వాళ్ళేం చేస్తున్నారు? స్టేటస్ రిపోర్ట్

నేను కొన్ని నెలల క్రితం ఇండియా నుండి వెళ్ళొచ్చాక ప్రధానంగా రెండు విషయాలు ప్రస్థావించాను.


ఒకటి సూర్యాపేటలోని నా పెద్దరికం గురించి. ఆ తరువాత కూడా ఇరువైపులా మాట్లా కూడా మధ్యవర్తిత్వం నెరిపాను. భర్త, భార్య నాకు ఫోన్ చేసి మ ఫ్రెండుని తగ్గమని నన్ను చెప్పమనేవారు, నేను చెబితే వింటాడనేవారు. మా ఫ్రెండు నాకు ఫోన్ చేసి ఆ భర్తని తగ్గమని చెప్పమనేవాడు. నేను చెబితే ఆ భర్త వింటాడనేవాడు. ఇరుపక్షాల వారికీ తగ్గమని సూచించి ఇహ ఆ విషయంలొ జోక్యం చేసుకోవడం మానివేసాను. ఇక్కడనుండి ఫోనులలల్లో ఎంతకని మధ్యవర్తిత్వం నడుపుతాము అని వాళ్ళ దారిన వాళ్ళకి వదిలేసాను. ఆ భర్తా భార్య నుండి మళ్ళీ ఫోనులేమీ రాలేదు. మా ఫ్రెండ్ కొన్ని సార్లు ఫోన్ చెసాడు కానీ నేను పట్టించుకోలేదు. అందువల్ల తాజా సమాచారం నాకు తెలియదు. ఒకసారి ఫోన్ చెసి కనుక్కొవాలి.


ఇంకొకటి విడిపోయిన యువజంటకి నేను ఇచ్చిన కౌన్సిలింగు గురించి. దాదాపుగా నేను చెప్పినట్లే చేస్తున్నారు. అతగాడు చిన్న బ్యుజినెస్ పెట్టుకొని ప్రియురాలి మీది అతి ధ్యాసని తగ్గించుకొని నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. అతని యొక్క వ్యాపారంలో నేనూ పార్ట్‌నరుగా చేరి ఆ జంటకి నా వల్ల వీలు అయిన సహాయం చెయ్యబోతున్నాను. బహుశా ఈ ఏడాది అంటే ఇంకో రెండు మూడు నెలల్లో వారి పెళ్ళి జరగవచ్చు.


ఇలాగే ఇంకొద్ది రోజుల్లో నా స్టేటస్ అప్‌డేట్ కూడా ఇస్తాను.

1 comment:

  1. మీ పెద్దరికం బాగుంది. మీరిలాగే సెటిలైపోకూడదూ... ఏదో ఫ్యామిలీ కౌన్సిలర్లా

    ReplyDelete