Scratch Free పెంపకం!

మేము అప్పుడు కెనడాలో వుండేవారం. మాకు తెలిసిన వారికి కెనడా ఇమ్మిగ్రేషన్ రావడంతో యుఎస్ నుండి కెనడాకి మారారు. ఒకసారి మాటల సందర్భంలో వాళ్ళ యొక్క మూడు నాలుగేళ్ళ బాబుని గురించి ఆ ఇంటామె ఇలా చెప్పింది. "మా బాబుకి కెనడా వచ్చాక వంటి మీద రెండు సార్లు గీతలు పడ్డాయండీ. యు ఎస్ లో స్క్రాచ్ ఫ్రీగా పెరిగాడు". నేను హ అని కళ్ళు తేలవేసినతపని చేసాను. ఇలా పిల్లలని అలా స్క్రాచ్ ఫ్రీగా కూడా పెంచాలనుకునేవారు కూడా వుంటారని నాకు అప్పుడే తెలియడం!

ఇహ మాకు తెలిసిన డాక్టర్ దంపతులు ఒకరు వుండేవారు. వాళ్ళ పిల్లలని ఎంత సున్నితంగా పెంచేవారంటే పిల్లల్ని అస్సలు ఎగరనీయకపోయేవారు, దుమకనీయకపోయేవారు. అలా చేస్తుంటే అదో మహాపరాధంగా చివాట్లేసి కూర్చోబెట్టేవారు. మా పిల్లలు స్వేఛ్ఛగా ఆడుతుంటే ఏంటీ పెంపకం అన్నట్లుగా చూసేవారు.  మా మిత్రుడు ఒకతను అయితే పిల్లలు ఆడుకుంటుంటే ఏంటీ గొడవ అని చిరాకు పడుతుంటాడు. బుద్ధిగా టివి చూస్తూ కూర్చోక ఏంటీ ఆటలు అని విసుక్కునేవాడు. అతను నాకు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి అతని విధానం తప్పని అర్ధం చేయించాను లెండి.  

ఒకసారి మా ఇంటికి ఓ రెండు కుంటుంబాలు వాళ్ళ పిల్లలతొ సహా వచ్చారు. వాళ్ళ పిల్లలు, మా అమ్మాయి కలిసి పిల్లో ఫైటింగు చేయసాగారు. ఏంటీ పిల్లోలతో ఫైటింగు అని ఆ తండ్రులు చిరాకు పడ్డారు. అవును, పిల్లలు కత్తులతో ఆడుకోవాలి గానీ మెత్తలతో ఆడుకోవడం ఏంటీ అని నేను దీర్ఘం తీసాను.

ఇలా పిల్లలని స్వేఛ్ఛగా ఆడుకోనివ్వకుండా, మరీ మరీ హద్దులు చెబుతూ అతి సున్నితంగా పెంచడం ఎప్పటినుండో ఫ్యాషన్ అయినట్లుంది. ఈ అతి సున్నితత్వం స్త్రీలలో ఎక్కువగా గమనిస్తుంటాం. తల్లితండ్రులిద్దరూ అలాంటి వారయితే ఇహ పిల్లలు చచ్చారన్నమాటే. ఇహ హద్దులే హద్దులు. వాటికిక అంతే వుండదు. చాలామందికి తమ తెలివి మీద తమకు కాస్త నమ్మకం కలిగిందంటే చాలు వారికి తెలిసిన జాగ్రత్తలు, మంచివనుకున్న మ్యానర్స్ అన్నీ తమ పిల్లలమీద యధేఛ్ఛగా రుద్దేస్తారు. పాపం చిన్న పిల్లలు అంతగా ఎదురు చెప్పలేరు గనుక వినేస్తారు. తమ పిల్లలు అపర బుద్ధిమంతుల్లా మెలగాలని ఆశిస్తారు కానీ ఆ పిల్లలు కోల్పోతున్న బాల్యాన్ని గుర్తించరు. చాలా క్రమశిక్షణతో పెంచుతున్నామనుకుంటారు కానీ మరో వైపున తమ పిల్లలు కోల్పోతున్నదేమిటో గుర్తించరు. పైగా నాలాంటివారెవరయినా పిల్లలని అర్ధం చేసుకుంటూ వారి బాల్యాన్ని వారికి ఇవ్వజూపుతుంటే గారాబం చేస్తున్నారంటారు.

