోందండి బాబూ ఈమధ్య. మచ్చుకు కొన్ని చూడండి. లాహిరి, జైజై నాయకా, ఓన్లీ కామెంట్స్, మయూఖ, వెన్నెలరాజ్యం, మనజగన్...ఇంకా జగన్ బొంద, జగన్ శ్రాధ్ధం(త్వరలో వస్తాయేమో).
ReplyDeleteI agree with you.
ReplyDeletehmm.. You have a point. But your solution may not be practical for the aggregators at this point.
ReplyDeleteI hope aggregator folks will understand the issue and comeup with their own innovative and practical solutions for this.
అలాగే
ReplyDeleteవీకీపీడియాల్లో పెంటవ్యాసాలెత్తుకొచ్చి బ్లాగుల్లోపెట్టడం
గూగుల్ ఇమేజెస్ ప్రింట్ స్క్రీన్ తీసి బ్లాగుల్లో పెట్టడం
నందమూరి ఫాన్స్ వెబ్సైట్లోంచి బెమ్మీ ఫొటోలెత్తుకొచ్చి బ్లాగుల్లోపెట్టడం
ఈ బ్లాగులని కూడా నిషేదించాలి అద్దెచ్చా
అలాగే ఈ కెలుకుడు గాంగ్ మీదా వీళ్ళ బారినపడి బ్లాగులూ కామెంట్లూ మూసుకుంటున్న వారి పీడితుల మీదా ఒక పాయింటు రాయండి మేస్టారు, వారి ప్రస్తావన లేకపోతే బ్లాగులు కల్తీ అవ్వడానికి అర్ధమే ఉండదు
ReplyDeleteశరత్ గారూ,
ReplyDeleteమీరన్నదానిలో కొంత వాస్తవమున్నా... ప్రతీ వ్యక్తికీ కొన్ని స్పందనలు కలుగుతాయి వార్తలు, రాజకీయాల్లాంటి అంశాలపై కూడా. కేవలము వార్తను ఆధారంగా చూపిస్తూ తమ అభిప్రాయాలను ఆయా అంశాలపై పొందుపరుస్తూంటే ఇబ్బంది లేదు.... లేదూ మీరన్నట్టు కేవలము బ్లాగును అలకటమే పనిగా పెట్టుకుంటే మాత్రం మీకే నా ఓటు.
నిజమేనండి..చాలా బ్లాగ్స్ లో సొల్లు రాస్తున్నారు..పైగా నేను కూడలి ఒక్కటే చూస్తాను ఎక్కువగా..ఇందులో అయితే..సొల్లు మరీ ఎక్కువగా ఉందండి..ఈ సొల్లు తగ్గించ గలిగితే..మీకు నా సపోర్ట్ కూడా...
ReplyDelete@ అజ్ఞాత @ 11 మే 2011 11:26 ఉ
ReplyDeleteనో కామెంట్స్
@ అజ్ఞాత @ 11 మే 2011 11:32 ఉ
థేంక్స్
@ పతోడు
ఆ ఎదవగోలలన్నీ ఇక్కడ ప్రస్థావిస్తే ఈ టపా యొక్క ఔచిత్యం దెబ్బతింటుందండీ. అందుకే ఆ కామెంట్లు ప్రచురించడం లేదు.
@ వీకెండ్
ReplyDeleteమనస్సుంటే వారికి మార్గం వుంటుంది కదా. ఎవరయినా, ఏమయినా దీనిపట్ల ఆచరణాత్మకంగా స్పందిస్తారేమో చూద్దాం.
@ అజ్ఞాత @ 11 మే 2011 12:42 సా
నో కామెంట్స్
@ అజ్ఞాత @ 11 మే 2011 1:02 సా
నో కామెంట్స్
@ అచంగ
ReplyDeleteబ్లాగులు అలకడం గురించేనండి నేను అనేది.
@ ప్రబంధ్
నేను అప్పారావు సంకలిని, భారారే హారం ముఖ్యంగా చూస్తుంటాను. వాటిల్లో కూడా ఈ బ్లాగుల నసే కనీసం సగం కనిపిస్తూవుంటుంది.
@ అజ్ఞాత @ 11 మే 2011 1:56 సా న
మీ అభిప్రాయంతో కూడా నేను చాలావరకు ఏకీభవించినా కూడా మీ కామెంట్ ప్రచురించలేకపోతున్నాను. అన్ని సమస్యలను ఇక్కడే రేకెత్తిస్తే టపా వివాదాస్పదం అయిపోయి ప్రయోజనం దెబ్బతింటుంది.
బ్లాగులోకంలో జగన్ బాకా బ్యాచ్ పెరిగిపోతోందండి బాబూ ఈమధ్య. మచ్చుకు కొన్ని చూడండి. లాహిరి, జైజై నాయకా, ఓన్లీ కామెంట్స్, మయూఖ, వెన్నెలరాజ్యం, మనజగన్...ఇంకా జగన్ బొంద, జగన్ శ్రాధ్ధం(త్వరలో వస్తాయేమో).
ReplyDeleteI agree with you.
నాకు తెలిసి బ్లాగంటేనే ఎవరి సొంత భావాలను వారు అచ్చేసుకోవడం. మరి పక్కవాళ్ళ సొంత భావాలను అచ్చేసుకుంటే కలిగే లాభం ఏమిటో?
ReplyDeleteఅజ్ఞాత చెప్పారు...
ReplyDeleteబ్లాగులోకంలో జగన్ బాకా బ్యాచ్ పెరిగిపోతోందండి బాబూ ఈమధ్య. మచ్చుకు కొన్ని చూడండి. లాహిరి, జైజై నాయకా, ఓన్లీ కామెంట్స్, మయూఖ, వెన్నెలరాజ్యం, మనజగన్...ఇంకా జగన్ బొంద, జగన్ శ్రాధ్ధం(త్వరలో వస్తాయేమో).
@ajantha garoo
baga chepparu, kanee evari istam varidi. meeru chadavakandi.