మా ఆవిడకి Ford Escape XLT (ఓ రెండేళ్ళు పాతదే లెండి) SUV (Sports Utility Vehicle) కానుకగా ఇచ్చాను. ఇలా నేను కొనే ప్రతీది ఆమె పుట్టిన రోజుకో లేదా మా పెళ్ళిరోజుకో లేదా ఇలా ప్రేమికుల రోజుకో దగ్గర్లో చూసుకొని అలా ఆమె పేరు చెప్పేస్తుంటానన్నమాట. ఇలాగే ఇదివరలో ఓ ఇల్లు, ఓ కారు గట్రా గట్రా కొనిచ్చేసాను లెండి. ఈ సామెత సరిగ్గా ఇక్కడ అతకదేమో కానీ గాలికి పోయే పిండి కృష్ణార్పణం లాగా అనుకోవచ్చు. అలా నీకు కానుకగా తీసుకున్నానని అన్నానో లేదో ఇహ నన్ను దానిమీద డ్రైవింగ్ చెయ్యనవ్వడం లేదు! మా పెద్దమ్మాయి కూడా కారు ప్రాక్టీసు ఈ వ్యానులోనే చేస్తానని గొడవ. మా ఆవిడ కూడా హైవే ప్రాక్టీసు ఈ వ్యానులోనే చేస్తానని గొడవ. ఇద్దరినీ సముదాయించే సరికి నా తలప్రాణం తోకకొచ్చింది.
మా కారు మా అందరికీ నచ్చింది. అదీ విశేషం. మా నలుగురికీ ఒకే విషయం నచ్చడం అన్నది మాలో అసాధారణ విషయమే. అప్పుడేదో రంకెలేసారుగా ఇప్పుడీ కానుకలేమిటీ అని దీర్ఘాలు తీయకండి. కలబడ్డప్పుడు ఎన్నో అనుకుంటాం. చేతులు కలిపినప్పుడూ, కలిసినప్పుడూ అలా అనుకోలేం కదా. నేను ప్రస్థుతంలో జీవిస్తుంటాను. రేపు మళ్ళీ ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? చూద్దాం.
Mee posts almost anni chadivi vuntanu and infact showed some of them to my husband to show how caring the husbands could be. Though i read your post before about your decision of divorce, i made a bet with my husband that it will never never happen. (Not that i wanted you and your wife to get divorced, because i am more concerned about your kids than you both). I am jealous of your wife.
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteమీకు నామీద వున్న నమ్మకం నన్ను అబ్బురపరచింది :) మీ నమ్మకమే సదా నిలబడాలని ఆశిస్తాను.
pai ajnaata intakee bet ento cheppaaru kaadu ...:)
ReplyDeletemottaniki konesaru . Summer trips ki ready ayipoyaru.Congratulations !!!. Hope everybody is excited. Have a safe travel and enjoy !!!
ReplyDelete@ అజ్ఞాత
ReplyDelete:)
వచ్చే నెల 18 న ఇక్కడినుండి బయల్దేరి న్యూజెర్సీ, న్యూయార్కులకు ఒక వారం కోసం వెళ్దామనుకుంటున్నాం. ఇప్పుడు వున్న మరీ పాత కారులో బయల్దేరం అంటారు మా వాళ్ళు. అందుకే ఇంకోటి కొనాల్సి వచ్చింది. బయల్దేరేలోగా మా ఆవిడకీ, పెద్ద అమ్మాయికీ ఈ కొత్త కారు మీద హైవే డ్రైవింగ్ ఫుల్లుగా నేర్పించేసి, డ్రైవింగ్ వాళ్ళకు అప్పగించేసి నేను వెనుక సీటులో కూర్చొని అమ్మలుతో ముచ్చట్లు చెబుతూ ప్రయాణించాలని నా ప్లాన్ కానీ చూడాలి మరి. వాళ్లెంత డ్రైవ్ చేసినా అలెర్టుగా నేను పక్కనే కూర్చోక తప్పదు అనుకుంటా.
All the best anna, I am happy to see this,
ReplyDeleteEven i look at ur posts.. i read almost every post of urs.. i love the way you show concern for ur kids.. specially for ur elder gal when u found her as an introvert.. they are gifted to have u as their dad..
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteధన్యవాదాలు
@ వేణు...
థేంక్స్. నా మనస్థత్వాన్ని అర్ధం చేసుకున్నందుకు.