పిల్లలని ఆడుకోనిద్దాం - అలా ఆడుకోవడం వారి యొక్క హక్కు అని గుర్తిద్దాం. వారి బాల్యాన్ని వారికి ఇచ్చేద్దాం.

17 comments:

  1. Sarat garu,

    This is the best post from you so far.

    thanks

    ReplyDelete
  2. "అర్ధం చేయించడం" అంటే హిందీలో సంఝానా కదూ. తెలుగులో అయితే నచ్చజెప్పడం అనుకుంటా :D. నా కేరళ దోస్తు ఇలాగే "అర్ధం చేయించరా" అనేవాడు. అది గుర్తొచ్చింది.

    ఇహ మీ పోష్టుకొస్తే... పిల్లలు పిల్లల్లాగే వుండాలి. అల్లరిచెయ్యాలి, ఇల్లుపీకి పందిరెయ్యాలి. అంతేగానీ తెలుగుసినిమాల్లో బాలనటుల్లా ఎక్కడాలేని dignity ఒలకబోస్తే చచ్చేంత చిరాకునాకు.

    ReplyDelete
  3. మట్టితో నీళ్ళతో ఆడకుంటే, ఎగిరి దూకి స్వేచ్ఛగా ఆడుకుంటూ మోకాళ్ళ చిప్పలు పగలగొట్టుకోకుంటే అది బాల్యమే కాదు. ఇలా అనుక్షణం పిల్లల్ని గమనిస్తూ "స్క్రాచ్ ఫ్రీ"గా పెంచాలనే ఆశతో వాళ్ళ మీద ఒక కన్నేసే పెంపకాన్ని "హలికాప్టర్ పేరెంటింగ్" (దీని మీద నేనో సారి రాశాను వసుంధరలో) అంటార్ట.

    పిల్లల స్వేచ్ఛకు ఎప్పుడూ ప్రాముఖ్యం ఇవ్వాల్సిందే! లేదంటే మనసులో అసంతృప్తులు అలా ఉండిపోతాయేమో!

    ReplyDelete
  4. బాగుంది.. మాకు తెలిసిన వారొకరు పిల్లల ఆట వస్తువులు వేరే పిల్లలు ముట్టుకుంటే డిష్ వాషర్ లో వేసి స్తేర్లైజ్ చేసి మరీ వాడేవారు. ఒక గది అంతా ఆరు అంగుళాల పరుపు వేయించారు...

    ReplyDelete
  5. నా తొమ్మిదినెల్ల కూతురు అవీ ఇవీ పట్టుకుని నడవటానికి ట్రై చేస్తుంది. రోజూ ఏదో ఒక దెబ్బ తగలకపోతే వింత. మరీ గట్టిగా పడినప్పుడు కంగారు పడి మమ్మీ కి కాల్ చేస్తే, "అబ్బా నువ్వు కంగారు పడకు అలా పడితేనే గుండు గట్టిపడుతుంది" అంటారు! ప్చ్!

    ReplyDelete
  6. నేను మా 8 ఏళ్ళ మా పాపతో మా పాప కన్నా చిన్నపిల్లాడిలా అల్లరి చేస్తా... తను ఒక్కతే మాకు. ఇంకొకళ్ళు ఉంటే నాకీ శ్రమ ఉండేది కాదు. ఇలా ఆడడం తో తను నన్ను నాన్న లా కాకుండా ఫ్రెండ్ లా భావిస్తుంది.

