శ్రీ శరత్ చంద్ర ఛటోపాధ్యాయ విరచిత చరిత్రహీనులు పుస్తకం మీద ఎవరికయినా US లో నివసిస్తున్న వారికి ఆసక్తి వుంటే తెలియజేయండి. మీ అడ్రసు తెలియజేస్తే పోస్ట్ చేస్తాను. అది గొప్ప పుస్తకమే కానీ నాకు మళ్ళీ మళ్ళీ చదివేంత ఆసక్తి, ఓపిక వుంటుంది అనుకోవడం లేదు. శరత్ దే శ్రీకాంత్ వుంది కానీ అది మాత్రం ఇతరులకు ఇవ్వను. ఆ పుస్తకం మొదటిసారి చదివినప్పుడయితే పూర్తిచేసాక 20 నిమిషాలు ధారాపాతంగా వెక్కివెక్కి ఏడ్చాను. అంతగా కదిలించించింది శ్రీకాంత్!
మా ఇంట్లో వారందరూ శరత్ చంద్ర ఛటోపాద్యాయ అభిమానులు అవడంతో మా నాన్న గారు నేను కూడా అలాంటి చక్కటి రచయితను అవాలని ఆకాంక్షించి ఆ పేరు పెట్టేరు. మరి నేనేమో ఇలా తయారు అయ్యాను.
మిగతావారు కూడా తాము మూలకు పడేసిన పుస్తకాలు ఇతరులతో పంచుకోవడం మొదలెడితే బావుంటుంది. పుస్తకప్రియులం అనుకుంటూ, చెప్పుకుంటూ గుట్టలు గుట్టలు పుస్తకాలు పోగెయ్యడమే కాకుండా ఇతరులతో పుస్తకాలు చదివింపజేసే ఇలాంటి ప్రయత్నాలకు మీరు ఊతం ఇవ్వాలి. మీ పుస్తక భాండాగారంలో ఒక్క పుస్తకమయినా తీసివెయ్యడానికి వీలవుతుందేమో చూసి దానిని ఇతరులతో పంచుకుంటారని ఆశిస్తాను.
అదే అనుకున్నా ,మీ నాన్నగారు రచయిత అవుతారనే ఆపేరు పెట్టి ఉంటారని .మీ రచనాశైలి చదివించేలా వుంటుంది
ReplyDelete