    ReplyDelete
  7. హు! నేనలా వాళ్ళ బాల్యాన్ని నాదగ్గర అట్టేపెట్టుకోకుండా వాళ్ళకిచ్చేస్తున్నందుకే నాకు పిల్లలిని పెంచడం రాదని, మా పిల్లలకి క్రమశిక్షణ లేదని/క్రమశిక్షణతో పెంచడంలేదని నిందలు భరిస్తున్నాను..ప్చ్!

    ReplyDelete
  8. వావ్. పదిమంది ఈ వ్యాసం (చాలా) బావుందని రియాక్షన్స్ ద్వారా మెచ్చుకున్నారే! ధన్యవాదాలు.

    @ అజ్ఞాత
    :)
    @ మినర్వా
    ఆశువుగా వ్రాస్తుంటాను. ఆ పదం దగ్గర స్టక్ అయ్యాను కానీ వేరే మంచి పదం సమయానికి గుర్తుకురాక లాగించేసాను :)
    @ సుజాత
    అలా పెంచబడినవారు తరువాత కానీ, పెద్దయ్యాక కానీ ఎలా తయారవుతారో తెలియదు కానీ నేను గమనించిన ఇద్దరు ముగ్గురు పిల్లలు మాత్రం మహా మొండిఘటాలుగా తయారయ్యేరు.
    @ క్రిష్ణప్రియ
    మా ఒక బంధువుల అమ్మాయిని ఇంట్లో అలాంటి అతి శ్రద్ధ చూపే డాక్టరుకి ఇచ్చి పెళ్ళిచేసారు. కొన్నేళ్ళకి ఆ అమ్మాయికి మానసిక స్థిమితం తప్పింది - నిజంగానే! ఆమె స్థిమితం తప్పడానికి అదే పూర్తిగా కారణమా కాదా అన్నది నాకు తెలియదు.

    ReplyDelete
  9. @మినర్వా:

    నచ్చచెప్పటం వేరు .. అర్థం చేయించటం వేరు.. నచ్చ చెప్పటం అంగీకరింపచేయటం అవుతుంది.. అర్థం చేయించటం కేవలం అర్థం చేయించటం మాత్రమే.. ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవాలి...

    ReplyDelete
  10. గురువు గారు .. బాగా చెప్పానా ?

    ReplyDelete
  11. @ రూత్
    అవును. పిలలు ఆటుపోట్లకి అలవాటు పడి వారి శరీరాలూ, వ్యక్తిత్వమూ బలంగా తయారవ్వాలి.

    @ మిర్చిబజ్జి
    పిల్లలతో సరిగ్గా అలానే ఆడుకోవాలి. కాదు కాదు - మనం పిల్లలని ఆడించకుండా పిల్లలు మనల్ని ఆడించడమే వారికి మనం ఇవ్వగల గొప్ప క్రీడ.

    @ రమణి
    భరిస్తూవుంటే మోపేస్తూవుంటారు కాదూ. అలా అన్నారు కానీ వారిని మీరు నిగ్రహిస్తుంటారనుకుంటాను. ఒకసారి మా బందువులు పిల్లలని అంతగా ప్రేమించనఖ్ఖరలేదనీ, తాము ఎలా వణికిస్తామో చెప్పుకువచ్చారు. పిల్లలని ప్రేమించడం మా బలహీనత కాదని అది మా విధానం అనీ, అవసరం అయినప్పుడు (మాత్రమే) క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామనీ స్పష్టపరిచాను. నిజానికి ఎవరయినా నన్ను విమర్శించినప్పుడు వివరణ ఇవ్వను - నవ్వేసి ఊరుకుంటాను కానీ వారు చక్కటి బంధువులే అవడంతో ఆ మాత్రం వివరణ ఇచ్చాను. విమర్శలకి తప్పనిసరిగా జవాబు, వివరణ ఇవ్వాలనుకోవడం వ్యక్తిత్వంలోని లోపం అవుతుంది.

    @ కాయ
    మీరు చెప్పిన 'అర్ధం'తో నేను ఏకీభవిస్తాను. మీరు చెప్పిన భావం సరి అయినదే అయినా నేను వాడిన ఆ పద ప్రయోగం మాత్రం సరి అయినది కాదు. అంతకంటే సబబయిన పదం వాడివుంటే బావుండేది. అర్ధం చేయించాను అనడానికి బదులుగా అర్ధమయేలా చేసాను అనడం బావుంటుందేమో.

    ReplyDelete
  12. అర్థమయ్యేలా చేయడానికి.. నచ్చేలా చెప్పటానికి తేడా ఎంత ఉందో ? ఏదో గిమ్మిక్కు చేసి అర్థం చేయించి నట్లు చెప్తున్నారు.. నిజం గా గిమ్మిక్కు చేశారా ?

    అర్థం చేయించటం .. ఉన్న దాన్ని ఉన్నట్లు చెప్పి అర్థం చేస్కునేలా చేయటం కదా .. మళ్ళీ మళ్ళీ అడగటం ..నాకు కొంచెం చాదస్తం లెండి గురువు గారు....

    నిజం గా గిమ్మిక్కు చేశారా ?

    ReplyDelete
  13. @ కాయ
    అంత మీమాంస అక్కరలేదండీ. గిమ్మిక్కులేమీ లేవు. పిల్లలకి ఏక్టివ్ లైఫ్ స్టైల్ వుండాల్సిన ప్రాముఖ్యత గురించి మా మిత్రుడికి వివరించాను.

    ReplyDelete
  14. పిల్లల విషయంలో పనికివచ్చే విషయాలు రాస్తారు మీరు.

    మిగతా విషయాలు పనికోస్తాయా కన్నా, కుతూహలంగా ఉంటాయి.(పక్కవాడి జీవితం అందరికి కూడా ఇలాగె ఉంటుంది.)

    ReplyDelete
  15. @ సాధారణ పౌరుడు
    ఒక్క పిల్లల విషయంలోనే కాకుండా ఇంకా కొన్ని విషయాలపై కూడా ఇతరులకి పనికి వచ్చే విధంగా వ్రాస్తుంటాను. ఉదాహరణకు ఇటీవల ఒక ప్లాజాలో మా ఆవిడ బ్యాగులో బంగారం పోయిందని వ్రాయడంలో అర్ధం ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయనీ, పారాహుశార్ అనీనూ.

    ఇహ మిగతా విషయాల్లోని కుతూహలమే కొంతమంది మనస్సులనయినా మార్చవచ్చు కానీ చాలా మంది ఆ విషయాలకి డిసెన్సిటైజ్ అవుతారు. అదే నాక్కావాల్సింది. నాకు ఒట్టి ఇంఫర్మేషన్ గానీ, ఎంటర్టైన్మెంట్ కానీ నచ్చవు. మనక్కావాల్సింది, ఇతరులకు ఇవ్వాల్సింది ఇంఫోటైన్మెంట్.

    ReplyDelete
  16. శక్తి సినిమా రివ్యూ పోస్ట్: "పురమాయించింది" అన్నది కరెక్ట్ అని నేను నిన్ననే చెప్దామనుకున్న శరత్ గారు.. కాని ఇంకోటి కూడా ఆలోచించాను... బార్య కాస్త గట్టిగా (ఉరుము ఉరిమినట్లుగా లేదా అజ్ఞాపించినట్లుగా ) చెప్పినట్లయితే మీ "ఉరమాయింపు" (మీరు కొత్తగా కనిపెట్టారనుకొని మన మాయాబజార్ అసమదీయులు తసమదీయులులా అన్నమాట) అనే పదం కనిపెట్టారని సరిపెట్టుకున్నా.. :)

    ReplyDelete
  17. @ రమణి
    మొదట్లో ఆ ఉద్దేశ్యంతో వ్రాయలేదు కానీ విమర్శ వచ్చాక ఆ ఉద్దేశ్యంతో వ్రాసేనని సమర్ధించుకుందామనుకున్నాను :))

    అక్కడ కామెంటలేక ఇక్కడ కామెంటేరన్నమాట. అర్ధమయ్యింది లెండి! హుం.

    ReplyDelete